అదీదాస్
పేరులో నేముంది
స్పోర్ట్స్ షూస్, దుస్తులు, యాక్సెసరీస్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా చిరపరిచితమైన బ్రాండ్ ఇది. అమెరికాలో చాలాకాలం ఈ పేరును ‘అడీదస్’ అని పొరపాటుగా పలికేవారు. భారత్, పాకిస్థాన్ వంటి దేశాల్లోనైతే ‘ఆదిదాస్’ అని, ‘అడీడాస్’ అని పలికేవారు. ‘అదీదాస్’ కంపెనీని జర్మన్ పారిశ్రామికవేత్త అడాల్ఫ్ దాస్లెర్ 1949లో ప్రారంభించారు.
ఆయన పేరులోని మొదటి పదంలోని తొలి మూడు అక్షరాలు, రెండో పదంలోని తొలి మూడు అక్షరాలు కలిపి కంపెనీకి ఈ పేరు పెట్టారు. జర్మనీలో ఈ పదానికి ప్రత్యేకంగా ఎలాంటి అర్థం లేకపోయినా, క్రీడా ప్రపంచంలో ఇది అచిరకాలంలోనే స్పోర్ట్స్ షూస్, యాక్సెసరీస్‌కి పర్యాయపదంగా మారింది.