Sports Shoes
-
ఇకపై నో జీన్స్, నో టీ షర్ట్స్.. సీబీఐ ఆదేశాలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ అధికారులకు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కార్యాలయంలోని అధికారులు జీన్స్, టీషర్ట్స్,స్పోర్ట్స్ షూస్, వేసుకోకూడదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఇకనుంచి ప్రతీ ఒక్కరూ వీటిని పాటించాలన్నారు. దీని ప్రకారం సీబీఐలో పని చేసే పురుషులు ఇకపై షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్లు, ఫార్మల్ షూస్ వేసుకోవాలి. అలాగే నీట్గా షేవ్ చేసుకోవాలి. ఇక మహిళా అధికారులైతే చీరలు, సూట్లు, ఫార్మల్ షర్ట్స్, ప్యాంట్లు మాత్రమే వేసుకొని కార్యాలయాలకు రావాలి. ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల అధిపతులకు తెలిపారు. చదవండి: వ్యాక్సిన్ వేసుకుంటే.. బిర్యానీ, బైకు, బంగారం.. ఎక్కడో తెలుసా? -
అదీదాస్
పేరులో నేముంది స్పోర్ట్స్ షూస్, దుస్తులు, యాక్సెసరీస్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా చిరపరిచితమైన బ్రాండ్ ఇది. అమెరికాలో చాలాకాలం ఈ పేరును ‘అడీదస్’ అని పొరపాటుగా పలికేవారు. భారత్, పాకిస్థాన్ వంటి దేశాల్లోనైతే ‘ఆదిదాస్’ అని, ‘అడీడాస్’ అని పలికేవారు. ‘అదీదాస్’ కంపెనీని జర్మన్ పారిశ్రామికవేత్త అడాల్ఫ్ దాస్లెర్ 1949లో ప్రారంభించారు. ఆయన పేరులోని మొదటి పదంలోని తొలి మూడు అక్షరాలు, రెండో పదంలోని తొలి మూడు అక్షరాలు కలిపి కంపెనీకి ఈ పేరు పెట్టారు. జర్మనీలో ఈ పదానికి ప్రత్యేకంగా ఎలాంటి అర్థం లేకపోయినా, క్రీడా ప్రపంచంలో ఇది అచిరకాలంలోనే స్పోర్ట్స్ షూస్, యాక్సెసరీస్కి పర్యాయపదంగా మారింది.