ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023 జరగడానికి ఇవాళ్టికి సరిగ్గా వంద రోజులు మిగిలిఉంది. అంటే మూడునెలలకు పైగా సమయం ఉన్నా మెగా టోర్నీ అందునా నాలుగేళ్లకోసారి జరిగే సమరం కాబట్టి అంచనాలు భారీగా ఉంటాయి. పైగా ఈసారి వన్డే వరల్డ్‌కప్‌కు క్రికెట్‌ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మన దేశం ఆతిథ్యం ఇస్తుండడం వాటిని మరింత పెంచేసింది. దీనికి తోడు ఇవాళ(జూన్ 27న) వన్డే వరల్డ్‌కప్ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేయడం అభిమానుల సంతోషాన్ని మరింత రెట్టింపు చేసింది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచి సచిన్ పాజీకి అంకితమిచ్చాం.. ఇప్పుడు 2023 వన్డే వరల్డ్‌కప్ కోహ్లి కోసం గెలవాలి. సచిన్ తర్వాత టీమిండియా క్రికెట్‌లో అనితరసాధ్య రికార్డులు సాధించిన కోహ్లికి బహుశా ఇదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది. అతని కోసం టీమిండియా ఈసారి కప్పు కొట్టబోతుంది అంటూ తెలిపాడు.
స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ''2011 వన్డే వరల్డ్‌కప్ మేము సచిన్ గెలుపు కోసం ఆడాం. వరల్డ్‌కప్ కొట్టి సచిన్ పాజీకి ఒక గ్రేట్ ముగింపునిచ్చాం. ఇప్పుడు కోహ్లి పరిస్థితి కూడా సచిన్‌నే తలపిస్తోంది. ఈసారి కోహ్లి కోసమైనా వరల్డ్‌కప్ కొట్టాలని ప్రతీ అభిమాని ఆశిస్తున్నాడు. ఇక కోహ్లి తన బ్యాటింగ్‌లో వందశాతం ఇచ్చేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తాడు.
ఇక కోహ్లి కూడా ఈ వరల్డ్‌కప్‌ను గొప్పగా మలుచుకోవాలని చూస్తున్నాడు. లక్షలాది మంది అభిమానుల మధ్య అహ్మదాబాద్ వేదికగా టీమిండియా ఫైనల్ ఆడితే చూడాలని ఉంది. ఈసారి స్వంతగడ్డపై జరగడం టీమిండియాకు సానుకూలాంశం. ఇక కోహ్లికి టీమిండియా తమ మ్యాచ్‌లను ఏ మైదానంలో ఆడుతుందో వాటి పిచ్‌లపై కోహ్లికి పూర్తి అవగాహన వచ్చేసింది. ఈ నేపథ్యంలో కోహ్లి ఈసారి వరల్డ్‌కప్‌లో పరుగుల జడివాన సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక పుష్కరకాలం కిందట ధోని సారధ్యంలో స్వంతగడ్డపై జరిగిన వరల్డ్‌కప్‌ను టీమిండియా ఎగరేసుకుపోయింది. అప్పుడు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ సహా విరాట్ కోహ్లి లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. అయితే అప్పుడు టీమిండియా కప్ కొట్టడంలో ధోని, యువరాజ్, గంభీర్‌లు ముఖ్యపాత్ర పోషిస్తే..సచిన్, సెహ్వాగ్‌లు పెద్దన్న పాత్ర పోషించారు.
అప్పటికి కెరీర్‌లో అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు వన్డే వరల్డ్‌కప్ లేదన్న వెలితి ఉండేది. యువరాజ్ సింగ్ వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు ఈసారి ప్రపంచకప్ గెలిచి సచిన్‌కు బహుమతిగా అందిస్తాం అని శపథం చేశాడు. ఆ టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న యువరాజ్ సింగ్ వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో పాటు సచిన్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.
వాంఖడే వేదికగా జరిగిన ఆనాటి ఫైనల్లో టీమిండియా గెలవగానే జట్టు సభ్యులు స్టేడియం మొత్తం కలియదిరిగారు. క్రికెట్ గాడ్ సచిన్‌ను కోహ్లి, యూసఫ్ పఠాన్‌లు తమ భుజాలపై ఎత్తుకొని స్టేడియం మొత్తం తిప్పుతుంటే.. సచిన్ చేతిలో జెండా పట్టుకొని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టడం అప్పటి అభిమానులు ఇంకా మరిచిపోలేదు.
Virender Sehwag said, "everyone needs to win this World Cup for Virat Kohli. The kind of great player he is, a great human being also, he always helps other players". pic.twitter.com/tgxMpZFxK7
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2023
చదవండి: పుండు మీద కారం చల్లేలా.. పీసీబీకి హైకోర్టు షాక్
World Cup: హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లు ఇవే.. పాకిస్తాన్‌వే రెండు మ్యాచ్‌లు
Comments
Please login to add a commentAdd a comment