tenders invited
-
BCCI: భారీ ఆదాయంపై కన్ను.. మీడియా హక్కుల టెండర్లు విడుదల
బీసీసీఐ భారీ ఆదాయంపై కన్నేసింది.స్పాన్సర్షిప్ హక్కుల రూపంలో కోట్లు గడించాలని చూస్తోంది. ఈ మేరకు స్పాన్సర్షిప్ టెండర్లకు ఆహ్వానాలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఒక్క రోజు గడువక ముందే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు మీడియా హక్కులు కట్టబెట్టేందుకు సిద్ధపడింది. వన్డే వర్డల్ కప్(ODI World Cup 2023) సమీపిస్తున్నందున మీడియా హక్కుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. అంతేకాదు ఇన్విటేషన్ టు టెండర్(Invite To Tender)లో వివరాలతో పాటు షరతులు స్పష్టంగా పేర్కొంది. ఆసక్తిగల మీడియా సంస్థలు జీఎస్టీ(GST)తో కలిపి రూ.15 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజు చెల్లించాలని తెలిపింది. అర్హతలు, అవసరాలు, బిడ్స్ వేయడం, హక్కులు, అభ్యంతరాలు.. ఇవన్నీ టెండర్ ప్రక్రియలో భాగమని బీసీసీఐ వెల్లడించింది. ఐటీటీ ఆగస్టు 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. చదవండి: బంతిని తన్నబోయి ప్రత్యర్థి కాలు విరగొట్టాడు -
భారీ ఆదాయంపై కన్ను.. టైటిల్ స్పాన్సర్షిప్ టెండర్లకు పిలుపు
బోర్డు ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇండియా(బీసీసీఐ) మరోసారి భారీ ఆదాయంపై కన్నేసింది. టైటిల్ స్పాన్సర్ రైట్స్‌కు బీసీసీఐ ఈరోజు టెండర్లను ఆహ్వానించింది. ప్రముఖ కంపెనీల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. జీఎస్టీతో కలిపి రూ. లక్ష చెల్లించిన వాళ్లకు మాత్రమే ఇన్విటేషన్ టు టెండర్ ఫామ్ ఓపెన్ అవుతుందని వెల్లడించింది. ఒకవేళ టెండర్ దక్కకుంటే కట్టిన డబ్బులు వాపసు ఇవ్వబోమని, ఈ టెండర్ దరఖాస్తు ఆగస్టు 21 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని నోటిఫికేషన్లో బీసీసీఐ స్పష్టంగా పేర్కొంది. ఆసక్తికల కంపెనీలు పేమెంట్ వివరాలను titlesponsor.itt@bcci.tv మెయిల్‌కు చేయాలని సూచించింది. స్పాన్సర్షిప్ దక్కించుకున్న కంపెనీ ఇకనుంచి బీసీసీఐ అన్ని కార్యక్రమాలకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. చదవండి: Ishan Kishan: హ్యాట్రిక్ అర్థసెంచరీలు.. ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు -
మరో ఏడు లింక్ రోడ్లు: రూ.203 కోట్లు.. 25 కి.మీ
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌న్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో గ్రేటర్ శివార్లలో మరో ఏడు లింక్‌రోడ్ల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. నగరంలో తొలి రెండు దశల్లో నిర్మించిన లింక్రోడ్లతో ఎంతో ప్రయోజనం కలగడంతో మూడో దశలో జీహెచ్ఎంసీతో పాటు శివార్లలోని 10 స్థానిక సంస్థల్లోనూ లింక్‌రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. వాటికి నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేయడంతో పాటు ఇటీవల మూడో దశలోని మూడో ప్యాకేజీ పనులకు టెండర్లు పిలవడం తెలిసిందే. తాజాగా ఈ దశలోని మొదటి ప్యాకేజీ పనులకు టెండర్లు పిలిచినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిన 50 కారిడార్లలో ఈ ఏడు రోడ్లు కూడా ఉండటంతో వీటికి టెండర్లు పిలిచారు. టెండర్లు పూర్తికాగానే పనులు చేపట్టనున్నారు. వీటి అంచనా వ్యయం రూ.203.34 కోట్లు. రెండు ప్యాకేజీల్లోని పనులను పరిగణనలోకి తీసుకుంటే వాటికయ్యే మొత్తం వ్యయం దాదాపు రూ. 500 కోట్లు. తాజాగా టెండర్లు పిలిచిన ఏడు మార్గాలు.. నిర్మించనున్న లింక్‌రోడ్ల పొడవు వివరాలిలా ఉన్నాయి. 1.ఈసా నది తూర్పు వైపు బాపూఘాట్ బ్రిడ్జినుంచి పీఅండ్‌టీ కాలనీ: (2.10 కి.మీ) 2.కొత్తూరులో రైల్వేక్రాసింగ్ నుంచి కుమ్మరిగూడ జంక్షన్: (2.60 కి.మీ.) 3.కొత్తూరు వై జంక్షన్ నుంచి వినాయక స్టీల్ (ఎన్‌న్‌హెచ్44) వరకు:(1.50కి.మీ) 4.శంషాబాద్ ఎన్‌హెచ్ 44 బస్టాప్ నుంచి ఒయాసిస్ ఇంటర్నేషనల్:(4కి.మీ) 5.శంషాబాద్ రైల్వే క్రాసింగ్ నుంచి ధర్మగిరి రోడ్: (5కి.మీ) 6. ఎన్‌న్‌హెచ్ తొండుపల్లి జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ సరీ్వస్‌రోడ్:(3కి.మీ) 7.గొల్లపల్లి ఎన్‌హెచ్ జంక్షన్– ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ (7 కి.మీ) ఏడు మార్గాల్లో వెరసి మొత్తం 25.20 కి.మీ.ల లింక్‌రోడ్డు నిర్మించనున్నారు. (చదవండి: రాష్ట్రాలకు ఆ అధికారం లేదు) -
‘శాశ్వత ఉచిత విద్యుత్’లో మరో కీలక అడుగు
సాక్షి, అమరావతి : పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించే ‘వైఎస్సార్ ఉచిత విద్యుత్’ పథకాన్ని మరో 30 ఏళ్లు సమర్ధవంతంగా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ పథకం కోసమే ప్రత్యేకంగా చేపట్టిన 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టింది. తొలిదశలో.. అనంతపురం, వైఎస్సార్ కడప, ప్రకాశం, కర్నూల్ జిల్లాల్లో 6,050 మెగావాట్లకు టెండర్లు పిలుస్తున్నట్లు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్ష (జ్యూడీషియల్ ప్రివ్యూ)కు పంపింది. (కృష్ణాపై రెండు బ్యారేజీలకు గ్రీన్ సిగ్నల్) ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ పర్యవేక్షణలో జరిగే టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండేలా జ్యూడీషియల్ ప్రీవ్యూ అధికారిక వెబ్సైట్ ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. జ్యూడీషియల్ ప్రివ్యూ.ఏపీ.జీవోవీ.ఇన్’లో పొందుపర్చింది. వీటిని పరిశీలించి ప్రజలు, కాంట్రాక్టు సంస్థలు, నిపుణులు అవసరమైన సలహాలు, సూచనలు ఈనెల 25లోగా ‘ఏపీజ్యూడీషియల్‌ప్రీవ్యూ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ లేదా ‘జడ్జి–జేపీపీ ఎట్ ది రేట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్‌కు పంపవచ్చని ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. పీఎంయు డాట్ ఏపీజీఈసీఎల్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్’కు కూడా సూచనలు పంపవచ్చని తెలిపింది. జ్యూడీషియల్ ప్రివ్యూ తర్వాతే పనులకు సంబంధించిన టెండర్లు పిలుస్తారని పేర్కొంది. (కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా) -
విజయవాడలో టీడీపీ నేత ‘రియల్’ బ్రేకులు!
రాజధాని ముసుగులో ప్రభుత్వ ముఖ్యనేత రియల్ ఎస్టేట్ దందాలో ఇదో కొత్త కోణం. తన బినామీల రూ.5 వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్డు బైపాస్ పనులను నాలుగేళ్లుగా అడ్డుకుంటున్న కుతంత్రం ఇది. విజయవాడ మీదుగా వెళ్తున్న రెండు ప్రధాన జాతీయ రహదారులపై నిత్యం 1.20లక్షల వాహనాల రాకపోకలతో లక్షలాది మంది నరకం చవిచూస్తున్నా తమ రియల్ ఎస్టేట్ దోపిడీ కంటే ఏదీ ఎక్కువ కాదన్న ముఖ్యనేత పన్నాగంతో.. పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను–విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్డు బైపాస్ పనులకు ఒక్క అడుగూ పడలేదు. ఆ బాగోతం కథాకమామిషు ఇదిగో ఇలా ఉంది.. సాక్షి, అమరావతి బ్యూరో: 2014 ఎన్నికల అనంతరం జూన్‌లో పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని అక్కడే వస్తుందని తన అనుచర గణానికి ముందే సమాచారమిచ్చి అక్కడ తక్కువ ధరకు పెద్దఎత్తున భూములు కొనిపించారు. అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించాక ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్‌ను పట్టించుకోకుండా తాము కొనుగోలు చేసిన భూముల డిమాండ్‌ను పెంచుకోగలిగారు. సీఎం చంద్రబాబు సన్నిహితులు, బినామీలు వాటిల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. వారిలో ఎంపీ మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థ, లింగమనేని ఎస్టేట్స్‌లతోపాటు పలువురు టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధుల వెంచర్లు ఉన్నాయి. క్రెడాయ్ వివరాల ప్రకారం.. రాజధాని పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.10వేల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. వాటిలో విజయవాడ కనకదుర్గ వారధి నుంచి గుంటూరు జిల్లా చినకాకాని మధ్యలోనే జాతీయ రహదారికి ఇరువైపులా దాదాపు రూ.5వేల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ పెట్టుబడులున్నాయి. వాటిలో దాదాపు 75శాతం టీడీపీ ముఖ్యనేత, ఆయన సన్నిహితులు, బంధువులు, బినామీలవే కావడం గమనార్హం. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఆ భూములకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు నుంచి బడా కంపెనీల వరకు అక్కడే భూములు, ప్లాట్లు కొనుగోలుకు పోటీపడుతున్నాయి. ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకునిపెట్టుబడికి మూడు నాలుగు రెట్లు లాభాలు గడించడానికి ముఖ్యనేత బినామీలు వ్యూహం పన్నారు. ఈ సమయంలో విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్ బైపాస్ ప్రాజెక్టును నిర్మిస్తే అటు పక్కనున్న భూములకు డిమాండ్ పెరుగుతుంది. అంటే గన్నవరం నుంచి గొల్లపూడి వరకు, కృష్ణా నదిపై నిర్మించే వంతెనకు ఆవల వైపు నుంచి చినకాకానికి అటువైపునున్న భూములకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే తమ రియల్ ఎస్టేట్ దందా సాగదని ముఖ్యనేత ఆయన బినామీ బ్యాచ్ సందేహించారు. తమ రియల్ ఎస్టేట్ వెంచర్లు అన్నీ అమ్ముడయ్యే వరకు విజయవాడ ఔటర్ బైపాస్ నిర్మాణం జరగకూడదని పథక రచన చేశారు. కాంట్రాక్టును దక్కించుకున్న గామన్ ఇండియా సంస్థ పనులు ప్రారంభించకపోయినా సరే ఎన్హెచ్ఏఐ కాంట్రాక్టు రద్దు చేయకుండా మూడున్నరేళ్లుగా అడ్డుకుంటున్నారు. అసలు పనులు ప్రారంభించకుండా గామన్ ఇండియా సంస్థను రాష్ట్ర ముఖ్యనేతే ప్రభావితం చేశారని కూడా అధికార వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ కొత్తగా ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచినా సరే రెండు ప్యాకేజీల పనులే ఈ ఏడాది ప్రారంభమవుతాయి. కృష్ణా నదికి అవతల వైపు నుంచి చినకాకాని వరకు పనులు మరో ఏడాది తరువాతే ప్రారంభమై 20022నాటికి పూర్తవుతాయి. ఈలోపు అంటే 2019లోగా తమ వెంచర్లు అన్నీ అమ్మేసుకోవాలన్నది ముఖ్యనేత పన్నాగం. మూడున్నరేళ్లుగా అవాంతరాలు హైదరాబాద్–మచిలీపట్నం 65వ నంబర్ జాతీయ రహదారి, చెన్నై–కోల్‌కత 16నంబర్ జాతీయ రహదారి విజయవాడ వద్ద కలుస్తాయి. పోలీసు, రవాణా శాఖ సర్వే ప్రకారం రోజూ 1.20లక్షల వాహనాలు ప్రయాణించే ఈ రహదారిలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుండడంతో లక్షలాది మంది నరకయాతన అనుభవిస్తున్నారు. దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారంగా విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్డు బైపాస్ నిర్మించాలని 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను నుంచి కృష్ణాజిల్లా గన్నవరం, గొల్లపూడి.. గుంటూరు జిల్లా మంగళగిరి మీదుగా చినకాకాని వరకు 103.59 కి.మీ. పొడవున నాలుగు లేన్ల బైపాస్ రోడ్డు నిర్మించాలన్నది ప్రణాళిక. అందుకోసం అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 60మీటర్ల వెడల్పుతో గుండుగొలను నుంచి చినకాకాని వరకు భూసేకరణ పూర్తిచేసింది. దాదాపు రూ.1,684కోట్ల అంచనా వ్యయంతో నిర్మించు, నిర్వహించు, బదలాయించు (బీవోటీ) విధానంలో ఈ బైపాస్ నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) 2014లో టెండర్లు పిలిచింది. ఎల్–1గా వచ్చిన గామన్ ఇండియా సంస్థకు 2014, సెప్టెంబరు 1న టెండరు ఖరారు చేశారు. 2017 మార్చి 1 నాటికి దీని నిర్మాణం పూర్తిచేయాలని గడువు విధించారు. కానీ, నాటి నుంచి నేటి వరకూ ఒక్క అడుగూ పడలేదు. కాంట్రాక్టు రద్దుకూ ముఖ్యనేత ససేమిరా నెలలు గడుస్తున్నా గామన్ ఇండియా సంస్థ రింగ్‌రోడ్డు బైపాస్ పనులు ప్రారంభించనే లేదు. ఎన్హెచ్ఏఐ అధికారులు ఎన్నిసార్లు ప్రస్తావించినప్పటికీ ఆ సంస్థ సానుకూలంగా స్పందించలేదు. దాంతో అధికారులు ఆ కాంట్రాక్టు రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యనేత రంగంలోకి దిగారు. ‘గామన్’ కాంట్రాక్టును రద్దు చేయడానికి వీల్లేదని.. కాంట్రాక్టు గడువు పొడిగించాలని కేంద్రంపై ఒత్తిడి చేశారు. టీడీపీ ఎంపీలు కేశినేని నాని, రాయపాటి సాంబశివరావులతోపాటు రాష్ట్ర మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి పుల్లారావు ఎన్హెచ్ఏఐ అధికారులతో చర్చలు జరిపారు. వారి ఒత్తిడితో ఎన్హెచ్ఏఐ కాంట్రాక్టు గడువును పొడిగించింది. అయినా పనులు ప్రారంభం కాలేదు. ఇక లాభం లేదని ఎన్హెచ్ఏఐ అధికారులు గామన్ ఇండియా సంస్థకు 2016, ఆగస్టులో రద్దు నోటీసు జారీచేశారు. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల జోక్యంతో మరోసారి గడువు పొడిగించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో నిర్ణీత గడువు ప్రకారం 2017, మార్చి 1 నాటికి ఒక్క అడుగు కూడా రోడ్డు నిర్మించనే లేదు. అయినా సరే, కాంట్రాక్టు రద్దు చేయడానికి వీల్లేదని ప్రభుత్వ ముఖ్యనేత 2017, డిసెంబరు వరకు అడ్డుకుంటూనే ఉన్నారు. కాంట్రాక్టు రద్దు.. తాజాగా టెండర్లు ‘గామన్’ సంస్థ ఎంతకీ పనులు ప్రారంభించకపోవడంతో ఇక లాభం లేదని ఆ కాంట్రాక్టును రద్దుచేసి రింగ్‌రోడ్డు బైపాస్ ప్రాజెక్టును ఈపీసీ విధానంలో నాలుగు ప్యాకేజీల కింద నిర్మించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ప్యాకేజీ–1గా గొండుగొలను నుంచి హనుమాన్ జంక్షన్ వరకు రూ.513కోట్లు, ప్యాకేజీ–2గా హనుమాన్ జంక్షన్ నుంచి చిన్నఅవుటుపల్లి వరకు రూ.587కోట్లతో టెండర్లు పిలిచింది. అందుకు జూన్ 4 వరకు గడువు ఉంది. అవసరమైన భూమి అందుబాటులో ఉన్నందున అందుకోసం తాజాగా డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) తయారుచేసేందుకు కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలిచారు. డీపీఆర్ అనంతరం రెండు ప్యాకేజీల కింద ఆ పనులకు టెండర్లు పిలుస్తారు. ప్యాకేజీ–1, 2ల పనులను 2020 నాటికి పూర్తి అవుతాయని అధికారులు భావిస్తున్నారు. గొల్లపూడి వద్ద కృష్ణా నదిపై వంతెనతో సహా ప్యాకేజీ 3, 4 పనులు 2022నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. -
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు టెండర్లు
అమరావతి : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ పనులకు డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్) సోమవారం టెండర్లు పిలిచింది. ఏలూరు, బందరు రోడ్డుల్లో 26 కిలోమీటర్ల నిర్మించే కారిడార్ల డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్‌తోపాటు ఎలివేటెడ్ బ్రిడ్జి, మధ్యలో కిలోమీటరుకు ఒక స్టేషన్, ఎంట్రీ-ఎగ్జిట్ ద్వారాల నిర్మాణం, ఫ్లంబింగ్ పనులన్నింటినీ కలిపి రూ.1800 కోట్ల అంచనాతో చేపట్టాల్సివుంటుందని పేర్కొంది. ఏలూరు రోడ్డు కారిడార్‌కు రూ.969 కోట్లు, బందరు రోడ్డు కారిడార్‌కు రూ.831 కోట్ల అంచనాతో విడిగా టెండర్లు పిలిచింది. స్టేషన్ల నిర్మాణ పనులకు సంబంధించిన టెండరు పత్రాలను డిసెంబర్ ఐదు నుంచి 16వ తేదీ వరకూ విక్రయిస్తారు. జనవరి 12 నుంచి 16వ తేదీలోపు టెండర్లు దాఖలు చేయాలి. త్వరలో నిడమానూరులో కోచ్ డిపో, రెండు కారిడార్లలో ట్రాక్ నిర్మాణం, విద్యుత్ తదితర పనులకు విడిగా టెండర్లు పిలవనుంది. -
వాటర్ గ్రిడ్ టెండర్ల ప్రక్రియ ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ తాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు టీఆర్ఎస్ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 7 నుంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ టెండర్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలపారు. మొత్తంగా 11 సెగ్మెంట్లలో వాటర్ గ్రిడ్ టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది.