విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు టెండర్లు | delhi metro rail corporation tenders invited for vijayawada metro project | Sakshi
Sakshi News home page

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు టెండర్లు

Published Mon, Nov 28 2016 8:56 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు టెండర్లు

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు టెండర్లు

అమరావతి : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ పనులకు డీఎంఆర్‌సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్) సోమవారం టెండర్లు పిలిచింది. ఏలూరు, బందరు రోడ్డుల్లో 26 కిలోమీటర్ల నిర్మించే కారిడార్ల డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్‌తోపాటు ఎలివేటెడ్ బ్రిడ్జి, మధ్యలో కిలోమీటరుకు ఒక స్టేషన్, ఎంట్రీ-ఎగ్జిట్ ద్వారాల నిర్మాణం, ఫ్లంబింగ్ పనులన్నింటినీ కలిపి రూ.1800 కోట్ల అంచనాతో చేపట్టాల్సివుంటుందని పేర్కొంది.

ఏలూరు రోడ్డు కారిడార్‌కు రూ.969 కోట్లు, బందరు రోడ్డు కారిడార్‌కు రూ.831 కోట్ల అంచనాతో విడిగా టెండర్లు పిలిచింది. స్టేషన్ల నిర్మాణ పనులకు సంబంధించిన టెండరు పత్రాలను డిసెంబర్ ఐదు నుంచి 16వ తేదీ వరకూ విక్రయిస్తారు. జనవరి 12 నుంచి 16వ తేదీలోపు టెండర్లు దాఖలు చేయాలి. త్వరలో నిడమానూరులో కోచ్ డిపో, రెండు కారిడార్లలో ట్రాక్ నిర్మాణం, విద్యుత్ తదితర పనులకు విడిగా టెండర్లు పిలవనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement