న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మెట్రోలో ప్రయాణించేవారు బైక్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 12 మెట్రో స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. రానున్న రోజుల్లో దీని సంఖ్య మరింత పెరగనుంది.
ఢిల్లీ మెట్రో ప్రయాణికులు 'డీఎంఆర్‌సీ మొమెంటం' అప్లికేషన్ ద్వారా బైక్ టాక్సీలను బుక్ చేసుకోవచ్చు. మహిళా ప్రయాణికుల కోసం ఢిల్లీ మెట్రో ప్రత్యేక బైక్ టాక్సీ సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకువస్తూ, రెండు రకాల బైక్ ట్యాక్సీలను విడుదల చేసింది. మొదటిది ‘షీరైడ్స్’ దీనిని ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల కోసం తీసుకువచ్చారు. రెండవది ‘రైడర్’ ఈ బైక్ టాక్సీ అందరికీ ఉపయోగపడుతుంది. ఈ బైక్ టాక్సీలన్నీ ఎలక్ట్రిక్ బైక్‌లు. వీటి వినియోగం వల్ల కాలుష్యం ఏర్పడదు.
DELHI METRO LAUNCHES BIKE TAXI SERVICE FOR ITS COMMUTERS INCLUDING DEDICATED BIKE TAXIS FOR WOMEN TRAVELERS
Delhi Metro customers will now be able to book their Bike taxi rides from Delhi Metro’s official mobile app, DMRC Momentum (Delhi Sarthi 2.0) itself without the need to… pic.twitter.com/pFwmhi3t0u— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) November 11, 2024
షీరైడ్స్ బైక్ టాక్సీకి మహిళా డ్రైవర్ ఉంటారు. దీనిద్వారా మహిళా ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని ఎంచుకోవచ్చు. షీరైడ్స్‌లో ప్రయాణానికి కనీస ధర రూ. 10. ఈ సౌకర్యం ప్రస్తుతం 12 మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంది. డీఆర్‌ఎంసీ ఈ సేవలను ‘ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మిగిలిన స్టేషన్లలో కూడా ఈ సదుపాయం రానున్న మూడు నెలల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: మబ్బుల్లో తేలుదాం.. మంచును ముద్దాడదాం
Comments
Please login to add a commentAdd a comment