byke taxi
-
బైక్ టాక్సీ సేవలను ప్రారంభించిన ఢిల్లీ మెట్రో
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మెట్రోలో ప్రయాణించేవారు బైక్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 12 మెట్రో స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. రానున్న రోజుల్లో దీని సంఖ్య మరింత పెరగనుంది.ఢిల్లీ మెట్రో ప్రయాణికులు 'డీఎంఆర్సీ మొమెంటం' అప్లికేషన్ ద్వారా బైక్ టాక్సీలను బుక్ చేసుకోవచ్చు. మహిళా ప్రయాణికుల కోసం ఢిల్లీ మెట్రో ప్రత్యేక బైక్ టాక్సీ సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకువస్తూ, రెండు రకాల బైక్ ట్యాక్సీలను విడుదల చేసింది. మొదటిది ‘షీరైడ్స్’ దీనిని ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల కోసం తీసుకువచ్చారు. రెండవది ‘రైడర్’ ఈ బైక్ టాక్సీ అందరికీ ఉపయోగపడుతుంది. ఈ బైక్ టాక్సీలన్నీ ఎలక్ట్రిక్ బైక్‌లు. వీటి వినియోగం వల్ల కాలుష్యం ఏర్పడదు. DELHI METRO LAUNCHES BIKE TAXI SERVICE FOR ITS COMMUTERS INCLUDING DEDICATED BIKE TAXIS FOR WOMEN TRAVELERSDelhi Metro customers will now be able to book their Bike taxi rides from Delhi Metro’s official mobile app, DMRC Momentum (Delhi Sarthi 2.0) itself without the need to… pic.twitter.com/pFwmhi3t0u— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) November 11, 2024షీరైడ్స్ బైక్ టాక్సీకి మహిళా డ్రైవర్ ఉంటారు. దీనిద్వారా మహిళా ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని ఎంచుకోవచ్చు. షీరైడ్స్లో ప్రయాణానికి కనీస ధర రూ. 10. ఈ సౌకర్యం ప్రస్తుతం 12 మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంది. డీఆర్ఎంసీ ఈ సేవలను ‘ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మిగిలిన స్టేషన్లలో కూడా ఈ సదుపాయం రానున్న మూడు నెలల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇది కూడా చదవండి: మబ్బుల్లో తేలుదాం.. మంచును ముద్దాడదాం -
ర్యాపిడోకి ఊహించని షాక్.. అన్ని సర్వీసులు బంద్ చేయాలని కోర్టు అదేశాలు!
ర్యాపిడోకి బాంబే హైకోర్ట్ గట్టి షాక్ ఇచ్చింది. పుణెలో ర్యాపిడో సర్వీస్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడో ట్యాక్సీ సర్వీస్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. బైకలతో పాటు కంపెనీకి చెందిన వాహనాలకు లైసెన్స్ లేదని తేల్చి చెప్పింది. అసలేం జరిగింది గతేడాది డిసెంబర్లో ర్యాపిడో లైసెన్స్ దరఖాస్తుని రవాణా శాఖ తిరస్కరించింది. కంపెనీ అప్లికేషన్లో బైక్, ట్యాక్సీలపై మార్గదర్శకాలు స్పష్టంగా లేవని, కనుకు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ అంశంపై ర్యాపిడో కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసుకు సంబంధించి ర్యాపిడో తరపు న్యాయవాదులు వాదిస్తూ.. లైసెన్స్ కోసం కంపెనీ దరఖాస్తు చేసిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందని వాదించారు. అయితే లైసెన్స్ ప్రక్రియ ఇంకా దరఖాస్తు దశలోనే ఉందని, ప్రస్తుతం ర్యాపిడో కార్యకలపాలు జరపడం చట్టవిరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు వచ్చే శుక్రవారం వరకు ర్యాపిడో తమ అన్నీ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. వచ్చే శుక్రవారం (జనవరి 20న) కోర్టు మరో సారి దీనిపై విచారణ చేపట్టనుంది. చదవండి: ‘ఆ కారు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’.. రతన్ టాటా భావోద్వేగ పోస్ట్ వైరల్! -
బైక్ టాక్సీ కోసం.. బాక్సీ యాప్!
బైక్ టాక్సీలు వచ్చాయని వినడమే గానీ వాటిని ఎలా అద్దెకు తీసుకోవాలన్న విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసం బాక్సీ అనే యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. అందులో ఉన్న బాక్సీబడ్డీ అనే ఫీచర్ కూడా వినియోగదారులకు ఉపయుక్తంగా ఉంటోంది. ఒకసారి ఒక బైకు ఎక్కిన తర్వాత ఆ డ్రైవర్ తీరు నచ్చితే, వాళ్లను ఫేవరెట్‌గా మార్క్ చేసుకోవచ్చు. తర్వాత మళ్లీ ఎప్పుడైనా రైడ్ బుక్ చేసుకుంటే, ముందుగా ఆ ఫేవరెట్ డ్రైవర్‌కే నోటిఫికేషన్ వెళ్తుంది. మహిళలు, వృద్ధులు ఈ ఫీచర్‌ను బాగా మెచ్చుకుంటున్నారని చెబుతున్నారు. ఒకసారి రైడ్ పూర్తయిన తర్వాత డ్రైవర్‌కు రేటింగ్ ఇవ్వాలని కస్టమర్‌ను అడుగుతారు. దాంతోపాటు నచ్చితే ఫేవరెట్‌గా మార్క్ చేయాలని చెబుతారు. తర్వాతి సారి బైక్ టాక్సీ బుక్ చేసుకునేటప్పుడు ఆ డ్రైవర్ అందుబాటులో ఉంటే అతడినే కేటాయిస్తారు. నమ్మకస్తుడైన డ్రైవర్ ఉంటే వెళ్లాలని వాళ్లు కోరుకుంటారని, దీనివల్ల తమ సేవలకు - వినియోగదారులకు మధ్య ఒక నమ్మకం ఏర్పడుతుందని బాక్సీ సహ వ్యవస్థాపకుడు మను రాణా అన్నారు. ప్రస్తుతం కేవలం దేశ రాజధాని ప్రాంతంలోనే అందుబాటులో ఉన్న బాక్సీ సర్వీసులను త్వరలోనే నోయిడా, ఘజియాబాద్‌లకు కూడా విస్తరిస్తారు.