బైక్ టాక్సీ కోసం.. బాక్సీ యాప్!
బైక్ టాక్సీలు వచ్చాయని వినడమే గానీ వాటిని ఎలా అద్దెకు తీసుకోవాలన్న విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసం బాక్సీ అనే యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. అందులో ఉన్న బాక్సీబడ్డీ అనే ఫీచర్ కూడా వినియోగదారులకు ఉపయుక్తంగా ఉంటోంది. ఒకసారి ఒక బైకు ఎక్కిన తర్వాత ఆ డ్రైవర్ తీరు నచ్చితే, వాళ్లను ఫేవరెట్‌గా మార్క్ చేసుకోవచ్చు. తర్వాత మళ్లీ ఎప్పుడైనా రైడ్ బుక్ చేసుకుంటే, ముందుగా ఆ ఫేవరెట్ డ్రైవర్‌కే నోటిఫికేషన్ వెళ్తుంది. మహిళలు, వృద్ధులు ఈ ఫీచర్‌ను బాగా మెచ్చుకుంటున్నారని చెబుతున్నారు.
ఒకసారి రైడ్ పూర్తయిన తర్వాత డ్రైవర్‌కు రేటింగ్ ఇవ్వాలని కస్టమర్‌ను అడుగుతారు. దాంతోపాటు నచ్చితే ఫేవరెట్‌గా మార్క్ చేయాలని చెబుతారు. తర్వాతి సారి బైక్ టాక్సీ బుక్ చేసుకునేటప్పుడు ఆ డ్రైవర్ అందుబాటులో ఉంటే అతడినే కేటాయిస్తారు. నమ్మకస్తుడైన డ్రైవర్ ఉంటే వెళ్లాలని వాళ్లు కోరుకుంటారని, దీనివల్ల తమ సేవలకు - వినియోగదారులకు మధ్య ఒక నమ్మకం ఏర్పడుతుందని బాక్సీ సహ వ్యవస్థాపకుడు మను రాణా అన్నారు. ప్రస్తుతం కేవలం దేశ రాజధాని ప్రాంతంలోనే అందుబాటులో ఉన్న బాక్సీ సర్వీసులను త్వరలోనే నోయిడా, ఘజియాబాద్‌లకు కూడా విస్తరిస్తారు.