Delhi Metro Rail Corporation
-
బైక్ టాక్సీ సేవలను ప్రారంభించిన ఢిల్లీ మెట్రో
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మెట్రోలో ప్రయాణించేవారు బైక్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 12 మెట్రో స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. రానున్న రోజుల్లో దీని సంఖ్య మరింత పెరగనుంది.ఢిల్లీ మెట్రో ప్రయాణికులు 'డీఎంఆర్సీ మొమెంటం' అప్లికేషన్ ద్వారా బైక్ టాక్సీలను బుక్ చేసుకోవచ్చు. మహిళా ప్రయాణికుల కోసం ఢిల్లీ మెట్రో ప్రత్యేక బైక్ టాక్సీ సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకువస్తూ, రెండు రకాల బైక్ ట్యాక్సీలను విడుదల చేసింది. మొదటిది ‘షీరైడ్స్’ దీనిని ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల కోసం తీసుకువచ్చారు. రెండవది ‘రైడర్’ ఈ బైక్ టాక్సీ అందరికీ ఉపయోగపడుతుంది. ఈ బైక్ టాక్సీలన్నీ ఎలక్ట్రిక్ బైక్‌లు. వీటి వినియోగం వల్ల కాలుష్యం ఏర్పడదు. DELHI METRO LAUNCHES BIKE TAXI SERVICE FOR ITS COMMUTERS INCLUDING DEDICATED BIKE TAXIS FOR WOMEN TRAVELERSDelhi Metro customers will now be able to book their Bike taxi rides from Delhi Metro’s official mobile app, DMRC Momentum (Delhi Sarthi 2.0) itself without the need to… pic.twitter.com/pFwmhi3t0u— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) November 11, 2024షీరైడ్స్ బైక్ టాక్సీకి మహిళా డ్రైవర్ ఉంటారు. దీనిద్వారా మహిళా ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని ఎంచుకోవచ్చు. షీరైడ్స్లో ప్రయాణానికి కనీస ధర రూ. 10. ఈ సౌకర్యం ప్రస్తుతం 12 మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంది. డీఆర్ఎంసీ ఈ సేవలను ‘ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మిగిలిన స్టేషన్లలో కూడా ఈ సదుపాయం రానున్న మూడు నెలల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇది కూడా చదవండి: మబ్బుల్లో తేలుదాం.. మంచును ముద్దాడదాం -
అనిల్ అంబానీ అదృష్టం తారుమారు
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నులకు సంబంధించి 2008లో వెలువడిన జాబితాలో ఆరవస్థానంలో నిలిచిన అనిల్ అంబానీకి వరుస ఎదురు దెబ్బలు కొనసాగుతున్నాయి. అనిల్ అంబానీ గ్రూప్ సంస్థల్లో ఒకటైన– ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు(డీఏఎంఈపీఎల్) అనుకూలంగా గతంలో వచ్చిన ఆర్బిట్రేషన్ అవార్డును సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ– డీఏఎంఈపీఎల్ అలాగే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మధ్య కుదిరిన ‘‘రాయితీ ఒప్పందం’’ విషయంలో తలెత్తిన ఒక వివాదానికి సంబంధించి రూ.8,000 కోట్ల అవార్డుతో ఆయన కష్టాలు కొంత గట్టెక్కుతాయన్న అంచనాలను తాజా పరిణామం దెబ్బతీసింది. ఆర్బిట్రేషన్ అనుగుణంగా గతంలో డీఎంఆర్సీ చెల్లించిన రూ.3,300 కోట్లను వాపసు చేయాలని సుప్రీం డీఏఎంఈపీఎల్ని ఆదేశించింది. అయితే తీర్పు వల్ల తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేర్కొంది. అటు డీఎంఆర్సీ నుంచి కానీ ఇటు గ్రూప్ సంస్థ డీఏఎంఈపీఎల్ నుంచి తనకు ఎటువంటి డబ్బూ అందలేదని వివరించింది. -
ప్రయాణికులు అలాంటి దుస్తుల్లో రావద్దు.. ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన..
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ఓ యువతి టు పీస్ బికినీ టైప్ దుస్తులు ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ కీలక ప్రకటన చేసింది. రైలులో ప్రయాణించేవారు ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంపై మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణికులు మెట్రోలో ఇతరులకు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా అన్పించే దుస్తులు ధరించవద్దని యాజమాన్యం సూచించింది. తోటి ప్రయాణీకుల సున్నితత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించవద్దని స్పష్టం చేసింది. సమాజానికి ఆమోదయోగ్యమైన వేషధారణలో ప్రయాణించాలని తెలిపింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే సెక్షన్ 59 ప్రకారం శిక్షార్హులని హెచ్చరించింది. 'మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తున్నప్పుడు వేషధారణ మంచిగా ఉండాలని ప్రయాణికులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దుస్తుల ఎంపిక వ్యక్తిగత విషయమే అయినప్పటికీ.. ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించి స్వీయ నియంత్రణలో ఉండాలని విజ్ఞప్తి చేసింది. బ్రా.. మిని స్కర్ట్.. పీలికల్లాంటి దుస్తుల్లో మెట్రో రైలులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను బిత్తరపోయేలా చేసిన యువతి పేరు రిథమ్ చననా. సోషల్ మీడియాలో ఈ యువతిపై మామూలు తిట్లు పడడం లేదు. సొసైటీని పాడు చేయడానికే అలాంటి బట్టలు వేసుకుంటున్నావా? అంటూ మండిపడుతున్నారంతా. తొలుత ఆమె ఫొటోలు, వీడియోలు చూసి అంతా ఉర్ఫీ జావెద్ అనుకుని పొరపడ్డారంతా. చివరికి.. ఆమె అసలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఐడెంటింటీ రివీల్ అయ్యింది. తనది ఎంతో పద్ధతిగల కుటుంబమని చెప్పిన ఆమె.. మొదట్లో తాను అంతే పద్దతిగా ఉండేదానినని చెప్పింది. అయితే.. సడన్‌గా తన ఆలోచనలు మారాయని, ఆ ఆలోచనలకు ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో దూరంగా ఉంటూ వస్తున్నానని తెలిపింది. చదవండి: దారుణం.. ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు.. 400 కిలోమీటర్లు తీసుకెళ్లి బీచ్‌లో.. -
ఎంపీకే టోకరా.. రూ. 25 కోట్లకు కుచ్చుటోపి
న్యూఢిల్లీ: బ్యాంకులో తనఖా పెట్టి.. 20 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్న ప్రాపర్టీని.. మాయమాటలు చెప్పి.. మరో వ్యక్తికి ఏకంగా 5 కోట్ల రూపాయలకు అంటగట్టారు నిందితులు. ఇక్కడ మోసపోయిన వ్యక్తి ఓ ఎంపీ కావడం విషేశం. నిందితులను అరెస్ట్ చేశారు ఆర్థిక నేరాల విభాగం అధికారులు. ఆ వివరాలు.. ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మకు నాలుగేళ్ల క్రితం నిందితుడు వినోద్ కుమార్ శర్మతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వినోద్ కుమార్ ఢిల్లీలో తనకు ఓ ప్రాపర్టీ ఉందని.. దాని విలువ సుమారు 5 కోట్ల రూపాయలుంటుందని తెలిపాడు. ఆ ప్రాపర్టీని ఢిల్లీ మెట్రో రైల్వై ప్రాజెక్ట్ లీజుకు తీసుకుందని.. నెలకు 8-9 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తుందని నమ్మబలికాడు. (చదవండి: చందమామపై ఇల్లు 289 కోట్లే!) వినోద్ మాటలు నమ్మిన అనురాగ్.. అతడు చెప్పిన మేరకు 5.6 కోట్ల రూపాయలు చెల్లించి 2017, ఫిబ్రవరి 21న కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అసలు మోసం వెలుగులోకి వచ్చింది. విషయం ఏంటంటే అనురాగ్‌కు ప్రాపర్టీని అమ్మడానికి ముందే వినోద్ దాని మీద కెనరా బ్యాంక్‌లో 20.2 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఆ ప్రాపర్టీ మీద కెనరా బ్యాంక్ అనేక చార్జీలు విధించినట్లు తెలుసుకున్నారు. (చదవండి: ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూసూద్!) అంతేకాక ప్రాపర్టీని అనురాగ్ శర్మకు అమ్మిన తర్వాత నిందితుడు.. ఆ విషయాన్ని దాచిపెట్టి డీఎంఆర్‌సీతో చేసుకున్న లీజ్ అగ్రిమెంట్‌ను తన పేరు మీదనే పొడగించుకున్నాడు. మోసపోయానని తెలుసుకున్న అనురాగ్ శర్మ.. నిందితుల మీద ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వినోద్ శర్మ తనను తాను మాజీ న్యాయశాఖ అధికారిగా పరిచయం చేసుకున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. చదవండి: ‘రూ.30 లక్షలు కట్టు.. గవర్నమెంట్ జాబ్ పక్కా’ -
పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్, ప్రారంభించిన పేటీఎం
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం తాజాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌తో కలిసి ఫాస్టాగ్ ఆధారిత పార్కింగ్ సర్వీసులు ప్రారంభించింది. వీటిని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) తెలిపింది. కష్మీర్ గేట్ మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ తరహా విధానంలో ఫాస్టాగ్ స్టికర్ గల కార్లు.. పార్కింగ్ ఏరియాలోకి వచ్చినప్పుడు నగదు చెల్లించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదని వివరించింది. ఇక ద్విచక్ర వాహనాల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపుల విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పీపీబీఎల్ తెలిపింది . చదవండి: ‘ఫాస్ట్’గా దోచేస్తున్నారు.. -
మెట్రో స్టేషన్లో నాగుపాము కలకలం
న్యూఢిల్లీ: ఒకప్పుడు పాములు ఎక్కడ ఉంటాయి? అని అడిగితే ఊరి చివర పుట్టల్లో, పొలాల్లో, అడవుల్లో అని చెప్పేవాళ్లం. కానీ అవి కూడా వలస వచ్చాయి.. జనావాసాల్లోకి! ఇంటి కప్పు మీద, వంటగదిలో, ఆఖరికి ఇంట్లోని బాత్రూమ్లోనూ పాములు ప్రత్యక్షమవుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఢిల్లీలోని సాకెట్ మెట్రో స్టేషన్ ద్వారం దగ్గర శుక్రవారం నాలుగడుగుల నాగుపాము పాగా వేసి అక్కడి సిబ్బందిని హడలెత్తించింది. దీంతో సిబ్బంది వెంటనే వైల్డ్‌లైఫ్ ఎస్‌వోఎస్ అనే స్వచ్ఛంద సంస్థకు సమాచారమిచ్చారు. (జాతీయ రహదారిపై త్రాచు పాము హల్చల్..) వారు ఘటనా స్థలానికి చేరుకుని ఎంతో చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం దాన్ని దూర ప్రదేశానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. ఇంకా మెట్రో రైళ్లు ప్రారంభం కాకపోవడంతో అక్కడ జనాలు ఎవరూ లేకపోయేసరికి పెద్ద ప్రమాదం తప్పింది. కాగా ఇటీవలే సాకెట్ మెట్రో స్టేషన్లో కొండచిలువను, ఓక్లా బర్డ్ సాంక్చుయరీ మెట్రో స్టేషన్లో నాగుపామును రక్షించినట్లు వైల్డ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. (పాముల కాలం.. జర భద్రం) -
20 మంది మెట్రోరైల్ ఉద్యోగులకు కరోనా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మెట్రోరైలు కార్పోరేషన్లో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. తమ సంస్థలో పని చేసే వివిధ స్థాయి ఉద్యోగులకు వైరస్ సోకినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. దీనిపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ట్వీట్ చేస్తూ.. ‘దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దానిపై పోరాడుతున్నాము. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అన్ని చర్యలు తీసుకొని మెట్రో సర్వీసులను పరుగులు పెట్టించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ’ ఢిల్లీ మెట్రోరైలు మస్కట్, మాస్క్, గ్లోవ్స్ ధరించిన బాలిక పోస్టరును అధికారులు ట్వీట్ చేశారు. మెట్రోరైలు కార్యాలయాలు, రైల్వేస్టేషన్లు శానిటైజ్ చేయిస్తూ కరోనా విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మెట్రోరైలు అధికారులు వెల్గడించారు. కాగా ఢిల్లీలో ఇప్పటిదాకా.. 23,645 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 606 మంది మరణించారు. 9,542 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. చదవండి: భారత్‌లో కొత్తగా 9,851 కేసులు Along with the rest of the country, DMRC is also fighting the battle against Covid - 19. Delhi Metro's employees have shown exemplary resilience in reporting back to their duties to keep the Metro system in all readiness for eventual resumption of services. #DMRCFightsCOVID pic.twitter.com/La5ev8Dgco — Delhi Metro Rail Corporation (@OfficialDMRC) June 4, 2020 -
జనతా కర్ఫ్యూ.. మెట్రో సేవలు బంద్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రోజున జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలంతా ఆరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ఈ నేపథ్యంలో ఆదివారం మెట్రో సేవలను నిలిపివేస్తున్నట్టు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ప్రకటించింది. ప్రజలు ఇళ్లలో ఉండి జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కరోనాపై పోరాటం చేయడం చాలా ముఖ్యమైనదని పేర్కొంది. కాగా, కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో 195 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్రం పలు కఠిన నిర్ణయాలను తీసుకుంది. మార్చి 22 నుంచి వారం రోజులపాటు అంతర్జాతీయ విమానసర్వీసులను రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. రైళ్లలో జనసమ్మర్ధాన్ని నివారించే ఉద్దేశంతో తాము ఇస్తున్న పలు రాయితీలను నిలిపివేస్తూ కేంద్ర రైల్వే శాఖ ఆదేశాలు జారీచేసింది. అలాగే పలు రాష్ట్రాలు కూడా కరోనా నియంత్రణలో భాగంగా మార్చి 31వరకు షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, సినిమా హాళ్లు మూసివేయాలని ఆదేశాలు జారీచేశాయి. చదవండి : అతను చనిపోయాడన్న వార్తలు అవాస్తవం : విశాఖ కలెక్టర్ మరో రెండు కరోనా కేసులు.. మొత్తం 18 -
ఉచితాలతో నష్టాల్లోకి నెట్టేస్తారా?
న్యూఢిల్లీ: మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసలు మెట్రోలో ఉచిత ప్రయాణం ఎందుకు? ఇలా ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల భవిష్యత్తులో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎమ్ఆర్సీ)ను నష్టాల బాటలో నడిపిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘ఉచిత’ నిర్ణయంపై ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గాలని, ఇలాంటి ఉచిత తాయిలాలను ఉపేక్షించబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఢిల్లీలో నాలుగో ఫేజ్‌లో భాగంగా త్వరలో చేపట్టే మెట్రో విస్తరణ కోసం భూసేకరణ చేయాలని, దానికి అయ్యే వ్యయంలో సగం కేంద్రం భరించాలని ‘ఆప్’ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచిత ప్రయాణాల వల్ల దీర్ఘకాలంలో నష్టాలు తప్పవని, ఇలాంటి హామీలనిస్తూ కేంద్రం ఈ ఖర్చునంతా భరించాలనడం సరికాదని వ్యాఖ్యానించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మెట్రో, బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని గతంలో ప్రకటించడం తెల్సిందే. -
మెట్రోలో సాంకేతిక లోపం.. భారీగా ట్రాఫిక్ జామ్!
న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైలులో తలెత్తిన సాంకేతిక లోపంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు గుర్గావ్-ఢిల్లీ మార్గమధ్యంలో సాంకేతికలోపం తలెత్తడంతో మెట్రో రైలు అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో రైలులో ఉన్న సుమారు వెయ్యిమంది రోడ్లపైకి రావడంతో గురుద్రోణాచార్య, కుతుబ్‌మినార్ మెట్రోస్టేషన్ల మధ్య(జాతీయరహదారి 8పై) భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. దీంతో మెట్రో ప్రయాణీకులతో పాటు సాధారణ ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ విషయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దృష్టికి రాగా ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని అందజేయాలని రవాణశాఖ మంత్రిని ఆదేశించారు. అంతేకాకుండా ఢిల్లీ మెట్రోనే పూర్తి బాధ్యతవహించాలన్నారు. సుల్తాన్పూర్ స్టేషన్లో ఓవర్‌హెడ్ వైర్లో సమస్య తలెత్తడంతో సేవలు నిలిచిపోయాయని, దీంతో ఎల్లోలైన్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగిందని అధికారులు పేర్కొన్నారు. తాత్కలికంగా హుడా సిటీ సెంటర్, సమయాపూర్‌బద్లీ, కుత్‌బ్‌మినార్ స్టేషన్ల మధ్య మెట్రో సేవలు అందించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ సమస్య వల్ల ఇబ్బంది పడ్డ ప్రయాణీకులు ట్విటర్ వేదికగా తమ అసహనాన్ని వెల్లగక్కారు. ఇదే అదునుగా భావించిన క్యాబ్ డ్రైవర్లు మాత్రం చార్జీలు అమాంతం పెంచేసి ప్రయాణీకుల జేబుకు చిల్లు పెట్టారు. మరికొందరు పట్టాలపై నడుచుకుంటూ ఇతర స్టేషన్‌కు చేరుకున్నారు. I have asked transport minister to seek a detailed report and direct Delhi Metro to fix responsibility https://t.co/0jkf9HvfKb — Arvind Kejriwal (@ArvindKejriwal) 21 May 2019 Electricity Issue of Delhi Metro Between #Sultanpur and #Qutub_Minar _MetroStation...Highly Rush &Traffic in Delhi Roads.@PMOIndia pic.twitter.com/kdSF4j4UYh — himanshu sharma (@himansh55221232) 21 May 2019 -
మెట్రోరైలు దిగుతున్న సమయంలో.. అనూహ్యంగా
న్యూఢిల్లీ : నగరమంటేనే ఉరుకుల-పరుగుల జీవితం. ఇప్పుడు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ మెట్రోరైళ్లు నడుస్తున్నాయి. మెట్రోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు, ముఖ్యంగా మెట్రో రైలు నుంచి దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన చాటుతోంది. ఓ 40 ఏళ్ల మహిళ మెట్రో రైలు దిగుతుండగా.. ఆమె చీర బోగీ డోర్లో చిక్కుకుపోయింది. దీంతో ఆమెను ఫ్లాట్‌ఫామ్ మీద మెట్రోరైలు లాక్కెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ బటన్ నొక్కడంతో ఆ మహిళకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలయ్యాయి. బ్లూలైన్ మార్గంలోని మోతినగర్ మెట్రో స్టేషన్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలిని గీతగా గుర్తించారు. గీత తన కూతురితో కలిసి.. మోతినగర్ మెట్రో స్టేషన్లో దిగుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ‘నవాడా నుంచి గీత, నా కూతురు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మోతినగర్‌లో ఆమె దిగారు. అయితే, దిగే సమయంలో ఆమె చీర మెట్రో బోగీ డోర్లో చిక్కుకొని.. డోర్ మూతపడింది. దీంతో మెట్రో రైలు కదలడంతోపాటు ఆమెను ఫ్లాట్‌ఫాం మీద ఈడ్చుకెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రయాణికుడెవరో ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. దీంతో డ్రైవర్ రైలును ఆపారు’ అని ఆమె భర్త జగదీశ్ ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన గీతను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. మోతినగర్ మెట్రో స్టేషన్లో ఈ ఘటన జరిగిన విషయం వాస్తవమేనని, ఈ ఘటనతో ఈ మార్గంలో మెట్రో సేవల్లో కొంత అంతరాయం ఏర్పడిందని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
3 మార్గాల్లో రెండోదశ!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండోదశ ప్రాజెక్టు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. తొలుత అనుకున్న మార్గాల్లో కాకుండా తాజాగా బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్ (25 కి.మీ.), రాయదుర్గం– శంషాబాద్ (30 కి.మీ.), ఎల్బీనగర్–నాగోల్ (5 కి.మీ.) మార్గాల్లో మొత్తంగా 60 కి.మీ. మెట్రో రెండోదశ మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుపై వేగంగా కసరత్తు జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) త్వరలో సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెండోదశ ప్రాజెక్టుకు సుమారు రూ.10 వేల కోట్ల వ్యయం కానుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మార్గాల్లో చేపట్టనున్న డిపోలు, స్టేషన్లు, పార్కింగ్ సదుపాయాల కల్పనకు అవసరమైన స్థలాలను ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. మెట్రో రెండో దశలో ప్రధానంగా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని పెంచాలని నిర్ణయించిన విషయం విదితమే. బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్ మెట్రో రూట్ ఇలా.. ఈ కారిడార్ పరిధిలో సుమారు 70 ఎకరాల స్థలాన్ని బీహెచ్ఈఎల్ (రామచంద్రాపురం)లో మెట్రో డిపోకు కేటాయించనున్నట్లు తెలిసింది. ఈ కారిడార్‌లో 22 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గాన్ని బీహెచ్ ఈఎల్, మదీనాగూడా, హఫీజ్‌పేట్, కొండాపూర్, కొత్తగూడా జంక్షన్, షేక్‌పేట్, రేతిబౌలి, మెహిదీపట్నం, లక్డీకాపూల్‌లలో మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. రాయదుర్గం–శంషాబాద్ మెట్రో రూట్ ఇలా.. రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడా, తెలంగాణ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ వరకు ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో బుద్వేల్ లేదా శంషాబాద్ ప్రాంతాల్లో 60 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో ఏర్పాటు కోసం కేటాయించనున్నారు. ఈ మార్గంలో హైస్పీడ్ రైలును నడపనున్నట్లు సమాచారం. దీంతో విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు సమయం ఆదా కానుంది. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు రెండోదశ మార్గాల్లో విస్తృతంగా అధ్యయనం జరిపి ఈ రూట్లను ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా సుమారు రూ.10 వేల కోట్ల అంచనా వ్యయం కానున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) విధానంలో చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. డీఎంఆర్సీ సమర్పించనున్న సమగ్ర ప్రాజెక్టు నివేదికలో తేలనున్న అంశాలివే... - రెండోదశ మెట్రో రైళ్లకు సిగ్నలింగ్ వ్యవస్థ, కోచ్‌ల ఎంపిక, ట్రాక్‌ల నిర్మాణం ఎలా ఉండాలో ఈ సంస్థ సూచించనుంది. - భద్రతా పరమైన చర్యలు.. టికెట్ ధరల నిర్ణయం - రెండోదశ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ - వివిధ రకాల ఆర్థిక నమూనాల పరిశీలన - ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన గడువు, దశలవారీగా చేపట్టాల్సిన షెడ్యూలు ఖరారు ఈనెలాఖరులో హైటెక్ సిటీకి మెట్రో రైళ్లు.. అమీర్‌పేట్–హైటెక్ సిటీ (13 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు ఈనెలాఖరున సిటిజన్లకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే మెట్రో రైళ్లకు ప్రయోగ పరీక్షలను నిర్మాణ సంస్థ విజయవంతంగా పూర్తిచేసింది. ఇక జేబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించ నున్నాయి. ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా..? పాతనగరానికి మెట్రో రైళ్లు ఎప్పుడు రాకపోకలు సాగిస్తాయన్న అంశం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా..? ప్రస్తుతం రెండోదశ ప్రాజెక్టుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభిం చినప్పటికీ గతంలో మరో ఐదు మార్గాల్లో రెండో దశ మెట్రో ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడకపోవడంతో ఈ మార్గాల్లో మెట్రో అనుమా నమే అన్న సందేహాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. 1.ఎల్బీనగర్–హయత్‌నగర్ 2.ఎల్బీనగర్–ఫలక్‌నుమా–శంషాబాద్ ఎయిర్‌పోర్టు 3.మియాపూర్–పటాన్చెరు 4.తార్నాక–ఈసీఐఎల్ 5.జేబీఎస్–మౌలాలి -
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు టెండర్లు
అమరావతి : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ పనులకు డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్) సోమవారం టెండర్లు పిలిచింది. ఏలూరు, బందరు రోడ్డుల్లో 26 కిలోమీటర్ల నిర్మించే కారిడార్ల డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్‌తోపాటు ఎలివేటెడ్ బ్రిడ్జి, మధ్యలో కిలోమీటరుకు ఒక స్టేషన్, ఎంట్రీ-ఎగ్జిట్ ద్వారాల నిర్మాణం, ఫ్లంబింగ్ పనులన్నింటినీ కలిపి రూ.1800 కోట్ల అంచనాతో చేపట్టాల్సివుంటుందని పేర్కొంది. ఏలూరు రోడ్డు కారిడార్‌కు రూ.969 కోట్లు, బందరు రోడ్డు కారిడార్‌కు రూ.831 కోట్ల అంచనాతో విడిగా టెండర్లు పిలిచింది. స్టేషన్ల నిర్మాణ పనులకు సంబంధించిన టెండరు పత్రాలను డిసెంబర్ ఐదు నుంచి 16వ తేదీ వరకూ విక్రయిస్తారు. జనవరి 12 నుంచి 16వ తేదీలోపు టెండర్లు దాఖలు చేయాలి. త్వరలో నిడమానూరులో కోచ్ డిపో, రెండు కారిడార్లలో ట్రాక్ నిర్మాణం, విద్యుత్ తదితర పనులకు విడిగా టెండర్లు పిలవనుంది. -
మెట్రోకు అదనంగా 916 కొత్త కోచ్‌లు
న్యూ ఢిల్లీ: మెట్రో వినియోగదారుల కష్టాలను తీర్చడానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్(డీఎంఆర్సీ) నడుంబిగించింది. గత ఐదేళ్లలో మెట్రో వినియోగదారుల వార్షిక వృద్ధి 17.5 శాతంగా నమోదైంది. దీంతో 916 కోచ్‌లను అదనంగా పట్టాలెక్కించే పనిలో డీఎంఆర్సీ పడింది. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరడగంతో రద్దీకి అనుగుణంగా మెట్రోను విస్తరించడానికి రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల సహకారాన్ని కోరింది. ఢిల్లీలో ప్రజా రవాణా అవసరాలను తీర్చడానికి అనుగుణంగా మెట్రో రైల్వే ఫ్రీక్వెన్సీ పెంచాలని సుప్రీం కోర్టుతో పాటూ అన్ని వర్గాల నుంచి చాలా రోజులుగా డిమాండ్ ఉంది. ఢిల్లీ మెట్రో తన పరిధిలో 1396 కోచ్‌లతో పని చేస్తోంది. మరో 916 కోచ్‌లు అంటే దాదాపు 65 శాతం అధికంగా కోచ్‌ల సంఖ్యను పెంచేలా ప్రణాళికలు సిద్దం చేసింది. దీని ప్రకారం మెట్రో ట్రైన్ల సంఖ్య విషయానికొస్తే ప్రస్తుతం ఉన్న 227 రైళ్లకు అదనంగా102 కొత్త రైళ్లు వినియోగంలోకి రానున్నాయి. కేంద్ర, ఢిల్లీ సర్కారు ఆమోదం లభిస్తే మెట్రో విస్తరణ పనులు 2017 ఏప్రిల్‌లో ప్రారంభించి 2021 మార్చిలోగా పూర్తి చేస్తామని డీఎంఆర్సీ ఆధికారులు తెలిపారు. ఈ ఏడాది లెక్కల ప్రకారం మెట్రో విస్తరణ పనులకు రూ. 13284 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 6 కారిడార్ల ద్వారా ఢిల్లీ మెట్రోను ఆపరేట్ చేస్తున్నారు. ఫేస్ 3లో భాగంగా మరో రెండు కారిడార్లను పెంచనున్నారు. -
‘అమరావతి’కి మెట్రో వేస్ట్
♦ తగినంత జనం లేకుండా రాజధానికి మెట్రో’ను విస్తరించడం అనవసరం ♦ సాధ్యాసాధ్యాల నివేదికలో తేల్చిచెప్పిన ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతికి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించడం అనవసరమని శ్రీధరన్ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్(డీఎంఆర్సీ) తేల్చేసింది. జనం లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తే పెట్టుబడులు తిరిగి రావని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సలహాదారుగా ఉన్న ఢిల్లీ మెట్రో రూపకర్త శ్రీధరన్ రాజధానికి మెట్రో విస్తరణకు సంబంధించి రూపొందించిన సాధ్యాసాధ్యాల నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నట్టు సమాచారం. రూ.పదివేల కోట్ల ఖర్చవుతుందని అంచనా.. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు కొనసాగింపుగా రెండో దశలో రాజధానికి మెట్రో ప్రాజెక్టును విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రాజధానికి మెట్రో రైలును విస్తరించాలంటే సుమారు రూ.పది వేల కోట్లు ఖర్చవుతుందని డీఎంఆర్సీ అంచనా వేసింది. ప్రయాణికులేరి? కారిడార్ నిర్మించే ప్రాంతంలో కనీసం 20 లక్షల జనాభా అయినా ఉండాలి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు మొదట్లో జనాభా సమస్య వస్తే శివారు ప్రాంతాలన్నింటినీ కలపి 20 లక్షల జనాభాను చూపించారు. ఇప్పుడు రాజధానిలో అంత జనాభాను ఎక్కడినుంచి తీసుకొస్తారనేది డీఎంఆర్సీ మొదటి ప్రశ్న. మెట్రో ప్రాజెక్టుపై ఖర్చుపెట్టిన డబ్బు తిరిగి రావాలంటే ప్రతిరోజూ 2.5 లక్షలనుంచి 3 లక్షల మంది ప్రయాణికులు అందులో ఎక్కాలి. ప్రస్తుతం రాజధాని గ్రామాల జనాభా 98 వేలు. అన్నీ అనుకున్నట్లు జూన్‌లో తాత్కాలిక సచివాలయం ప్రారంభమైతే నాలుగు వేలమంది ఉద్యోగులు, ఇతరులు ఒక వెయ్యిమంది అక్కడికొచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో మెట్రో ఎక్కేవారి సంఖ్య వందల్లోనే ఉంటుందని డీఎంఆర్సీ వాదన. గుంటూరుకు మెట్రో విస్తరణా అసాధ్యం! సీడ్ రాజధాని నుంచి గుంటూరుకు మెట్రో విస్తరణ కూడా సాధ్యమయ్యే పనికాదని డీఎంఆర్సీ తేల్చింది. గుంటూరు జనాభా ఆరు లక్షలు దాటలేదని, ఈ నేపథ్యంలో అక్కడికి ప్రాజెక్టును విస్తరించడం ఏ కోణంలోనూ సరికాదని స్పష్టం చేసింది. -
విజయవాడ మెట్రోరైలుకు కేంద్రం పచ్చజెండా
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. మెట్రో ప్రాజెక్టు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లొచ్చని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. మొత్తం 25 కిలోమీటర్ల పొడవున రెండు లైన్లతో విజయవాడ మెట్రో రైలు నిర్మాణం అవుతుందని ఆయన వివరించారు. మెట్రో గురు ఇ. శ్రీధరన్ నేతృత్వంలో ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ విజయవాడ మెట్రో పనులను చేపట్టనున్న విషయం తెలిసిందే. తొలుత గుంటూరు - విజయవాడ మధ్య మెట్రో రైలు ఏర్పాటు చేయాలని భావించినా, అది ఆర్థికంగా అంత వెసులుబాటు కాదని నిపుణులు చెప్పడంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. -
లక్ష బావులు, యాభైవేల చెరువులు
తవ్వించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారణ చర్యల్లో భాగంగానే.. ముంబై : ముంచుకొస్తున్న కరవును నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లక్ష బావులు, యాభైవేల చెరువులు తవ్వించాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి పనులు ప్రారంభమవుతాయని ఈ మేరకు సీఎం ఫడ్నవీస్ గురువారం వెల్లడించారు. కరవు వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ‘ఈ కార్యక్రమం వల్ల 14 జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతమున్న బావుల తవ్వకం పనులు తొందరగా పూర్తి చేసి, వ్యవసాయం కోసం మరో లక్ష బావులు, యాభైవేల చెరువులు తవ్విస్తాం’ అని సీఎం అన్నారు. రాష్ట్రం ప్రస్తుతం సహజ విపత్తుల వల్ల ఇబ్బంది పడుతోందని, తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బంది తలెత్తుతోందని చెప్పారు. గతేడాది అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ ఏడాది అసలు వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, మేత లేక పశువులు అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కరువు నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని జిల్లాల అధికారులకు సూచించినట్లు చెప్పారు. నీటి సంరక్షణ చర్యలతో పాటు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆహార భద్రత పథకాలు ప్రారంభిస్తామని, రాజీవ్ గాంధీ జీవనిధి యోజన పథకం కింద ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పారు. ‘అంధేరీ-దహిసర్’ మెట్రోకు సర్వం సిద్ధం అంధేరీ తూర్పు-దహిసర్ తూర్పు మెట్రోకు ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీజ్ ఆమోదం తెలపనున్నారు. రూ.5,757 కోట్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనం పూర్తి చేసిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ).. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీఏ)కి నివేదిక సమర్పించింది. 16.5 కిమీ మేర నిర్మించే ఈ మెట్రో మార్గానాకి గాను నాలుగు నుంచి నాలుగున్నర ఏళ్ల సమయం పడుతుందని, ఈ కారిడార్‌లో 16 స్టేషన్లు ఉంటాయని ఎమ్మెమ్మార్డీఏ సీనియర్ అధికారి అన్నారు. -
మెట్రో దూకుడు
రెండు నెలల్లో పేపర్ వర్క్ పూర్తి నాలుగు నెలల్లో పనులు ప్రారంభం సిద్ధం కావాలని డీఎంఆర్సీకి ప్రభుత్వం లేఖ సిబ్బందిని సమకూర్చుకుంటున్న శ్రీధరన్ బృందం 8న ఢిల్లీలో ప్రాథమిక సమావేశం మెట్రో ప్రాజెక్టును వేగంగా పట్టాలెక్కించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌కి లేఖ కూడా రాసింది. దీంతో రెండు నెలల్లో ప్రాజెక్టు పేపర్ వర్క్ పూర్తి చేయడానికి డీఎంఆర్సీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పనులు ప్రారంభించడానికి నాలుగు నెలలు పడుతుందని చెబుతున్నారు. విజయవాడ బ్యూరో : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు సిద్ధం కావాలని ప్రభుత్వం డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్)కి సూచించింది. ఈ మేరకు లేఖ అందుకున్న డీఎంఆర్సీ పనులు చేపట్టడానికి అవసరమైన ప్రాథమిక వనరులను సమకూర్చుకోవడానికి సమాయత్తమైంది. రెండు రోజుల క్రితం ఢిల్లీలో సమావేశమై ప్రాజెక్టు గురించి చర్చించిన శ్రీధరన్ బృందం ఈ నెల ఎనిమిదో తేదీన మరో కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వంతో కుదుర్చోవాల్సిన ఒప్పందం, నిధుల సమీకరణ, ప్రాజెక్టు విధివిధానాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రాజెక్టుకు అయ్యే రూ.6,823 కోట్ల వ్యయంలో 40 శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భరించాలని ఇప్పటికే నిర్ణయించాయి. మిగిలిన 60 శాతం మొత్తాన్ని జపాన్‌కు చెందిన జైకా సంస్థ నుంచి రుణంగా తీసుకోవాలని భావించి వారితోనూ చర్చలు జరిపారు. పనులు మొదలు పెట్టడానికి తొలుత ప్రభుత్వం కొంత నిధులు కేటాయించాల్సి ఉంది. ఈ అంశాలన్నింటిపైనా సమావేశంలో చర్చించి వివరాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పిస్తారు. అనంతరం కొద్దిరోజుల్లోనే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టు వ్యయంలో కొనుగోళ్లకు అయ్యే మొత్తంలో ఆరు శాతాన్ని డీఎంఆర్సీ ఫీజుగా తీసుకుంటుంది. పనులన్నింటినీ దాదాపు కన్సల్టెన్సీలు, ఇతర కంపెనీలకు అప్పగించి డీఎంఆర్సీ పర్యవేక్షణ చేస్తుంది. ఈ అంశాలన్నింటినీ ఒప్పందంలో చేర్చే అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వాటితో సంబంధం లేకుండా పనులు ప్రారంభించడానికి డీఎంఆర్సీ ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వం కూడా ఇందుకు మౌఖికంగా అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో రెండు నెలల్లో ప్రాజెక్టు పేపర్ వర్క్‌ను పూర్తి చేయడానికి డీఎంఆర్సీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించడానికి నాలుగు నెలలు పడుతుందని డీఎంఆర్సీ అధికారులు చెబుతున్నారు. సీఈ నేతృత్వంలో ప్రాజెక్టు పనులు మెట్రో పనులు మొత్తం ఒక చీఫ్ ఇంజనీర్ నేతృత్వంలో జరగనున్నాయి. రైల్వేలో అనుభవం ఉన్న సీనియర్ చీఫ్ ఇంజనీర్‌ను డీఎంఆర్సీ త్వరలో నియమించనుంది. సవివర నివేదిక రూపకల్పన దశ నుంచే ఒక డెప్యూటీ డెరైక్టర్ (డెప్యూటీ చీఫ్ ఇంజనీర్) పనిచేస్తుండగా వారం క్రితం మరో డెప్యూటీ డెరైక్టర్‌ను నియమించింది. త్వరలో 30 నుంచి 40 మంది సిబ్బందిని నియమించనున్నారు. నగరంలో మెట్రో కార్యాలయాన్నీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. -
మెట్రో ప్రయాణికులకు శుభవార్త!
న్యూఢిల్లీ: మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) చర్యలు చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం రేపటి నుంచి అదనంగా 17 రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 వరకు వీటిని నడపబోతున్నట్లు పేర్కొంది. గ్రీన్ లైన్, ఎయిర్‌పార్టు ఎక్స్‌ప్రెస్ లైన్ మినహా మిగిలిన అన్ని మార్గాల్లో ఈ 17 రైళ్లను అదనంగా తిప్పుతామని చెప్పింది. అదనంగా ఏర్పాటు చేస్తున్న ఈ రైళ్లు రద్దీ సమయాల్లో మొత్తం 104 ట్రిప్పులు వేస్తాయని వెల్లడించింది. ఈ చర్యల వల్ల పీక్ అవర్స్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు మరింతగా ప్రోత్సహించినట్లు అవుతుందని డీఎంఆర్సీ ప్రతినిధి చెప్పారు. ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే ద్వారాకా-నొయిడా(బ్లూ లైన్), జహంగీర్‌పురి-గుర్గావ్ (యెల్లో లైన్) మార్గాల్లో కొత్తగా 12 రైళ్లను ఏర్పాటు చేశారు. అదనపు కేటాయింపులతో బ్లూ లైన్ మార్గంలో రైళ్ల సంఖ్య 53కి పెరగగా, యెల్లో లైన్ మార్గంలో 63కి చేరింది. అలాగే ట్రిప్పుల సంఖ్య కూడా వరుసగా బ్లూ లైన్(619), యెల్లో లైన్(734)కి పెరిగింది. రెడ్ లైన్ మార్గంలో మాత్రం ఆఫ్ పీక్ అవర్స్‌లో తిప్పేందుకు ఒకే ఒక రైలును వేయగా, వయొలెట్ లైన్లో పీక్ అవర్స్ కోసం ఒక రైలును కేటాయించారు. ఢిల్లీ మెట్రో ద్వారా రోజుకి 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారని అంచనా. ప్రయాణికుల రద్దీ కారణంగా 2010-14 మధ్య కాలంలో కోచ్‌ల సంఖ్యను 640 నుంచి 1,076కి పెంచింది. ఈ విధంగా డీఎంఆర్సీ చేపడుతున్న చర్యలతో మెట్రోలో ప్రయాణం ఇక సులభతరం అయ్యే అవకాశం ఉంది. -
డీఎంఆర్సీ డాక్యుమెంట్లను డిజిటలీకరణ
న్యూఢిల్లీ: డాక్యుమెంట్ల రూపంలో భద్రపరిచే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) సమాచారాన్ని అవసరమైనప్పుడు క్షణాల్లో తిరిగి చూసుకునేలా డిజిటలైజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఏజెన్సీ రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను డీఎంఆర్సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూ సింగ్, ఎన్ఐసీ డిప్యూటీ డైరక్టర్ జనరల్ రాజీవ్ ప్రకాశ్ మెట్రో భవన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ వెబ్సైట్ రూపకర్తలను అభినందించారు. దీనిని సక్రమంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. కాగా, భవిష్యత్‌లో కూడా సంస్థ ఉద్యోగుల కోసం మరిన్ని ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తామని డీఎంఆర్సీ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. దీర్ఘకాలంపాటు డాక్యుమెంట్లను సంరక్షించడమే కాకుండా ఎప్పుడు కావలంటే అప్పుడు క్షణాల్లో సమాచారాన్ని చూసుకోవడానికి శాస్త్రిపార్కులోని నేషనల్ డేటా సెంటర్లోని ఎన్ఐసీ సర్వర్ తోడ్పతుందని చెప్పింది. -
29న మెట్రో సేవలపై పాక్షిక ఆంక్షలు
న్యూఢిల్లీ: బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భద్రతా చర్యల్లో భాగంగా ఈ నెల 29న రెండు స్టేషన్లలో మెట్రో రైలు సేవలపై ఆంక్షలు విధించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరున్నరవరకూ సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్ స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) పేర్కొంది. సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత ఈ రెండు స్టేషన్లలో సేవలను పునరుద్ధరిస్తారు. అయితే నగరంలోని మిగతా అన్ని మెట్రో స్టేషన్లలో సేవలకు ఎటువంటి అంతరాయమూ ఉండదు. -
ఎయిర్పోర్ట్ మెట్రోకు పెరిగిన ఆదరణ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌కు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది. కాగా, గత జూలైలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఈ మెట్రో నిర్వహణను హస్తగతం చేసుకుంది. అప్పటినుంచి ఈ రైలుకు ప్రయాణికుల్లో ఆసక్తి పెంచేందుకు పలుచర్యలు తీసుకుంది. అందులో భాగంగా టికెట్ ధరను తగ్గించింది. దాంతోపాటు రైల్వేస్టేషన్లలో మౌలిక వసతులు కల్పించడంతో ఈ రైలుకు ప్రయాణికుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఇందులో ప్రయాణించేవారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధి సాధించినట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, 2013 జూలై నుంచి 2014 జూలై వరకు సరాసరి రోజువారి ప్రయాణికుల సంఖ్యలో పెద్దగా మార్పులేదు. 2013 జూలైలో రోజూ 10,069 మంది ప్రయాణిస్తే, 2014 జూలైలో ఆ సంఖ్య 13,838కి మాత్రమే పెరిగింది. అయితే గత జూలైలో ప్రయాణచార్జీలను తగ్గించిన తర్వాత ఒక్కసారి ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఒక్క నవంబర్లోనే 5,38,293 మంది ఈ రైలును ఆశ్రయించారు. అంటే సరాసరిన రోజున18 వేల మంది ప్రయాణించినట్లు అధికారికంగా తేలింది. ఈ సందర్భంగా డీఎంఆర్సీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. గత జూలై వరకు ఈ రైల్లో ప్రయాణించడానికి కనిష్టంగా రూ.30, గరిష్టంగా రూ.180 టికెట్ ధర ఉండేదన్నారు. కాగా, జూలై నుంచి ఈ ధరలను రూ.20, రూ.100గా మార్చామన్నారు. అలాగే శివాజీస్టేడియం నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్ రైల్‌కు ఫీడర్ బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రైళ్లకు అనుసంధానం చేస్తూ ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాలను మార్చామన్నారు. దీంతో ఇటీవల కాలంలో ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోందని వివరించారు. -
చార్జీలు తగ్గించినా స్పందన అంతంతే
న్యూఢిల్లీ: ఎయిర్పోర్ట్ మార్గంలో మెట్రో రైళ్లను నడుపుతున్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఈ ఏడాది జులైలో చార్జీలను దాదాపు 40 శాతం తగ్గించింది. అయినప్పటికీ సంస్థ ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. చార్జీలను తగ్గించినప్పటికీ ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య ఆశించినమేర పెరగలేదు. తొలుత ఈ మార్గంలో మెట్రో రైళ్ల నిర్వహణ బాధ్యతలను రిలయన్స్ సంస్థ చేపట్టింది. అయితే 2013, జులైలో ఆ బాధ్యతలనుంచి తప్పుకోవడంతో డీఎంఆర్సీ తన భుజస్కంధాలపైకి ఎత్తుకుంది. అప్పట్లో ప్రతిరోజూ దాదాపు 10,069 మంది రాకపోకలు సాగించేవారు. ఆ తర్వాతి సంవత్సరం అది 17,943కు చేరుకుంది. ఆ తర్వాత రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచడంతోపాటు చార్జీలను కూడా తగ్గించింది. అంతేకాకుండా మెట్రో రైలు సేవలను ప్రారంభ సమయాన్ని గం. 4.45గా చేసింది. అంతకుముందు గం. 5.15 నిమిషాలకు తొలి రైలు బయల్దేరేది. అంతకుముందు ఈ మార్గంలో ప్రతి 15 నిమిషాలకు ఒక మెట్రో రైలు వచ్చేది. రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచడంద్వారా ఇప్పుడు ఆ సమయాన్ని పది నిమిషాల 30 సెకండ్లకు కుదించారు. ఇందువల్ల ఈ మార్గంలో ట్రిప్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అంతకుముందు 148 ట్రిప్పులు ఉండగా ఆ తర్వాత వీటి సంఖ్య 166కు చేరుకుంది. అంతేకాకుండా ప్రయాణికులకు వసతులు కూడా బాగా పెంచారు. శివాజీ మెట్రో స్టేషన్ వద్ద ఫీడర్ సేవలను పెంచారు. ఆయా స్టేషన్లవద్ద దిగిన ప్రయాణికులకు తక్షణమే బస్సులు అందేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఇంతచేసినప్పటికీ ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ప్రయాణికుల సంఖ్య అంతంతగానే పెరిగింది. ఈ విషయం డీఎంఆర్సీని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఈ మార్గంలో మొత్తం 21 స్టేషన్లు ఉన్నాయి. కాగా ఎయిర్పోర్ట్ మెట్రో మార్గాన్ని పొడగించే అంశంపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) దృష్టి సారించింది. గుర్గావ్ వరకూ పొడిగించాలని భావిస్తోంది. ఇందులోభాగంగా హర్యానా ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరిపింది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ గుర్గావ్ వరకూ ఈ మార్గాన్ని పొడిగించినట్టయితే మెట్రో రైలు సేవలను వినియోగించుకునేవారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఇందువల్ల వారు తమ తమ గమ్యస్థానాలకు సత్వరమే చేరుకునే వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. -
ఢిల్లీ మెట్రో సేవలు భేష్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) తన కార్యకలాపాలు ప్రారంభించి 12 ఏళ్లు పూర్తిచేసుకుంది. ప్రయాణికుల ఆదరణ పొందుతూ అంచలంచెలుగా విస్తరణ చెందుతున్న ఢిల్లీ మెట్రో కారణంగా 2014 సంవత్సరంలో దాదాపు రూ. 10,346 కోట్ల పొదుపు జరిగిందని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీఆర్ఆర్ఐ) అంచనా వేసింది. 190 కి.మీ. పొడవున్న ఈ మెట్రో నెట్ వర్క్ కారణంగా ప్రాణ నష్టం ఏటా గణనీయంగా తగ్గుతోందని అంచనా వేసింది. సంబంధిత వివరాలను డీఎంఆర్సీ ఛైర్మన్ మంగూసింగ్ మీడియాకు వె ల్లడించారు. ఇంధన పొదుపు విషయానికి వస్తే ఢిల్లీ మెట్రో దాదాపు రూ. 1,972 కోట్ల విలువైన ధనాన్ని పొదుపు చేసింది. 2011లో దాదాపు 1.06 లక్షల టన్నుల ఇంధనం పొదుపు అవగా.. 2014లో ఇది 2.7 లక్షల టన్నులకు చే రుకుంది. ఇక వాహన పెట్టుబడి- నిర్వహణ వ్యయం రూ. 2,617 కోట్లు మేర ఆదా అయ్యింది. ప్రయాణికుల అమూల్యమైన సమయానికి లెక్కకడితే దాని విలువ రూ. 4,107 కోట్లు అవుతుందని సింగ్ వివరించారు. అంతేకాకుండా 2007లో 16,895 వాహనాల వినియోగం తగ్గితే... 2011లో 1,17,249 వాహనాల వినియోగం తగ్గిందని, 2014లో ఆ సంఖ్య 3,90,971కి చేరిందని వివరించారు. 2007లో 24,691 టన్నుల ఇంధనం పొదుపవగా.. 2014లో 2,76,000 టన్నుల ఇంధనం పొందుపైందని వివరించారు. 2011లో ప్రతి ప్రయాణికుడికి తాను ప్రయాణం చేసినప్పుడు 28 నిమిషాలు ఆదా కాగా.. ఈ ఏడాది 32 నిమిషాలు ఆదా అయ్యిందని తెలిపారు. అలాగే ట్రాఫిక్ జాముల కారణంగా వృథా అయ్యే ఇంధనం మెట్రోల ద్వారా మిగిలిందని, దీని విలువ రూ. 491 కోట్లు ఉంటుందని వివరించారు. అలాగే కాలుష్యం తగ్గింపు కారణంగా దాదాపు రూ. 489 కోట్లు ఆదా అయ్యింది. ఈ అన్ని అంశాలు కలిపితే 2014లో రూ. 10,346 కోట్లు ఆదా అయినట్లని వివరించారు. ఏటా ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని తెలిపారు. క్రమంగా విస్తరణ ఢిల్లీ మెట్రో రైలు తన సేవలను క్రమంగా విస్తరిస్తోంది. 2014లో జన్‌పథ్, మండీ హౌజ్ స్టేషన్లను ప్రారంభించింది. అలాగే 11 రైళ్లను 8 కోచ్‌లు గల రైళ్లుగా మార్చింది. ఫేజ్-1లో 65 కి.మీ. ఫేజ్-2లో 125 కి.మీ. మేర మెట్రో నెట్వ ర్క్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఫేజ్-3, ఫేజ్-4 విస్తరణ పనులు నడుస్తున్నాయి. ఫేజ్-3లో మరో 167.27 కి.మీ. మేర నెట్వర్క్ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫేజ్-4లో మరో 100 కి.మీ. మేర నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. -
తొలి దశలో ‘మెట్రో’ లేనట్లే!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలో మెట్రో రైలు(మాస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ సిస్టమ్) కూత వినిపించదా? తొలి దశలో విశాఖ, విజయవాడల్లోనే మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టనున్నారా? రెండో దశలో అంటే 2018 తర్వా తే తిరుపతికి మెట్రో రైలు ప్రాజెక్టుపై ఆలోచన చేస్తారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి అధికారవర్గాలు. మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పట్లో తిరుపతిలో చేపట్టే అవకాశాలు లేవని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. రాజధాని ఏర్పాటుపై ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతుందని గ్రహించిన సీఎం చంద్రబాబు.. సెప్టెంబర్ 4న శాసనసభలో జిల్లాపై వరాల వర్షం కురిపించారు. ఆ వరాలతో ప్రజల ఆగ్రహాగ్నిని చల్లార్చాలని భావించారు. ఆ హామీల్లో తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టడం ఒకటి. కానీ.. ఆ హామీ ఇచ్చినప్పటి నుంచీ దాన్ని అటకెక్కించే దిశగా చంద్రబాబు పావులు కదుపుతూ వస్తున్నారు. రాష్ట్రంలో చేపట్టే మెట్రోరైలు ప్రాజెక్టులకు సలహాదారుగా పనిచేసేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మాజీ ఎండీ శ్రీధరన్ అంగీకరించారు. వీజీటీఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి), విశాఖపట్నంలకు మెట్రో రైలు ప్రాజెక్టులను మంజూరు చేస్తూ ఆగస్టు 30న ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల్లో ఎక్కడా తిరుపతి మెట్రో రైలు ప్రాజెక్టు ప్రస్తావన లేకపోవడం గమనార్హం. వీజీటీఎం పరిధిలో మెట్రో రైలు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు సెస్టెంబర్ 20న విజయవాడ, మంగళగిరిలో పర్యటించారు. విజయవాడ, మంగళగిరి మధ్య మెట్రో రైలు ఏర్పాటుచేయాలని సూచిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గత నెలలో విశాఖపట్నంలో పర్యటించిన శ్రీధరన్ బృందం తొలి దశలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాల్లో పర్యటించి.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇదేంటి బాబూ! మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్) రూపొందించే బాధ్యతను డీఎమ్మార్సీకి అప్పగిస్తూ అక్టోబరు 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల్లో వీజీటీఎం, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు ఒక కిమీ డీపీఆర్ రూపొందించేందుకు కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.ఎనిమిది లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కానీ.. అదే ఉత్తర్వుల్లో తిరుపతి మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టడానికి వీలుగా డీపీఆర్ రూపొందించాలన్న అంశాన్ని ప్రస్తావించలేదు. తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి.. ఫీజుబులిటీ రిపోర్టు ఇచ్చేందుకు రూ.50 లక్షలను కన్సల్టెన్సీ ఫీజుగా ఇచ్చేందుకు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం అంగీకరించడం గమనార్హం. మెట్రో రైలు ప్రాజెక్టులపై హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు.. ఆ ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం, వీజీటీఎం మెట్రో రైలు ప్రాజెక్టుల డీపీఆర్‌లను మార్చి 31, 2015లోగా పూర్తి చేసి, అందించాలని సీఎం కోరారు. వీజీటీఎం, విశాఖపట్నంలలో మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశ పనులను జూన్, 2015 నుంచి చేపట్టి, జూన్, 2018లోగా పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు. కానీ.. తిరుపతి మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టడంపై చర్చించలేదు. ఇప్పటికి లేనట్లే.. తిరుపతికి మెట్రో రైలును మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకున్నా.. తుడా అధికారులు ఆ ప్రాజెక్టుకు అవసరమైన ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. రేణిగుంట విమానాశ్రయం, తిరుచానూరు, ఆర్టీసీ బస్టాండు, పద్మావతి మహిళా యూనివర్సిటీ, శ్రీనివాసమంగాపురం, ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీ జూ, అలిపిరి, కపిలతీర్థం, రేణిగుంట విమానాశ్రయం మధ్య తొలుత మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటుచేయాలని తుడా అధికారులు ప్రతిపాదించారు. సుమారు 60 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మారాన్ని నిర్మించాల్సి వస్తుందని తుడా అధికారులు అంచనా వేశారు. ఈ నివేదికను డీఎమ్మార్సీ పరిశీలించి.. ఫీజుబులిటీ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. కానీ.. ఇప్పటిదాకా డీఎమ్మార్సీ బృందం తిరుపతిలో పర్యటించలేదు. విశాఖపట్నం, వీటీజీఎం మెట్రో రైలు ప్రాజెక్టుల డీపీఆర్ రూపకల్పనలో డీఎమ్మార్సీ బృందం నిమగ్నమైతే.. తిరుపతిలో ఇప్పట్లో పర్యటించే అవకాశం లేదని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. వీటీజీఎం, విశాఖపట్నంలలో మెట్రో రైలు ప్రాజెక్టులు తొలి దశ పూర్తయిన తర్వాత.. తిరుపతి ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉందని తుడా ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.