29న మెట్రో సేవలపై పాక్షిక ఆంక్షలు | Metro services on 29 partial restrictions | Sakshi
Sakshi News home page

29న మెట్రో సేవలపై పాక్షిక ఆంక్షలు

Published Tue, Jan 27 2015 10:36 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

Metro services on 29 partial restrictions

న్యూఢిల్లీ: బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భద్రతా చర్యల్లో భాగంగా ఈ నెల 29న  రెండు స్టేషన్‌లలో మెట్రో రైలు సేవలపై ఆంక్షలు విధించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరున్నరవరకూ సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్ స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) పేర్కొంది. సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత ఈ రెండు స్టేషన్లలో సేవలను పునరుద్ధరిస్తారు. అయితే నగరంలోని మిగతా అన్ని మెట్రో స్టేషన్లలో సేవలకు ఎటువంటి అంతరాయమూ ఉండదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement