డీఎంఆర్‌సీ-నోయిడా అథారిటీ మధ్య ఒప్పందం | Greater Noida Metro pact to be signed today | Sakshi
Sakshi News home page

డీఎంఆర్‌సీ-నోయిడా అథారిటీ మధ్య ఒప్పందం

Published Sat, Oct 18 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

నోయిడా సిటీ సెంటర్-సెక్టార్ 62, నోయిడా సిటీ సెంటర్ -గ్రేటర్ నోయిడా మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు శుభవార్త. ఈ రెండు మార్గాల్లో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి

 నోయిడా: నోయిడా సిటీ సెంటర్-సెక్టార్ 62, నోయిడా సిటీ సెంటర్  -గ్రేటర్ నోయిడా మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు శుభవార్త. ఈ రెండు మార్గాల్లో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, నోయిడా అథారిటీ శనివారం అవగాహన పత్రంపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి శంకర్ అగర్వాల్, నోయిడా చైర్‌పర్సన్ రమారమణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు మెట్రో మార్గాల పొడవు 6.675 కిలోమీటర్లు.
 
 ఈ ప్రాజెక్టు పనులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌సింగ్ యాదవ్ ఈ ఏడాది సెప్టెంబర్ 30వతేదీన ఆమోదం తెలిపిన సంగతి విదితమే. అవగాహన పత్రాలపై సంతకాలు పూర్తయిన నేపథ్యంలో నిధుల చెల్లింపు అనంతరం ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించిన అనంతర ప్రక్రియ ప్రారంభమవుతుంది.  నోయిడా సిటీ సెంటర్-సెక్టార్ 62 పనులకు రూ. 1,816,  నోయిడా సిటీ సెంటర్  -గ్రేటర్ నోయిడా పనులకు రూ. 5,064 కోట్ల మేర వ్యయమవుతుందని అంచనా వేశారు. 2017నాటికల్లా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు అయ్యే వ్యయాన్ని  కేంద్రం, యూపీ ప్రభుత్వం భరించనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement