విజయవాడ మెట్రోరైలుకు కేంద్రం పచ్చజెండా
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. మెట్రో ప్రాజెక్టు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లొచ్చని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. మొత్తం 25 కిలోమీటర్ల పొడవున రెండు లైన్లతో విజయవాడ మెట్రో రైలు నిర్మాణం అవుతుందని ఆయన వివరించారు.
మెట్రో గురు ఇ. శ్రీధరన్ నేతృత్వంలో ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ విజయవాడ మెట్రో పనులను చేపట్టనున్న విషయం తెలిసిందే. తొలుత గుంటూరు - విజయవాడ మధ్య మెట్రో రైలు ఏర్పాటు చేయాలని భావించినా, అది ఆర్థికంగా అంత వెసులుబాటు కాదని నిపుణులు చెప్పడంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు.