ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం బీసీసీఐ బిడ్‌లను ఆహ్వానించింది. ఆగస్టు 1 నుంచి జూలై 31, 2022 వరకు ఉండే ఈ ఒప్పందం కోసం ఆసక్తిగల కంపెనీలు టెండర్లు దాఖలు చేయాలని సూచించింది. జూన్ 1 నుంచి 21 వరకు అందుబాటులో ఉండే ఈ టెండర్ల కోసం రూ.3 లక్షలు నాన్ రిఫండబుల్ కింద జమ చేయాల్సి ఉంటుంది. జూన్ 27 మధ్యాహ్నం 12 గంటల్లోపు పూర్తి చేసిన టెండర్లను సమర్పించాలి. బిడ్డింగ్‌లో విజేతగా నిలిచిన కంపెనీ వచ్చే సీజన్ నుంచి 2022 వరకు టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తుంటుంది. ప్రస్తుతం రెండేళ్ల వ్యవధి (2016–17) కోసం రూ.100 కోట్ల చొప్పున చైనీస్ మొబైల్ కంపెనీ వీవో కుదుర్చుకున్న ఒప్పందం ముగిసింది.