
1972లో వచ్చిన 'పండంటి కాపురం' సినిమాతో నటుడిగా ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు నరేశ్ విజయకృష్ణ. అప్పట్లో హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడీయన. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితులైన ఈయన ఈ మధ్యే సకల సదుపాయాలు ఉండేలా ఓ కారవ్యాన్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా నరేశ్ ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారును సొంతం చేసుకున్నాడు.
ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'నా కల నెరవేరిందోచ్, ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను' అని పేర్కొంటూ తన కారును చూపించాడు. పర్పుల్ కలర్‌లో ఉన్న ఈ కారును డ్రైవ్ చేస్తూ నగర రోడ్లపై చక్కర్లు కొట్టి మురిసిపోయాడు నరేశ్. వెంటనే తన ప్రొఫైల్ పిక్ కూడా మార్చేశాడు. కారు పక్కన నిల్చున్న ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నాడు. ఇంత ఖరీదైన కారును కొన్న నటుడికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Hi sharing my new dream come true with my twitter family💕 pic.twitter.com/rnxev9r2Ts
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 2, 2022
#NewProfilePic pic.twitter.com/J0c2BDDxhf
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 2, 2022
Comments
Please login to add a commentAdd a comment