
సినీ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై నటి పవిత్రా లోకేశ్ ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌ను అడ్డుపెట్టుకొని తనను కించపరుస్తుందని ఆమె ఆరోపించింది. రమ్య, నరేష్‌ల మధ్య కుటుంబ వివాదాలున్నాయి. రమ్యపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో జోక్యం చేసుకుంది. నా వ్యక్తిగత జీవితంపై రమ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నా పరువుకు భంగం కలిగేలా రమ్య వ్యవహరిస్తుంది.
యూట్యూబ్ ఛానళ్ల ప్రచారం వెనుక రమ్య హస్తం ఉంది.పలు యూట్యూబ్ ఛానళ్లను రమ్యే వెనుక ఉండి నడిపిస్తుంది.అంతేకాకుండా గతంలో కూడా నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అంటూ పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా నరేష్ తనకు సంబంధించి యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పవిత్రా లోకేశ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు చేస్తూ తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా గతంలో నరేష్, పవిత్ర లోకేశ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అనంతరం ఓ హోటల్ రూమ్‌లో నరేష్, పవిత్ర ఉండగా నరేష్ భార్య వచ్చి గొడవ చేశారు. దీంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment