Senior Naresh
-
అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది: నరేశ్ వీకే
‘‘మంచి నటుడు కావాలని పరిశ్రమలోకి వచ్చాను. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. 50 ఏళ్లు సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం ప్రేక్షకుల ప్రేమ, అభిమానాల వల్లే సాధ్యమైంది. నా జీవితాంతం చిత్ర పరిశ్రమకు సేవ చేస్తాను’’ అని నటుడు డా. నరేశ్ వీకే అన్నారు. నటుడిగా ఆయన ప్రయాణం మొదలై 50 ఏళ్లు పూర్తయ్యాయి. నేడు (జనవరి 20) నరేశ్ పుట్టినరోజు. (చదవండి: ప్రముఖ హీరో మంచి మనసు... ఆరుగురు ఖైదీలు విడుదల) ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని శుక్రవారం నరేశ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా తొమ్మిదో ఏట ‘పండంటి కాపురం’ (1972)తో బాలనటుడిగా అడుగుపెట్టాను. మా అమ్మ విజయ నిర్మల, జంధ్యాల, కె. విశ్వనాథ్, బాపు, రమణ, ఈవీవీ సత్యనారాయణ, వంశీ, రేలంగి నరసింహారావు వంటి మహనీయులతో సినిమాలు చేసే అదృష్టం దక్కింది. రాజకీయాలు, ఆ తర్వాత సమాజ సేవ వల్ల దాదాపు పదేళ్లు పరిశ్రమకి దూరమయ్యాను. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, బిజీగా ఉన్నాను. నాకు నెగటివ్ రోల్స్ చేయాలని ఉంది. ఇక ఏ ప్రభుత్వమైనా సినీ పరిశ్రమకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలి. నంది అవార్డులని పరిశ్రమ గౌరవంగా చూస్తుంది. కానీ ఇప్పుడా అవార్డులని ఇవ్వడం లేదు.. మళ్లీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మా అబ్బాయి నవీన్‌కి దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నాను. మా విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్‌ని మోడ్రన్ స్టూడియోగా చేస్తున్నాం’’ అన్నారు. -
నరేశ్-పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’ క్రేజీ అప్డేట్
సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ మధ్య ఈ జంట తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. అయితే అది నిజ జీవితానికి సంబంధించినది కాదని.. ఓ సినిమా కోసం అలా వీడియో చేశారని తర్వాత తెలిసింది. ఆ సినిమా పేరే ‘మళ్ళీ పెళ్లి’. మెగా మూవీ మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పెద్ద వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఏప్రిల్ 13న ‘మళ్ళీ పెళ్లి’టీజర్ విడుదల చేయనున్నట్లు నరేశ్ ట్వీటర్ వేదికగా తెలిపాడు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని, ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఆయన తెలిపారు. జయసుధ, శరత్‌బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. Experience the Magic of Love with the Teaser of #MalliPelli - Telugu ❤️🔥#MattheMaduve - Kannada ❤️🔥 RELEASING ON APRIL 13th 🫶 Directed by @MSRajuOfficial #PavitraLokesh @vanithavijayku1 @VKMovies_ @EditorJunaid @adityamusic Summer 2023 Release! pic.twitter.com/3AT2b7HQvw — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) April 8, 2023 -
నరేష్ మూడో భార్యపై ఫిర్యాదు చేసిన పవిత్రా లోకేశ్
సినీ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై నటి పవిత్రా లోకేశ్ ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌ను అడ్డుపెట్టుకొని తనను కించపరుస్తుందని ఆమె ఆరోపించింది. రమ్య, నరేష్‌ల మధ్య కుటుంబ వివాదాలున్నాయి. రమ్యపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో జోక్యం చేసుకుంది. నా వ్యక్తిగత జీవితంపై రమ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నా పరువుకు భంగం కలిగేలా రమ్య వ్యవహరిస్తుంది. యూట్యూబ్ ఛానళ్ల ప్రచారం వెనుక రమ్య హస్తం ఉంది.పలు యూట్యూబ్ ఛానళ్లను రమ్యే వెనుక ఉండి నడిపిస్తుంది.అంతేకాకుండా గతంలో కూడా నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అంటూ పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా నరేష్ తనకు సంబంధించి యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పవిత్రా లోకేశ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా గతంలో నరేష్, పవిత్ర లోకేశ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అనంతరం ఓ హోటల్ రూమ్‌లో నరేష్, పవిత్ర ఉండగా నరేష్ భార్య వచ్చి గొడవ చేశారు. దీంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. -
పవిత్రా లోకేశ్ నా భార్యే: సుచేంద్రప్రసాద్
బనశంకరి(కర్ణాటక): ‘నటి పవిత్రా లోకేశ్ నా భార్యే. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెను వివాహం చేసుకున్నాను. నా పాస్‌పోర్ట్, ఆధార్ కార్డును గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది’ అని కన్నడ నటుడు సుచేంద్రప్రసాద్ చెప్పారు. నటి పవిత్ర, తెలుగు సీనియర్ నటుడు నరేష్‌లు పెళ్లి చేసుకోబోతున్నారని గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతుండటం, అదే సమయంలో వారిద్దరూ తరచూ జంటగా కనిపిస్తుండటం తెలిసిందే. చదవండి: అలా చేస్తే ‘సర్కారువారి పాట’మరో 100 కోట్లు వసూలు చేసేది ఈ నేపథ్యంలో సుచేంద్రప్రసాద్ శనివారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పవిత్రా లోకేశ్, తాను భార్యాభర్తలుగా అనేక కార్యక్రమాలకు వెళ్లామని, కానీ వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకోలేదని చెప్పారు. మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవడం విదేశీ సంస్కృతికి నిదర్శనమని భావించామని, అందుకే సర్టిఫికెట్ తీసుకోలేదని చెప్పారు. -
వారిద్దరూ కలిసి ఎలా ఉంటారో చూస్తా.. నరేష్ మూడో భార్య రమ్య శపథం
మైసూరు: తాను ఇంకా విడాకులు తీసుకోలేదని, అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్తతో కలిసి తిరుగుతోందని నరేష్ మూడో భార్య రమ్య మండిపడింది. భర్తకు విడాకులు ఇవ్వను, అందరి ముందు ఆయనను పెళ్లి చేసుకున్నాను, నా భర్త మరో మహిళతో కలిసి తిరగడం సరికాదు, వారికి పోలీసులు అండగా ఉండడం ఏమిటి అని ప్రశ్నించింది. వారిద్దరు కలిసి ఎలా ఉంటారో చూస్తానని శపథం చేసింది. చదవండి: వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! కొన్నిరోజులుగా చర్చనీయాంశమైన సీనియర్ సినీ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్, నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మధ్య గొడవ పతాక స్థాయికి చేరింది. ఆదివారం మైసూరులో నరేష్, పవిత్ర ఓ హోటల్లో ఒకే గదిలో ఉండగా, రమ్య అక్కడకొచ్చి ఇద్దరితో గొడవకు దిగింది. హోటల్ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నా ఆమె శాంతించలేదు. నరేష్, పవిత్రలు శనివారం రాత్రి ఆ హోటల్లో దిగారు. ఆదివారం ఉదయం రమ్య వారి గది వద్దకు వచ్చి డోర్ బెల్ నొక్కింది. కానీ, నరేష్ తలుపు తీయలేదు. రమ్య అక్కడే ఉండిపోయింది. హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి రమ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె ససేమిరా అంది. పోలీసులు ఆమెను అడ్డుకుని పక్కకు తీసుకెళ్లగా నరేష్, పవిత్రలు తలుపు తీసుకుని బందోబస్తు మధ్య బయటకు వచ్చారు. రమ్య గట్టిగా అరుస్తూ చెప్పు తీసుకుని వారి మీద దాడి చేయడానికి యత్నించింది. ఇద్దరు పోలీసులపైనా ఆమె దాడికి దిగింది. నరేష్ పవిత్రను తీసుకుని అక్కడనుంచి వెళ్లిపోయారు. -
హోటల్లో నరేశ్, పవిత్ర జంట.. చెప్పుతో కొట్టబోయిన రమ్య
Actor Naresh And Pavitra Lokesh: సినియర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేష్ జంట మైసూర్లో ప్రత్యేక్షమైంది. మైసూర్‌లోని ఓ హోటల్ ఉన్న ఈ జంటను నరేశ్ మూడో భార్య రమ్య అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పవిత్రను చెప్పుతో కొట్టేందుకు రమ్య ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. రమ్యను చూసి నరేశ్ విజిల్స్ వేసుకుంటూ.. పవిత్రతో కలిసి లిఫ్ట్‌లో వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: దయచేసి నాకు, నరేశ్‌కు సపోర్డు ఇవ్వండి..) గత కొన్ని రోజులుగా నరేశ్, పవిత్ర పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేశ్ మూడో భార్య రమ్య తెరపైకి వచ్చి తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రా లోకేశ్‌ను నరేశ్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆరోపించారు. ‘నరేశ్ నన్ను మోసం చేశాడు. కొంతకాలం మేం కలిసి లేము. అలాగని విడాకులు తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్ ఎలా పెళ్లి చేసుకుంటాడు?’ అని ప్రశ్నించారు. దీనిపై పవిత్ర లోకేష్ కూడా స్పందించారు. రమ్య కావాలనే తనను బ్యాడ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏదైన ఉంటే హైదరాబాద్‌లో మాట్లాడకుండా.. బెంగళూరు వచ్చి నన్ను చెడ్డగా చూపించడం కరెక్ట్ కాదన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో కూడా విడుదల చేశారు. -
లగ్జరీ కారు కొనుగోలు చేసిన నరేశ్
1972లో వచ్చిన 'పండంటి కాపురం' సినిమాతో నటుడిగా ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు నరేశ్ విజయకృష్ణ. అప్పట్లో హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడీయన. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితులైన ఈయన ఈ మధ్యే సకల సదుపాయాలు ఉండేలా ఓ కారవ్యాన్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా నరేశ్ ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారును సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'నా కల నెరవేరిందోచ్, ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను' అని పేర్కొంటూ తన కారును చూపించాడు. పర్పుల్ కలర్లో ఉన్న ఈ కారును డ్రైవ్ చేస్తూ నగర రోడ్లపై చక్కర్లు కొట్టి మురిసిపోయాడు నరేశ్. వెంటనే తన ప్రొఫైల్ పిక్ కూడా మార్చేశాడు. కారు పక్కన నిల్చున్న ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నాడు. ఇంత ఖరీదైన కారును కొన్న నటుడికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Hi sharing my new dream come true with my twitter family💕 pic.twitter.com/rnxev9r2Ts — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 2, 2022 #NewProfilePic pic.twitter.com/J0c2BDDxhf — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 2, 2022 -
లగ్జరీ కారవ్యాన్ కొనుగోలు చేసిన నరేశ్.. ప్రత్యేకత ఏంటంటే?
కారవాన్... సినీతారలు సాధారణంగా ఉపయోగించే మల్టీపర్పస్ వాహనం. ఇందులో సకల సౌకర్యాలనూ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే గతంలో ఇది కేవలం స్టార్ హీరో, హీరోయిన్లు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కారవాన్లు వాడుతున్నారు. తమ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ అయితే చాలు వెళ్లి తమ కారవాన్‌లో సేద తీరుతారు. మరో షాట్ రెడీ కాగానే బయటకు వస్తున్నారు. తాజాగా సీనియర్ నరేశ్ లగ్జరీ కారవాన్‌ని కొలుగోలు చేశాడు. ఒకప్పడు హీరోగా రాణించిన నరేశ్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో దూసుకెళ్లున్నాడు. ఆయన ఇంట్లో కంటే ఎక్కువ సమయంలో షూటింగ్ స్పాట్లోనే గడుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర నటీనటులు వాడిన కారవ్యాన్‌ని వాడడం అంత మంచిది కాదని భావించిన నరేశ్.. ప్రత్యేకంగా ఓ కారవ్యాన్ కొలుగోలు చేశాడట. తనకు కావాల్సిన సదుపాయాలు అన్ని ఉండేలా దాన్ని ఏర్పాటు చేయించుకున్నారట. అందులో ఏసీ బెడ్, మేకప్ ప్లేస్, జిమ్, వెయిటింగ్ రూమ్, వాష్రూప్తో సహా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయట. ఈ వ్యాన్ని ఆయన ముంబై నుంచి తెప్పించారట. దీని కోసం నరేశ్ భారీగానే ఖర్చు చేశారట. ప్రస్తుతం టాలీవుడ్లో ఏ క్యారెక్టర్ ఆర్టిస్టుకి ప్రత్యేకంగా కారవ్యాన్ లేదు. కొంతమంది సీనియర్ నటులకు అయితే నిర్మాతలే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారట. అయితే నరేశ్ మాత్రం సొంతంగా క్యారవాన్ కొలుగోలు చేయడం విశేషం. -
అదే ఫాలో అవుతున్నా.. అందుకే ఇప్పటికీ టాప్‌లో ఉన్నాను : నరేశ్
Naresh VK actor: ‘‘విజయకృష్ణ మూవీస్’ బ్యానర్ స్థాపించి యాభై ఏళ్లు అవుతోంది. ఈ బ్యానర్ పతాకాన్ని మళ్లీ ఎగరవేయాలనుకుని ఈ ఏడాది నుంచి సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను’’ అని నటుడు నరేశ్ విజయకృష్ణ అన్నారు. నేడు (జనవరి 20) తన పుట్టినరోజుని పురస్కరించుకుని బుధవారం నరేశ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం లేదు. 1972లో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమాతో తెరంగేట్రం చేశాను. నటుడిగా యాభై ఏళ్లు నిండాయి. ఇంతటి సుధీర్ఘ ప్రయాణానికి కారణమైన సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలగార్లకు, నా గురువు జంధ్యాలకి థ్యాంక్స్. యాభై ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా కొత్త పాత్రలు ఇస్తున్న రచయితలు, దర్శక–నిర్మాతలకు, నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ యాభై ఏళ్లలో ఓ పదేళ్లు సామాజిక సేవ, రెండేళ్లు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అభివృద్ధి కోసం కృషి చేశాను. ఈ ఏడాది అమ్మ పేరుతో (విజయ నిర్మల) స్టూడియోను అందుబాటులోకి తీసుకొస్తున్నాను. ‘నాలుగు స్థంభాలాట’ సమయంలో ‘గౌరవం నువ్వు ఆశించకు.. అందరికీ ఇవ్వు’ అని మా అమ్మ చెప్పారు.. నేను అదే ఫాలో అవుతుండటం వల్లే ఇంకా టాప్‌లో ఉన్నాను. ఓటీటీ వచ్చినా థియేటర్ అనుభూతే వేరు. ప్రస్తుతం రామ్‌చరణ్–శంకర్ సినిమా, సితార ఎంటర్టైన్మెంట్స్తో పాటు నవీన్ పొలిశెట్టి సినిమా చేస్తున్నాను. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలని ఉంది. ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. ఇండస్డ్రీ, ఏపీ ప్రభుత్వం (టికెట్ ధరలు, ఇతర ఇండస్ట్రీ సమస్యలను ఉద్దేశించి) మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. -
MAA Elections 2021: నరేశ్‌పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో మళ్లీ ఎన్నికల రగడ మొదలైంది. ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అసలు ఎన్నికలు జరకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్యానల్ ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా, ఉన్నదంతా ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. తాము ఫండ్ రైజ్ చేసి ఇస్తే.. నరేశ్ ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. 'మా' ఎన్నికలు జరపాలంటూ హేమ సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సారి మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో తనను సపోర్ట్ చేసిన వారందరి కోరిక మేరకే ఈ సారి అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగుతున్నానని హేమ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
‘మా’ఎన్నికల సమరం.. నరేశ్ కొత్త ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్‌తోపాటు.. జీవితరాజశేఖర్, హేమ కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ఫ్యానల్ సభ్యులను కూడా ప్రకటించారు. ఇండస్ట్రీలోని పెద్దలు తమకు నచ్చిన వారికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ తెరపైకి సరికొత్త ప్రతిపాదన తెచ్చారు. ‘మా’అధ్యక్ష పదవి మహిళకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళ ఏకగ్రీవానికి తన వంతు ప్రయత్నిస్తానని ‘సాక్షి’తో చెప్పారు. ‘మా’లో కులాలు, మతాలకు చోటు లేదని, లోకల్, నాన్ లోకల్ అనే అంశానికి చోటు లేదన్నారు. ఫోకస్‌గా పనిచేస్తూ, అందుబాటులో ఉన్నవారు అధ్యక్షుడిగా రావాలని నరేశ్ అన్నారు. చదవండి: నాగబాబు వ్యాఖ్యలు షాక్‌కి గురిచేశాయి: నరేశ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1721373393.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం
-
మేనిఫెస్టో హామీలు నెరవేర్చాలి
‘‘మా’ ఎన్నికల సందర్భంగా నరేష్ ప్యానెల్ ప్రకటించిన మేనిఫెస్టోలోని అన్ని హామీలను వారికున్న రెండు సంవత్సరాల కాలంలో నెరవేర్చి, అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి. నూతనంగా ఎన్నికైన వారందరికీ అభినందనలు’’ అని నటులు కృష్ణ అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా ఎన్నికైన నరేశ్, ఇతర సభ్యులు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేశారు. నటి, దర్శకురాలు విజయ నిర్మల మాట్లాడుతూ– ‘‘మీ అందర్నీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లోనే ‘మా’ పుట్టింది. ఈ సంఘం అభివృద్ధి కోసం ఇదివరకు నేను ఇస్తున్న డబ్బుకంటే ఎక్కువే ఇచ్చి ఋణం తీర్చుకుంటాను’’ అన్నారు. నటులు కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘చెన్నైలో ఉన్నప్పుడు కృష్ణగారు, మేము అంతా ‘మా’ అసోసియేషన్‌ని చాలా బాగా నడిపాం. అప్పుడు ఎలక్షన్స్ లేవు.. ఇప్పుడు వచ్చాయి. ప్యానెల్‌లోని అందరూ కలిసికట్టుగా పనిచేసి, ‘మా’ అసోసియేషన్ ప్రతిష్టని ఎంతో ఎత్తుకు చేర్చాలి’’ అన్నారు. ‘‘మా’ అంటేనే అమ్మ. ఈ కళకి కులం, మతం అంటూ భేదం లేదు.. అందరూ కలిసికట్టుగా పనిచేసి, ‘మా’ అభివృద్ధికి కృషి చేయాలి’’ అన్నారు గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ‘మా’ నూతన అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ– ‘‘ఈ కార్యక్రమానికి విచ్చేసిన కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, శ్యామల, కోటా శ్రీనివాసరావు, జయసుధ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ‘మా’ అసోసియేషన్‌కి నేను ఇచ్చే మొదటి బహుమతి ‘మా’ గీతం. రెండో బహుమతిగా లక్షా వెయ్యినూటపదహార్లు నా సోదరుల సంక్షేమం కోసం ఇస్తున్నాను. ‘మా’ సభ్యత్వం గతంలో లక్ష ఉండగా 10,000 తగ్గిస్తూ 90,000 చేస్తున్నాం.. ఇది నా మూడో గిఫ్ట్.. మా అమ్మ విజయనిర్మలగారు ‘మా’కి ప్రతినెలా 15,000 ఇస్తున్నారు. ‘మా’ లో 24 గంటల హెల్ప్‌లైన్‌ని ఏర్పాటు చేసాం. సలహాల పెట్టెను ఏర్పాటు చేసి అందరి విన్నపాలు స్వీకరిస్తాం. మహిళల సాధికారత, సంక్షేమం కోసం జీవితగారి ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ఈ సందర్భంగా ‘మా’ కోసం అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన గీతాన్ని కృష్ణ, విజయనిర్మల విడుదల చేశారు. ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా, రాజశేఖర్, జీవిత, ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు పలువురు నటీనటులు పాల్గొన్నారు. -
విద్య 100... బుద్ధి 0
‘‘ఒక అద్భుతమైన పాయింట్‌ని ఎంటర్టైనింగ్గా చెప్పడం చాలా గొప్ప విషయం’’ అన్నారు మా అధ్యక్షుడు సీనియర్ నరేశ్. చేతన్ మద్దినేని హీరోగా నరేష్ కుమార్ దర్శకత్వంలో మంజునాథ్ వి. కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’. ‘విద్య 100శాతం, బుద్ధి 0 శాతం’ అనేది ఉపశీర్షిక. ఇందులో హీరో తండ్రి పాత్రలో నటించారు నరేశ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘కన్నడంలో చాలా పెద్ద హిట్ సాధించిన ఈ చిత్రాన్ని అదే టీమ్ తెలుగులో చేయడం మొదటి సక్సెస్‌గా నేను భావిస్తున్నాను. చార్లీ చాప్లిన్ కామెడీ సీన్ వెనక చిన్న పెయిన్ ఉంటుంది. ఈ ఫార్ములాతో తెరకెక్కిన చిత్రమిది. ఇలాంటి సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. పాత్రను ఫీలై చేతన్ అద్భుతంగా నటించారు. అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. దర్శకుడు నరేశ్ మంచి వినోదాత్మకంగా తెరకెక్కించారు. తెలుగు సినిమాలపై అభిమానంతో ఓ మంచి చిత్రాన్ని తెలుగులో నిర్మించాలనుకోవడం మంజునాథ్‌కి ఉన్న అభిరుచిని తెలియజేస్తుంది. ఈ సినిమా తెలుగులోనూ సక్సెస్ సాధించాలి’’ అన్నారు. ‘‘సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. తల్లిదండ్రులు చదువుకోసం వారి పిల్లలను ఎలా ఒత్తిడి చేస్తున్నారు? పిల్లల మానసిక పరిస్థితి ఏంటి? అనే అంశాలను ఎంటర్టైనింగ్ చూపించారు’’ అన్నారు దర్శకులు మారుతి. ‘‘కన్నడంలో మేము చేసిన ఫస్ట్ ర్యాంకు చిత్రం మా జీవితాలను మార్చేసింది. విద్యార్థులకు విద్యే కాదు. బుద్ధి ఉండాలని చెప్పే సినిమా. వినోదంతో పాటు సందేశం కూడా ఉంది’’ అన్నారు నరేశ్‌కుమార్. ‘‘తెలుగులో సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. తెలుగులో మరిన్ని సినిమాలు నిర్మిస్తాను’’ అన్నారు మంజునాథ్. ‘‘ప్రతి ఫస్ట్ ర్యాంకు స్టూడెంట్ బయోపిక్ ఇది. ఈ పాత్ర చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. తల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు చేతన్. సంగీత దర్శకుడు కిరణ్ రవీంద్రనాథ్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది. -
అది కరెక్ట్ కాదు
2019–2021 మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీనియర్ నరేశ్ గెలుపొందిన విషయం తెలిసిందే. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఈ నెల 22న ముహూర్తం నిర్ణయించుకున్నారు నరేశ్. అయితే అనుకున్న సమయానికి ప్రమాణ స్వీకారం చేయడానికి శివాజీ రాజా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నరేశ్. 2017–2019 కాలపరిమితికి శివాజీ రాజా ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికైన నరేశ్ ప్రమాణ స్వీకారం చేయాలంటే తన పదవీ కాలం ముగియాలని శివాజీరాజా అంటున్నారని నరేశ్ చెబుతున్నారు. ఇంకా నరేశ్ మాట్లాడుతూ– ‘‘మా’లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం. అవన్నీ మర్చిపోయి మా గుట్టు బయటపడకుండా అందరినీ కలుపుకుపోయి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అయినా మమ్మల్ని పని చేయకుండా వెనక్కి లాగుతున్నారు. ఇండస్ట్రీ పెద్దల అంగీకారంతో, వారి సమక్షంలో ఈ 22న మంచి మూహుర్తం ఖరారు చేసుకుని ప్రమాణా స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నాం. ‘నా పదవీకాలం 31వరకు ఉంది. అప్పటి వరకు ఎవరూ మా కుర్చీలో కూర్చోవద్దు. కోర్టుకి వెళతా అని శివాజీ రాజా ఫోన్లో బెదిరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పెద్దలు ఎలా చెబితే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, ఈసీ మెంబర్స్ పాల్గొన్నారు. -
‘మా’ అధ్యక్షుడిగా నరేశ్
‘మా’ నూతన అధ్యక్షుడు ఎవరు? అనే ఉత్కంఠకు తెరపడింది. సీనియర్ నరేశ్ మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికోసం సీనియర్ నరేశ్, శివాజీరాజా ప్యానళ్ల మధ్య హోరాహోరీ పోరు సాగగా నరేశ్ విజయం సాధించారు. ‘మా’ అసోసియేషన్‌లో దాదాపు 800 ఓట్లు ఉండగా 472 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సారి పోలింగ్‌కు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడంతో కౌంటింగ్ ఆలస్యమైంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. నరేశ్‌కు 268 ఓట్లు పోల్ కాగా, శివాజీ రాజాకు 199 ఓట్లు వచ్చాయి. దీంతో 69 ఓట్ల ఆధిక్యంతో నరేశ్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ‘మా’ ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, జాయింట్ సెక్రటరీగాలుగా గౌతమ్‌రాజు, శివబాలాజీ, కోశాధికారిగా రాజీవ్ కనకాల విజయం సాధించారు. కాగా హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందడం విశేషం. ‘మా’ ఈసీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ) సభ్యులుగా అలీ, రవిప్రకాశ్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వీ, జాకీ, సురేశ్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటే కల్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. -
పారితోషికం కాదు.. పాత్ర ముఖ్యం
‘‘ఏ ఆర్టిస్ట్‌కైనా సక్సెస్, ఫెయిల్యూర్ కామన్. ఏడెనిమిదేళ్ల క్రితం మంచి హిట్ వస్తే బావుంటుంది అనుకున్నాను. గతేడాది వచ్చిన హిట్ సినిమాల్లో సుమారు 8 సినిమాల్లో నటించాను. నాపై దర్శకులు ఉంచిన నమ్మకంతోనే ఆ పాత్రలు వచ్చాయి. గతేడాది మన ఇండస్ట్రీ చాలా బావుంది. అలాగే నాకు కూడా. ఈ ఏడాదిని కూడా అలానే కొనసాగించాలనుంది. పాత్రల్లో ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్నాను’’ అన్నారు నటుడు నరేశ్. ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ► ‘శతమానం భవతి’ నా కెరీర్లో టర్నింగ్ పాయింట్. 2018 మన తెలుగు సినిమాలకు హెల్తీయస్ట్ ఇయర్. ‘ఛలో, తొలిప్రేమ, రంగస్థలం, మహానటి, సమ్మోహనం, దేవదాస్, అరవింద సమేత.., శైలజారెడ్డి అల్లుడు’.. ఇలా చాలా సినిమాల్లో కనిపించాను. ‘సమ్మోహనం’ లో చేసిన పాత్ర నన్ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్కృష్ణగారికి థ్యాంక్స్ చెప్పాలి. సీనియర్ డైరెక్టర్స్‌తో పాటు యువ దర్శకులు కూడా ఆయా పాత్రలకు నన్ను ఎంచుకోవడం çహ్యాపీ. నాకు పారితోషికం ముఖ్యం కాదు.. పాత్ర ముఖ్యం. ► నటుడిగా 47 ఏళ్లు పూర్తి చేసుకొని 48లోకి వెళ్తున్నాను. మరో రెండేళ్లలో గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటాను. నా క్రమశిక్షణ, ఇండస్ట్రీలో పెంచుకున్న గుడ్‌విల్, వివాదాల్లోకి వెళ్లకపోవడం.. నా సుదీర్ఘ ప్రయాణానికి కారణం అయ్యాయనుకుంటాను. చిన్న బడ్జెట్ సినిమాలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నాను, ఉంటాను కూడా. కొత్త కాన్సెప్ట్‌లు, కొత్త ఐడియాలకు సిద్ధం. వెబ్ సిరీస్‌లకు కూడా అడుగుతున్నారు కానీ మంచి కాన్సెప్ట్‌తో డిజిటల్‌గా కూడా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను. ► గతేడాది మూడు షిఫ్ట్స్ పని చేశా. ఈ ఏడాది కూడా అలానే ఉండాలనుకుంటున్నాను. పాత్రల ఎంపికలో మంచి పాత్రలు ఎంచుకుంటున్నా. క్వాలిటీ, బ్యానర్లు ఇవన్నీ చూసుకొని ఎంచుకుంటాను. ప్రస్తుతం కార్తికేయతో అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా, ఫణిరాజా అని బుర్రాసాయి మాధవ్ అసోసియేట్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ‘పవనిజం 2’ సినిమాలో విలన్‌గానూ చేస్తున్నాను. ► రెండు బయోపిక్స్‌లో (మహానటి, ఎన్టీఆర్) మంచి పాత్రలు చేయడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో బీఏ సుబ్బారావు పాత్ర ఇచ్చినందుకు క్రిష్, బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పాలి. ► ఇంతకు ముందు తమిళ, మలయాళ రీమేక్స్ కోసం మనవాళ్లు వెళ్లేవారు. ఇప్పుడు వేరే భాషల వాళ్లే మన సినిమా రీమేక్స్ కోసం వస్తుండటం మంచి పరిణామం. మా అబ్బాయి నవీన్ ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమాతో రాబోతున్నాడు. -
నన్ను నేను కోల్పోయినట్లుగా ఉంది
‘‘స్క్రీన్ నేమ్ ‘రెబల్ స్టార్’. కానీ రియల్‌గా ‘సింపుల్ స్టార్.. హంబుల్ స్టార్’’... ప్రముఖ కన్నడ స్టార్ అంబరీష్ గురించి పలువురు చిత్రరంగ ప్రముఖులు వ్యక్తపరిచిన అభిప్రాయం ఇది. ‘‘నలుగురూ బాగుండాలని కోరుకునే వ్యక్తి’’ అని కూడా పేర్కొన్నారు. ఇంత మంచి పేరు ఉంది కాబట్టే... తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఇండస్ట్రీవాళ్లు ‘ఇక అంబరీష్ లేరు’ అనే మాటను జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ని భాషల్లోనూ స్నేహితులను సంపాదించుకున్న అజాతశత్రువు అని అంబరీష్ గురించి వినిపించే మాట. బెంగళూరులో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించడానికి వెళ్లిన మోహన్‌బాబు, ఖుష్బూ, సీనియర్ నరేశ్‌లు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ► అంబరీష్‌గారితో మీ స్నేహం ఎప్పుడు మొదలైంది? ఎవరు పరిచయం చేశారు అన్నది గుర్తు లేదు కానీ 36 సంవత్సరాల క్రితం మదరాసులో మా ఇంట్లో కలిశాం. ఆ స్నేహం ‘అరేయ్.. ఒరేయ్’ అని పిలుచుకునేంత గాఢమైంది. అప్పట్లో మదరాసులో వాడు హోటల్లో ఉండేవాడు. ఆ సమయంలో మా ఇంటికి వచ్చేవాడు. అప్పటికి అంబరీష్‌కి పెళ్లి కాలేదు. సుమలత, నేను 10–12 సినిమాలు యాక్ట్ చేశాం. చాలా మంచి అమ్మాయి. అంబరీష్, తనూ పెళ్లి చేసుకోవడం.. ఇలా ఆ కుటుంబానికి చెందినవన్నీ మాకు, మా కుటుంబానికి చెందినవన్నీ వాళ్లకూ తెలుసు. నేను బెంగళూర్ వెళితే వాడికి ఫోన్ చేయాల్సిందే. లేకపోతే ఊరుకోడు. గొప్ప స్నేహితుడు, శ్రేయోభిలాషి. ► అంబరీష్‌గారు నటుడి నుంచి రాజకీయ నాయకు డిగా ఎదగడం చూశారు.. ఆయన ఎదుగుదల గురించి? నిజానికి మా ఇద్దరి స్నేహం మొదలైనప్పుడు నేను విలన్‌గా చేస్తున్నాను. అంబరీష్ అప్పటికే మంచి స్టార్. కానీ మా మధ్య ఆ తేడాలేవీ ఉండేవి కాదు. మంచి నటుడు అనిపించుకున్నాడు. యంఎల్‌ఏ అయ్యాడు. అన్నీ కష్టపడి సాధించుకున్నాడు. ఆ ఎదుగుదలలో భాగంగా వాడు ఏ ఫంక్షన్‌కి పిలిచినా వెళ్లేవాడిని. ఒకవేళ ఒకటీ అరా వెళ్లకపోతే ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి ‘ఎక్కడ వాడు.. ఆ రాస్కెల్ ఎక్కడ?’ అని అడిగేవాడు. నన్ను తిట్టేవాళ్లలో మొదటి వ్యక్తి వాడే. ‘అరేయ్ ఒరేయ్’ అనే మాటలకన్నా నన్ను ఎక్కువగానే తిట్టేవాడు. అంత చనువుంది. మా స్నేహాన్ని మాటల్లో చెప్పలేం. ► అంబరీష్‌గారు భోజనప్రియుడు అని విన్నాం. ఏది ఇష్టంగా తినేవారు? మదరాసులో హోటల్లో ఉండేవాడని చెప్పాను కదా. హోటల్లో ఉండే అన్ని రకాల వంటకాలు ఇంట్లో లేకపోయినా ఇంట్లో ఉండే ఒకటీ రెండు కూరలు మనకు బ్రహ్మాండంగా అనిపిస్తాయి. అందుకే మా ఇంటి నుంచి క్యారేజీ పంపించేవాళ్లం. చికెన్, మటన్ బాగా ఇష్టపడి తినేవాడు. ఎందుకో కానీ చేపలంటే తనకి ఇష్టం ఉండేది కాదు. నన్ను కూడా తినొద్దనేవాడు. నేను బెంగళూరు వెళితే అప్పుడు కూడా ఫిష్ తప్ప చికెన్, మటన్ వండించేవాడు. ► చివరిసారిగా అంబరీష్‌గారిని మీరెప్పుడు కలిశారు? మా అమ్మగారు చనిపోయిన రోజున (ఈ ఏడాది సెప్టెంబర్ 20) ఫోన్ చేశాడు. ‘కొంచెం ఆరోగ్యం బాగాలేదు.. రాలేకపోతున్నాను. బాధగా ఉంది. కొన్ని రోజుల తర్వాత వచ్చి కలుస్తాను’ అన్నాడు. పది రోజుల ముందు ఫోన్ చేశాడు. నేను అప్పుడు తిరుపతిలో ఉన్నాను. వైకుంఠ ఏకాదశికి కుటుంబంతో తిరుపతి రావాలనుకుంటున్నాను అన్నాడు. అంతకు ముందు సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున ఫ్యామిలీతో సహా తిరుపతి వచ్చాడు. నేనే దగ్గరుండి తీసుకెళ్లాను. రెండు గంటల పాటు దైవ సన్నిధిలోనే ఉన్నాం. ► స్నేహం ఏమీ ఆశించదంటారు.. మీ ఇద్దరి స్నేహం అలానే సాగిందా? ఈ రోజు వరకూ కూడా వాడు ఫలానాది కావాలి అని అడిగింది లేదు. ఎప్పుడైనా నేనేమైనా అడిగానేమో గుర్తు లేదు. మాది స్వచ్ఛమైన స్నేహం. నా లైఫ్‌లో గొప్ప స్నేహితుడు వాడు. శ్రేయోభిలాషి. అంబరీష్ లేడనే మాట విని బాధపడిపోయాను. మా కుటుంబం మొత్తం ఇక్కడే ఉన్నాం. అంబరీష్ అంతిమక్రియలు జరిగే వరకూ బెంగళూరులోనే ఉంటాను. నా మిత్రుడికి చివరి వీడ్కోలు ఇచ్చినప్పటికీ నా మనసులో నుంచి ఎప్పటికీ చెరిగిపోడు. నా ఆప్తమిత్రుల్లో ఒకరిని కోల్పోయాను. నన్ను నేను కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. ‘అడుగు ఆపకూడదు అనేవారు’ — సీనియర్ నరేశ్ ► చివరిసారిగా అంబరీష్‌గారిని ఎప్పుడు కలిశారు? గతేడాది బెంగళూరులో ఆయన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా అందర్నీ పిలిచారు. అప్పుడు కలిశాను. ఆ తర్వాత కన్నడ నటీనటుల సంఘం (కళారధి) భవనం ప్రారంభోత్సవానికి వెళ్లాను. నటీనటుల కోసం బెంగళూరులో అంత పెద్ద బిల్డింగ్ రావడం ఆయన కృషి వల్లే సాధ్యమయింది. నేను చివరిసారిగా అంబీ అన్నను కలిసింది ఆ బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడే. దాదాపు 9 నెలలు అవుతుంది అనుకుంటున్నాను. ► అసలు మీరు అంబరీష్‌గారిని ఫస్ట్ ఎక్కడ కలిశారు? 1983–84–85 టైమ్‌లో ఆయన చెన్నైలో ఉండేవారు. ఆ టైమ్‌లో ఫస్ట్ కలిశాను. ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. నా కెరీర్ తొలినాళ్లలో ఆయన వందో చిత్రం షూటింగ్ టైమ్‌లో కలిశాను. ఆయన్ను బ్రదర్‌లా అనుకునేవాడిని. ► అంబరీష్గారిలోని నటుడ్ని చూసి మీకేనిపించేది? కన్నడంలో రాజ్‌కుమార్‌గారి తర్వాత మాస్ హీరో అంటే అంబరీష్గారే. ఆయన్ను తొలిసారి బ్లాక్ అండ్ వైట్ మూవీ ‘అంత’ (తెలుగులో ‘అంతం కాదిది ఆరంభం’)లో వెండితెరపై చూశాను. స్క్రీన్‌పై అంబీ అన్న నటన చూసి, ఆశ్చర్యపోయాను. సౌత్ నుంచి ఓ సినీ దిగ్గజం వెళ్లిపోయింది. ► అంబరీష్‌గారు ఎలాంటి వారు? ఆయనకు వయసు భేదం లేదు. అందరినీ కలుపుకునే పెద్ద మనసు ఉన్న వ్యక్తి. ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఇదే చెబుతారు. చాలా ధారాళమైన హృదయం ఉన్న వ్యక్తి. చాలా సరదా మనిషి. అంబరీష్‌గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారా? కలిసి నటించలేదు. కృష్ణగారితో సుమలతగారు సినిమాలు చేశారు. అలా ఆ కుటుంబానికీ, మా కుటుంబానికీ మంచి అనుబంధం ఉంది. ► మీకు ఏమైనా సలహాలు ఇచ్చేవారా? లైఫ్‌లో ఎప్పుడూ ఒక అడుగు ముందుకు వేస్తూనే ఉండాలి. ఆగకూడదు అనేవారు. చాలా మొండివాడు. ధైర్యవంతుడు. సినిమాల్లో, రాజకీయాల్లోనూ, దానధర్మాల్లోనూ ముందు ఉండేవారు. ► అంబరీష్గారి నుంచి స్ఫూర్తి పొందే విషయాలు చెబుతారా? చాలా ఉన్నాయి. మేజర్‌గా ధైర్యం, కలుపుగోలుతనం, దానగుణం. 'స్థాయిని బట్టి మాట్లాడే వ్యక్తి కాదు' – ఖుష్బూ ► మీ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అంబరీష్‌గారు స్టార్. ఆయనతో సినిమా చేసినప్పుడు ఎలా ఉండేది? అంబరీష్‌గారు చాలా కంఫర్ట్బుల్. చాలా ఫ్రెండ్లీ నేచర్. ఆయనతో పని చేయడాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా సరే రిపీటెడ్‌గా వర్క్ చేయాలనుకునే స్టార్ అంబరీష్. అంత కంఫర్ట్బుల్. ► ఫస్ట్ టైమ్ అంబరీష్‌గారిని ఎప్పుడు కలిశారు? ‘ఒంటి సలగా’ అనే కన్నడ సినిమా సెట్లో మెదటిసారి కలిశాను. నేను సూపర్‌స్టార్‌ని. నన్ను అందరూ గౌరవించాలి, నన్ను చూసి భయపడాలి అనుకునే మనిషి కాదు అంబరీష్‌గారు. అలాంటివి కోరుకోరు కూడా. చాలా హంబుల్‌గా ఉండేవారు. అందుకని నాకు భయం అనిపించలేదు. ► పవర్ఫుల్ మాస్ రోల్స్ చేయడంవల్ల అంబరీష్గారికి ‘రెబల్‌స్టార్’ ట్యాగ్ ఉంది. లొకేషన్లో అసిస్టెంట్స్‌తో ఎలా ఉండేవారు? స్క్రీన్ మీదే ఆయన రెబల్ స్టార్. బయట అందరినీ సమానంగా చూసేవారు. కెరీర్ చివరి వరకూ కూడా ఆయన అలానే ఉన్నారు. స్థాయిని బట్టి మాట్లాడే గుణం లేదాయనకు. ► 1980లలో నటించిన తారలందరూ ‘రీయూనియన్’ అంటూ ప్రతి ఏడాదీ కలుస్తున్నారు. అప్పుడు అంబరీష్‌గారు సందడి చేసేవారా? ఈ ఏడాది ఆరోగ్య కారణలతో హాజరు కాలేకపోయారు. కానీ ప్రతీ ఏడాది ఫుల్ హుషారుగా, సరదాగా ఉండేవారు. చాలా సింపుల్‌గా, నార్మల్‌గా ఉంటారు. కానీ 2015లో మోహన్‌లాల్ ఏర్పాటు చేసిన మీట్లో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ ఉన్నారు. శనివారం వెళుతూ వెళుతూ ఓ చేదు వార్త వినేలా చేస్తుందని ఊహించలేదు. మా అందరికీ పెద్ద షాక్. అత్యంత ఆప్తుడిని కోల్పోయాం. -
దాసరికి సినీ,రాజకీయ ప్రముఖుల పరామర్శ
-
పదేళ్లకో ట్రెండ్ సెట్టర్ వస్తుంది!
‘‘ఇటీవల నేను చేసిన పాత్రల్లో ‘అ..ఆ’ చిత్రంలోని రామలింగం పాత్ర ది బెస్ట్. ‘గుంటూరు టాకీస్’లోని పాత్ర మాస్‌కి దగ్గర చేస్తే, రామలింగం క్యారెక్టర్ క్లాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది’’ అని నటుడు సీనియర్ నరేశ్ అన్నారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ - ‘‘ప్రతి పదేళ్లకోసారి ట్రెండ్ సెట్ చేసే మూవీ వస్తుంటుంది. ‘అ..ఆ’ అటువంటి కోవలోకి వస్తుంది. ప్రస్తుతం రావు రమేశ్, నేను ఇంకా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నాం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఇప్పటి తరం దర్శకులతో పనిచేయడం వల్ల ప్రస్తుత ట్రెండ్ తెలుస్తోంది. చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఉండదు. బాగా ఆడే ప్రతి సినిమా పెద్దదే. కృష్ణగారి స్వర్ణోత్సవ చిత్రం ‘శ్రీశ్రీ’లో, మహేశ్‌తో ‘బ్రహ్మోత్సవం’లో చేయడం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం నాలుగు చిత్రాలు కమిట్ అయ్యా’’ అన్నారు. -
గుంటూరు కహానీ!
అది ఓ మెడికల్ షాపు. దాంట్లో పనిచేసే ఇద్దరు యువకులు అతితెలివితేటలతో చేసిన పని, వారి జీవితాలను మలుపు తిప్పుతుంది. మరి ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ‘గుంటూరు టాకీస్’ చూడాల్సిందే. ‘చందమామ కథలు’ చిత్రంలో జాతీయ పురస్కారం అందుకున్న ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకుడు. సిద్ధు జొన్నలగడ్డ, సీనియర్ నరేశ్, లక్ష్మీ మంచు, మహేశ్ మంజ్రేకర్, శ్రద్ధాదాస్, రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీపార్ట్ చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ - గుంటూరు నేపథ్యంలో సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆద్యంతం చాలా ఉత్కంఠతతో ఈ సినిమా సాగుతుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, సంగీతం: శ్రీ చరణ్. -
మంచి ఫీల్ ఉన్న చిత్రం
‘‘ఎన్నో అడ్డంకులు అధిగమించి మా ‘పరంపర ’ చిత్రాన్ని విడుదల చేశాం. మూడో వారంలోకి ప్రవేశించడం ఆనందంగా ఉంది. ఈ 28న వైజాగ్, విజయవాడ, రాజమండ్రిల్లో విడుదల చేయనున్నాం’’ అని దర్శక, నిర్మాత మధు మహంకాళి తెలిపారు. సీనియర్ నరేశ్, ఆమని, రావి కొండలరావు ముఖ్య తారలుగా స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘పరంపర’ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. నరేశ్ మాట్లాడుతూ -‘‘జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రానికి ప్లాటినమ్ అవార్డ్ వచ్చింది. ఈ తరహా చిత్రాలు తీయడానికి నిర్మాతలకు ధైర్యం కావాలి. మంచి ఫీల్ ఉన్న చిత్రం’’ అన్నారు. ఒక మంచి చిత్రం నిర్మించామనే సంతృప్తి దక్కిందని నిర్మాతల్లో ఒకరైన రూపాదేవి అన్నారు. ఇలాంటి మంచి చిత్రాలకు వినోదపు పన్ను మినహాయింపునివ్వాలని రావి కొండలరావు కోరారు. యువతరాన్ని మేలుకొలిపే చిత్రమిదని మనోవైజ్ఞానిక విశ్లేషకులు సి. నరసింహారావు అభిప్రాయపడ్డారు.