Naresh VK, Pavitra Lokesh Malli Pelli Movie Teaser Release Date Out, Deets Inside - Sakshi
Sakshi News home page

నరేశ్‌-పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’ క్రేజీ అప్‌డేట్‌

Published Sat, Apr 8 2023 1:29 PM | Last Updated on Sat, Apr 8 2023 3:56 PM

Naresh VK, Pavitra Lokesh Malli Pelli Movie Teaser Release Date Out - Sakshi

సీనియర్‌ నటుడు వీకే నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ మధ్య ఈ జంట తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. అయితే అది నిజ జీవితానికి సంబంధించినది కాదని.. ఓ సినిమా కోసం అలా వీడియో చేశారని తర్వాత తెలిసింది. ఆ సినిమా పేరే ‘మళ్ళీ పెళ్లి’. మెగా మూవీ మేకర్‌ ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నరేశ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పెద్ద వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది.  

తాజాగా  ఈసినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు మేకర్స్‌. ఏప్రిల్‌ 13న ‘మళ్ళీ పెళ్లి’టీజర్‌ విడుదల చేయనున్నట్లు నరేశ్‌ ట్వీటర్‌ వేదికగా తెలిపాడు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని, ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని ఆయన తెలిపారు. జయసుధ, శరత్‌బాబు, వనితా  విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి  స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement