Actor Naresh Buys Luxurious Customized Caravan, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Actor Naresh: లగ్జరీ కారవ్యాన్‌ కొనుగోలు చేసిన నరేశ్‌.. ఏ క్యారక్టర్‌ ఆర్టిస్టుకు అలాంటి లేదు!

Published Tue, Jan 25 2022 11:25 AM | Last Updated on Tue, Jan 25 2022 1:38 PM

VK Naresh Buy A Luxury Vanity Van - Sakshi

కారవాన్... సినీతారలు సాధారణంగా ఉపయోగించే మల్టీపర్పస్ వాహనం. ఇందులో సకల సౌకర్యాలనూ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే గతంలో ఇది కేవలం స్టార్‌ హీరో, హీరోయిన్లు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టులు కూడా కారవాన్‌లు వాడుతున్నారు. తమ పాత్రకు సంబంధించిన షూట్‌ కంప్లీట్‌ అయితే చాలు వెళ్లి తమ కారవాన్‌లో సేద తీరుతారు. మరో షాట్‌ రెడీ కాగానే బయటకు వస్తున్నారు. తాజాగా సీనియర్‌ నరేశ్‌ లగ్జరీ కారవాన్‌ని కొలుగోలు చేశాడు. 

ఒకప్పడు హీరోగా రాణించిన నరేశ్‌.. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో దూసుకెళ్లున్నాడు. ఆయన ఇంట్లో కంటే ఎక్కువ సమయంలో షూటింగ్‌ స్పాట్‌లోనే గడుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర నటీనటులు వాడిన కారవ్యాన్‌ని వాడడం అంత మంచిది కాదని భావించిన నరేశ్‌..  ప్రత్యేకంగా ఓ కారవ్యాన్‌ కొలుగోలు చేశాడట. తనకు కావాల్సిన సదుపాయాలు అన్ని ఉండేలా దాన్ని ఏర్పాటు చేయించుకున్నారట.

అందులో ఏసీ బెడ్‌, మేకప్‌ ప్లేస్‌, జిమ్‌, వెయిటింగ్‌ రూమ్‌, వాష్‌రూప్‌తో సహా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయట. ఈ వ్యాన్‌ని ఆయన ముంబై నుంచి తెప్పించారట. దీని కోసం నరేశ్‌ భారీగానే ఖర్చు చేశారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ క్యారెక్టర్‌ ఆర్టిస్టుకి ప్రత్యేకంగా కారవ్యాన్‌ లేదు. కొంతమంది సీనియర్‌ నటులకు అయితే నిర్మాతలే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారట. అయితే నరేశ్‌ మాత్రం సొంతంగా క్యారవాన్‌ కొలుగోలు చేయడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement