
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్‌తోపాటు.. జీవితరాజశేఖర్, హేమ కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ఫ్యానల్ సభ్యులను కూడా ప్రకటించారు. ఇండస్ట్రీలోని పెద్దలు తమకు నచ్చిన వారికి మద్దతు ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలో ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ తెరపైకి సరికొత్త ప్రతిపాదన తెచ్చారు. ‘మా’అధ్యక్ష పదవి మహిళకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళ ఏకగ్రీవానికి తన వంతు ప్రయత్నిస్తానని ‘సాక్షి’తో చెప్పారు. ‘మా’లో కులాలు, మతాలకు చోటు లేదని, లోకల్, నాన్ లోకల్ అనే అంశానికి చోటు లేదన్నారు. ఫోకస్‌గా పనిచేస్తూ, అందుబాటులో ఉన్నవారు అధ్యక్షుడిగా రావాలని నరేశ్ అన్నారు.
చదవండి:
నాగబాబు వ్యాఖ్యలు షాక్‌కి గురిచేశాయి: నరేశ్
Comments
Please login to add a commentAdd a comment