మంచి ఫీల్ ఉన్న చిత్రం | International recognition for 'Parampara' | Sakshi
Sakshi News home page

మంచి ఫీల్ ఉన్న చిత్రం

Published Sat, Nov 22 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

మంచి ఫీల్ ఉన్న చిత్రం

మంచి ఫీల్ ఉన్న చిత్రం

‘‘ఎన్నో అడ్డంకులు అధిగమించి మా ‘పరంపర ’ చిత్రాన్ని విడుదల చేశాం. మూడో వారంలోకి ప్రవేశించడం ఆనందంగా ఉంది. ఈ 28న వైజాగ్, విజయవాడ, రాజమండ్రిల్లో విడుదల చేయనున్నాం’’ అని దర్శక, నిర్మాత మధు మహంకాళి తెలిపారు. సీనియర్ నరేశ్, ఆమని, రావి కొండలరావు ముఖ్య తారలుగా స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘పరంపర’ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.

నరేశ్ మాట్లాడుతూ -‘‘జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రానికి ప్లాటినమ్ అవార్డ్ వచ్చింది. ఈ తరహా చిత్రాలు తీయడానికి నిర్మాతలకు ధైర్యం కావాలి. మంచి ఫీల్ ఉన్న చిత్రం’’ అన్నారు. ఒక మంచి చిత్రం నిర్మించామనే సంతృప్తి దక్కిందని నిర్మాతల్లో ఒకరైన రూపాదేవి అన్నారు. ఇలాంటి మంచి చిత్రాలకు  వినోదపు పన్ను మినహాయింపునివ్వాలని రావి కొండలరావు కోరారు. యువతరాన్ని మేలుకొలిపే చిత్రమిదని మనోవైజ్ఞానిక విశ్లేషకులు సి. నరసింహారావు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement