Pavitra Lokesh Vs Ramya Raghupathi: Naresh Third Wife Ramya Said That Will Not Divorce - Sakshi
Sakshi News home page

Naresh-Pavitra: వారిద్దరూ కలిసి ఎలా ఉంటారో చూస్తా.. నరేష్‌ మూడో భార్య రమ్య శపథం

Published Mon, Jul 4 2022 9:18 AM | Last Updated on Mon, Jul 4 2022 10:10 AM

Naresh Third Wife Ramya Said That Will Not Divorce - Sakshi

మైసూరు: తాను ఇంకా విడాకులు తీసుకోలేదని, అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్తతో కలిసి తిరుగుతోందని నరేష్‌ మూడో భార్య రమ్య మండిపడింది. భర్తకు విడాకులు ఇవ్వను, అందరి ముందు ఆయనను పెళ్లి చేసుకున్నాను, నా భర్త మరో మహిళతో కలిసి తిరగడం సరికాదు, వారికి పోలీసులు అండగా ఉండడం ఏమిటి అని ప్రశ్నించింది. వారిద్దరు కలిసి ఎలా ఉంటారో చూస్తానని శపథం చేసింది.
చదవండి: వేశ్య పాత్రలో యాంకర్‌ అనసూయ..!

కొన్నిరోజులుగా చర్చనీయాంశమైన సీనియర్‌ సినీ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్, నరేష్‌ మూడో భార్య రమ్య రఘుపతి మధ్య గొడవ పతాక స్థాయికి చేరింది. ఆదివారం మైసూరులో నరేష్, పవిత్ర ఓ హోటల్లో ఒకే గదిలో ఉండగా, రమ్య అక్కడకొచ్చి ఇద్దరితో గొడవకు దిగింది. హోటల్‌ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నా ఆమె శాంతించలేదు. నరేష్, పవిత్రలు శనివారం రాత్రి ఆ హోటల్లో దిగారు.

ఆదివారం ఉదయం రమ్య వారి గది వద్దకు వచ్చి డోర్‌ బెల్‌ నొక్కింది. కానీ, నరేష్‌ తలుపు తీయలేదు. రమ్య అక్కడే ఉండిపోయింది. హోటల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి రమ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె ససేమిరా అంది. పోలీసులు ఆమెను అడ్డుకుని పక్కకు తీసుకెళ్లగా నరేష్, పవిత్రలు తలుపు తీసుకుని బందోబస్తు మధ్య బయటకు వచ్చారు. రమ్య గట్టిగా అరుస్తూ చెప్పు తీసుకుని వారి మీద దాడి చేయడానికి యత్నించింది. ఇద్దరు పోలీసులపైనా ఆమె దాడికి దిగింది. నరేష్‌ పవిత్రను తీసుకుని అక్కడనుంచి వెళ్లిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement