![Ramya Raghupathi Sensational Comments On Her Husband Naresh - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/6/naresh-ramya.gif.webp?itok=xJ8L2cqM)
సినీ నటుడు నరేశ్ కొంతకాలంగా తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో నటి పవిత్రా లోకేశ్‌కు దగ్గరైన అతడు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది రమ్య. 'మా ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయని వార్తలు వస్తున్నాయి. అది పూర్తిగా అవాస్తవం. కోర్టులో కేసు ఇంకా నడుస్తోంది. తను విడాకులు తీసుకుని ఇంకొకరితో సెటిలైపోదామనుకుంటున్నాడు. కానీ మా బాబు మేమిద్దరం కలిసే ఉండాలని కోరుకుంటున్నాడు. వాడి కోసమైనా నేను విడాకులివ్వను. అతడికి పవిత్రతో పెళ్లి జరగనివ్వను.
నరేశ్ ఎన్నోసార్లు అమ్మాయిలతో అడ్డంగా దొరికిపోతే వచ్చి కాళ్లు పట్టుకుని సారీ చెప్పేవాడు, ఏడ్చేవాడు. నేను తల్లిలా క్షమించేదాన్ని. మొన్నటికి మొన్న నరేశ్- పవిత్ర లిప్‌లాక్ చూసి మీ నాన్న పెళ్లంటగా అని బాబును వాడి ఫ్రెండ్స్ ఆటపట్టిస్తున్నారట. పిల్లాడి మనసు గాయపడుతోంది. అతడి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నేను రాఖీ కట్టిన వ్యక్తితో, డ్రైవర్‌తో.. ఇలా చాలామందితో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు. నన్ను బద్నాం చేస్తున్నాడు. ఇన్ని నిందలు పడుతున్నా కూడా నేను బతికున్నానంటే అది నా కొడుకు కోసమే!
సమ్మోహనం సినిమా సమయంలో పవిత్ర ఓ సారి ఇంటికి వచ్చింది. పిచ్చిదానిలా నేను ఆమెకు వడ్డించి సరదాగా కలిసిపోయాను. 'మా' ఎలక్షన్స్ సమయంలో నాకు తనమీద కొంత అనుమానం మొదలైంది. అతడి బర్త్‌డే రోజు ఇష్టమైన కేక్ తీసుకొస్తే కట్ చేయకుండా వెళ్లిపోయాడు. తర్వాత పవిత్ర దగ్గరకు వెళ్లి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. నా కంట్లో నీళ్లు వస్తే ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనని నరేశ్‌ను హెచ్చరించింది అతడి తల్లి. కానీ ఎప్పుడైతే ఆమె మరణించిందో అతడికి హద్దు లేకుండా పోయింది' అని చెప్పుకొచ్చింది రమ్య.
Comments
Please login to add a commentAdd a comment