
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో మళ్లీ ఎన్నికల రగడ మొదలైంది. ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అసలు ఎన్నికలు జరకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్యానల్ ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా, ఉన్నదంతా ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. తాము ఫండ్ రైజ్ చేసి ఇస్తే.. నరేశ్ ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.
'మా' ఎన్నికలు జరపాలంటూ హేమ సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సారి మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో తనను సపోర్ట్ చేసిన వారందరి కోరిక మేరకే ఈ సారి అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగుతున్నానని హేమ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment