
సాక్షి, శ్రీ సత్యసాయి: సీనియర్ నటుడు నరేశ్ తుపాకీ లైసెన్స్ కావాలంటున్నాడు. ఈ మేరకు గురువారం నాడు పుట్టపర్తి ఎస్పీ మాధవరెడ్డిని కలిసి తనకు తుపాకీ లైసెన్స్ ఇవ్వాలని కోరాడు. స్వీయరక్షణ కోసమే అతడు తుపాకీ లైసెన్స్ కోసం అభ్యర్థించినట్లు తెలుస్తోంది.
కాగా నరేశ్ హీరోగా నటించిన మళ్లీ పెళ్లి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. పవిత్రా లోకేశ్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఎంఎస్ రాజు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా జూన్ 24న ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. కాగా ఈ సినిమాపై నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! తనను టార్గెట్ చేస్తూ పరువు తీసేందుకే మేకర్స్ సినిమాను నిర్మించారని మండిపడింది. సృజనాత్మక భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆ మధ్య కోర్టుకు వెళ్లింది. ఈ సినిమా వల్ల తన గౌరవం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment