ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'ఫెరారీ' (Ferrari) తమ బ్రాండ్ కార్లను క్రిప్టోకరెన్సీ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. యూరోపియన్ దేశాలలోని సంపన్న కస్టమర్ల అభ్యర్థమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెరారీ పేర్కొంది.
ఫెరారీ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ 'ఎన్రికో గల్లీరా' (Enrico Galliera) దీని గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో క్రిప్టోకరెన్సీ ద్వారా విక్రయాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ ద్వారా కార్లను కొనుగోలు చేస్తే ధరల్లో ఏమార్పు ఉండదని, ఎలాంటి అధిక ఫీజులు ఉండవని స్పష్టం చేశారు.
ఫెరారీ ఈ క్రిప్టోకరెన్సీ ద్వారా ఎన్ని కార్లను విక్రయించనుంది? నిర్దిష్ట సంఖ్య (లిమిట్) ఏమైనా ఉందా? అనేదానికి సంబంధించిన అధికారికి వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. క్రిప్టోకరెన్సీ చెల్లింపుల ద్వారా విక్రయాలు ప్రారంభమైతే యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్లలో విక్రయాలు భారీగా పేరే సూచనలు ఉన్నట్లు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు!
గతంలో బిట్‌కాయిన్ ద్వారా టెస్లా విక్రయాలు
2021లో టెస్లా కంపెనీ అధినేత 'ఎలాన్ మస్క్' (Elon Muck) బిట్‌కాయిన్ చెల్లింపుతో టెస్లా కార్లను కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతి తక్కువ కాలంలోనే ఈ విధానానికి ముగింపు పలికేసాడు. అయితే ఇప్పుడు ఫెరారీ ఈ విధానానికి సుముఖత వ్యక్తం చేసింది. ఇది సజావుగా ముందుకు సాగుతుందా? ఏదైనా సమస్యలను ఎదుర్కుంటుందా? అనే వివరాలు భవిష్యత్తులో తెలుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment