
దీపిందర్ గోయల్ (Deepinder Goyals) అనగానే అందరికి జొమాటో గుర్తొస్తుంది. భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అందరూ మెచ్చే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో జొమాటో ఒకటిగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో ఒక సాధారణ ఉపాధ్యాయ దంపతులకు జన్మించిన గోయల్ ఈ రోజు రూ. 2వేల కోట్లకంటే ఎక్కువ సంపాదించాడు. కోటీశ్వరుడైన దీపిందర్ గోయల్ ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫెరారీ రోమా
జొమాటో ప్రధాన కార్యాలయం సమీపంలోని రోడ్ల మీద తరచుగా దీపిందర్ గోయల్ తన ఫెరారీ రోమా కారులో కనిపిస్తూ ఉంటాడు. ఈ కారు రెడ్ కలర్‌లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చిత్రమేమంటే జొమాటో యాప్ కూడా ఇదే కలర్‌లో ఉండటం గమనార్హం. ఈ కారు ధర సుమారు రూ. 4.3 కోట్లు (ఆన్-రోడ్ ప్రైస్). ఫెరారీ రోమా 3.9 లీటర్ ట్విన్‌టర్బో వి8 ఇంజన్ కలిగి 690 బిహెచ్‌పి పవర్, 760 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
పోర్స్చే 911 టర్బో ఎస్
పోర్స్చే కంపెనీకి చెందిన 911 టర్బో ఎస్ కూడా దీపిందర్ గోయల్ ఉపయోగించే కార్లలో ఒకటి. దీని ధర రూ. 3.13 కోట్లు. ఈ కారు కేవలం 8.9 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని ఇంజిన్ 650 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
(ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ - ఈ ధరతో ఒక కారు కొనేయొచ్చు!)
లంబోర్ఘిని ఉరుస్
మన దేశంలో ఎక్కువ మంది సెలబ్రిటీల వద్ద ఉన్న లగ్జరీ కార్లలో లంబోర్ఘిని ఉరుస్ ఒకటి. ఈ కారుని దీపిందర్ గోయల్ కూడా కొనుగోలు చేశారు. దీని ధర రూ. 4.18 కోట్లు. ఇందులో 4.0-లీటర్, ట్విన్-టర్బో వి8 ఇంజిన్ ఉంటుంది. ఇది 650 hp పవర్, 850 Nm టార్క్ అందిస్తుంది. కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది.
పోర్స్చే కారెరా ఎస్
పోర్స్చే కంపెనీకి చెందిన కారెరా ఎస్ దీపిందర్ గోయల్ వద్ద ఉన్న సూపర్ కార్లలో ఒకటి. దీని ధర రూ. 1.88 కోట్లు. ఇందులోని 3.0 లీటర్ ప్లాట్ సిక్స్ సిలిండర్ బాక్సర్ పెట్రోల్ ఇంజిన్ 450 bhp పవర్, 530 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉండటమే కాకుండా పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది.
(ఇదీ చదవండి: అపర కుబేరులు జిమ్‌లో ఉంటే ఇలాగే ఉంటారా? ఫోటోలు చూడండి!)
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.