ఫెరారి నుంచి మరో సూపర్ కారు - లాంచ్ ఎప్పుడంటే? | Ferrari 812 successor Launch Next Year | Sakshi
Sakshi News home page

Ferrari: ఫెరారి నుంచి మరో సూపర్ కారు - లాంచ్ ఎప్పుడంటే?

Published Mon, Dec 18 2023 8:33 PM | Last Updated on Mon, Dec 18 2023 9:13 PM

Ferrari 812 successor Launch Next Year - Sakshi

భారతీయ మార్కెట్లో సూపర్ కార్ల వినియోగం పెరుగుతున్న తరుణంలో విదేశీ కంపెనీలు కూడా దేశీయ విఫణిలో కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఫెరారీ కంపెనీ వచ్చే ఏడాది ఓ కొత్త కారుని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'ఫెరారీ' వచ్చే సంవత్సరంలో సరికొత్త సూపర్‌ఫాస్ట్‌ కారు '812 సక్సెసర్' (Ferrari 812 Successor)ను విడుదల చేయనుంది. ఇప్పటికే అనేక మార్లు ఇటలీలో టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారు 2024లో ప్రారంభమవుతుంది.

ప్రారంభంలో ఫెరారీ రోమా మాదిరిగా కనిపించిన ఈ కారు ఇప్పుడు కొంత అప్డేట్ పొంది ఉండటం గమనించవచ్చు. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ కారులో వీ12 ఇంజిన్‌ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పర్ఫామెన్స్ గురించి కంపెనీ అధికారిక వివరాలను వెల్లడించలేదు. 

ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్‌ చరిత్రలో గూగుల్‌ శకం.. అనన్య సామాన్యం

ఫెరారీ 812 సక్సెసర్ కొత్త-లుక్ హెడ్‌లైట్ డిజైన్‌, క్వాడ్-ఎగ్జిట్ ఎగ్జాస్ట్‌లు పొందుతుంది. అండర్‌పిన్నింగ్‌లు దాదాపు రోమా, పురోసాంగ్యూ మాదిరిగా ఉంటుంది. ఫీచర్స్ కూడా దాని మునుపటి మోడల్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. 2025 నాటికి ఇది ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement