ఆటోమోబైల్ మార్కెట్‌లో పట్టు పెంచుకునేందుకు హ్యుందాయ్ ఇండియా దూకుడు పెంచింది. యూత్‌తో మరింతగా కనెక్ట్ అయ్యేందుకు వీలుగా సరికొత్త లైన్‌లో వెహికల్స్‌ని లాంఛ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ని హ్యుందాయ్ వెల్లడించింది.
ఎన్ సిరీస్
డైనమిజం, స్పోర్టీనెస్ థీమ్‌తో రెండేళ్ల కిందట అంతర్జాతీయ మార్కెట్‌లో ఎన్ లైన్ సిరీస్‌ను హ్యుందాయ్ ప్రవేశపెట్టింది, తాజాగా ఇప్పుడు ఇండియాకు ఎన్ లైన్ సిరీస్‌లో వెహికల్స్ తెస్తామంటూ ప్రకటించింది.
ఐ20 ఎన్
ప్రస్తుతం హ్యుందాయ్‌లో పాపులర్ మోడల్‌గా ఉన ఐ20లో సెగ్మెంట్‌లో తొలి ఎన్ లైన్‌ను తేనన్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి, ప్రస్తుతం ఉన్న ఐ 20 కారుకి డిజైన్, ఇంజన్‌లో స్పోర్టీనెస్, డైనమిజానికి తగ్గట్టుగా మార్పులు చేసి మార్కెట్‌లోకి తేనున్నారు.
ఈ ఏడాదిలోనే
ఇట్స్ టైమ్ టూ ప్లే అంటూ ఎన్ లైన్ సిరీస్‌కి సంబంధించిన ప్రోమోను హ్యుందాయ్ విడుదల చేసింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దసరా, దీపావళి పండగల సమయానికి ఎన్‌సిరీస్ కారు ఇండియా మార్కెట్‌లో అందుబాటులో ఉండవచ్చని అంచనా
మార్కెట్‌ను ఆకట్టుకునేలా
ఇండియన్ కార్ల మార్కెట్లో హ్యుందాయ్‌కి గణనీయమైన వాటా ఉన్నప్పటికీ మార్కెట్ లీడర్ కాలేకపోయింది. అయితే ఎన్ లైన్ సిరీస్‌తో మార్కెట్‌లో తన పట్టు పెంచుకునే ఉద్దేశంలో హ్యుందాయ్ ఉంది. దీంతో డైనమిజం, స్టోర్టీనెస్ వంటి ఫీచర్లు జోడించినా మార్కెట్‌ను ఆకట్టుకునే విధంగా రూ. 11 నుంచి 13 లక్షల మధ్య ధర ఉండవచ్చని అంచనా.
The globally popular #HyundaiNLine, is now coming to India. N Line range comes with motorsports inspired styling elements to compliment your aspirations. N Line is a statement of dynamism and sportiness. #ItsTimeToPlay!#NLineInIndia #ComingSoon
— Hyundai India (@HyundaiIndia) August 9, 2021
Comments
Please login to add a commentAdd a comment