India Specs & Features
-
Huyndai N Line: హ్యుందాయ్ నుంచి ఎన్ లైన్... కీలక అప్డేట్స్ ఇవే
ఆటోమోబైల్ మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు హ్యుందాయ్ ఇండియా దూకుడు పెంచింది. యూత్‌తో మరింతగా కనెక్ట్ అయ్యేందుకు వీలుగా సరికొత్త లైన్లో వెహికల్స్‌ని లాంఛ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన కీలక అప్డేట్ని హ్యుందాయ్ వెల్లడించింది. ఎన్ సిరీస్ డైనమిజం, స్పోర్టీనెస్ థీమ్‌తో రెండేళ్ల కిందట అంతర్జాతీయ మార్కెట్లో ఎన్ లైన్ సిరీస్‌ను హ్యుందాయ్ ప్రవేశపెట్టింది, తాజాగా ఇప్పుడు ఇండియాకు ఎన్ లైన్ సిరీస్‌లో వెహికల్స్ తెస్తామంటూ ప్రకటించింది. ఐ20 ఎన్ ప్రస్తుతం హ్యుందాయ్‌లో పాపులర్ మోడల్‌గా ఉన ఐ20లో సెగ్మెంట్లో తొలి ఎన్ లైన్‌ను తేనన్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి, ప్రస్తుతం ఉన్న ఐ 20 కారుకి డిజైన్, ఇంజన్లో స్పోర్టీనెస్, డైనమిజానికి తగ్గట్టుగా మార్పులు చేసి మార్కెట్లోకి తేనున్నారు. ఈ ఏడాదిలోనే ఇట్స్ టైమ్ టూ ప్లే అంటూ ఎన్ లైన్ సిరీస్‌కి సంబంధించిన ప్రోమోను హ్యుందాయ్ విడుదల చేసింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దసరా, దీపావళి పండగల సమయానికి ఎన్సిరీస్ కారు ఇండియా మార్కెట్లో అందుబాటులో ఉండవచ్చని అంచనా మార్కెట్‌ను ఆకట్టుకునేలా ఇండియన్ కార్ల మార్కెట్లో హ్యుందాయ్‌కి గణనీయమైన వాటా ఉన్నప్పటికీ మార్కెట్ లీడర్ కాలేకపోయింది. అయితే ఎన్ లైన్ సిరీస్‌తో మార్కెట్లో తన పట్టు పెంచుకునే ఉద్దేశంలో హ్యుందాయ్ ఉంది. దీంతో డైనమిజం, స్టోర్టీనెస్ వంటి ఫీచర్లు జోడించినా మార్కెట్‌ను ఆకట్టుకునే విధంగా రూ. 11 నుంచి 13 లక్షల మధ్య ధర ఉండవచ్చని అంచనా. The globally popular #HyundaiNLine, is now coming to India. N Line range comes with motorsports inspired styling elements to compliment your aspirations. N Line is a statement of dynamism and sportiness. #ItsTimeToPlay!#NLineInIndia #ComingSoon — Hyundai India (@HyundaiIndia) August 9, 2021 -
షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్ స్పెషల్ ఏంటి?
న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షావోమి మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. షావోమి ఎంఐ మాక్స్ 2ను మంగళవారం ఢిల్లీలో నిర్ వహించిన లాంచింగ్ కార్యక్రమంలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఫ్లాగ్ షిప్ డివైస్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ, వరుస ఆవిష్కరణలు, వరుస రికార్డు అమ్మకాలతో దూసుకుపోతున్న షావోమి బిగ్ ఈజ్ బ్యాక్ అంటూ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఎంఐ మాక్స్‌కి కొనసాగింపుగా బిగ్ డిస్ప్లే, బిగ్గర్ బ్యాటరీ అంటూ ఈ తాజా షావోమి ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలోచైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ ఇండియాలో మాత్రం ఒక వేరియంట్‌నే లాంచ్ చేసింది. 4జీబీ, 16జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.16999, ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది. మెటల్‌బాడీ, రౌండెడ్ ఎడ్జ్స్తో స్పెషల్‌గా డిజైన్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఒకే స్క్రీన్ లో రెండు యాప్‌లను ఒకేసారి వీక్షించే సదుపాయం స్ప్లిట్ స్క్రీన్‌తో సాధ్యం కానుంది. ఎంఐ మూడవ వార్షికోత్సవం సందర్బంగా జూలై 20 నుంచి ఈ డివైస్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీంతోపాటు ఒక సర్ ప్రైజ్ ఆఫర్ కూడా ఉంది. ఎంఐ మ్యాక్స్ 2 కొనుగోలు చేసిన కస్టమర్లకు జియో 100 జీబీ 4 జీ డాటా ఉచితం. అలాగే జులై 27నుంచి ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్ లోనూ ఒకేసారి విక్రయాలు ప్రారంభించనుంది. షావోమి ఎంఐ మ్యాక్స్ 2 ఫీచర్లు 6.44 అంగుళాల ఫుల్ హెచ్-డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్: 7.1.1 నోగట్ 2 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5300 ఎంఏహెచ్