షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ స్పెషల్‌ ఏంటి? | Xiaomi Mi Max 2 Launched in India|Price, Specs & Features | Sakshi
Sakshi News home page

షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ స్పెషల్‌ ఏంటి?

Published Tue, Jul 18 2017 12:50 PM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

Xiaomi Mi Max 2 Launched in India|Price, Specs & Features



న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ మేకర్‌  షావోమి  మరో స్మార్ట్‌ఫోన్‌ను  లాంచ్‌ చేసింది.  షావోమి ఎంఐ మాక్స్ 2ను  మంగళవారం ఢిల్లీలో  నిర్ వహించిన లాంచింగ్‌  కార్యక్రమంలో  భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.  ఫ్లాగ్‌ షిప్‌  డివైస్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ, వరుస ఆవిష్కరణలు,  వరుస  రికార్డు అమ్మకాలతో  దూసుకుపోతున్న షావోమి బిగ్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ మరోసారి తన  ప్రత్యేకతను చాటుకుంది.  ఎంఐ మాక్స్‌కి కొనసాగింపుగా  బిగ్‌ డిస్‌ప్లే, బిగ్గర్‌ బ్యాటరీ అంటూ ఈ తాజా  షావోమి ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది.

64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలోచైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ ఇండియాలో మాత్రం ఒక  వేరియంట్‌నే లాంచ్‌ చేసింది.  4జీబీ, 16జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ.16999, ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది. మెటల్‌బాడీ, రౌండెడ్‌ ఎడ్జ్స్‌తో స్పెషల్‌గా డిజైన్‌ చేసిన  ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్ప్లిట్‌ స్క్రీన్‌ ఫీచర్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.  ఒకే స్క్రీన్‌ లో రెండు యాప్‌లను ఒకేసారి వీక్షించే సదుపాయం స్ప్లిట్‌ స్క్రీన్‌తో సాధ్యం  కానుంది.  ఎంఐ  మూడవ వార్షికోత్సవం సందర్బంగా జూలై 20 నుంచి  ఈ డివైస్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ  ప్రకటించింది. దీంతోపాటు ఒక సర్‌ ప్రైజ్‌ ఆఫర్‌  కూడా ఉంది. ఎంఐ మ్యాక్స్ 2 కొనుగోలు చేసిన  కస్టమర్లకు జియో 100 జీబీ 4 జీ డాటా  ఉచితం.  అలాగే  జులై 27నుంచి ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌ లోనూ ఒకేసారి  విక్రయాలు ప్రారంభించనుంది.
 
షావోమి ఎంఐ మ్యాక్స్ 2 ఫీచర్లు
6.44 అంగుళాల ఫుల్ హెచ్-డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే
1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్: 7.1.1 నోగట్
2 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్
4జీబీ ర్యామ్‌
64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
12 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
5300 ఎంఏహెచ్
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement