వచ్చేనెలలో ముంబైలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీనిలో ముంబైలోని మొదటి భూగర్భ మెట్రో త్రీ ప్రాజెక్ట్ ఒకటి. ఇది ఆక్వా లైన్‌లోని మొదటి దశ. ఆరే కాలనీ, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మధ్య నడుస్తున్న 12 కిలోమీటర్ల మార్గానికి ఇది విస్తరణకానుంది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం థానే క్రీక్ వంతెనలోని ఒక భాగం, ముంబై నుండి నాగ్‌పూర్‌కు అనుసంధానించే సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే చివరి దశ ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. థానే రింగ్ మెట్రోకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ముంబై మెట్రో కొత్త విస్తరణలో మొత్తం 10 స్టేషన్లు ఉండనున్నాయి. ఈ కారిడార్ పొడవు 33.5 కి.మీ. ఈ లైన్ పూర్తి కావడానికి 2025 మార్చి వరకూ సమయం పట్టనుంది.
ఈ మార్గంలో మెట్రో అందుబాటులోకి వచ్చాక దాదాపు 2,500 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని అంచనా. దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకునేందుకు ఈ మెట్రో ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ ఆక్వా లైన్ దక్షిణ ముంబై, మధ్య పశ్చిమ ప్రాంతాలను కలుపుతుంది. ఈ మార్గంలో నారిమన్ పాయింట్, ముంబై సెంట్రల్, వర్లీ, దాదర్ నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా చేరుకోవచ్చు.
ఇది కూడా చదవండి: త్వరలో తొలి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే
Comments
Please login to add a commentAdd a comment