Underground Metro
-
ఒక అపరిచితుడి దయ
ఒక మనిషి సాటి మనిషికి సాయానికి రాడని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ముక్కూ ముఖం తెలియని మనుషులు చేయందిస్తారు. అడక్కుండానే మనల్ని సమస్య నుంచి గట్టెక్కిస్తారు. అది ఎంత చిన్నదైనా సరే, ఆ సమయానికి పెద్ద సాయమే అవుతుంది. అయితే, అలాంటి మనుషులను మనం ఎంత నమ్ముతాం? చాలాసార్లు మనుషుల రూపాలను చూసి వాళ్ల గుణాలను అంచనా వేస్తుంటాం. కానీ మనుషులను చూపులతో అంచనా వేయలేం. అలాంటి సందర్భాలు మనకు చాలాసార్లు ఎదురవుతూనే ఉంటాయి. ఎవరో అపరిచితులు అనూహ్యంగా ఇతరులకు సాయపడటం, ఆ తరువాత మన జీవితాల్లోంచి వారు మాయమైపోవడం... ఓహ్! మరచిపోలేం. చేదు అనుభవాలు ఎదురైనా అవి గుర్తుంచుకోవాల్సినవి కావు.అధికారికంగా దాని పేరు ‘లండన్ అండర్‌గ్రౌండ్’. కానీ అందరూ పిలిచేది ‘ట్యూబ్’ అని! అది నిజంగానే గొట్టం ఆకారంలోనే ఉంటుంది మరి! కానీ, సొరంగం నుంచి రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వస్తూండటాన్ని చూసినప్పుడు మాత్రం దాన్ని టూత్‌పేస్ట్‌తో పోల్చడం మేలని నాకు అనిపిస్తుంది. పదహారేళ్ల వయసులో మొట్టమొదటిసారి ట్యూబ్‌ను చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన కూడా ఇదే. విక్టోరియా స్టేషన్లో ఉన్నాను అప్పుడు నేను. అప్పుడే ఎయిర్పోర్ట్ వాహనం నుంచి కిందకు దిగాను. రెండు చేతుల్లో భారీ ట్రంకు పెట్టెలు. మీరు నమ్మినా నమ్మకపోయినా... ఆరోజు ఎయిరిండియా విమానం రెండు గంటలు ముందుగానే ల్యాండ్ అయ్యింది. నేను ఉండటానికి వెళ్తున్న నా సోదరి కిరణ్ కూడా దానికి ఆశ్చర్యపోయింది.తమ్ముడు సెలవుల కోసం అనుకోకుండా ప్రత్యక్షమవుతున్నాడన్న ఆనందం, షాక్ నుంచి కోలుకుంటూ ‘‘హీత్రూ నుంచి బస్సు పట్టుకో... బాండ్ స్ట్రీట్‌లో ట్యూబ్’’ అంటూ కిరణ్ తన ఇంటికి దారి చెప్పింది. ‘‘నేను ఆ పక్కన ఉంటా’’ అని ముగించింది.బాండ్ స్ట్రీట్ స్టేషన్ కిరణ్ ఆఫీసుకు దగ్గరలోనే ఉంటుంది. నాకైతే అప్పటికి లండన్ కొత్త. ఒకపక్క ఉత్సాహంగా ఉంది. ఇంకోపక్క కొంచెం ఉద్వేగంగానూ అనిపిస్తోంది. బాండ్ స్ట్రీట్ అన్నది మోనోపలి గేమ్‌లో కనిపించే పేరు. అక్కడున్న జనాలను చూస్తే మాత్రం అమ్మో ఇంతమందా? అనిపించక తప్పదు. అందరూ ఎవరి హడావుడిలో వారున్నారు. చాలామంది వ్యాపారాలు చేసుకునేవాళ్లనుకుంటా. ఒకరిద్దరు మాత్రం అక్కడక్కడా తచ్చాడుతూ కనిపించారు. బెల్‌బాటమ్ ప్యాంట్లు, పొడుచుకువచ్చినట్లు ఉన్న జుత్తుతో ఉన్న వాళ్లకు బూడిద రంగు ఫ్లానెల్స్, సరిగ్గా అమరని స్కూల్ బ్లేజర్‌తో ఉన్న నేను పరాయివాడినన్న విషయం ఇట్టే తెలిసిపోయేలానే ఉంది. వాతావరణం ఇలా ఉన్న సందర్భంలోనే... సొరంగం నుంచి ట్యూబ్ బయటకొస్తూ కనిపించింది. సొరంగంలో ఉండగానే వచ్చిన రణగొణ ధ్వని ట్యూబ్ వస్తున్న విషయాన్ని అందరికీ ఎలుగెత్తి చెప్పింది. శబ్దం వింటూనే చాలామంది ట్యూబ్ రాకను గుర్తించారు. సామన్లు సర్దుకుంటూ రైలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. నాకైతే అంతా కొత్త. పరిసరాలతో పరిచయమూ తక్కువే. ఏం చేయాలో తెలియకుండా అలా... చూస్తూనే ఉండిపోయా కొంత సమయం!ఎవరో గట్టిగా అరిచారు. ‘‘మిత్రమా... రా’’ అని! అప్పటికే రైలు తలుపులు తెరుచుకుని ఉన్నాయి. జనాలు లోపలికి చొరబడుతున్నారు. నేను మాత్రం నా రెండు ట్రంకు పెట్టెలతో ముందుకెళ్లేందుకు తంటాలు పడుతున్నాను. రెండింటినీ ఒక్కో చేత్తో పట్టుకున్నానా... హ్యాండ్‌బ్యాగ్ పట్టుకునేందుకు ఇంకో చేయి లేకుండా పోయింది. సర్దుదామనుకుంటే పెట్టెలు ఎత్తలేనంత బరువైపోతున్నాయి. ఈ లోపు పక్క నుంచి ఏదో గొంతు వినిపించింది... ‘‘ఒంటిచేత్తోనే చేయగలవు.’’ అంటూ. ‘‘రెండు, మూడు కావాలేమో’’ అని కూడా అనేసిందా గొంతు! యాభై ఏళ్లు పైబడ్డ వ్యక్తి మాటలు కావచ్చు అవి. చిందరవందర బట్టలేసుకుని ఉన్నాడు. తలపై టోపీ ఒకటి. గడ్డం కూడా సరిగ్గా గీసుకోలేదు. బహుశా కంపు కూడా కొడుతున్నాడేమో. మామాలుగానైతే ఆ వ్యక్తితో మాట్లాడేవాడిని కాదేమో. భవిష్యత్తులోనైతే అలాంటి వాళ్లకు దూరంగా జరిగిపోయేవాడినేమో. దిమ్మరి అనుకుని వారిని దూరం నుంచే కొనచూపుతో చూస్తూ ఉండేవాడిని. ఎందుకంటే అలాంటివాళ్లపై నాకున్న అయిష్టం ఇట్టే తెలిసిపోతుంది మరి. అయితే ఆ రోజు నేను ట్యూబ్ ఎక్కేనాటి పరిస్థితి వేరు. కుర్రాడిని. సాయం అవసరం ఉంది. పొగరు ఇంకా తలకెక్కి లేదు. మరీ ముఖ్యంగా... ఆ మనిషి నా ట్రంకు పెట్టెలతోపాటు హ్యాండ్ లగేజీ కూడా లాక్కున్నాడు. ట్యూబ్‌లోకి చేర్చాడు. ఆ వెంటనే రైలు తలుపులు మూసుకున్నాయి. ఆ వ్యక్తి నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నోట్లో కొన్ని పండ్లు ఊడిపోయి ఉంటే... ఉన్నవి కూడా గారమరకలతో కనిపించాయి. ‘‘హమ్మయ్యా... ఎక్కేశాం’’ అన్నాడా వ్యక్తి! సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు నాకు. ఓ నీరసపు నవ్వు నవ్వి ఊరుకున్నాను. ‘‘చిటికెలో రైలు తప్పిపోయేది తెలుసా?’’ అన్నాడు. నాకేమో కొత్తవాళ్లతో మాట్లాడటమంటే భయం. అతడేమో ఒకట్రెండు మాటలతో సరిపెట్టేలా లేడు. మొత్తమ్మీద ఇద్దరి మధ్య కాసేపు మౌనమే రాజ్యమేలింది. రెండు స్టేషన్లు దాటిన తరువాత ఆ వ్యక్తి నా వైపు చూసి, ‘‘ఎక్కడికి మిత్రమా?’’ అన్నాడు. తలూపుతూ నా సమాధానం విన్నాడు. కిటికీల్లోంచి బయటకు చూడటం మొదలుపెట్టాడు. సొరంగం నల్లటి గోడలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు బయట! ఆ వ్యక్తి ఆ నల్లగోడలనే కళ్లప్పగించి మరీ చూస్తూ ఉండిపోయాడు.ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందా? అని నేను ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. లగేజీ ఎలా దింపుకోవాలన్న ఆలోచన మెదడును తొలిచేస్తోంది. ఇంతలో బాండ్స్ట్రీట్ రానేవచ్చింది. పెట్టెలు సర్దుకుందామని అనుకునే లోపే ఆ వ్యక్తి వాటిని తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. ‘‘చిన్న లగేజీలు నువ్వు తీసుకో’’ అన్నాడు. ‘‘నీ సైజుకు తగ్గవి’’ అని చతుర్లాడాడు కూడా. ప్లాట్‌ఫామ్ చివరి వరకూ నాకు తోడుగా వచ్చాడు. ‘‘వచ్చేశాం’’ అన్నాడు. ‘‘గుడ్ లక్’’ చెప్పాడు. వచ్చినంత వేగంగా వెనక్కు వెళ్లిపోయాడు. మేమొచ్చిన వైపే వెళ్లాల్సిన ట్యూబ్ కోసం వేచి చూడటం మొదలుపెట్టాడు.ఈ సంఘటన తరువాత నేను ఆ వ్యక్తిని ఎప్పుడూ కలవలేదు. అతడు చేసిన సాయానికి థ్యాంక్స్ అయినా సరిగ్గా చెప్పానో లేదో గుర్తు లేదు. కానీ లండన్ అండర్‌గ్రౌండ్‌లో నాకు ఎదురైనా మధురమైన అనుభూతుల్లో ఇదీ ఒకటిగా నిలిచిపోయింది. ఎవరో అపరిచితులు అనూహ్యంగా ఇలా ఇతరులకు సాయపడటం ఆ తరువాత మన జీవితాల్లోంచి వారు మాయమైపోవడం... ఓహ్! మరచిపోలేం. చేదు అనుభవాలూ ఎదురవుతూంటాయి కానీ, వాటిని నేను గుర్తుంచుకోను. ఢిల్లీలోనూ మెట్రో భూగర్భ మార్గం పడుతున్న నేపథ్యంలో మనకూ ఇలాంటి అనుభవాలు బోలెడన్ని ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు చూసిన వెంటనే మనకు కలిగే ఇంప్రెషన్ తప్పు కావచ్చు అని చెప్పేందుకు ఉపయోగపడుతూంటాయి. చూపులతోనే మనిషిని అంచనా వేయలేమని చెబుతూంటాయి!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
12 కి.మీ. అండర్‌గ్రౌండ్ జర్నీ!
వచ్చేనెలలో ముంబైలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీనిలో ముంబైలోని మొదటి భూగర్భ మెట్రో త్రీ ప్రాజెక్ట్ ఒకటి. ఇది ఆక్వా లైన్‌లోని మొదటి దశ. ఆరే కాలనీ, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మధ్య నడుస్తున్న 12 కిలోమీటర్ల మార్గానికి ఇది విస్తరణకానుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం థానే క్రీక్ వంతెనలోని ఒక భాగం, ముంబై నుండి నాగ్‌పూర్‌కు అనుసంధానించే సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే చివరి దశ ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. థానే రింగ్ మెట్రోకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ముంబై మెట్రో కొత్త విస్తరణలో మొత్తం 10 స్టేషన్లు ఉండనున్నాయి. ఈ కారిడార్ పొడవు 33.5 కి.మీ. ఈ లైన్ పూర్తి కావడానికి 2025 మార్చి వరకూ సమయం పట్టనుంది.ఈ మార్గంలో మెట్రో అందుబాటులోకి వచ్చాక దాదాపు 2,500 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని అంచనా. దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకునేందుకు ఈ మెట్రో ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ ఆక్వా లైన్ దక్షిణ ముంబై, మధ్య పశ్చిమ ప్రాంతాలను కలుపుతుంది. ఈ మార్గంలో నారిమన్ పాయింట్, ముంబై సెంట్రల్, వర్లీ, దాదర్ నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి: త్వరలో తొలి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే -
దేశంలో మొదటి భూగర్భ మెట్రో.. వచ్చే నెల నుంచే..
ఎంతగానో ఎదురు చూస్తున్న దేశంలో మొట్టమొదటి అండర్‌గ్రౌండ్ మెట్రో లైన్ ముంబైలో వచ్చే నెలలో ప్రారంభం కానుంది. పూర్తి భూగర్భ కారిడార్ అయిన కొలాబా-బాంద్రా-ఎస్ఈఈపీజెడ్ మెట్రో లైన్ 3 ప్రారంభంతో ముంబై వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.ముంబై నగరంలోని ఆరే కాలనీని ప్రధాన వ్యాపార జిల్లా అయిన బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బికెసి) తో కలిపే మెట్రో లైన్ ఫేజ్ 1ను జులైలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరే కాలనీ నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వరకు సుమారు 9.63 కిలోమీటర్ల దూరాన్ని ఫేజ్ 1 కవర్ చేస్తుంది.మెట్రో లైన్ 3 నిర్మాణం మొత్తం పూర్తయితే 33.5 కిలోమీటర్ల మేర 27 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. మెట్రోలో ప్రతిరోజూ 260 సర్వీసులు నడుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు వీటిని నడిపేలా నిర్ణయించారు.ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎంఎంఆర్‌సీ) రూ.37,000 కోట్లకు పైగా వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టింది. కొలాబా-బాంద్రా-ఎస్ఈఈపీజెడ్ మెట్రో లైన్ 3 ఆపరేషన్, నిర్వహణ కాంట్రాక్టును ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఎంఎంఆర్‌సీ ఇచ్చింది. అంతర్జాతీయ కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రక్రియ అనంతరం 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఎంఎంఆర్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది.#MMRC has successfully completed Research Designs and Standards Organisation #RDSO trials of Rolling Stock for #MetroLine3. Testing of other electrical systems and integrated testing of Rolling Stock with signaling is in progress. After completion of testing, the Commissioner of… pic.twitter.com/GnH51CfQIU— MumbaiMetro3 (@MumbaiMetro3) June 24, 2024 -
గ్రేటర్ హైదరాబాద్‌లో భూగర్భ మెట్రో కథ కంచికేనా..?
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరం లండన్.. మన దేశంలోని కోల్‌కతా తరహాలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనూ భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని మూడేళ్లక్రితం నిర్ణయించిన నేపథ్యంలో రాయదుర్గం–శంషాబాద్ రూట్లో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ ఏర్పాటు ప్రణాళిక సిద్ధం చేసిన విషయం విదితమే. ఇదీ అండర్‌గ్రౌండ్ మెట్రో ప్లాన్.. రాయదుర్గం–శంషాబాద్ మార్గంలో 31 కి.మీ. మార్గంలో ఏర్పాటు చేయాల్సిన రూట్లో కేవలం 3 కి.మీ. మార్గంలో... శంషాబాద్ టౌన్ సమీపం నుంచి విమానాశ్రయం టెర్మినల్ వరకు భూగర్భ మెట్రో ఏర్పాటుచేయాలని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ గతంలో సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలో సూచించింది. విమానాల ల్యాండింగ్.. టేకాఫ్‌కు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే భూగర్భ మెట్రోను ప్రతిపాదించడం విశేషం. కాగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రో మార్గం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించి మూడేళ్లు గడిచినా అడుగు ముందుకుపడడంలేదు. ఈ రూట్లో మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన రూ.4500 కోట్లను ప్రభుత్వం సొంతంగా వ్యయం చేస్తుందా..? మొదటి దశ తరహాలో పబ్లిక్ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తుందా అన్న అంశంపై సస్పెన్స్ వీడడం లేదు. (మీకు తెలుసా: కర్ర ముక్కలే.. కార్లను నడిపించేవి..) ఎయిర్పోర్ట్ మెట్రో ఏర్పాటుతో ఉపయోగాలివే.. ► రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ వి మానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతుంది. ► కానీ మెట్రోరైళ్లలో కేవలం 25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌ను డిజైన్ చేశారు. ► ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసింది. సుమారు రూ.4500 కోట్ల అంచనావ్యయంతో చేపట్టనున్న ఈ మెట్రోకారిడార్ ఏర్పాటుతో గ్రేటర్ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే సిటీజన్లకు అవస్థలుండవు. ► ఈరూట్లో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ► స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ► మెట్రో స్టేషన్లను ఔటర్‌రింగ్‌రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పాజంక్షన్, కిస్మత్పూర్, గండిగూడా చౌరస్తా, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. స్థలపరిశీలన కూడా పూర్తైంది. (క్లిక్: అయోమయంలో ఆర్టీసీ.. చేతులెత్తేసిన జీహెచ్ఎంసీ!) -
ఎయిర్ పోర్ట్‌కు 25 నిమిషాల్లో జర్నీ..
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటివరకు నగరవాసుల కోసం ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాయి. ఇక కోల్‌కతా తరహా భూగర్భ మెట్రోను సైతం ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాయదుర్గం–శంషాబాద్ రూట్లో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో భూగర్భ మెట్రో అంశం తెరమీదకొచ్చింది. మొత్తం 31 కి.మీ. మార్గంలో ఏర్పాటు చేయనున్న ఈ రూట్లో 3 కి.మీ. మార్గంలో(శంషాబాద్ టౌన్ సమీపం నుంచి విమానాశ్రయం టెర్మినల్ వరకు) భూగర్భ మెట్రో ఏర్పాటు చేయాలని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలో సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విమానాల ల్యాండింగ్.. టేకాఫ్‌కు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే భూగర్భ మెట్రోను ప్రతిపాదించినట్లు సమాచారం. కాగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రో మార్గం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ రూట్లో మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన రూ.4,500 కోట్లను ప్రభుత్వం సొంతంగా వ్యయం చేస్తుందా.. లేదా పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతోనా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎయిర్ పోర్ట్‌కు 25 నిమిషాల్లో జర్నీ.. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాలు పడుతుంది. కానీ మెట్రో రైళ్లలో 25 నిమిషాల్లోనే చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌ను డిజైన్ చేశారు. ఈ మెట్రో కారిడార్ ఏర్పాటుతో గ్రేటర్ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే సిటిజన్లకు అవస్థలు తప్పనున్నాయి. ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న మెట్రో కారిడార్లతో విమానాశ్రయానికి కనెక్టివిటీ లేదు. దీంతో తక్షణం విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైన విషయం విదితమే. ప్రతి ఐదు కిలోమీటర్లకో స్టేషన్.. విమానాశ్రయ మార్గంలో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్ల ఏర్పాటుకు ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పా జంక్షన్, కిస్మత్పూర్, గండిగూడ చౌరస్తా, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో స్థలపరిశీలన జరుపుతున్నారు. పిల్లర్ల ఏర్పాటుకు వీలుగా సాయిల్ టెస్ట్ చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. పీపీపీ విధానంలో ముందుకొచ్చేనా... ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో మొదటిదశ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టారు. మూడు మార్గాల్లో 72 కి.మీ ప్రాజెక్టు పూర్తికి సుమారు రూ.14 వేల కోట్ల అంచనా వ్యయం అవుతుందని తొలుత అంచనా వేశారు. కానీ ఆస్తుల సేకరణ ఆలస్యం కావడం, అలైన్మెంట్ చిక్కులు, రైట్‌ఆఫ్‌వే సమస్యల కారణంగా మెట్రో అంచనా వ్యయం సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా పెరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండో దశ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందా అన్నది సస్పెన్స్‌గా మారింది. కాగా రాయదుర్గం–శంషాబాద్ ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ ఏర్పాటుకు స్పెషల్ పర్పస్ వెహికిల్ (ప్రత్యేక యంత్రాంగం)ను ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం విదితమే. -
ఆ మెట్రో యమ డేంజర్..
వాషింగ్టన్: అండర్‌గ్రౌండ్ మెట్రో రైళ్లలో ప్రయాణించడం పెను ప్రమాదమని ఓ అథ్యయనం బాంబు పేల్చింది. ఈ తరహా రైళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలకు ప్రయాణీకులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అమెరికాలో చేపట్టిన ఓ అథ్యయనం హెచ్చరించింది. వాయు కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా 2015లో 65 లక్షల మంది మృత్యువాత పడటాన్ని ఈ సర్వే ప్రస్తావిస్తూ వాయు కాలుష్యంలో పర్టిక్యులేట్ మ్యాటర్ పెను ప్రమాదకరంగా పరిణమించిందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అండర్‌గ్రౌండ్ మెట్రోల కారణంగా పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, హెక్సావలెంట్ క్రోమియంలు గాలిలో కలుస్తున్నాయని ఇవి పీల్చడం ద్వారా క్యాన్సర్ సహా శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అండర్‌గ్రౌండ్ ట్రైన్లలో వెంటిలేషన్ ఇబ్బందులతో పాటు స్టీల్ ట్రాక్‌లు ఒత్తిడికి గురికావడంతో చెలరేగే రేణువులు, డస్ట్ బారిన ప్రయాణీకులు పడే ప్రమాదం ఉందని ఈ సర్వే పేర్కొంది. ఆయా మెట్రో స్టేషన్లలో కాలుష్య కారకాలను పరిశీలించి, పరీక్షించిన యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకులు ఈ అంశాలు వెల్లడించారు. -
10 రోజులు.. రూ.4 కోట్లు
బెంగళూరు : భూగర్భ మెట్రోకు ఆదరణ భారీగా పెరుగుతోంది. దీంతో ఈస్ట్-వెస్ట్ కారిడార్ మార్గంలో గతంతో పోలిస్తే నమ్మ మెట్రోకు ప్రయాణికుల సంఖ్య పెరగడమే కాకుండా ఆదాయమూ గణనీయంగా పెరుగుతోంది. మొత్తం 17 స్టేషన్లు కలిగిన బయ్యపనహళ్లి (ఈస్ట్)-నాయండ హళ్లి (వెస్ట్) మార్గంలో గత నెల 30 నుంచి భూగర్భంలోని ఐదు స్టేషన్ల గుండా నమ్మమెట్రో ప్రయాణం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచి సోమవారం వరకూ రోజుకు సగటున 90 వేల మంది చొప్పున తొమ్మిది లక్షల మంది ప్రయాణికులు నమ్మ మెట్రోలో ప్రయాణం చేశారు. దక్షిణ భారత దేశంలోనే భూగర్భ మెట్రో ప్రయాణం అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి. దీంతో భూగర్భంలో రైలు ప్రయాణాన్ని ఆస్వాదించడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో వారాంతాల్లో మెట్రో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే రోజువారి ప్రయాణికులు కూడా బస్సు, ఆటోలు క్యాబ్‌లను వ దిలి మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. 18.10 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు నలభై నిమిషాల్లోపే రూ.40 ఖర్చుతో చేరుకోవచ్చు. మరోవైపు ఈ ఈస్ట్వెస్ట్కారిడార్ మార్గంలో అనేక ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు నగర కేంద్రబిందువైన మెజెస్టిక్ కూడా అందుబాటులోకి వస్తుంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా ఈ మెట్రోలో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో గతంలో పోలిస్తే భూగర్భ మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో ఈస్ట్ వెస్ట్ కారిడార్‌లో ప్రయాణం చేసే వారి సంఖ్య రోజుకు 30 శాతం పెరిగినట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) అధికారులు చెబుతున్నారు. మొత్తంగా మెట్రోలో సగటున రోజుకు 96 వేల మంది ప్రయాణం చేస్తుండటంతో నమ్మ మెట్రో సంస్థకు ప్రతి రోజూ దాదాపు రూ.40 లక్షల ఆదాయం వస్తోంది. ఇదిలా ఉండగా ఈస్ట్వెస్ట్కారిడార్లో ప్రస్తుతం 15 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రైలు 10 నిమిషాలకొకసారి అందుబాటులోకి వస్తోంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటం వల్ల రైళ్ల సంఖ్యను పెంచి తద్వారా ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చే సమయాన్ని ఆరు నిమిషాలకు తగ్గించాలని తాము ఆలోచిస్తున్నట్లు బీఎంఆర్సీఎల్ అధికారిక ప్రతినిధి యూ.ఏ వసంతరావ్ తెలిపారు. ఈ విషయమై తమ సాంకేతిక సిబ్బందితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బీఎంటీసీ...‘మెట్రో’కు ఒకటే కార్డు... భూగర్భ మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్‌కార్డులు కొనేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. బీఎంఆర్సీఎల్ రోజుకు కనిష్టంగా 2,300 స్మార్ట్‌కార్డులను గత పది రోజులుగా అమ్ముతోంది. గతంలో ఈ సంఖ్య 800లుగా ఉండేది. మొత్తంగా నమ్మ మెట్రో సర్వీసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇప్పటి వరకూ 1.75 లక్షల స్మార్ట్‌కార్డులు అమ్ముడుపోయాయి. ఇదిలా ఉండగా ఫీడర్ సర్వీసుల ద్వారా మెట్రో స్టేషన్లకు బీఎంటీసీ బస్సులో వచ్చి అటు పై మెట్రోలో ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో అటు బీఎంటీసీతో పాటు మెట్రోలో కూడా చెల్లుబాటు అయ్యేలా ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (ఈటీఎస్) విధానంలో రూపొందించిన స్మార్ట్‌కార్డులను ప్రవేశ పెట్టనున్నారు. బయ్యపనహళ్లి నుంచి ఎం.జీ రోడ్డుకు మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైన సమయంలో ఇలాంటి కార్డులను ప్రవేశపెట్టినా ప్రయాణికుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఈటీఎస్ స్మార్ట్ కార్డులను రద్దు చేసి కేవలం మెట్రోలో మాత్రమే చెల్లుబాటు అయ్యే స్మార్ట్‌కార్డులను అనుమతిస్తూ వచ్చారు. అయితే ప్రయాణికుల నుంచి వినతులు అందడంతో తిరిగి ఈటీఎస్ స్మార్ట్ కార్డులను ప్రవేశ పెట్టాలని బీఎంఆర్సీఎల్, బీఎంటీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని నాలుగువేల బస్సుల్లో ఎలక్ట్రానిక్ టికెట్ మిషన్ (ఈటీఎం)లు ఉండటంతో సదరు స్మార్ట్ కార్డు మెట్రోలో కాకుండా కేవలం బీఎంటీసీ బస్సు ప్రయాణికులకు కూడా ఉపయోగపడుతుందనేది అధికారుల ఆలోచన. ఈమేరకు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ ఆధ్వర్యంలో త్వరలో జరిగే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని బీఎంటీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తేదీ ఆదాయం ఏప్రిల్30 93,526 మే 1 1,23,789 మే 2 96,159 మే 3 94,680 మే 4 93,882 మే 5 93,608 మే 6 95,526 మే 7 1,09,00 మే 8 1,04,908 మే 9 90,000 -
అలైన్మెంట్ మార్పు లేనట్టే!
* మెట్రో సమీక్షలో సీఎంకు స్పష్టం చేసిన ఎల్అండ్టీ * ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే పనులు * రెండో దశపై చిగురిస్తున్న నగరవాసుల ఆశలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్, మొజంజాహీ మార్కెట్, అసెంబ్లీ వంటి చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మార్గంలో మెట్రో పనులు చేపట్టేది లేదని, ముందుగా ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకే ముందుకు సాగుతామని ఎల్అండ్టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బుధవారం సచివాలయంలో మెట్రో పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన సమీక్షాసమావేశంలో ఎల్అండ్టీ సంస్థ ఉన్నతాధికారులు ఈ విషయమై సీఎంతో చర్చించినట్లు సమాచారం. ముందుగా కుదుర్చుకున్న ఒప్పం దం మేరకే నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా ఎలివేటెడ్(ఆకాశమార్గం) రూట్లో 72 కి లోమీటర్ల మేర పనులు చేపడతామని సీఎంకు వివరించారని, దానికి ఆయన నుంచి అభ్యంతరమేమీ వ్యక్తం కాలేదని తెలిసింది. గతంలో చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటుపై నిపుణుల ఆధ్వర్యంలో పరిశీలించాలని కేసీఆర్ ఎల్అండ్ టీ, హెచ్ఎంఆర్లను కోరిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం, ఎల్అండ్టీ వర్గాల మధ్య తొలిసారి సానుకూలంగా చర్చలు జరగడం విశేషం. దీంతో మెట్రో పనులకు ఎదురైన తాత్కాలిక అడ్డంకులు అన్నీ తొలగినట్లైంది. కొనసాగిన టెస్ట్ రన్.. గత రెండు రోజులుగా నిలిచిన నాగోల్-ఎన్జీఆర్ఐ(ఉప్పల్)మార్గంలో ఎలివేటెడ్ మెట్రోరైలు ప్రయోగ పరుగు బుధవారం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు కొనసాగింది. ఇదే విషయమై ‘సాక్షి’ఎల్అండ్టీ వర్గాలను వివరణ కోరగా ఉప్పల్ మెట్రో డిపోలో ఉన్న నాలుగు రైళ్లకు 18 అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మెట్రో టెస్ట్న్క్రు అవసరమైన విద్యుత్ సరఫరాలో గత మూడురోజులుగా ఎలాంటి అంతరాయం కలగలేదని చెప్పారు. గురువారం మరోమారు టెస్ట్న్ ్రనిర్వహించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రెండోదశపై చిగురిస్తున్న ఆశలు! సీఎం కేసీఆర్ తాజా సమీక్షలో మెట్రో పరిధిని సమీప భవిష్యత్‌లో 200 కి.మీ.కి విస్తరించాలని సూచించడడంతో నగరంలో మెట్రో రెండోదశపై ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత మూడు రూట్లకు అదనంగా మహానగరం పరిధిలో మరో 15 రూట్లలో మెట్రో రైలు ప్రాజె క్టు చేపట్టాలన్న డిమాండ్లు ప్రజాప్రతినిధులు, స్థానికుల నుంచి ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు గతంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లీ అసోసియేట్స్ సంస్థ నిర్వహించిన సమగ్ర రవాణా రంగ అధ్యయనం(సీటీఎస్)లోనూ సముచిత స్థానం కల్పించారు. అయితే ఈ ప్రతిపాదనల్లో వేటికి ఆమోదముద్ర పడుతుందో అన్న అంశం.. సమగ్ర సర్వే, ప్రభుత్వ నిర్ణయం మేరకే తేలుతుందని హెచ్ఎంఆర్ వర్గాలు స్పష్టం చేశాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆయా మార్గాల్లో త్వరలో మెట్రో రైలు మార్గం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సర్వే జరగనున్నట్లు తెలిసింది. గతంలో సీటీఎస్ అధ్యయనంలో చోటు కల్పించిన మెట్రో మార్గాలివీ.. 1.తార్నాక-కీసర ఓఆర్ఆర్ (18.23 కి.మీ.) 2.ఉప్పల్-ఘట్కేసర్ (14.06) 3.భరత్‌నగర్-దుండిగల్ ఓఆర్ఆర్(18.48) 4.జూబ్లీబస్‌స్టేషన్-శామీర్‌పేట్ (19.19) 5. హైటెక్‌సిటీ-శంషాబాద్ (36.59) 6.నాగోల్-బండ్లగూడ (26.26) 7.గోపన్‌పల్లి-బొల్లారం (31.76) 8.లక్డీకాపూల్-ఇస్నాపూర్ (36.26) 9.బొల్లారం-నారపల్లి (21.05) 10.హైటెక్‌సిటీ-కాజిపల్లి (13.07) 11.మలక్‌పేట్-కొంగర ఓఆర్ఆర్ (21.11) 12.నారపల్లి-శంషాబాద్ (28.89) 13.షేక్‌పేట్-కొల్లూరు ఓఆర్ఆర్ (20.85) 14.బీహెచ్ఈఎల్-అబ్దుల్లాపూర్‌మెట్ (19.19) 15.జూబ్లీ బస్టాండ్-శంషాబాద్ (14.12) -
మెట్రో ఎటో?
తెరపైకి భూగర్భ మెట్రో సీఎం ఆదేశాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు చారిత్రక కట్టడాలను రక్షించాలంటున్న ‘హెరిటేజ్’ ప్రతినిధులు భూగర్భ మార్గమైతే రూ.3 వేల కోట్లు పెరగనున్న అంచనా వ్యయం సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ఎలివేటేడ్ మెట్రో రైలు మార్గం డోలాయమానంలో పడింది. ఈ మార్గాన్ని చారిత్రక ప్రదేశాల వద్ద భూగర్భం నుంచి వేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా కారిడార్-1 పరిధిలోని ఎల్బీనగర్-మియాపూర్, కారిడార్-2 పరిధిలోని జేబీఎస్-ఫలక్‌నుమా రూట్లలో నిపుణుల ఆధ్వర్యంలో త్వరలో ప్రత్యేకంగా పరిశీలన చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా సుల్తాన్‌బజార్, బడీచౌడి, మొజాంజాహి మార్కెట్, గన్‌పార్క్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ మెట్రో నిర్మాణం చేపడితే నిర్మాణవ్యయం అదనంగా రూ.మూడు వేల కోట్ల మేర పెరగనుందని తాజాగా అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పిల్లర్ల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో నిర్మాణ సంస్థకు జరిగే నష్టాన్ని సైతం అధికారులు నివేదికలో పొందుపరుస్తున్నట్లు తెలిసింది. రూ.మూడువేల కోట్లు పెరగనున్న నిర్మాణ వ్యయం..? ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా, నాగోల్-శిల్పారామం రూట్లలో మొత్తం 72 కిలోమీటర్ల మేర జరగనున్న మెట్రో పనులను రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో ఎల్అండ్టీ సంస్థ 2011లో చేపట్టిన విషయం విదితమే. అయితే ఏకంగా మూడు కారిడార్ల పరిధిలో సుమారు పది కిలోమీటర్ల మార్గంలో భూగర్భ మార్గాన మెట్రో రైల్వే మార్గాన్ని మారిస్తే నిర్మాణ వ్యయం సుమారు రూ.మూడు వేల కోట్ల మేర పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ అదనపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా లేదా ఎల్అండ్టీ భరిస్తుందా అన్నది తేలాల్సి ఉందన్నారు. కాగా 2010 సెప్టెంబరు 4న సదరు సంస్థతో కుదిరిన ఒప్పందంలో ఈ అంశం ప్రస్తావన లేకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారం గందరగోళంగా మారుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఒడిదొడుకులు ఎదుర్కొం టున్న మౌలిక వసతుల కల్పన రంగ సంస్థలు తాజా మార్పులతో బెంబేలెత్తి కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ముం దుకు రావంటున్నారు. కాగా సుల్తాన్‌బజార్ మార్కెట్లో మెట్రోరైలు అలైన్మెంట్ మార్పు పనులు ప్రారంభించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా సోమవారం మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. భూగర్భ మెట్రో.. లాభనష్టాలు సుల్తాన్‌బజార్, బడీచౌడి, మొజాంజాహి మార్కెట్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల రూపురేఖలు, వాటి చారిత్రక ప్రాధాన్యం దెబ్బతినకుండా ఉంటుంది. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నగరాల్లో చారిత్రక ప్రదేశాలు, విధానసభల వద్ద భూగర్భ మెట్రో మార్గాలను నిర్మిస్తున్నారని, ఇక్కడా అలాగే భూగర్భ మెట్రో నిర్మించాలని వారసత్వ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. నగరంలోని రాతినేలను తొలిచి భూగర్భ మార్గం నిర్మించాలంటే జర్మనీకి చెందిన అత్యంత ఖరీదైన టన్నెల్ బోరింగ్ యంత్రాలు కొనుగోలు చేయాలి. భూగర్భ మార్గంలో భత్రతా ఏర్పాట్లు చేయడం చాలా కష్టం. నిర్మాణ సమయంలో పెద్ద బండరాళ్లు కూలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నగరంపై ఉగ్రవాద పడగనీడ ఉన్న నేపథ్యంలో మెట్రో ఆస్తులు, ప్రయాణికుల రక్షణ కత్తిమీద సాములా మారుతుంది. నిర్మాణ వ్యయం ప్రతి కిలోమీటరుకు రూ.450 నుంచి రూ.500 కోట్ల వరకు చేరుకోనుంది. భూగర్భంలో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టాల్సి ఉన్నందున అధికంగా ఆస్తులను సేకరించాల్సి ఉంటుంది. వీటి పరిహారం, బాధితులకు పునరావాసం క ల్పించడం సవాలుగా మారనుంది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం కంటే విదేశీ పరిజ్ఞానంపైనే ఆధార పడాల్సి ఉంటుంది. నగరం నడిబొడ్డు నుంచి మెట్రో మార్గం వెళ్లనున్న నేపథ్యంలో నిజాం కాలం నాటి డ్రైనేజి లైన్లు బయటపడే అవకాశ ం ఉంది. ఇప్పటికే పబ్లిక్‌గార్డెన్, నాంపల్లి మార్గంలో పురాతన వరదనీటి కాల్వ బయల్పడిన విషయం విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణ పనులు త్వరితంగా ముందుకు సాగడం కష్టసాధ్యమౌతుంది. మూడు కారిడార్లలో 72 కి.మీ. మెట్రో కారి డార్ పనులు 2017 జనవరి నాటికి పూర్తికావాల్సి ఉండగా.. భూగర్భ మార్గం మీదుగా చేపడితే ఐదేళ్లు ఆలస్యంగా పనులు పూర్తవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాతి నేలలో భూగర్భ మెట్రో సాధ్యమేనా..? దక్కన్ పీఠభూమిలో ఉన్న హైదరాబాద్ నగరంలో భూమి నుంచి ఐదు మీటర్ల లోతునకు తవ్వకాలు జరిపితే కఠినమైన రాతినేల ఉంటుందని భూభౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భూగర్భ మెట్రో నిర్మాణం అనే క వ్యయప్రయాసలతో కూడినదని స్పష్టం చేస్తున్నారు. రాతినేలను తొలిచేందుకు బ్లాస్టింగ్ (పేలుడు పదార్థాలతో బండరాళ్లను పేల్చడం) ప్రక్రియ చేపట్టడం నగరంలో వీలు కాదని అభిప్రాయపడుతున్నారు. ఎలివేటెడ్ మెట్రో.. లాభనష్టాలు ఆకాశమార్గం మీదుగా ఎలివేటెడ్ మార్గం నిర్మిస్తే రక్షణ, భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టే వీలుంటుంది. నిర్మాణ వ్యయం కి.మీ.కి రూ.200 కోట్లే. స్వదేశీ పరిజ్ఞానం వినియోగించుకోవచ్చు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పిల్లర్ల నిర్మాణం పూర్తయినందున సెగ్మెంట్ల ఏర్పాటు, రైల్వే ట్రాక్, స్టేషన్ల నిర్మాణం పనుల్లో అంతరాయం లేకుండా చూడవచ్చు. మెట్రో కారిడార్లలో ఆస్తుల సేకరణ పరిమితంగానే ఉంటుంది. ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయిన విషయం విదితమే. చారిత్రక కట్టడాలున్న ప్రాంతాల్లో ఎలివేటెడ్ మార్గం కారణంగా ఆయా ప్రాం తాల చారిత్రక ప్రాధాన్యం, రూపురేఖలు మారతాయని హెరిటేజ్ పరిరక్షణ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర, వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిందే నగర చరిత్ర, వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎలివేటెడ్ మెట్రో మార్గం వల్ల తెలంగాణ అమరవీరుల స్థూపం కూడా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉండటం దురదృష్టకరం. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. - అనురాధ, ఇన్టాక్ కన్వీనర్