వాషింగ్టన్: అండర్‌గ్రౌండ్ మెట్రో రైళ్లలో ప్రయాణించడం పెను ప్రమాదమని ఓ అథ్యయనం బాంబు పేల్చింది. ఈ తరహా రైళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలకు ప్రయాణీకులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అమెరికాలో చేపట్టిన ఓ అథ్యయనం హెచ్చరించింది. వాయు కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా 2015లో 65 లక్షల మంది మృత్యువాత పడటాన్ని ఈ సర్వే ప్రస్తావిస్తూ వాయు కాలుష్యంలో పర్టిక్యులేట్ మ్యాటర్ పెను ప్రమాదకరంగా పరిణమించిందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
అండర్‌గ్రౌండ్ మెట్రోల కారణంగా పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, హెక్సావలెంట్ క్రోమియంలు గాలిలో కలుస్తున్నాయని ఇవి పీల్చడం ద్వారా క్యాన్సర్ సహా శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అండర్‌గ్రౌండ్ ట్రైన్లలో వెంటిలేషన్ ఇబ్బందులతో పాటు స్టీల్ ట్రాక్‌లు ఒత్తిడికి గురికావడంతో చెలరేగే రేణువులు, డస్ట్ బారిన ప్రయాణీకులు పడే ప్రమాదం ఉందని ఈ సర్వే పేర్కొంది. ఆయా మెట్రో స్టేషన్లలో కాలుష్య కారకాలను పరిశీలించి, పరీక్షించిన యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకులు ఈ అంశాలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment