ఎంతగానో ఎదురు చూస్తున్న దేశంలో మొట్టమొదటి అండర్‌గ్రౌండ్ మెట్రో లైన్ ముంబైలో వచ్చే నెలలో ప్రారంభం కానుంది. పూర్తి భూగర్భ కారిడార్ అయిన కొలాబా-బాంద్రా-ఎస్ఈఈపీజెడ్ మెట్రో లైన్ 3 ప్రారంభంతో ముంబై వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.
ముంబై నగరంలోని ఆరే కాలనీని ప్రధాన వ్యాపార జిల్లా అయిన బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బికెసి) తో కలిపే మెట్రో లైన్ ఫేజ్ 1ను జులైలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరే కాలనీ నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వరకు సుమారు 9.63 కిలోమీటర్ల దూరాన్ని ఫేజ్ 1 కవర్ చేస్తుంది.
మెట్రో లైన్ 3 నిర్మాణం మొత్తం పూర్తయితే 33.5 కిలోమీటర్ల మేర 27 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. మెట్రోలో ప్రతిరోజూ 260 సర్వీసులు నడుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు వీటిని నడిపేలా నిర్ణయించారు.
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎంఎంఆర్‌సీ) రూ.37,000 కోట్లకు పైగా వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టింది. కొలాబా-బాంద్రా-ఎస్ఈఈపీజెడ్ మెట్రో లైన్ 3 ఆపరేషన్, నిర్వహణ కాంట్రాక్టును ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఎంఎంఆర్‌సీ ఇచ్చింది. అంతర్జాతీయ కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రక్రియ అనంతరం 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఎంఎంఆర్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది.
#MMRC has successfully completed Research Designs and Standards Organisation #RDSO trials of Rolling Stock for #MetroLine3. Testing of other electrical systems and integrated testing of Rolling Stock with signaling is in progress. After completion of testing, the Commissioner of… pic.twitter.com/GnH51CfQIU
— MumbaiMetro3 (@MumbaiMetro3) June 24, 2024
Comments
Please login to add a commentAdd a comment