ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నేడు(శనివారం) అండర్ గ్రౌండ్ మెట్రో పరుగులు తీయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్ట్రలోని ముంబై మెట్రో లైన్-3తో పాటు మొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్నారు.
ఈ మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తదితరులు పాల్గొననున్నారు.
నేడు అండర్ గ్రౌండ్ మెట్రోలో ప్రయాణించనున్న ప్రధాని మోదీ తన ప్రయాణంలో లాడ్లీ బహిన్ లబ్ధిదారులు, విద్యార్థులు, కార్మికులతో సంభాషించనున్నారు. ఆధునిక ఫీచర్లతో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు రూపొందించిన మొబైల్ యాప్ మెట్రో కనెక్ట్-3ని కూడా ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు.
ఎంఎంఆర్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని భిడే మాట్లాడుతూ 'నేడు ముంబై ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు. మెట్రో లైన్-3ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ముంబై మెట్రోలో ప్రయాణించే వారికి ఈ కొత్త మెట్రో ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఈ భూగర్భ మెట్రో నగర రూపురేఖలను మార్చనుందని’ అన్నారు.
ఇది కూడా చదవండి: అహ్మద్‌నగర్ ఇక అహిల్యానగర్
Comments
Please login to add a commentAdd a comment