న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ గతేడాది మార్చిలో జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో కార్యక్రమంలో తన రేస్‌మో కారుతో చేసిన సందడి అంతాఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ప్రదర్శనకు ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా మంది సందర్శకులను తన సీతాకోకచిలుక డోర్స్ డిజైన్‌తో కట్టిపడేసింది. కానీ ఇప్పుడు టాటా మోటార్స్ వారందరినీ షాక్‌కు గురిచేసింది.
తన ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ కార్ ప్రాజెక్ట్ ‘రేస్‌మో’ను రద్దు చేసినట్లు ప్రకటించింది. టర్న్ అరౌండ్, వ్యయ నియంత్రణ వ్యూహాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘‘ప్రస్తుత సమయంలో పలు ప్రాజెక్టులకు ఆర్థికంగా అంత విలువ లేదని భావిస్తున్నాం. రేస్‌మో ప్రాజెక్ట్‌ను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు’’ అని టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్‌వో పి.బి.బాలాజీ తెలిపారు. రేస్‌మో ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే, ఆ ప్రతిపాదనను పరిశీలిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment