CBI officials
-
ఆర్జీ కర్ ఆస్పత్రి మెడిసిన్ కొనుగోళ్లలో భారీ లోపాలు: సీబీఐ
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులు దర్యాప్తు సంస్థ సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. సందీప్ ఘోష్ ప్రన్సిపల్గా ఉన్న సమయంలో ఆస్పత్రిలో పేషెంట్లకు అందించే మెడిసిన్ కొనుగోళ్ల వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని సీబీఐ తాజాగా పేర్కొంది. బయటి ఏజెన్సీల నుంచి ఔషధాలను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా బిడ్డర్లను సాంకేతికంగా పరిశీలన చేసే కీలకమైన అంశాన్ని విస్మరించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. పేషెంట్ల ఆరోగ్యం బిడ్డర్లు సప్లై చేసే నాణ్యమైన మెడిసిన్‌పై అధారపడి ఉంటుంది. అయితే.. ఈ క్రమంలో బిడ్డర్ల సాంకేతిక పరిశీలిన చాలా ముఖ్యమైన అంశం. కానీ.. రెండు దశల్లో పూర్తి చేసుకోవల్సిన సాంకేతిక పరిశీలనను కేవలం ఒక దశ తర్వాతే బిడ్డర్లకు కాంట్రాక్ట్ అప్పగించనట్లు పలు డాక్యుమెంట్లపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు వెల్లడించారు. బిడ్డర్లు మొదటి దశ పరిశీలనలో అర్హత సాధించకపోయినా రెండోదశకు అనుమతించి మరీ కాంట్రాక్టు అప్పగించినట్లు సీబీఐ పేర్కొంది. అదే విధంగా ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే మెడిసిన్ నాణ్యత విషయంలో పీజీ ట్రైనింగ్ డాక్టర్లు ఎన్నిసార్లు సందీప్ ఘోస్ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోలేదని సీబీఐ తెలిపింది. మరోవైపు.. కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంలో నిర్లక్ష్యం కారణంగా సందీప్ ఘోష్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక.. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌తో పాటు సందిప్ ఘోష్‌కు కూడా సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే.చదవండి: కోల్‌కతా కేసు: 25 దాకా ‘ఘోష్’ సీబీఐ కస్టడీ పొడిగింపు -
విశాఖ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో వీరభద్రరావు, కోటయ్య చౌదరిని సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 140 శాంపిల్స్‌ను సీబీఐ మేజిస్ట్రేట్ ఎదుట మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఐ అధికారుల బృందంతో పాటు డీఐజీ విశాల్ గున్ని మరోసారి పోర్టులో కంటైనర్‌ని పరిశీలించారు. విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ, వ్యాపార సంబంధాలూ బయటపడ్డాయి. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా డ్రై ఈస్ట్‌తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్‌లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్‌లు.. మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్‌తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇదీ చదవండి: విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్.. 'కేరాఫ్ కోటయ్య చౌదరి' -
సీబీఐ అధికారులే షాక్..సినీ రేంజ్ లో డ్రగ్స్ సరఫరా..
-
విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్...'కేరాఫ్ కోటయ్య చౌదరి'
విశాఖ సిటీ/ సాక్షి, అమరావతి: అచ్చం సినిమాను తలపించే రీతిలో విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా డ్రై ఈస్ట్‌తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్‌ను స్వా«దీనం చేసుకున్నారు. కంటైనర్‌లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్‌లు.. మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్‌తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎవరిదీ కంటైనర్.. అని విచారణ మొదలుపెట్టగానే.. ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ, వ్యాపార సంబంధాలూ బయటపడ్డాయి. బ్రెజిల్ దేశంలోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన ‘జిన్ లియన్ యన్ గ్యాంగ్’ కంటైనర్ నౌక ఈ నెల 16వ తేదీ రాత్రి 9.30 గంటలకు విశాఖ పోర్టు టెర్మినల్–2కు చేరుకుంది. అందులో వచ్చిన కంటైనర్లను విశాఖ పోర్టు స్టాక్ యార్డ్‌లో అన్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ షిప్‌లోని ఎస్‌ఈకేయూ 4375380 నంబర్ గల కంటైనర్‌లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, తనిఖీ చేయాలని ఈ నెల 18న ఇంటర్‌పోల్ నుంచి ఒక ఈ–మెయిల్ వచ్చింది. వెంటనే ఢిల్లీలో సీబీఐ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ ఉమేష్ శర్మకు అప్పగించారు. సీబీఐ ఎస్పీ గౌరవ్ మిట్టల్ పర్యవేక్షణలో ఉమేష్‌కుమార్‌తో పాటు మరో డీఎస్పీ ఆకాష్ కుమార్ మీనా బృందం నార్కోటిక్ డిటెక్షన్ కిట్‌తో ఈ నెల 19వ తేదీ ఉదయం 8.15 గంటలకు విశాఖ చేరుకుంది. విశాఖ సీబీఐ డీఎస్పీ సంజయ్‌కుమార్ సమల్‌తో కలిసి విశాఖ పోర్టు విజిలెన్స్, కస్టమ్స్ అధికారుల సహకారంతో పోర్టులో తనిఖీ చేపట్టారు. ఇంటర్‌పోల్ సమాచారమిచ్చిన నంబర్ గల కంటైనర్‌ను స్వా«దీనం చేసుకున్నారు. భారీగా మాదక ద్రవ్యాలు గుర్తింపు సదరు కంటైనర్ లాసెన్స్ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ కాగా.. సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.వి.ఎల్.ఎన్.గిరిధర్, కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె.భరత్ కుమార్‌ను రప్పించారు. కంటైనర్, సీల్ నెంబర్లు చూపించి అందులో ఏముందని సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించారు. కంటైనర్‌లో 25 కేజీలు చొప్పున 1000 బ్యాగ్‌లు మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ ఉందని చెప్పారు. దీంతో కంటైనర్ తెరిచి చూడగా లోపల 20 బాక్సులలో వెయ్యి బ్యాగులు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బాక్స్ నుంచి ఒక్కో బ్యాగ్‌ను కంపెనీ ప్రతినిధుల సమక్షంలోనే బయటకు తీశారు. ఆ బ్యాగుల్లో పచ్చ రంగులో ఉన్న పౌడర్‌ను నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షించారు. 20 బ్యాగుల్లో పౌడర్‌ను పరీక్షించిన సీబీఐ అధికారులు విస్తుపోయారు. ఈ పౌడర్‌లో కొకైన్, మెథాక్వాలోన్, ఓపియం, మారిజోనా, హాషిష్ మాదక ద్రవ్యాలు ఉన్నట్లు రెండు వేర్వేరు పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. తాము తొలిసారిగా వీటిని దిగుమతి చేసుకున్నామని, అందులో ఉన్న పదార్థాల గురించి తమకు తెలియదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. తిరిగి సీబీఐ బృందం 20వ తేదీ ఉదయం 10.15 గంటలకు విశాఖ పోర్టుకు చేరుకొని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కూనం హరికృష్ణ, ఇతరుల సమక్షంలో మరికొన్ని బ్యాగులను పరీక్షించారు. అన్నింటిలోను మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించగా.. వారు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీపై కేసు నమోదు చేశారు. సంధ్యా ఆక్వాపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు టీడీపీ ప్రభుత్వ హయాంలో సంధ్యా ఆక్వా అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కంపెనీలో తనిఖీలు నిర్వహించింది. అనుమతి లేకుండా ఈక్విడార్ దేశం నుంచి రొయ్యలను దిగుమతి చేసుకుని వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేశారని తేలింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత చట్టాలు అనుమతించవు. కానీ ఆ చట్టాన్ని సంధ్యా ఆక్వా ఎండీ కూనం వీరభద్రరావు చౌదరి బేఖాతరు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. దాంతోపాటు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను కూడా ఉల్లంఘించినట్టు తనిఖీల్లో వెల్లడైంది. ఏకంగా 16 ఉల్లంఘనలను గుర్తించి కేసు నమోదు చేసి సంధ్యా ఆక్వా కంపెనీని సీజ్ చేశారు. ఇదిలా ఉండగా కూనం వీరభద్రరావుపై యూఎస్ పోలీసులు 2016లో కేసు నమోదు చేశారు. ఆ ఏడాది జూలై 30న లాస్ ఏంజెలిస్ నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న విమానంలో తన పక్కనే నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వీరభద్రరావుని ఎఫ్‌బీఐ అరెస్టు చేసి న్యూయార్క్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం తానా ప్రతినిధుల సహాయంతో ఈ కేసు నుంచి బయటపడ్డారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ వీరభద్రరావు పాత్ర ఉందని తెలుస్తోంది. ఈయన నేతృత్వంలో రూ.25 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. -
కలవర పెడుతున్న ప్రశ్నలు
ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ప్రత్యేక సీబీఐ బృందాన్ని మణిపుర్‌కు పంపింది. సీబీఐ పదకొండు కేసులను దర్యాప్తు చేస్తోంది. వాటి కోసం మణిపుర్ వెళ్లని సీబీఐ బృందం, ఈ కేసు కోసమే ఎందుకు వెళ్లినట్లు? ‘‘మణిపుర్‌లోని ప్రస్తుత సంక్షోభం జాతుల మధ్య ఘర్షణ కాదు. మయన్మార్, బంగ్లాదేశ్‌లలో స్థావరాలు ఏర్పరచుకుని ఉన్న కుకీ మిలిటెంట్లు... మణిపుర్ నుంచి పని చేస్తున్న తీవ్రవాద సంస్థల సహకారంతో భారత ప్రభుత్వంపై తలపెట్టిన పూర్తిస్థాయి యుద్ధం’’ అని ముఖ్యమంత్రి బీరేన్ అన్నారు. తీవ్రవాద సంస్థలు ఈ రెండు తెగలతోనూ సంబంధాలను కలిగి ఉండి మణిపుర్లో ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయి. బీరేన్ ఎందుకు ఒక వైపే మాట్లాడుతున్నారు? ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక సీబీఐ బృందాన్ని మణిపుర్‌కు పంపడంలో చూపిన ఉల్లాస పూరితమైన సంసిద్ధతను, ఆ కేసును ఛేదించారని చెబుతున్న సీబీఐ బృందం పని తీరులోని గొప్ప వేగాన్ని అభినందిస్తూనే... విషయాలను క్లిష్టతరం చేయగల కొన్ని ప్రశ్నల్ని కూడా ఇక్కడ పరిగణనలోకి తీసు కోవడం ఒక విలువైన పరిశీలన కాగలదని నేను విశ్వసిస్తున్నాను. ఈ ప్రశ్నల్లో కొన్ని నిస్సందేహంగా కుకీ తెగలవారు లేవనెత్తినవే అయి ఉంటాయన్నది ఆశ్చర్యమేమీ కాదు. అంతమాత్రాన ఆ ప్రశ్నలు చెల్లుబాటు కాకుండాపోతాయని మాత్రం నేనైతే కచ్చితంగా అనుకోను. మొదటి విషయం ఏంటంటే, సీబీఐ పదకొండు కేసులను దర్యాప్తు చేస్తోంది. కార్–వాష్ స్టేషన్లో ఇద్దరు కుకీ మహిళలపై లైంగిక దాడి జరిపి వారిని హత్య చేసినప్పుడు... డేవిడ్ థీక్ తల నరికి చంపినప్పుడు... అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న తల్లినీ, బిడ్డకూ వాహ నంతో సహా కాల్చి బూడిద చేసినప్పుడు... దర్యాప్తు కోసం మణిపుర్ వెళ్లని సీబీఐ ప్రత్యేక బృందం... ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై విచారణ జరిపేందుకు ఇంఫాల్‌కు ఎందుకు వెళ్లినట్లని మీరడగవచ్చు. మీరు కుకీ తెగకు చెందిన వారైతే కనుక ఇది మీకు మైతేయిల పట్ల కేంద్రం ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తున్నట్లుగా అనిపించదా? రెండో ప్రశ్న కూడా అంతే ముఖ్యమైనది. అజయ్ భట్నాగర్ నేతృత్వంలోని సీబీఐ ప్రత్యేక బృందం సెప్టెంబర్ 27 సాయంత్రం ఇంఫాల్ చేరుకుంది. నాలుగు రోజుల లోపే కొన్ని అరెస్టులు జరిపింది. ఇక్కడే ఐ.టి.ఎల్.ఎఫ్. (ఇండీజనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్) ఒక ప్రశ్నను లేవనెత్తింది. ‘‘ఇంత వేగంగా పని చేయగలిగిన సీబీఐ మిగతా హేయమైన కేసులలో ఎందుకని ఒక్కర్నీ అరెస్టు చేయలేదు?’’ అని ప్రశ్నించింది. కుకీ తెగ ప్రజల అత్యున్నత స్థాయి స్వయం ప్రకటిత సంఘం ‘కుకీ ఇంపీ’ మరింత సూటిదైన ప్రశ్నకు సమాధానం కోరుతోంది. ‘‘కుకీ–జో కమ్యూనిటీకి వ్యతిరేకంగా అనుమానాస్పద కారణాలతో అరెస్టులు చేసినప్పుడు... కుకీ–జో ప్రజలపై ఎంతో అమానుషంగా, అనాగరికంగా శిరచ్ఛేదనకు, అత్యాచారాలకు, గృహ దహనాలకు పాల్పడిన నేరస్థులను అదే తరహాలో ఎందుకు అరెస్టు చేయలేదు?’’ అని కుకీ ఇంపీ ప్రశ్నిస్తోంది. ఏమైనా, కుకీలు లేవనెత్తిన ఈ ప్రశ్నలతో పాటుగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చేసిన వ్యాఖ్యల నుంచి తలెత్తిన ప్రశ్నలూ కొన్ని ఆలోచన రేకెత్తించేవిగా ఉన్నాయి. సీబీఐ అరెస్టుల అనంతరం బీరెన్ సింగ్, ‘‘విద్యార్థుల అపహరణ, హత్యకు కారణమైన కొంతమంది ప్రధాన నేరస్థులు ఈ రోజు చురాచాంద్‌పుర్‌లో అరెస్ట్ అయ్యారని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు నిందితులు మాత్రమే కదా అవుతారు? బీరేన్ ఏ ప్రాతిపదికన నిందితులను దోషులుగా పేర్కొన్నారు? అలా పేర్కొనడం... కోర్టులో నిందితుల అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉంటుందా? కుకీలకు ఇది రుచించకపోవడంలో ఆశ్యర్యం ఏమీ లేదు. ఐ.టి.ఎల్.ఎఫ్. వ్యక్తం చేసిన ఆందోళనే ఇతరులు అనేక మందిలోనూ చోటు చేసుకుంది. ‘‘మహిళలు సహా అభాగ్యులైన కుకీ గిరిజనుల పట్ల కఠినంగా వ్యవహరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మైతేయి తెగల ఆగ్రహం నుండి ముఖ్యమంత్రిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది’’ అని వారి అనుమానం. కనుక మీరిప్పుడు నేనెందుకు ఈ ప్రశ్నల వైపు మీ దృష్టిని మరల్చానో అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్దిష్ట ఘటనలో ఇంఫాల్ లోని పరిణామాలు చురాచాంద్‌పుర్ నుండి చూసినప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. కచ్చితంగా ఐదు నెలల తర్వాత ఢిల్లీలో మంత్రులకు, అధికారులకు ఈ విషయం తెలిసి తీరుతుంది. అయినప్పటికీ అది వారినేమీ భావోద్వేగానికి గురి చేయదు. ‘‘నేనెందుకు ఆశ్చర్యపోతున్నాను?’’ అనే మరొక ప్రశ్నకు ఆ పరిణామం దారి తీస్తుంది. ఒక భిన్నమైన, అయినప్పటికీ సంబంధం కలిగివున్న ఒక విషయాన్ని లేవనెత్తడంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇప్పుడు తన రాష్ట్రాన్ని ఇలా చూస్తున్నారు: ‘‘మణి పుర్లోని ప్రస్తుత సంక్షోభం జాతుల సమూహాల మధ్య ఘర్షణ కాదు. రాష్ట్ర శాంతి భద్రతల సమస్య కూడా కాదు. మయన్మార్,బంగ్లాదేశ్‌లలో స్థావరాలు ఏర్పరచుకుని ఉన్న కుకీ మిలిటెంట్లు... మణిపుర్ నుంచి పని చేస్తున్న తీవ్రవాద సంస్థల సహకారంతో భారత ప్రభుత్వంపై తలపెట్టిన పూర్తిస్థాయి యుద్ధం’’ అంటారు ఆయన. ఇది మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది బీరేన్ అభిప్రాయమా? లేక న్యూఢిల్లీ అభిప్రాయమా? న్యూఢిల్లీ అభిప్రాయమే అయితే ఈ విషయాన్ని నెపిడా(మయన్మార్ రాజధాని), ఢాకాల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందా? యుద్ధం అని మీరెలా చెప్పగలరు అని ముఖ్యమంత్రిని అడిగితే, ఆయన నిస్సందేహంగా సీమిన్లుమ్ గాంగ్టే అనే కుకీ అరెస్టును చూపుతారు. ఎన్.ఐ.ఎ. (నేషనల్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ) అంటున్న దానిని బట్టి గాంగ్టే దేశ సరిహద్దుకు ఆవల ఉన్న తీవ్రవాద సంస్థ సభ్యుడు. అయితే గాంగ్టే అరెస్టుకు కొన్ని రోజుల ముందు నిషేధిత ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ సభ్యుడైన మొయిరాంగ్థమ్ ఆనంద్ సింగ్ అనే మైతేయి తెగ వ్యక్తిని కూడా ఎన్.ఐ.ఎ. అరెస్టు చేసింది. దీనిని బట్టి తీవ్రవాద సంస్థలు ఈ రెండు తెగల వారితోనూ సంబంధాలను కలిగి ఉండి మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుండి మణిపుర్లో కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయని అనుకోవాలి. మరైతే ముఖ్యమంత్రి ఎందుకు ఒక వైపే మాట్లాడుతున్నారు? మళ్లీ ఇదొక కలవరపెట్టే ప్రశ్న. నా ముగింపు: మణిపుర్ రెండు వైపుల నుంచీ కలవరపరిచే ప్రశ్నలను విసురుతోంది. అందుకే కేవలం ఒక కోణం నుంచి ఇచ్చే సమాధానం పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది. ఎందుకు అని అర్థం చేసుకోడానికి ఈ చిన్న ముక్క మీకు సహాయపడి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సిసోడియాను సీబీఐ చిత్రహింసలు పెడుతోంది: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని ఆప్ ఆరోపించింది. తప్పుడు అభియోగాలను ఒప్పుకుని, సంతకాలు చేయాలంటూ ఆయన్ను బలవంతం చేస్తున్నారని పేర్కొంది. ఆప్ జాతీయ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించి సీబీఐ వద్ద ఆధారాలు లేవన్నారు. సిసోడియా నివాసంపై జరిపిన దాడుల్లోనూ ఏమీ దొరకలేదని చెప్పారు. సిసోడియా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. -
శ్రీనివాసరావుతో సంబంధమేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావు కేసులో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. శ్రీనివాసరావుతో సంబంధాలేమైనా ఉన్నాయా? ఆర్థిక లావాదేవీలు జరిగాయా? అంటూ ప్రశ్నించారు. తమ ప్రాథమిక విచారణలో తేలిన అంశాలు, ఇద్దరు నేతలు తెలిపిన విషయాలను బేరీజు వేసుకున్నారు. బుధవారం సీబీఐ నోటీసులు అందుకున్న గంగుల, వద్దిరాజు గురువారం ఢిల్లీలో విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 7.40 గంటల వరకు సుమారు 8.40 గంటల పాటు జరిగింది. వేర్వేరుగా విచారణ అధికారులు గంగుల, వద్దిరాజు ఇద్దర్నీ వేర్వేరుగా ప్రశ్నించారు. శ్రీనివాసరావును కూడా వారికి ఎదురుగా కూర్చోబెట్టి వారు చెప్పిన సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారు. ‘శ్రీనివాసరావుతో ఎప్పటినుంచి పరిచయం ఉంది? ఎక్కడెక్కడ కలిశారు? ఏమైనా ఆఫర్లు ఇచ్చాడా? లావాదేవీలు ఏమైనా జరిగాయా? ఎవరినైనా పరిచయం చేశాడా? డబ్బు చెల్లింపులు జరిగాయా.?’లాంటి పలు ప్రశ్నలకు సమాధానాలను రాబట్టేందుకు ప్రయత్నించారని తెలిసింది. కొన్ని విషయాల్లో తమ వద్ద ఉన్న ఆధారాలను వారి ముందు ఉంచి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారని సమాచారం. పూర్తిగా సహకరించాం: మంత్రి గంగుల విచారణ ముగిసిన తర్వాత గంగుల, వద్దిరాజు మీడియాతో మాట్లాడారు. గంగుల మాట్లాడుతూ.. ‘ఈ వ్యవహారంలో ఎలాంటి ఆలస్యం చేయరాదన్న ఉద్దేశంతో సీబీఐ అధికారులు పిలవగానే మేం ఢిల్లీలో విచారణకు హాజరయ్యాం. ఎందుకంటే మేం చట్టాలను గౌరవిస్తాం. న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి వారు చెప్పిన సమయాని కంటే ముందే వారి కార్యాలయానికి వచ్చాం. ఒక ఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో మా విచారణ జరిగింది. వారికి పూర్తిగా సహకరించాం. వారిని గుర్తుపట్టావా? అని శ్రీనివాసరావును ప్రశ్నించారు. అతన్ని వారం క్రితం ఒక మున్నూరు కాపు సమావేశంలో కలిశామని మేం చెప్పాం. రెండుసార్లు మాత్రమే కలిశాం. మున్నూరు కాపు బిడ్డ, ఐపీఎస్ అధికారి అని చెప్పినందుకు గుర్తించామే కానీ, ఆయనతో లావాదేవీలు చేయాలన్న ఆలోచనలు మాకు ఎవరికీ రాలేదు. ఈ విషయాలనే సీబీఐ అధికారులకు వివరించాం. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను తెలియజేశాం. మేం ఎక్కడా తప్పు చేయలేదు కాబట్టే వాస్తవాలు చెప్పాం. దీనిపై శ్రీనివాసరావును క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మేం చెప్పిన ప్రతి విషయాన్నీ రికార్డు చేసుకున్నారు. మా సమాధానాలతో సీబీఐ అధికారులు పూర్తిగా సంతృప్తి చెందారు. మా సంతకాలు తీసుకొని పంపించారు. మళ్లీ విచారణకు రమ్మని చెప్పలేదు. ఇదే ఫైనల్ విచారణ అన్నారు..’అని తెలిపారు. బయట జరుగుతున్న వదంతులు ఏవీ వాస్తవాలు కాదని మంత్రి గంగుల కొట్టిపారేశారు. మేం బంగారం కొనిచ్చామన్నది దుష్ప్రచారమే: ఎంపీ వద్దిరాజు ‘కాపు వ్యక్తిగా శ్రీనివాసరావు మాకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర ఉన్న ఫోన్లు, బంగారం ఆయన కొనుక్కున్నవే. మేము కొనిచ్చామన్నది0 దుష్ప్రచారమే. అది పూర్తిగా అవాస్తవం. అన్ని అంశాలు వివరించాం. అధికారులకు సహకరించాం. శ్రీనివాసరావును మా ఎదురుగా కూర్చోపెట్టి విచారించారు.. ’అని వద్దిరాజు చెప్పారు. -
బొగ్గు కుంభకోణం: బెంగాల్ న్యాయ మంత్రిపై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ/కోల్‌కతా: బొగ్గు కుంభకోణం వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ న్యాయ శాఖ మంత్రి మొలోయ్ ఘటక్ నివాసాల్లో సీబీఐ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. పశ్చిమ బర్దమాన్ జిల్లా అసన్సోల్లోని మూడు ఇళ్లు, కోల్‌కతాలోని రెండు ఇళ్లల్లో ఈ సోదాలు జరిగాయి. కోల్‌కతాలో ఘటక్ సన్నిహితుడికి చెందిన ఒక ఇంట్లో, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్లో మరో ఇంట్లోనూ సోదాలు చేపట్టినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. అసన్సోల్లో ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌కు చెందిన గనిలో తవ్విన బొగ్గును కొందరు స్వాహా చేసినట్లు ఫిర్యాదు అందడంతో సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తోంది. మంత్రి మొలోయ్ ఘటక్‌ను కోల్‌కతాలోని ఆయన అధికారిక నివాసంలో సీబీఐ బృందం ప్రశ్నించింది. బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణంలో మంత్రిపేరు తెరపైకి వచ్చిందని, ఇందులో ఆయన భాగస్వామ్యం ఉన్నట్లు తమకు సాక్ష్యాధారాలు లభించాయని అధికారులు పేర్కొన్నారు. మంత్రి నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించామని చెప్పారు. ఘటక్ వద్ద పనిచేస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్‌ను కూడా ప్రశ్నించామన్నారు. అసన్సోల్లో ఘటక్ ఇంట్లో బీరువా తాళాలు అందుబాటులో లేకపోవడంతో అధికారులు దాన్ని బద్దలు కొట్టినట్లు తెలిసింది. మంత్రి ఇళ్లల్లో సీబీఐ సోదాల సందర్భంగా కేంద్ర పారామిలటరీ సిబ్బంది భారీగా మోహరించారు. బొగ్గు స్మగ్లింగ్ కేసులో ఘటక్ గతంలో ఒకసారి ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. -
ఆ ఐఏఎస్ ఆఫీసర్.. అవినీతికి కేరాఫ్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అవినీతి, వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేసిన వ్యవహారంలో గుజరాత్లో కలెక్టర్‌గా పనిచేస్తున్న కంకిపాటి రాజేష్ సీబీఐ అధికారులకు దొరికిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పుట్టి పెరిగిన రాజేష్ 2011లో ఐఏఎస్ సాధించారు. గుజరాత్‌లోని సురేంద్రనగర్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆయన భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. మైనింగ్ లీజులు, తుపాకీలకు లైసెన్సులు ఇవ్వడం, బినామీ పేర్లతో ప్రభుత్వ భూములు సొంతం చేసుకోవడం, భూములను కబ్జా చేసినవారికి వాటిని క్రమబద్ధీకరించడం, ఖరీదైన బట్టల రూపంలో లంచాలు వసూలు చేయడం.. ఇలా అవినీతిలో కూరుకుపోయి భారీగా ఆస్తులు పోగేశారు. గుజరాత్‌లోని సురేంద్రనగర్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన సీబీఐ రాజేష్ అవినీతి గుట్టును రట్టు చేసింది. ఏకకాలంలో సీబీఐ సోదాలు ప్రస్తుతం కంకిపాటి రాజేష్ గుజరాత్ సాధారణ పరిపాలన శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్నారు. కలెక్టర్‌గా ఉన్నప్పుడు పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డట్టు వచ్చిన ఫిర్యాదులపై సీబీఐ ఏడాదిపాటు లోతైన విచారణ చేసి ఆయన అక్రమాస్తుల గుట్టును బయటపెట్టింది. కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని గురువారం కేసు నమోదు చేసింది. రాజమహేంద్రవరం శివారు లాలాచెరువు, అహ్మదాబాద్, సురేంద్రనగర్, తదితర ప్రాంతాల్లో ఉన్న రాజేష్ నివాసాలు, కార్యాలయాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రాజేష్ అక్రమాలకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. లాకర్లలో ఇప్పటివరకు గుర్తించిన పత్రాల ప్రకారం ఆస్తుల మార్కెట్ విలువ రూ.300 కోట్ల పైనే ఉంటుందని తేల్చారు. ఇళ్లు, భూమి సహా ఎనిమిది రకాల ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. దీంతో రాజేష్‌తోపాటు ఆయనకు సహాయం అందిస్తున్న వ్యాపారవేత్త రఫీక్ మెమను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ ఇద్దరిపై సాక్ష్యాలను నాశనం చేయడం, నేరపూరిత కుట్రకు పాల్పడటం వంటి అభియోగాలు నమోదు చేసింది. వారిద్దరిని సీబీఐ కోర్టులో హాజరుపర్చింది. విచారణకు 10 రోజులు తమకు అప్పగించాలని సీబీఐ విజ్ఞప్తి చేయగా కోర్టు ఒక రోజు మాత్రమే అవకాశం ఇచ్చింది. తవ్వే కొద్దీ బయటపడుతున్న అక్రమాలు.. రాజేష్ అక్రమాల పుట్ట తవ్వే కొద్దీ బయటపడుతోంది. సురేంద్రనగర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ‘జిల్లా కలెక్టర్ ఫండ్’, ‘సుజలాం.. సుఫలాం’ కోసం పలువురు ఇచ్చిన చెక్కులను కూడా మార్చేసి అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. ప్రభుత్వ ఖాతాల్లో ఈ నగదును జమ చేస్తానని నమ్మబలికి స్వాహా చేసినట్టు సీబీఐ నిగ్గు తేల్చింది. రాజేష్ అక్రమాలకు మధ్యవర్తిగా సూరత్‌కు చెందిన బట్టల వ్యాపారి రఫీక్ మెమన్వ్యవహరించారు. ఆయుధాల లైసెన్సులు, మైనింగ్ లీజుల కోసం తనను సంప్రదించేవారితో రాజేష్ తాను అడిగినంత మొత్తాన్ని రఫీక్‌కు చెల్లించమని చెప్పేవాడని సీబీఐ పేర్కొంది. బినామీ పేర్లతో ప్రభుత్వ భూములు స్వాధీనం, ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించడం ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు సీబీఐ తేల్చింది. సీబీఐతోపాటు గుజరాత్ అవినీతి నిరోధక శాఖ కూడా విచారణ చేపట్టి కేంద్రానికి నివేదిక పంపాయి. ఆ రాష్ట్ర మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి పీకే తనేజా ప్రాథమిక విచారణలోనూ ఈ అవినీతి బండారం బయటపడటంతో గుజరాత్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. -
సోదాల పేరుతో సీబీఐ అధికారుల రచ్చ
న్యూఢిల్లీ: ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు గుంజేందుకు సోదాల పేరుతో హంగామా సృష్టించిన సీబీఐ అధికారులు నలుగురు అడ్డంగా దొరికిపోయారు. ఉన్నతాధికారులు వారిని డిస్మిస్ చేయడంతోపాటు అరెస్ట్ చేశారు. ఈనెల 10వ తేదీన సీబీఐ అధికారులమని చెబుతూ కొందరు తన ఆఫీసులోకి వచ్చి, నానా హంగామా సృష్టించారని చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త ఒకరు ఫిర్యాదు చేశారు. తనకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ బెదిరించి, రూ.25 లక్షలివ్వాలని డిమాండ్ చేశారని అందులో పేర్కొన్నారు. తమ సిబ్బంది ఒకరిని పట్టుకోగా, మిగతా వారు పరారయ్యారని వివరించారు. ఈ ఫిర్యాదుపై సీబీఐ డైరెక్టర్ సుబోధ్‌కుమార్ జైశ్వాల్ వెంటనే స్పందించారు. విచారణ జరిపి ఈ నలుగురూ ఢిల్లీ సీబీఐ ఆర్థిక నేరాలు, ఇంటర్‌పోల్ ప్రొటోకాల్ డివిజన్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్సైలు సుమిత్ గుప్తా, అంకుర్ కుమార్, ప్రదీప్ రాణా, అకాశ్ అహ్లావత్లుగా గుర్తించారు. వీరి నివాసాలపై సోదాలు చేపట్టి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురినీ అరెస్ట్ చేయడంతోపాటు వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిపై ఆరోపణలు రుజువైతే 10 ఏళ్ల నుంచి జీవితకాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. -
వివేకా హత్యపై తప్పుడు వాంగ్మూలం ఇమ్మంటున్నారు
అనంతపురం క్రైం: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తప్పుడు వాంగ్మూలమివ్వాలని సీబీఐ అధికారులు, మరికొందరు ఒత్తిడి తెస్తున్నట్లు కల్లూరు గంగాధరరెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివేకాను హత్య చేయాలని ఆ కేసు నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనను కోరారని, ఇందుకు రూ.10 కోట్లు ఆఫర్ చేశారని, ఆయనతోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్రమేయంతోనే హత్య జరిగిందని వాంగ్మూలమివ్వాలంటూ సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్, అప్పటి సిట్ సీఐ శ్రీరామ్, వైఎస్ వివేకా కుమార్తె సునీత తీవ్ర ఒత్తిడి తెచ్చారని తెలిపాడు. ఇందుకు ఒప్పుకోకపోవడంతో సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నాడు. తనకు రక్షణ కల్పించాలని కోరాడు. గంగాధరరెడ్డి సోమవారం అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. చదవండి: హత్యలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలది కీలకపాత్ర: జర్నలిస్ట్ భరత్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు.. నాది కడప జిల్లా పులివెందుల. 12 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా యాడికికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నా. పులివెందులలో డబుల్ మర్డర్ కేసులో ముద్దాయిని. వివేకానందరెడ్డిని హత్య చేయాలని నన్ను దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సంప్రదించినట్లు చెప్పాలని అప్పట్లో సిట్ బృందంలో సీఐగా (ప్రస్తుతం అనంతపురం జిల్లా మడకశిర సీఐ) ఉన్న శ్రీరామ్ నాపై ఒత్తిడి తెచ్చారు. కడప డీటీసీలో చిత్ర హింసలు పెట్టారు. చేయని నేరాన్ని ఒప్పుకోవడానికి నేను ఇష్టపడలేదు. ఈ ఏడాది అక్టోబర్ 2, 3 తేదీల్లో సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ వాట్సాప్ కాల్ చేసి వివేకా హత్యకు శివశంకర్‌రెడ్డి ప్రేరేపించినట్టు చెప్పాలన్నారు. అక్టోబర్ 4న సీబీఐ అధికారులు యాడికిలోని మా ఇంటికి వచ్చారు. వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లి హత్య చేసి, దొంగతనం చేసినట్లుగా సీన్ క్రియేట్ చేసి పారిపోవాలని శివశంకర్‌రెడ్డి నాతో చెప్పినట్లు చెప్పాలన్నారు. ఎవరైనా పట్టుకుంటే దొంగతనానికి వెళ్లానని, బీరువా శబ్దం విని వివేకానందరెడ్డి వచ్చినట్లు, ఏమి చేయాలో పాలుపోక హత్య చేశానని చెప్పమన్నారు. ఇందుకు శివశంకర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తానన్నట్లు వాంగ్మూలమివ్వాలని రామ్‌సింగ్ ఒత్తిడి చేశారు. చదవండి: సీబీఐ పిటిషన్లో టీడీపీ పలుకులు! కడప రింగ్ రోడ్డులో వైఎస్ సునీతను కలిశా ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. ఆరోగ్యం సరిగా లేక, అబద్ధాలు చెప్పేందుకు మనస్కరించక వెళ్లలేదు. తర్వాత కడప జిల్లా పెద్దకుడాలకు చెందిన బాబురెడ్డి యాడికికి వచ్చి నన్ను కలిశాడు. వైఎస్ సునీత నన్ను విచారణకు హాజరై సీబీఐ వాళ్లు కోరినట్లుగా వివేకాను శివ శంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేయించారని చెప్పమన్నారని చెప్పాడు. ఇలా చెబితే రూ.10 లక్షలు ఇచ్చి, నా రెండు కాళ్లూ బాగు చేయిస్తామని చెప్పారు. బాబురెడ్డి ముందస్తుగా రూ.15 వేలు ఇచ్చి ఖర్చులకు ఉంచుకోమన్నాడు. నేను భయపడి ఈ నెల 25న కారు బాడుగకు తీసుకుని పులివెందులకు వెళ్లా. అక్కడ రింగ్ రోడ్డు వద్ద కారులో వేచి ఉన్న సునీతను కలిశా. సీబీఐ అధికారులు చెప్పమన్నట్లు సీబీఐ కోర్టు ముందు చెప్పమన్నారు. కడప సెంట్రల్ జైలు దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ సీబీఐ వాళ్లు నన్ను కడప ఆర్ అండ్ బీ అతిథి గృహానికి తీసుకెళ్లారు. పైన చెప్పిన విధంగా వాంగ్మూలం తయారు చేసి నాకు చదివి విన్పించి, సంతకం చేయమన్నారు. చేయని తప్పుకు సంతకం చేయబోనని సీబీఐ వారితో గొడవపడ్డా. ఈ నెల 30న కోర్టులో 164 స్టేట్మెంట్ రికార్డు చేయాలని, అప్పుడు న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు రెండు పేపర్లలో సమాధానాలు రాశిచ్చారు. దాన్ని తీసుకుని యాడికికి వచ్చేశా. అప్పటి నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. వారు చెప్పినట్లు ఒప్పుకోవాలంటూ హింసిస్తున్నారు. నా ఇంటి చుట్టుపక్కల కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు. నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ప్రాణ రక్షణ కల్పించాలి’ అని గంగాధర్ రెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. డీఎస్పీతో విచారణ చేయిస్తున్నాం : ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప గుర్తు తెలియని వ్యక్తులు, వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని కల్లూరు గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. వివేకా హత్య కేసులో చేయని నేరానికి వాంగ్మూలం ఇవ్వాలని 2019లో అప్పటి సిట్ బృందంలోని సీఐ శ్రీరామ్, ఇటీవల సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపాడు. సీబీఐ, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన వాట్సాప్ కాల్స్ స్క్రీన్‌షాట్‌ను జత చేశాడు. ఈ ఫిర్యాదుపై విచారణకు తాడిపత్రి డీఎస్పీ చైతన్యను నియమించాం. గంగాధర్‌రెడ్డిని వాచ్ చేయాలని పామిడి సీఐ, ఇతరులను ఆదేశించాం. -
వివేకా హత్యతో నాకు సంబంధం లేదు
సాక్షి, అమరావతి/కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని, తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని వైఎస్సార్సీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. హత్య అనంతరం వివేకా కుటుంబ సభ్యుల తీరు సందేహాస్పదంగా ఉందని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ నేతలు వివేకా హత్యకు కుట్ర పన్ని ఉండవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. హత్య వెనుక వాస్తవాలను, అసలు కుట్రను వెలికితీసేందుకు వివేకా కుటుంబ సభ్యులను, చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలను విచారించాలని కోరారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా కొన్ని మీడియా సంస్థలు తాను కూడా ఈ కుట్రలో భాగస్వామిని అని చర్చలు నిర్వహిస్తుండటం తన దృష్టికి వచ్చిందన్నారు. హత్య కేసులో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కింది అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను కోరారు. లేఖలోని ముఖ్యాంశాలు.. నన్ను చిత్రహింసలు పెట్టారు ఈ హత్య కేసులో మొదట స్థానిక పోలీసులు, అనంతరం అప్పటి టీడీపీ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు చేపట్టిందన్నారు. సిట్ 2019 మార్చిలో వారం పాటు తనను విచారణ పేరుతో దారుణంగా చిత్రహింసలకు గురిచేసిందని తెలిపారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన సీబీఐ మూడుసార్లు విచారించిందని, ప్రతిసారీ పూర్తిగా సహకరిస్తూనే ఉన్నానని తెలిపారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించిన సునీత వైఎస్ సునీత మొదటి నుంచి వేరే ఉద్దేశాలతో ప్రకటనలు చేస్తూ, దర్యాప్తు అధికారులకు పిటిషన్లు ఇస్తూ దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తూ అమాయకులను వేధించారు. ఓ వర్గం మీడియా కూడా ప్రత్యర్థులను వేధించేందుకు సునీతను అడ్డుపెట్టుకుంది. ఆంధ్రజ్యోతి ఏబీఎన్ చానల్ యజమాని వేమూరి రాధాకృష్ణను సునీత కలవడం ప్రస్తావించాల్సిన అంశం. ఆ పత్రిక, చానల్ మా పార్టీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ ఉంటాయి. సునీత ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నారని ఇవన్నీ రుజువు చేస్తున్నాయి. సౌభాగ్యమ్మ వారానికి మూడుసార్లు సీబీఐ అధికారులను కలవడం దర్యాప్తును ప్రభావితం చేయడమే. సునీత భర్త రాజశేఖరరెడ్డి, సీబీఐ అధికారులు కుమ్మక్కై దస్తగిరికి ఓ న్యాయవాదిని నియమించి ఐదు రోజుల్లోనే ముందస్తు బెయిల్ వచ్చేలా చేశారు. తండ్రిని హత్య చేసిన దస్తగిరికి సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఎందుకు మద్దతిస్తున్నారో విచారించాలి. హత్యకు కొన్ని రోజుల ముందే శివప్రకాశ్ రెడ్డి 20 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు ఎందుకు కొన్నారో విచారించాలి. వివేకా సెల్‌ఫోన్‌ను వెంటనే ఎందుకు పోలీసులకు ఇవ్వలేదు? వివేకానందరెడ్డి పులివెందులలో ఆయన ఇంట్లో మృతిచెందినట్లు 2019, మార్చి 15న ఉదయం గుర్తించారు. ఆయన పీఏ మూలి వెంకట కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాశ్ ఇంట్లోకి వెళ్లి చూడగా బాత్రూమ్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. అక్కడ ఆయన రాసినట్టుగా ఉన్న ఓ లేఖ, సెల్‌ఫోన్‌ను వెంకట కృష్ణారెడ్డి స్వాధీనం చేసుకున్నారు. వాటి విషయాన్ని అక్కడే ఉన్న బంధుమిత్రులకుగానీ పోలీసులకు గానీ చెప్పలేదు. హైదరాబాద్‌లో ఉన్న వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, పెద్ద బావమరిది ఎన్.శివప్రకాశ్‌రెడ్డి, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పులివెందుల చేరుకున్న కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు వాటి విషయాన్ని గోప్యంగా ఉంచారు. సునీత సాయంత్రం 4.30 గంటలకు లేఖను పోలీసులకు ఇవ్వగా.. కృష్ణారెడ్డి సెల్‌ఫోన్‌ను సాయంత్రం 5.30 గంటలకు ఇచ్చారు. కృష్ణారెడ్డితో ఫోన్లో మాట్లాడిన సునీత ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను వెంటనే పోలీసులకు ఇవ్వాలని కృష్ణారెడ్డికి చెప్పాలి. కానీ వారు పులివెందులకు చేరుకునే వరకు ఇవ్వొద్దని చెప్పారు. కీలక ఆధారాలను పోలీసులకు వెంటనే అప్పగించకపోవడం వెనుక కారణాలపై దర్యాప్తు చేయాలి. సెల్‌ఫోన్‌ను ట్యాంపర్ చేయడానికి, డాటాను డిలీట్ చేయడానికి పూర్తి అవకాశాలున్నాయి. రక్తపు మరకలు తుడిపించింది గంగిరెడ్డే వివేకానందరెడ్డి గుండెపోటుకు గురై బాత్రూమ్ కమోడ్‌పై పడి చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులే భావించారు. హత్య జరిగిన రోజు నేను మరికొందరితో కలిసి జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా వివేకా బావమరిది శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే మేమంతా వివేకా ఇంటికి వెళ్లేసరికే కృష్ణారెడ్డి, ఇనయతుల్లా, రంగయ్య, వంట మనిషి లక్ష్మమ్మ, ఆమె కుమారుడు ప్రకాశ్ ఉన్నారు. బాత్రూమ్లో వివేకా మృత దేహాన్ని చూసిన వెంటనే బయటకు వచ్చేశా. సీఐ శంకరయ్య, అధికారులు, బంధుమిత్రులు, ఎర్ర గంగిరెడ్డి వచ్చారు. గంగిరెడ్డి అక్కడి వ్యవహారాలను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బయటకు తేవాలని ఇనయతుల్లాకు, రక్తపు మడుగుగా మారిన ఇంటిని శుభ్రం చేయాలని లక్ష్మమ్మకు చెప్పారు. లేఖ, సెల్ఫోన్లను ఉదయమే పోలీసులకు ఇచ్చి ఉంటే రక్తపు మరకలు శుభ్రం చేయకుండా పోలీసులు అడ్డుకుని ఉండేవారు. గంగిరెడ్డి ఎవరి ఆదేశాలతో రక్తపు మరకలు తుడిపించారు? ఎవరి ఆదేశాలతో ఇనయతుల్లా ఫొటోలు, వీడియోలు తీశారు? వాటిని కుటుంబ సభ్యులకు ఎందుకు పంపారు? వివేకా ఎలా చనిపోయారో తెలిసినప్పటికీ అనుమానాస్పద మృతి అని ఎవరి ఆదేశాలతో కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారో తేల్చాలి. గుండెపోటుతో మరణించారని ఆదినారాయణరెడ్డి ఎలా చెప్పారు? వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని, శివప్రకాశ్‌రెడ్డి ఈ విషయాన్ని చెప్పారని అప్పటి టీడీపీ మంత్రి ఆది నారాయణరెడ్డి మీడియాకు ఎలా చెప్పారు? వివేకానందరెడ్డి ఇంట్లో పరిస్థితి గురించి సునీత, రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్‌రెడ్డిలకు పూర్తిగా తెలుసు. కృష్ణారెడ్డితో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. మృతదేహం ఫొటోలను ఇనయతుల్లా వాట్సాప్ చేశారు. వివేకానందరెడ్డి శరీరంపై తీవ్ర గాయాలున్నాయని డాక్టర్ నాయక్ వారికి చెప్పారు. అయినా గుండెపోటుతో మృతిచెందారని శివప్రకాశ్‌రెడ్డి మంత్రికి ఎందుకు చెప్పారు? వీరందరూ కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. వాస్తవాలను వెలికి తీసేందుకు వారే కీలకం. వివేకా హత్య వెనుక చంద్రబాబు, టీడీపీ కుట్ర ఉండొచ్చు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డిని హత్య చేశారు. కడప, పులివెందుల నియోజకవర్గాలు వైఎస్సార్ కుటుంబానికి పెట్టని కోటలు. కడపలో వైఎస్సార్సీపీ బలంగా ఉండటంలో వివేకా కీలకంగా ఉన్నారు. ఆయన ఉండటం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజకీయ జీవితానికి ప్రమాదకరం. ఆయన్ని అడ్డు తొలగిస్తే తప్ప పట్టు సాధించలేమని భావించారు. హత్యకు రెండు వారాల ముందు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి, మరికొందరు అప్పటి సీఎం చంద్రబాబును ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఆయన సూచనల మేరకు మళ్లీ విజయవాడలో ఓ హోటల్లో సమావేశమయ్యారు. అనంతరం అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఆయన కార్యాలయంలో కలిశారు. అప్పుడే కుట్ర జరిగి ఉండొచ్చు. హత్యకు ఒకరోజు ముందు పరమేశ్వరరెడ్డి ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రివర్గాలకు చెప్పకుండా బయటకు వచ్చి బీటెక్ రవి, మరికొందరిని కడపలోని హరితా హోటల్లో కలిశారు. వీరంతా ఎన్నో ఫ్యాక్షన్ హత్యల్లో పాల్గొన్నారు. వివేకాను అడ్డు తొలగించుకోవడం టీడీపీకి ఎన్నికల్లో కలసివచ్చే అంశం. చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ హత్యను 2019 ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు కూడా. వివేకానందరెడ్డికి ముప్పు ఉందని తెలిసినప్పటికీ ఆయనకు గన్‌మెన్‌ను టీడీపీ ప్రభుత్వం తొలగించింది. కుట్రతోనే ఇలా చేశారా అన్న విషయంపై దర్యాప్తు జరగాలి. వైఎస్ వివేకా హత్యకేసులో శివశంకర్‌రెడ్డి అరెస్ట్ కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి సీబీఐ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ ద్వారా గురువారం కడప కేంద్రకారాగారంలోని గెస్ట్‌హౌస్‌కు తీసుకొచ్చారు. కడప రిమ్స్‌లోని ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో కోవిడ్–19 పరీక్షలు చేయించిన తరువాత శివశంకర్‌రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపరచగా డిసెంబర్ 2 వరకు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో కడప కేంద్రకారాగారానికి తరలించారు. శివశంకర్‌రెడ్డిని విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. శంకర్‌రెడ్డి అనారోగ్యంతో ఉన్నారు కడప అర్బన్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టు చేసిన శివశంకర్‌రెడ్డి అనారోగ్యంతో ఉన్నారని ఆయన కుమారుడు చైతన్య రెడ్డి సీబీఐకి తెలిపారు. ఆయనకు ఈనెల 15న ఎడమ భుజానికి శస్త్ర చికిత్స జరిగిందని, ఇంకా వైద్యం పొందాల్సిన అవసరం ఉందని సీబీఐకి లేఖ రాశారు. వివేకానందరెడ్డి హత్యలో తన తండ్రి పాత్ర లేదని, కేవలం ఆరోపణలతోనే సీబీఐ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారని తెలిపారు. శివ శంర్రెడ్డిని ఈ నెల 17న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో చైతన్య రెడ్డి సీబీఐకి లేఖ రాస్తూ తన తండ్రికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
న్యాయ పాలనకు విఘాతం కలగనివ్వద్దు
సాక్షి, అమరావతి : న్యాయ వ్యవస్థను, జడ్జిలను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అభ్యంతరకర పోస్టులు పెట్టడం వల్ల న్యాయ పాలనకు విఘాతం కలుగుతుందని హైకోర్టు తెలిపింది. సీబీఐ కేసులు నమోదు చేసినా పోస్టులు పెట్టడం ఆగడం లేదంది. హైకోర్టు ఇటీవల పలు కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్డడంపై విచారణ జరపాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుల్లో తదుపరి పురోగతి లేదంటూ హైకోర్టు తరఫున రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యంపై జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు స్పందిస్తూ, సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన స్థాయీ నివేదకను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచుతున్నామని, ఇది నాలుగవదని చెప్పారు. ఐదుగురిని అరెస్ట్ చేసి వారిపై చార్జిషీట్లు వేశామని, మరో 3 నెలల్లో దర్యాప్తు పూర్తవుతుందన్నారు. సీల్డ్ కవర్లో సీబీఐ ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఇక్కడి నిందితుల విషయంలో సీబీఐ దర్యాప్తు సంతృప్తికరంగా ఉందని, అయితే విదేశాల్లో ఉన్న నిందితుల విషయంలో మాత్రం సీబీఐ విఫలమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విదేశాల్లో ఉన్న నిందితులపై విచారణను వేగవంతం చేయడానికి ఏం చేయాలో తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. సీబీఐ కేసు కొట్టేయాలంటూ పిటిషన్ తన అరెస్ట్‌తో పాటు సీబీఐ ఎఫ్ఐఆర్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని గుంటూరుకు చెందిన అవుతు శ్రీధర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం విచారణ జరిపారు. ఐపీసీ సెక్షన్ 502(2) పిటిషనర్‌కు వర్తించదని అతని తరఫు న్యాయవాది చిన్మోయ్ ప్రదీప్ శర్మ వాదనలు వినిపించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
వివేకా హత్యకేసులో ఆయుధాల కోసం కొనసాగిన గాలింపు
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో ఆయుధాల కోసం వైఎస్సార్ జిల్లా పులివెందులలోని తూర్పు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోగల వంకలో రెండోరోజు ఆదివారం కూడా సీబీఐ అధికారులు గాలించారు. కస్టడీలో ఉన్న సునీల్‌యాదవ్ తెలిపిన వివరాల మేరకు హత్యకేసుకు ఉపయోగించిన ఆయుధాల కోసం శనివారం గాలించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 6 గంటలకు కడప నుంచి సునీల్‌యాదవ్ సహా సీబీఐ అధికారులు వంక బ్రిడ్జి వద్దకు చేరుకుని మునిసిపల్ పారిశుధ్య కార్మికులతో ఆయుధాలకోసం గాలింపు చర్యలు చేపట్టారు. వంకలో బురద ఎక్కువగా ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం జేసీబీ వాహనాన్ని తెప్పించి బురదను తొలగించే కార్యక్రమం చేపట్టారు. కడప రైల్వేస్టేషన్ మేనేజర్ మోహన్‌రెడ్డి సాక్ష్యంగా చేపట్టిన ఈ గాలింపులో సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి ఆయుధాలు లభించలేదు. దీంతో అధికారులు వెనుదిరిగారు. సోమవారం మళ్లీ గాలించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సీబీఐ బృందంతో సమావేశమైన వివేకా కుమార్తె, అల్లుడు ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఉన్న సీబీఐ బృందాన్ని వైఎస్ వివేకా కుమార్తె సునీతమ్మ, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కలిశారు. గంటకుపైగా సమావేశమైన వారు హత్యకేసుకు సంబంధించి పలు విషయాలు చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఈ హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు వైఎస్ వివేకా వంటమనిషి లక్షుమ్మ కుమారుడు ప్రకాష్, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, యూసీఐఎల్ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి, కాంపౌండర్ ప్రకాష్‌రెడ్డి, వాచ్మెన్ రంగయ్యలను విచారించారు. -
దేశవ్యాప్తంగా 110 ప్రాంతాల్లో సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: సీబీఐ అధికారులు మంగళవారం రికార్డు స్థాయిలో సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 110 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను ప్రధాని మోదీ హయాంలో అవినీతిపై చేపట్టిన అతిపెద్ద చర్యగా భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ.250 కోట్ల స్కాలర్ షిప్ కుంభకోణానికి సంబంధించి పలు విద్యా సంస్థలపై దాడులు జరిపింది. అదేవిధంగా, యూపీలో రద్దయిన నోట్ల చెలామణీ ఆరోపణలపై నాలుగుచోట్ల సోదాలు జరిపింది. రూర్కెలాలోని బోకారో స్టీల్ ప్లాంట్‌లో అవినీతి కేసులో రాంచీ, బొకారో, కోల్‌కతాలోని అధికారుల ఇళ్లపై దాడులు చేసింది. ఈ సందర్భంగా సీబీఐ.. అవినీతి, నేర పూరిత ప్రవర్తన, ఆయుధాల స్మగ్లింగ్ తదితర నేరాలకు సంబంధించి 30 కేసులు నమోదు చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఆయుధాల లైసెన్స్ జారీలో అక్రమాలకు సంబంధించి 13 చోట్ల సోదాలు చేశామని సీబీఐ తెలిపింది. మంగళవారం ఉదయం ఏకకాలంలో ప్రారంభమైన ఈ సోదాల్లో 500 మంది అధికారులు పాల్గొన్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా నగదు, నగలతోపాటు పలు బ్యాంకు పత్రాలు, స్థిరాస్తులు, మ్యూచువల్ ఫండ్స్ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. రూ.1,139 కోట్ల బ్యాంకింగ్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ గత వారం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 చోట్ల తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. -
సీబీఐ ముందు హాజరుకావాల్సిందే
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో తమ ముందు హాజరుకావాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులను గౌరవించి తీరాల్సిందేనని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కి హైకోర్టు స్పష్టం చేసింది. అయితే సీబీఐ నిర్దేశించిన మే 4న కాకుండా మే 27, 28 తేదీల్లో సీబీఐ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు బెంగళూరులోని సీబీఐ అధికారుల ముందు హాజరు కావాలని పేర్కొంది. ఆ రెండు రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఇవ్వాలని సూచించింది. అధికారుల విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని సుజనాకు స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాది వెంట ఉంచుకోవచ్చని పేర్కొంది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద విచారణ పేరుతో సుజనా చౌదరిని అరెస్ట్ చేయడం గానీ, శారీరకగా, మానసికంగా వేధింపులకు గానీ గురిచేయొద్దని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. సీబీఐ తనకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ సుజనా చౌదరి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ అమర్నాథ్గౌడ్ విచారణ జరిపారు. ప్రాథమిక ఆధారాలున్నాయి.. సీబీఐ న్యాయవాది కె.సురేందర్ వాదనలు వినిపిస్తూ, సీఆర్పీసీ సెక్షన్160, 161 కింద నోటీసులు ఇచ్చినప్పుడు, విచారణను ఎదుర్కోవడానికి నిరాకరించడానికి వీల్లేదన్నారు. తాము సీఆర్పీసీ సెక్షన్ 41 కింద జరుపుతున్న విచారణ కాదన్నారు. సుజనా గ్రూపు కంపెనీల వ్యవహారాలకు సంబంధిం చిదర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగితాలపైనే లావాదేవీలు చూపినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయన్నారు. అందుకే పిటిషనర్‌కు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ దశలో ఈ కేసు పూర్వాపరాల గురించి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయట్లేదన్నారు. సీబీఐ చెప్పిన మే 4న కాకుండా, ఈ నెల 27, 28 తేదీల్లో ఆ సంస్థ ముందు హాజరు కావాలని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధం లేదు.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. చెన్నైకి చెందిన బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజ్టెక్ట్స్ కంపెనీకి కానీ, ఆ కంపెనీ అధికారులతో కానీ సుజనా చౌదరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు ఇచ్చిన నోటీసులకు సంబంధించి సీబీఐని పిటిషనర్ మరింత సమాచారం, అలాగే ఎఫ్ఐఆర్ కాపీ కోరుతూ లేఖ రాశారన్నారు. అయితే సీబీఐ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఎన్నికల దృష్ట్యా మే 19వ తేదీ వరకు అందుబాటులో ఉండలేనని సీబీఐకి చెప్పారన్నారు. -
నీరవ్ మోదీ కోసం లండన్‌కి సీబీఐ, ఈడీ
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ కేసు లండన్ కోర్టులో విచారణకు రానుండడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బృందం లండన్ బయలుదేరింది. ఈడీ–సీబీఐ నుంచి జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని బుధవారం లండన్ బయలుదేరారు. నీరవ్‌మోదీ భార్య అమీపై ఈడీ ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు కూడా తీసుకువెళ్లనున్నారు. భారతీయ అధికారులు ఆ దేశంలోని వివిధ అధికారులను, క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌ను కలిసి మోదీ, అతని కుటుంబ సభ్యులు, ఇతరులపై భారత్‌లో దాఖలైన కేసులకు సంబంధించిన వివరాలు, తాజా సాక్ష్యాలు గురించి వారికి తెలియజేస్తారు. నీరవ్‌మోదీ తన బంధువు మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రుణాలు తీసుకుని ఎగవేసినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. -
బ్యాంకుకే కన్నం వేసిన మేనేజర్
సాక్షి, హైదరాబాద్: కంచె చేను మేయడం అంటే ఇదేనేమో! ఓ బ్యాంకు మేనేజర్ తాను పనిచేస్తున్న బ్రాంచ్‌ను నిలువుగా ముంచిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నాగర్‌గూడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఎన్.కృష్ణఆదిత్య అదే బ్యాంకులో తన పేరిట సేవింగ్ ఖాతా తెరిచాడు. తన స్నేహితుడు నీరటి కృష్ణయ్య పేరుపై రూ.9 లక్షలతో ఓవర్ డ్రాఫ్ట్(ఓడీ) అకౌంట్ తెరిచాడు. ఈ బ్యాంకు పరిధిలో ఉన్న 77 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి డబ్బులను ఆన్లైన్ ద్వారా సేవింగ్ ఖాతాలోకి బదిలీ చేసుకోవడంతోపాటు ఓడీ అకౌంట్‌పై రూ.92 లక్షలు బ్యాంకు నుంచి బదిలీ చేశాడు. 77 అకౌంట్లతో 24 మంది ఖాతాదారుల అనుమతి లేకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా డబ్బులను తన సేవింగ్ ఖాతాలోకి మళ్లించినట్టు బ్యాంకు రీజినల్ మేనేజర్ అంతర్గత విచారణలో బయటపడింది. ఇక్కడితో ఆగకుండా కృష్ణఆదిత్య 53 మంది పేర్లతో తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి బ్యాంకు ఖాతాలు తెరిచాడు. వీళ్ల ఖాతాలపై రూ.62 లక్షలను రుణాల పేరిట దండుకున్నాడు. దుర్గాభవానీ, జై భవానీ మద్యం దుకాణాలకు ఎలాంటి రుణ ష్యూరిటీ పత్రాలు లేకుండానే రూ.60 లక్షలు రుణాలు మంజూరు చేశాడు. గ్రూప్ ఆఫ్ కస్టమర్ల పేరుతో 11 మందికి అర్హత లేకున్నా క్రెడిట్ రుణాలు మంజూరు చేసి బ్యాంకుకు నష్టం వచ్చేలా చేసినట్టు గుర్తించారు. అయితే, ఈ వ్యవహారం ఓ ఖాతాదారుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చినట్టు ఎస్బీఐ రీజినల్ మేనేజర్ జె.దుర్గాప్రసాద్ తెలిపారు. తనకు సమాచారం లేకుండా తన అకౌంట్ నుంచి రూ.2 లక్షలను డ్రా చేసి కృష్ణఆదిత్య తన అకౌంట్లో వేసుకున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరపగా మొత్తం కుంభకోణం బయటపడిందని దుర్గప్రసాద్ సీబీఐకి రెండు రోజుల క్రితం చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణ ఆదిత్య మొత్తం రూ.3.46 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు తేలిందన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సీబీఐ హైదరాబాద్ రేంజ్ అధికారులు ప్రాథమిక విచారణ జరిపి బ్యాంక్ మేనేజర్ కృష్ణ ఆదిత్యతోపాటు క్యాషియర్ కమ్ క్లర్క్ లేళ్ల శశిధర్, తాత్కాలిక మేనేజర్ ఆరె సత్యం, అసిస్టెంట్ మేనేజర్ మహ్మద్, సుజాత్ అలీ సిద్దిఖీ, ఇతడి స్నేహితులు మహ్మద్ అబ్దుల్ ఖలీముల్లా షబ్బీర్, మహ్మద్ జబీరుల్లాపై సీబీఐ కేసులు నమోదు చేసింది. -
కూపీ లాగితే ‘సీబీఐ’ డొంక కదులుతోంది!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) నేడు ఇంతగా భ్రష్టుపట్టి పోవడానికి కారకులు ఎవరు? అందుకు బాధ్యులు ఎవరు? సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై అవినీతి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ దాఖలయితే ఆయనపై మాత్రమే చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆయనతోపాటు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై కూడా ఎందుకు చర్యలు తీసుకుంది? ఇద్దరిని బలవంతపు సెలవు మీద ఎందుకు పంపించింది? అసలు గుజరాత్ ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన రాకేశ్ అస్థానా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ స్థాయికి ఎలా ఎదిగారు? ఆయన నియామకాన్ని సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎందుకు సవాల్ చేశారు? ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అభిమాన పాత్రుడు ఎలా అయ్యారు? మోదీకి అస్థానాను పరిచయం చేసిందెవరు? అస్థానా ఇంతవరకు డీల్ చేసిన కేసులేమిటీ? 2016లో వడోదరలో విలాసవంతమైన తన కూతురు పెళ్లి వేడకులకు డబ్బులు ఖర్చు పెట్టిందెవరు? చివరకు తానే ఓ కేసులో పీకల దాకా ఎలా కూరుకుపోయారు? ఆ కేసేమిటీ? సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకు ఆదర్శ నాయకుడని చెప్పుకునే రాకేశ్ అస్థానా తనకు తాను ‘ఉక్కు మనిషి’ని అని చెప్పుకుంటారు. ఆయన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాశ్ చంద్రబోస్, వివేకానందుడినితో పోలుస్తూ 2018, ఏప్రిల్ నెలలో ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. అస్థానానే తనకు తాను అలా ప్రమోట్ చేసుకున్నారని అప్పుడు ఆరోపణలు వచ్చాయి. హవాలా కేసులో ‘స్టెర్లింగ్ బయోటెక్’ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకొన్న ‘డైరీ ఆఫ్ 2011’ కేసులో ఆస్థానా నిందితుడు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థుల ప్రమేయం ఉన్న ‘అగస్ట వెస్ట్‌ల్యాండ్’ రక్షణ కుంభకోణం, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై, భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా, రాజస్థాన్ అంబులెన్స్ కుంభకోణం లాంటి కేసులను విచారించడం ద్వారా అస్థానా పేరు బాగా వెలుగులోకి వచ్చింది. అంతకంటే 2002లో ‘గోద్రా రైలు దుర్ఘటన’ కేసును దర్యాప్తు జరిపిన సిట్‌కు నాయకత్వం వహించిందీ అశోక్ అస్థానానే. 2002, ఫిబ్రవరి 27వ తేదీన కర సేవకుల బోగీలు తగులబడి 58 మంది మరణించిన విషయం తెల్సిందే. 2002, మార్చి నెలలో దాఖలైన మొదటి చార్జిషీటులో రైలు ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందని పేర్కొన్నారు. ఈ బోగీలను ముస్లింలు తగులబెట్టారన్న వార్తల కారణంగానే గుజరాత్ అంతటా అల్లర్లు చెలరేగడం, రెండువేల మందికి పైగా మరణించడం తెల్సిందే. అప్పటి మోదీ నాయకత్వంలోని గుజరాత్ ప్రభుత్వం 2002, మే నెలలో రాకేశ్ అస్థానా నాయకత్వాన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. జూలై 9వ తేదీ నాటికల్లా కేసు దృక్కోణమే మారిపోయింది. రైలు ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదని, స్థానిక ముస్లిం వ్యాపారి ఒకరు కుట్రపన్ని రైలు బోగీలను తగులబెట్టారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ మేరకు 2002, సెప్టెంబర్ నెలలో ఛార్జిషీటు దాఖలయింది. 2003, ఫివ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజమ్ యాక్ట్’ కింద నిందితులపై అభియోగాలు మోపారు. కేంద్రంలోని యూపీఏ హయాంలో 2005లో ‘పోటా’ రివ్యూ కమిటీ పోటా ఆరోపణలను కొట్టివేసింది. గోద్రా కేసు విచారణ మాత్రం వివిధ కోర్టుల్లో అనేక ఏళ్లపాటు కొనసాగింది. 2011లో ట్రయల్ కోర్టు 11 మంది నిందితులకు మరణశిక్ష, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2017లో గుజరాత్ హైకోర్టు మరణ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చింది. అహ్మదాబాద్ పేలుళ్ల కేసును కూడా 2008లో సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ పేలుళ్ల కేసు దర్యాప్తు బృందానికి కూడా అస్థానానే ఇంచార్జీగా వ్యవహరించారు. నగరంలో నాడు సంభవించిన 22 పేలుళ్లలో 56 మంది అమాయకులు మరణించారు. నరేంద్ర మోదీ ‘సెక్యూరిటీ’ అనే నినాదంపైనే వరుసగా రెండో సారి ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆ కేసు దర్యాప్తులో మరో పోలీసు అధికారి అభయ్ చుడాసమా కూడా ముక్యపాత్ర వహించారు. అప్పుడు అస్థానా బరోడా పోలీసు కమిషనర్‌గా పనిచేస్తుండగా, అభయ్ డిప్యూటీ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 2005లో జరిగిన షొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో అభయ్ చుడాసమ ప్రధాన నిందితుల్లో ఒకరు. ‘ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)’ విద్యార్థులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని అస్థానా బృందం చివరకు తేల్చింది. అద్వానీతో పరిచయం లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన్ని పశుదాణా కేసులో విచారించి ఆయనపై చార్జిషీటు దాఖలవడానికి బాధ్యుడయ్యాడని ప్రశంసలు అందుకున్న అస్థానా 2000 సంవత్సరంలో ఎల్కే అద్వానీకి పరిచయం అయ్యారు. అద్వానీ గుజరాత్‌కు వచ్చినప్పుడు ఆయనకు సెక్యూరిటీ ఆఫీసర్‌గా వెళ్లిన అస్థానా, తనకుతాను పరిచయం చేసుకొని తాను సర్దార్ వల్లభాయ్ పటేల్ అభిమానినని, ఆ తర్వాత తమనూ అభిమానిస్తానని చెప్పారట. 2002లో అద్వానీ స్వయంగా తన వెంట తీసుకెళ్లి అస్థానాను మోదీకి పరిచయం చేశారట. ఢిల్లీకి పిలుపు.. 2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొంత కాలానికే ఢిల్లీకి బదిలీ చేస్తూ అస్థానాకు ఉత్తర్వులు అందాయి. 2017లో ఆయన్ని సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘స్టెర్లింగ్ బయోటెక్’ హవాలో కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అస్థానాను సీబీఐ అధికారిగా ఎలా నియమిస్తారంటూ ‘కామన్ కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టులో కేసు వేశారు. దాన్ని తొలుత సుప్రీం కోర్టు కొట్టి వేయగా, మళ్లీ రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. 3.83 కోట్ల ముడుపులు స్టెర్లింగ్ బయోటెక్ కంపునీ నుంచి సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీలో రాకేశ్ అస్థానాకు 3.83 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చినట్లు నమోదై ఉంది. ఈ డైరీ ఆధారంగానే ఆ కంపెనీపై సీబీఐ 2017లోనే చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ అందులో అస్థానా పేరును పేర్కొనలేదు. 2016లో వడోదరలో వైభవంగా జరిగిన కూతురు పెళ్లికి పెళ్లి వేదిక నుంచి భోజనాల వరకు ‘స్టెర్లింగ్ బయోటెక్’ కంపెనీ వర్గాలే స్పాన్సర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. గత జూలై నెలలో అలోక్ వర్మ విధి నిర్వహణలో భాగంగా దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆయనకు చెప్పకుండా, ఆయన అనుమతి లేకుండా అస్థానా సీబీఐలో కొత్త నియామకాలు జరిపారు. వర్మ వచ్చాక ఈ విషయమై కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈడీ దాడులతో స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీ డైరెక్టర్లు చేతన్, నితిన్ సండేసర ఆస్తులపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ సెప్టెంబర్ నెలలో దాడులు చేయడంతో మరోసారి ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ హవాల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా అస్థానా తనను వేధిస్తున్నారని, ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తే కేసు లేకుండా చూస్తానని చెబుతున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన సతీష్ సనా అనే వ్యాపారి సీబీఐకే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న సీబీఐ డైరెక్టర్ వర్మ అక్టోబర్ 15వ తేదీన అస్థానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వర్మ రాజకీయ పక్షపాతి అని, అవినీతికి పాల్పడుతున్నారంటూ అస్థానా కూడా కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు లేఖ రాశారు. ఇద్దరిపై ఆరోపణలు వచ్చినందునే.. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ అస్థానాపై అవినీతి ఆరోపణలు వస్తే ఆయనపై చర్య తీసుకోవాలిగానీ, డైరెక్టర్ అలోక్ వర్మపై ఎందుకు చర్య తీసుకున్నారని విలేకరులు ప్రశ్నించగా, ఇద్దరిపై అవినీతి ఆరోపణలు వచ్చినందున ఇద్దరిపై చర్యలు తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు సీబీఐ డైరెక్టర్‌పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. ఆయన నీతివంతుడు, నిజాయితీపరుడంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణియం ప్రశంసించడం ఇక్కడ గమనార్హం. ఓ నిందుతుడు చేసిన కౌంటర్ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్నారంటే అరుణ్ జైట్లీకి వివేకమెంతుందో ఆయనకే తెలియాలి. -
‘సిట్’ పిటిషన్‌కు సుప్రీం ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని విచారించేందుకు కోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిల్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఈ పిల్ వేశారు. సీబీఐని ప్రభావితం చేస్తున్న విస్తృత అవినీతికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని, వెంటనే విచారణకు చేపట్టాలన్న ఆయన విజ్ఞప్తికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల బెంచ్ అంగీకరించింది. పూర్తి వివరాలు సమర్పించాలని, పిటిషన్‌ను అత్యవసరంగా విచారించే అంశాన్ని పరిశీలిస్తామని భూషణ్‌కు తెలిపింది. అలోక్ వర్మను సెలవుపై పంపుతూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేయాలని భూషణ్ కోర్టును కోరారు. కేబినెట్ సెక్రటరీ, సీవీసీ, రాకేశ్ అస్థానా, అలోక్ వర్మ, నాగేశ్వరరావులను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. ‘ప్రతివాదులు దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ స్వతంత్రతను దెబ్బతీయాలని చూశారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు ఉన్నప్పటికీ ఆ నిబంధనను పక్కనబెడుతూ ఆయన్ని సెలవులోకి పంపి తాత్కాలిక డైరెక్టర్‌ను నియమిస్తూ చట్టబద్ధమైన నియామక ప్రక్రియను ఉల్లంఘించారు. ఒకవేళ సీబీఐ డైరెక్టర్‌పై ఫిర్యాదులు వస్తే సీవీసీ నేరుగా తొలగించకూడదు. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన హైపవర్డ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నారు. దురుద్దేశపూర్వకం.. సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్లను విధుల నుంచి తప్పిస్తూ సీవీసీ, ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు దురుద్దేశపూర్వకమని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ‘రాకేష్ అస్థానాపై చర్యలు తీసుకున్నందుకే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను బాధితుడిగా చేసినట్లు తెలుస్తోంది. రాకేష్ అస్థానాను స్పెషల్ డైరెక్టర్‌గా నియమించినప్పుడే అలోక్ వర్మ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అస్థానాపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని అలోక్ 2017 అక్టోబరు 21న కేబినెట్ కన్సల్టేషన్ కమిటీకి లేఖ రాశారు. సంబంధిత ఆరోపణలు ఉన్న కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోందని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. సీనియర్ ఐటీ అధికారులు ముగ్గురు గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్, సందేసర గ్రూప్ కంపెనీల నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ ఢిల్లీ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో అస్థానా పాత్ర కూడా ఉంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సతీష్ బాబు సానా అస్థానాకు లంచం ఇచ్చారన్న మరో కేసు కూడా దర్యాప్తులో ఉంది. దీనిపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు నమోదవగానే అస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అదే రోజు రాత్రి కేంద్రం, సీవీసీలు..డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి’ అని పిటిషన్లో పేర్కొన్నారు. -
మాల్యా కేసులో సీబీఐ ముందడుగు
లండన్: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా సీబీఐ అధికారులు సమర్పించిన అనేక ఆధారాలను లండన్ మెజిస్ట్రేట్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో మాల్యాను భారత్‌ను రప్పించేందుకు సీబీఐ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి మద్దతు లభించినట్లయింది. మాల్యాను భారత్‌కు రప్పించే కేసు విచారణ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం విచారణకు మాల్యా కోర్టుకు హాజరయ్యారు. భారత్ తరఫున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) సమర్పించిన ఆధారాలపై స్పందించేందుకు మరింత సమయమివ్వాలని మాల్యా తరఫు న్యాయవాదులు కోర్టును కోరగా.. జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత్ తరఫున అందచేసిన అదనపు సమాచారం సహాయకరంగా ఉంటుందని సంతృప్తి వ్యక్తం చేశారు. జూలై 11కు విచారణ వాయిదాపడింది. -
బీజేపీ ఎమ్మెల్యేకి వారం రోజుల సీబీఐ కస్టడీ
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను ఏడు రోజుల సీబీఐ కస్టడీకి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ యువతి(17)పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాహాబాద్ హైకోర్టు ఉత్తర్వులతో సీబీఐ అధికారులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని కొన్ని గంటలపాటు విచారన జరిపారు. గతేడాది జూన్ 4వ తేదీన బాధితురాలు ఉద్యోగం కోసం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లింది. కానీ నిందితుడు కుల్దీప్ సింగ్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఫిబ్రవరిలో బాధితురాలి కుటుంబసభ్యులు ఎమ్మెల్యేపై రేప్ కేసు పెట్టగా, యువతి తండ్రిని అక్రమంగా ఆయుధాలు ఇంట్లో ఉంచుకున్నాడని ఆరోపిస్తూ అరెస్ట్ చేశారు. చివరికి జైళ్లోనే లాకప్ డెత్ అయ్యాడు. దీంతో వివాదం పెద్దది కావడంతో ఎట్టకేలకు నిందితుడు కుల్దీప్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఉన్నావ్ ఘటనలో దోషులు ఎంతవారైనా వదిలిపెట్టబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే సిట్‌ను ఏర్పాటుచేశామన్న విషయం విదితమే. -
మార్కెట్ యార్డుల్లో సీబీఐ తనిఖీలు
క్రోసూరు : క్రోసూరు మార్కెట్ యార్డులో బుధవారం సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో సీసీఐ ద్వారా జరిగిన పత్తి కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ జరుగుతున్న విషయం విదితమే. ఈ ఏడాది మార్కెట్ యార్డులో సీసీఐ రూ.3.25 లక్షల మేర పత్తి కొనుగోళ్లు చేసింది. వీటికి సంబంధించి రికార్డులు స్వాధీన పరుచుకున్నారు. పత్తి ఎంతమేర యార్డుకు చేరుకుందో వాటికి సంబంధించి రికార్డులు, వేబిల్లులు, రైతు పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్సు కాపీలు, సేల్స్ రికార్డులు, వేబ్రిడ్జి తూకాల బిల్లులు స్వాధీన పరుచుకున్నట్లు తెలిసింది. ప్రతి ఏటా మార్కెట్‌యార్డులో రైతుల పేరుతో పత్తి కొనుగోళ్లు చేసేది తక్కువని, అంతా బ్రోకర్ల ద్వారా యార్డుకు చేరుకున్నవేనని కొందరు రైతులు సీబీఐ అధికారులకు తెలిపారు. పాస్ పుస్తకాల జిరాక్సు కాపీలు లేకుండా రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు చూపిస్తూ బ్రోకర్ల నుంచి సీసీఐ కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. పిడుగురాళ్ల యార్డులో తనిఖీలు పిడుగురాళ్ల రూరల్ : స్థానిక వూర్కెట్ యూర్డులో సీబీఐ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. గత ఏడాది సీసీఐ పత్తి కొనుగోలు జరిగిన వూర్కెట్ యూర్డులు అన్నింట్లోనూ తనిఖీలు నిర్వహించారు. వాటికి సంబంధించి చెక్ బుక్‌లు, బిల్ పుస్తకాలు, రైతులకు ఇచ్చిన బిల్లులను, యూర్డుకు సంబంధించిన రిజిష్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు 6 గంటలపాటు రెండు బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాగా, దీనిపై వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన విలేకరులపై సీబీఐ అధికారులు విరుచుకుపడ్డారు. -
ఏసీబీ వలలో ఆర్డబ్ల్యూఎస్ డీఏవో
- రూ.52వేలు లంచం తీసుకుంటూ.. - బిల్లు మంజూరుకు పర్సంటేజీ డిమాండ్ ఆదిలాబాద్ రూరల్ : అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు అవినీతి చేప చిక్కింది. రూరల్ వాటర్ సప్లయ్ శాఖలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(ఆర్డబ్ల్యూఎస్ డీఏవో)గా పనిచేస్తున్న పిల్లి క్రాంతికుమార్ ఓ బోర్వెల్ సివిల్ కాంట్రాక్టర్ నుంచి రూ.52వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌కు చెందిన బోర్వెల్ సివిల్ కాంట్రాక్టర్ నారాయణరెడ్డి రెండేళ్ల క్రితం 136 బోర్వెల్లను ఫ్లషింగ్ చేశాడు. వీటి వ్యయం రూ.6లక్షలు అయింది. పనులు పూర్తి చేసినా బిల్లు మంజూరు చేయడంలో అధికారులు జాప్యం చేశారు. బిల్లు మంజూరు, ఇతర పనులకు సంబంధించి బిల్లుపై 7శాతం డబ్బు ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను డీఏవో క్రాంతికుమార్ డిమాండ్ చేశాడు. బిల్లుపై ఏడు శాతం ఇవ్వాలని కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏడు శాతంతో రూ.42వేలు అవుతుందని, బిల్లు మంజూరు చేయడంలో తాను ఎక్కువగా శ్రమ పడాల్సి వచ్చిందని అందుకు అదనంగా మరో రూ.10వేలు ఇవ్వాలని డీఏవో డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ నారాయణరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పట్టణంలోని టీచర్స్ కాలనీలో క్రాంతికుమార్ తన ఇంట్లో గురువారం నారాయణరెడ్డి నుంచి రూ.52వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. జిల్లాలో అవినీతికి పాల్పడే అధికారుల సంఖ్య పెరిగిందని, వివిధ శాఖల్లో లంచం లేనిదే అధికారులు పనులు చేయడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ డీఎస్సీ సుదర్శన్గౌ తెలిపారు. అలాంటి అధికారులపై దాడులు చేస్తామని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాలను మంజూరు చేయడంలో సైతం అధికారులు లబ్ధిదారుల నుంచి వేలాది రూపాయలు లంచం తీసుకుంటున్నట్లు తమ కు ఫిర్యాదులు అందయన్నారు. అవినీతికి పాల్పడే అధికారులను వదిలేది లేదని పేర్కొన్నారు.