విశాఖ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు | Turning Point In The Visakha Drug Case | Sakshi
Sakshi News home page

విశాఖ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు

Published Fri, Mar 22 2024 4:27 PM | Last Updated on Fri, Mar 22 2024 4:36 PM

Turning Point In The Visakha Drug Case - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్‌ కేసు కీలక మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో వీరభద్రరావు, కోటయ్య చౌదరిని సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 140 శాంపిల్స్‌ను సీబీఐ మేజిస్ట్రేట్ ఎదుట మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఐ అధికారుల బృందంతో పాటు డీఐజీ విశాల్ గున్ని మరోసారి పోర్టులో కంటైనర్‌ని పరిశీలించారు.

విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ స్మగ్లింగ్‌ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ, వ్యాపార సంబంధాలూ బయటపడ్డాయి.

ఇంటర్‌పోల్‌ సమాచారంతో ఆపరేషన్‌ గరుడలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా డ్రై ఈస్ట్‌తో కలిపి బ్యాగుల్లో ప్యాక్‌ చేసిన ఈ డ్రగ్స్‌ కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్‌లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్‌లు.. మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్‌ డ్రై ఈస్ట్‌తో మిక్స్‌ అయిన డ్రగ్స్‌ ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.

ఇదీ చదవండి: విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్‌.. 'కేరాఫ్‌ కోటయ్య చౌదరి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement