న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని ఆప్ ఆరోపించింది. తప్పుడు అభియోగాలను ఒప్పుకుని, సంతకాలు చేయాలంటూ ఆయన్ను బలవంతం చేస్తున్నారని పేర్కొంది.
ఆప్ జాతీయ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించి సీబీఐ వద్ద ఆధారాలు లేవన్నారు. సిసోడియా నివాసంపై జరిపిన దాడుల్లోనూ ఏమీ దొరకలేదని చెప్పారు. సిసోడియా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment