ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, తాజాగా సిసోడియా భార్య అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసొచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అనుమతించింది.
దీంతో, శనివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య సిసోడియాను ఇంటికి తీసుకెళ్లాలని తీహార్ జైలు సూపరింటెండెంట్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు మనీశ్ సిసోడియాను శనివారం ఉదయం జైలు నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సిసోడియా తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే, అనూహ్యంగా సిసోడియా ఇంటికి చేరుకోవడానికన్నా ముందే ఆయన భార్య అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
ఇక, ఆమె ఆసుపత్రిలో ఉండటంతో జైలు అధికారులు.. సిసోడియాను ఆసుపత్రి వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో తన భార్య, కుటుంబ సభ్యులను ఆసుపత్రిలోనే కలుసుకున్నారు. అక్కడే వారితో మాట్లాడారు. కాగా, సాయంత్రం 5 గంటలకు సిసోడియా మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఒడిషా రైలు ప్రమాదంపై రిటైర్డ్ ఉద్యోగి, యూనియన్ నేత సంచలన కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment