Tortures
-
ఎటు చూసినా మృతదేహాలే
డమాస్కస్: ఎక్కడ చూసినా శవాల కుప్పలు. రాజధాని డమాస్కస్‌తోపాటు కుతైఫా, ఆద్రా, హుస్సేనియాల తదితర ప్రాంతాల్లో సామూహిక సమాధులు! సిరియాలో ఇటీవల కుప్పకూలిన అసద్ ప్రభుత్వం అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుగుబాటుదారులను బంధించి జైళ్లలో చిత్రహింసలు పెట్టడమే గాక దారుణంగా హతమార్చినట్టు తేలింది. అలా అదృశ్యమైనవారి మృతదేహాలు ఎక్కడపడితే అక్కడ బయటపడుతున్నాయి. సిరియా అంతటా సామూహిక సమాధులేనన్న వార్తల నేపథ్యంలో సిరియన్ ఎమర్జెన్సీ టాస్‌్కఫోర్స్ (ఈటీఎఫ్) అనే అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇటీవల దేశంలో పర్యటించింది. దాని పరిశీలనలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటికొచ్చాయి... లక్షల మంది గల్లంతు సిరియాలో తిరుగువాబాటు చేసిన వారందరినీ బషర్ అల్ అసద్ ప్రభుత్వం నిర్బంధించింది. జైళ్లలో పెట్టి చిత్ర హింసలకు గురి చేసింది. ఆ క్రమంలో వేలాది మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఎవరికీ తెలియలేదు. అలా 2011 నుంచి ఇప్పటివరకు ఏకంగా లక్ష మందికి పైగా అదృశ్యమయ్యారు. 2014లో కనపించకుండా పోయిన సోదరుడి కోసం ఓ మహిళ, 2013లో అరెస్టయిన కుమారుడి కోసం ఓ తండ్రి ఇప్పటికీ వెదుకుతూనే ఉన్నారు. హయత్ తహ్రీర్ అల్షామ్ (హెచ్‌టీఎస్) తిరుగుబాటు సంస్థ దేశాన్ని హస్తగతం చేసుకోవడం, అసద్ రష్యాకు పారిపోవడం తెలిసిందే. అనంతరం సిరియా రక్షణ దళం వైట్హెల్మెట్స్తో కలిసి హెచ్‌టీఎస్ సిరియా అంతటా జైళ్లు, నిర్బంధ కేంద్రాలను తెరిచింది. అసద్ హయాంలో నిర్బంధించిన వేలాది మందిని విడుదల చేసింది. ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయిన తమ ఆత్మీయులకోసం అనేకమంది జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. వారేమైనట్టు? తిరుగుబాటుదారులను చిత్రహింసలు పెట్టి చంపాక అసద్ సర్కారు సామూహికంగా ఖననం చేసింది. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అలా ఇప్పటికే ఏకంగా లక్షకు పైగా మృతదేహాలను కనుగొన్నారు! సామూహిక సమాధులున్న మరో 66 ప్రాంతాలనూ గుర్తించారు. డమాస్కస్ వాయవ్యంగా ఉన్న కుతైఫా పట్టణంలో వేలాది మృతదేహాలను వేర్వేరు చోట్ల సామూహికంగా ఖననం చేసినట్లు ఈటీఎఫ్ తెలిపింది. డమాస్కస్ విమానాశ్రయ మార్గంలో హుస్సేనియేయాలోనూ సామూహిక సమాధులు బయటపడ్డాయి. దక్షిణ సిరియాలో పన్నెండు సామూహిక సమాధులు కనుగొన్నారు. సిరియాలో గల్లంతైన వారిలో 80,000 మందికి పైగా చనిపోయినట్టు హక్కుల సంఘం ఇప్పటికే తేలి్చంది. 60,000 మందిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బ్రిటన్‌కు చెందిన వార్ మానిటర్ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎస్ఓహెచ్ఆర్) తెలిపింది. గుర్తించలేని స్థితిలో శవాలు ఖననం చేసి చాలాకాలం కావడంతో చాలావరకు శవాల అవశేషాలే మిగిలాయి. దాంతో మృతులనుగుర్తించడం కష్టంగా మారింది. చేసేది లేక పుర్రెలు, ఎముకలనే భద్రపరుస్తున్నారు. డీఎన్ఏ నమూనాల డాక్యుమెంటేషన్, తదుపరి విశ్లేషణ కోసం బ్లాక్ బాడీ బ్యాగుల్లో విడిగా ఉంచుతున్నారు. హత్యకు గురైన వారిని మున్ముందైనా గుర్తించగలమని ఈటీఎఫ్ ఆశాభావం వెలిబుచి్చంది. -
సిసోడియాను సీబీఐ చిత్రహింసలు పెడుతోంది: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని ఆప్ ఆరోపించింది. తప్పుడు అభియోగాలను ఒప్పుకుని, సంతకాలు చేయాలంటూ ఆయన్ను బలవంతం చేస్తున్నారని పేర్కొంది. ఆప్ జాతీయ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించి సీబీఐ వద్ద ఆధారాలు లేవన్నారు. సిసోడియా నివాసంపై జరిపిన దాడుల్లోనూ ఏమీ దొరకలేదని చెప్పారు. సిసోడియా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. -
ఉక్రెయిన్‌లో శవాల దిబ్బలు
ఇజియం (ఉక్రెయిన్): ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ ప్రాంతంలో భారీగా శవాల దిబ్బలు బయట పడుతున్నాయి. ఇజియంలో రష్యా బలగాలు 400కు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని ఉక్రెయిన్ బలగాలు గుర్తించాయి. కొన్నింటిపై తూటాల గాయాలుండగా, మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల్లో మరణించి ఉంటారని భావిస్తున్నారు. కొన్ని మృతదేహాలకు చెవులు కోసేసి ఉండటంతో రష్యా సైనికులు చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడికి సమీపంలోనే మరో చోట 17 ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలను కొనుగొన్నారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ..బుచా, మరియుపోల్, ఇజియం..రష్యా ప్రతి చోటా మరణశాసనం రాసింది. ఇందుకు ఆ దేశం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని అన్నారు. ఇలా ఉండగా, రష్యాను సైనికపరంగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు మరో 600 మిలియన్ డాలర్ల సాయాన్ని అందజేస్తామని అమెరికా ప్రకటించింది. -
మూగజీవాలను హింసిస్తున్న వ్యక్తి
-
ప్రియుడి కోసం కన్న బిడ్డలకు వాతలు
వేలూరు: ప్రియుడితో ఉల్లాస జీవితానికి అడ్డంకిగా ఉన్నారని కన్న బిడ్డలకు చిత్రహింసలు పెడుతూ నిత్యం నరకం చూపుతున్న తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తిరుత్తణికి చెందిన గణేశన్, కవిత(27) దంపతులు. వీరికి మహాలక్ష్మి, కార్తీక్ అనే ఇద్దరు పిల్లలున్నారు. గణేశన్ 7సంవత్సరాల కిందట మృతి చెందాడు. ఈ స్థితిలో రెండేళ్ల కిందట కవిత ఇద్దరు పిల్లలను తీసుకొని వేలూరు జిల్లా గుడియాత్తంకు చేరింది. అక్కడ రాజన్ ఆలయం ప్రాంతంలోని హౌసింగ్ బోర్డులో నివసిస్తోంది. పిల్లలు మహాలక్ష్మి 6వ తరగతి, కార్తీక్ ఐదవ తరగతి చదువుతున్నారు. ఇదిలా ఉండగా అదే ప్రాంతానికి చెందిన రామలింగం కుమారుడు గోపితో కవితకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో కవిత, గోపి వివాహం చేసుకొని ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. తమ ఉల్లాస జీవితానికి అడ్డుగా ఉన్న పిల్లలను వీరిద్దరూ చిత్రహింసలకు గురిచేసేవారు. కవిత రోజూ మహాలక్ష్మికి పాత్రలు కడగడం, దుస్తులు ఉతకడం వంటి పనులు చెప్పి పని చేయకుంటే శరీరంపై వాతలు పెట్టడం, వేడి నీళ్లు పోయడం వంటివి చేస్తూ తరచూ హింసించేది. ఈ నేపథ్యంలో తమ ఉల్లాస జీవితానికి పిల్లలు అడ్డంకిగా ఉన్నారని కవిత, గోపి మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో ఆగ్రహంగా ఉన్న కవిత శనివారం ఉదయం పిల్లలపై వేడి నీళ్లను పోసింది. చిన్నారులు ఏడుస్తూ బయటకు పరుగులు తీయడంతో ఇరుగుపొరుగు వారిని దగ్గరకు తీసుకుని విషయం ఆరాతీశారు. అనంతరం దీనిపై గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి కవితతో పాటు ఆమె ప్రియుడు గోపిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. తీవ్ర గాయాలైన చిన్నారులు మహాలక్ష్మి, కార్తీక్‌లను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. -
నొప్పి తెలియని జబ్బు...
ఈ జబ్బు ఉన్నవారిని శారీరకంగా ఎంతగా హింసించినా వారికి తెలియదు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా నొప్పే అనిపించదు. ఇదేదో బాగుందని అనుకుంటున్నారా? నొప్పి తెలియని ఈ కండిషన్ చాలా అరుదుగా వస్తుంది. యికంజెనిటల్ ఇన్సెన్సిటివిటీ టు పెన్’ (సిప్) అని పేర్కొనే ఈ వ్యాధిని వైద్యపరిభాషలో ‘కంజెనిటల్ అనాల్జెసియా’ అంటారు. నొప్పి తెలియనివ్వకుండా చేసే ఎండార్ఫిన్ అనే స్రావాలు మెదడులో మోతాదుకు మించి స్రవించడం వల్ల నొప్పి తెలియకపోవడంతో వాళ్లకు ఏదైనా శరీరక సమస్య వచ్చినా తెలియదు. ఇన్ఫెక్షన్తో కనీసం పన్ను నొప్పి వస్తున్నా అది వాళ్లకు తెలియదు. దాంతో ఇన్ఫెక్షన్ శరీరంలోని ఇతర ప్రాంతాలకు పాకి వాళ్ల ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చు. అందుకే ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. -
దాడి వెనుక ఆ ఇద్దరు ఎస్ఐలు?