న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు తిహార్ జైల్లో ప్రాణ హాని ఉందని పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన్ను ఒకటో నంబర్ జైల్లో కరడుగట్టిన నేరగాళ్లతో కలిపి ఉంచారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
‘‘ధ్యానం చేసుకోవడానికి వీలుగా విపాసన సెల్‌లో ఉంచాలన్న సిసోడియా విజ్ఞప్తి చేశారు. అందుకు కోర్టు కూ డా సమ్మతించినా జైలు అధికారులు మాత్రం తోసిపుచ్చారు’’ అని విమర్శించారు. దీనిపై కేంద్రం బదులిచ్చి తీరాలన్నారు. ఆప్ ఆరోపణలను జైలు వర్గాలు తోసిపుచ్చాయి. ‘‘సిసోడియాతో పాటున్న ఖైదీల్లో అంతా సత్ప్రవర్తన గలవారే. గ్యాంగ్‌స్టర్లెవరూ లేరు’’ అని చెప్పాయి.
Comments
Please login to add a commentAdd a comment