Life threatening
-
పంజాబ్ సీఎంకి లెప్టోస్పిరోసిస్ నిర్ధారణ! అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుంది?
పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. బుధవారం అర్ధరాత్రి భగవంత్ మాన్ హఠాత్తుగా స్పృహ తప్పిపడిపోయారు. హుటాహుటినా ఆయన్ను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు ఆయనకు లెప్టోస్పిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు యాంటీ బయాటిక్స్ అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అసలేంటీ వ్యాధి? ఎందువల్ల వస్తుంది..?.లెప్టోస్పిరోసిస్ అంటే ..?లెప్టోస్పిరోసిస్ అనేది లెప్టోస్పిరా బాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఇది మానవులను జంతువులను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా మానవులకు లెప్టోస్పిరోసిస్ సోకిన జంతువుల ద్వారా లేదా వాటి మూత్రంతో ప్రత్యక్ష సంబంధం లేదా ఆ మూత్రంతో కలుషితమైన నేల, నీరు వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా చర్మంపై కోతలు లేదా రాపిడి ద్వారా లేదా కళ్లు, ముక్కు నోటిలో శ్లేష్మ పొరల ద్వారా మానవుకులకు సంక్రమిస్తుంది. లక్షణాలు..ఈ వ్యాధి కారణంగా అధిక ఉష్ణోగ్రత, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, అతిసారం, చలి, కళ్ళు ఎర్రబడటం తదితర లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి,వాపు చేతులు, కాళ్లల్లో కనిపించడం వంటివి జరుగుతాయి. వ్యాధి తీవ్రత..దీన్ని యాంటీ బయాటిక్స్‌తో రెండు వారాల్లో నయం అయ్యేలా చెయ్యొచ్చు. అదే ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే మాత్రం మూత్రపిండాలకు వ్యాపిస్తుంది. మెదడు, వెన్నుపాము, కాలేయానికి సోకవచ్చు. అరుదైన పరిస్థితుల్లో ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. నిర్థారించడం కష్టమైతే..ఈ వ్యాధిని ఏంటనేది నిర్థారించడం కష్టముతుందని అన్నారు. దీనిపై సదరు వైద్యుడికి సరైన అవగాహన ఉంటేనే నిర్థారించగలరని చెప్పారు. అలాంటి సమయాల్లో మరో వైద్యుడిని కూడా సంప్రదించటం అనేది ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. ఈలోగా ఆ బ్యాక్టీరియా గనుక మెదడులోకి ప్రవేశిస్తే మాత్రం ప్రాణాతంకంగా మారిపోతుంది. అయితే ఇది మానవుడి నుంచి మానవుడికి మాత్రం సంక్రమించదట.ఎందువల్ల అంటే..కాలుష్యం కారణంగా ఈ వ్యాధి వస్తుందని చెబుతున్నారు వైత్యులు. ముక్యంగా కిరాణ స్టోర్స్‌లలో లూజ్కి సరుకులను తీసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకండి. సాధ్యమైనంత వరకు ప్యాక్ చేసి, సీల్ చేసిన వాటినే కొనుగోలు చేయాలని చెబుతున్నారు నిపుణులు. ఉష్ణమండల వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. తొలిసారిగా..1920లలో అండమాన్ దీవుల నుంచి తొలిసారిగా ఈ వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భారతదేశంలోని గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అండమాన్ నికోబార్ దీవులు వంటి తీర ప్రాంత రాష్ట్రాలలో అధికంగా ఉంటుందని వెల్లడించారు నిపుణులు . అయితే ఈ వ్యాధి గణనీయమైన మరణాలకు దారితీసినప్పటికీ చాలా అరుదుగా సంభవించడం గమనార్హం.(చదవండి: ఓ డాక్టర్ హార్ట్ బిట్..! హృదయాన్ని మెలితిప్పే కేసు..!) -
సిసోడియాకు ప్రాణ హాని
న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు తిహార్ జైల్లో ప్రాణ హాని ఉందని పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన్ను ఒకటో నంబర్ జైల్లో కరడుగట్టిన నేరగాళ్లతో కలిపి ఉంచారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ‘‘ధ్యానం చేసుకోవడానికి వీలుగా విపాసన సెల్లో ఉంచాలన్న సిసోడియా విజ్ఞప్తి చేశారు. అందుకు కోర్టు కూ డా సమ్మతించినా జైలు అధికారులు మాత్రం తోసిపుచ్చారు’’ అని విమర్శించారు. దీనిపై కేంద్రం బదులిచ్చి తీరాలన్నారు. ఆప్ ఆరోపణలను జైలు వర్గాలు తోసిపుచ్చాయి. ‘‘సిసోడియాతో పాటున్న ఖైదీల్లో అంతా సత్ప్రవర్తన గలవారే. గ్యాంగ్‌స్టర్లెవరూ లేరు’’ అని చెప్పాయి. -
అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు: చికోటి ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదని, తనకు కేసీనో ఇండస్ట్రీలోని ప్రత్యర్ధుల నుండి ప్రాణహాని ఉందని కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ అన్నారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ, కొంత కాలంగా రెక్కి నిర్వహిస్తున్నారని, పోలీసులు విచారణ జరిపి సెక్యూరిటీ పెంచాలని కోరారు. ‘‘నేను రాజకీయాల్లోకి వస్తునాన్నని తెలిసి టార్గెట్ చేశారు. ఈడీ విచారణ మొదలైనప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈడీ విచారణ దర్యాప్తులో ఉందన్నారు. కేసీనో నిర్వహిస్తున్నానని, అది తన ప్రొఫెషన్ అన్న చికోటి.. ప్రభుత్వానికి టాక్స్‌లు చెల్లించి లీగల్ ఉన్న దగ్గరే కేసీనో నడుపుతున్నానన్నారు. హిందూత్వం కోసం కేసీనోను వదులుకోవడానికి తాను సిద్ధమని, అవకాశం ఉంటే రాజకీయాల్లోకి రావడానికి రెడీ అని చికోటి ప్రవీణ్ అన్నారు. కాగా, చీకోటి ప్రవీణ్ కారు చోరీకి గురైంది. సైదాబాద్ ఇంట్లో కారును దుండగులు దొంగిలించారు. ఇన్నోవా కార్ కీస్ వెతికి కారుతో పరారయ్యారు. సైదాబాద్ పీఎస్‌లో చికోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చదవండి: ఉపాధ్యాయుల వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త -
‘విషం తాగించి, హత్యాయత్నం చేశారు.. నా భర్తతో ప్రాణహాని ఉంది’
సాక్షి, సైదాబాద్: ప్రభుత్వ అధికారి అయిన తన భర్త నుంచి ప్రాణహాని ఉందని పోలీసులు తనను రక్షించి అతనిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ వాపోయింది. ఐఎస్‌సదన్ డివిజన్ సరస్వతీనగర్ కాలనీకి చెందిన బాధితురాలు ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించింది. నాగార్జునసాగర్‌లో ఎస్ఈగా పనిచేస్తున్న కొర్ర ధర్మపై గతంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించి పలు ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న బాధితురాలి పేరుతో ఉన్న ఆస్తులను తన పేరుపై రాసివ్వాలని భర్త ధర్మ వేధింపులకు దిగాడని ఆమె పేర్కొంది. తనను ఇంటి నుండి బయటకు వెళ్లనీయకుండా ఒకగదిలో బంధించాడని ఆరోపించింది. ఈనెల 4న అతను, సహచరులతో కలిసి బలవంతంగా విషం తాగించి తనపై హత్యాయత్నం చేశారన్నారు. ఆసుపత్రిలో నాలుగు సర్జరీలతో తేరుకున్నానని వివరించారు. ఇంటి నుండి ఎలాగోలా బయట పడ్డానని, ఆస్తులన్నీ అతని పేరుతో బదలాయిస్తానని, కానీ తనకు అతని నుండి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. పోలీసు ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. భార్య మిస్సింగ్ అంటూ భర్త ఫిర్యాదు ప్రభుత్వ అధికారి అయిన భర్తపై ఆరోపణలు చేసిన సదరు మహిళ కనపడటంలేదని ఆమె భర్త సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ సబ్బిరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...నాగార్జునసాగర్‌లో ప్రభుత్వ ఉద్యోగి అయిన ధర్మ తన భార్య పద్మజకు కుటుంబ పరిస్థితుల కారణంగా మానసికస్థితి సరిగాలేదని ఆమె శనివారం మధ్యాహ్నం నుండి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. శనివారం రాత్రి సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్: ఇద్దరు పిల్లలతో కలిసి గృహిణి అదృశ్యం -
టీడీపీ నేత నుంచి ప్రాణహాని: శ్రీధర్
సాక్షి, తిరుపతి: టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నుంచి తనకు ప్రాణ ముప్పు ఉందని ఎన్ఆర్ఐ విద్యాసంస్థల తాజా మాజీ సీఈవో శ్రీధర్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్ఆర్ఐ విద్యాసంస్థల సీఈవోగా రాజీనామా చేసి బయటకు వచ్చానని తెలిపారు. వచ్చిన లాభాల్లో 5 శాతం వాటా ఇస్తామని తానను మోసం చేశారన్నారు. కోవిడ్ సమయంలో ఫీజులు తగ్గించమని చెప్పినా పూర్తిగా వసూలు చేశారని.. తనపై ఆలపాటి రాజేంద్రప్రసాద్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. తనకేదైనా జరిగితే టీడీపీ నేత ఆలపాటిదే బాధ్యత అని శ్రీధర్ స్పష్టం చేశారు. చదవండి: రెడ్ మీ నోట్11 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీక్, లుక్ అదిరిపోయింది..! -
వీళ్లు మారరు !
అనంతపురం న్యూ సిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఇంకా కొందరు వైద్యుల్లో నిర్లక్ష్యం వీడలేదు. వీరి బాధ్యతారాహిత్యం.. నిండు ప్రాణాలపై ప్రభావం చూపుతోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతేడాది తాడిపత్రికి చెందిన అక్తార్‌భాను అనే బాలింతకు రక్తమార్పిడి చేసి నిండు ప్రాణాన్ని తీసిన విషయ విధితమే. దీనిపై ప్రభుత్వం స్పందించి అందుకు బాధ్యులైన వైద్యులను సస్పెండ్ చేసింది. అయినా కూడా చాలా మంది వైద్యుల్లో ఎలాంటి మార్పు రావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఆస్పత్రిలో ఓ ఖైదీ సర్జరీ విషయంలో అనస్తీషియా విభాగం వైఫల్యం ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 12న ఓ ఖైదీ ఆస్పత్రిలో అడ్మిషన్ అయ్యాడు. ఖైదీని పరీక్షించిన వైద్యులు లాపొరాక్టమీ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13న సర్జన్లు ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో సర్జరీ చేశారు. అంతకంటే ముందు ఓ అనస్తీషియా వైద్యురాలు.. అనస్తీషియా విభాగం హెచ్‌ఓడీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనస్తీషియా ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవంగా ఖైదీకి సర్జరీ చేసే సమయంలో కచ్చితంగా సంబంధిత హెచ్ఓడీ పర్యవేక్షణలో అనస్తీషియా ఇవ్వాల్సి ఉందని ఆస్పత్రి వర్గాల చెబుతున్నాయి. సర్జరీ జరిగిన కాసేపటికే ఖైదీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్యులు అప్రమత్తమై ఆంబు బ్యాగ్, ఆక్సిజన్ సిలిండర్ ద్వారా శ్వాసను అందించి అక్యూట్ మెడికల్ కేర్‌కు తరలించారు. వెంటిలేటర్ ద్వారానే వైద్యం అందించారు. మొదట స్పైన్‌కు అనస్తీషియా ఇవ్వడం ద్వారానే ఈ సమస్య ఏర్పడినట్లు సమాచారం. అన్నీ అయ్యాక ఈ విషయాన్ని హెచ్ఓడీ దృష్టికి తీసుకెళ్లాగా హెచ్ఓడీ తీవ్ర స్థాయిలో సంబంధిత వైద్యురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏమైనా జరిగితే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని బహిరంగంగానే చెప్పినట్లు సమాచారం. ఖైదీ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి విషమించడంతో శుక్రవారం ట్రెకాష్టమీ చేసినట్లు తెలిసింది. ఇదే రోజున ఖైదీకి ఎంఆర్ఐ చేశారు. ఆస్పత్రిలో ఈ అంశం పెద్దచర్చనీయాంశమవడంతో రోజూ ముగ్గురు అనస్తీషియా వైద్యులు ప్రత్యేకంగా ఖైదీని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సర్జరీ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. దీనిపై లోతుగా విచారణ చేపడుతామని తెలిపారు. అనస్తీషియా హెచ్ఓడీ నవీన్‌కుమార్ తనకు ఖైదీ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని, సర్జరీ పూర్తయ్యాకే వైద్యురాలు తనకు దృష్టికి తీసుకొచ్చారని సమాధానమిచ్చారు. -
యూరి ఉగ్రదాడి సూత్రధారికి ప్రాణాంతక వ్యాధి
లాహోర్ : భారత్‌లో పలు ఉగ్ర దాడులకు ప్రధాన సూత్రధారి మసూద్ అజార్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది. తీవ్ర అనారోగ్యంగా జైషే మహ్మద్ చీఫ్ ఏడాదిన్నరగా మంచానికే పరిమితమైనట్టు హిందుస్థాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. యూరి దాడికి బాధ్యుడైన మసూద్ అజార్ వెన్నుపూస, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ కథనం పేర్కొంది. రావల్పిండిలోని మురీ ప్రాంతంలో కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది.కాగా మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఇటీవల ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడాన్ని చైనా సమర్ధించుకుంది. భారత్, పాకిస్తాన్ సహా ఐరాస భద్రతా మండలి సభ్యుల్లో దీనిపై ఏకాభిప్రాయం లేదని చైనా వాదిస్తోంది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఇప్పటికే ఐరాస నిషేధిత ఉగ్ర సంస్ధల జాబితాలో ఉంది. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో దాడికి సంబంధించి జైషే చీఫ్ మసూద్‌ను ప్రధాన సూత్రధారిగా చార్జిషీట్లో పేర్కొంది. గత ఏడాది నాగర్‌కోట దాడిలోనూ మసూద్ ఆజాద్ కీలకంగా వ్యవహరించడం గమనార్హం. -
‘ఆయన అడుగుపెడితే చంపేస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాను హతమారుస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఉమాదేవి ఖతీక్ కుమారుడు ప్రిన్స్‌దీప్ లాల్‌చంద్ ఖతీక్ హెచ్చరించడం కలకలం రేపింది. ‘జ్యోతిరాదిత్య సింధియా..నీలో ఝాన్సీ రాణిని చంపిన జివాజిరావు రక్తం ప్రవహిస్తోంది. నువ్వు హట్టాలో అడుగుపెడితే నిన్ను కాల్చిచంపుతా..నా చేతిలో నీ చావు తప్పద’ని లాల్‌చంద్ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 5న హట్టా జిల్లాలో ర్యాలీకి సింధియా హాజరవుతున్న నేపథ్యంలో లాల్‌చంద్ పోస్ట్ దుమారం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని హట్టా నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఉమాదేవి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ‘సింధియా గౌరవ ఎంపీ..ఆయనపై ఇలాంటి పోస్ట్ దురదృష్టకరం..ఈ పోస్ట్‌ను తొలగించమని నా కుమారుడిని కోరతా’నని ఉమాదేవి పేర్కొన్నారు. జ్యోతిరాదిత్య సింధియాకు దేశవ్యాప్తంగా ఉన్న పేరుప్రతిష్టలకు భయపడి బీజేపీ ఆయనపై నిరాధార ఆరోపణలు చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రాజా పటేరియా విమర్శించారు. ఈ ఉదంతంపై పోలీసులు తక్షణమే విచారణ చేపట్టి సింధియాకు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. -
చిరంజీవి అశ్వత్థామ!
పురానీతి కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇరువైపులా ఉన్న వీరులందరూ దాదాపుగా మరణించారు. కౌరవుల పక్షాన దుర్యోధనుడొక్కడే మిగిలాడు. భీముడికి, దుర్యోధనుడికి మధ్య భీకరమైన గదాయుద్ధం జరిగింది. భీముడు చివరకి దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. దుర్యోధనుడి పతన వార్తను విన్న అశ్వత్థామ పరుగున యుద్ధభూమికి చేరుకున్నాడు. తొడలు విరిగి, చచ్చిన పులిలా పడున్న దుర్యోధనుడిని చూసి అమితంగా బాధపడ్డాడు. ‘‘ఎలాగైనా సరే, నీకు సంతోషాన్ని కలిగిస్తాను’’ అని శవసాక్షిగా ప్రతిజ్ఞ చేసి, వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లాడు. శిబిరంలో అర్ధరాత్రి ఆదమరచి నిద్రపోతున్న ఉపపాండవుల తలలు నరికి ఉత్తరీయంలో మూటగట్టుకుని వచ్చి, దుర్యోధనుడి దేహం ముందు పడవేసి, ప్రభు రుణం తీరిపోయినట్లుగా భావించి, ్రÔ¶ ద్ధాంజలి ఘటించాడు. తెల్లవారింది. ఉపపాండవుల మరణవార్త వ్యాపించింది. పాండవుల శిబిరాలన్నీ దుఃఖంతో గొల్లుమన్నాయి. పాండుపుత్రుల తల్లి ద్రౌపది తీవ్ర దిగ్భ్రాంతికి లోనై, కుప్పకూలిపోయింది. అర్జునుడు ముందుగా తనను తాను దిటవు పరచుకున్నాడు. తర్వాత మెల్లగా ద్రౌపదిని లేపి, ‘‘పాంచాలీ! సుక్షత్రియ వంశంలో పుట్టి, వీరాధివీరులైన పాండవులకు పత్నిగా ఉన్న నీవు ఇంతగా దుఃఖించడం తగదు. దుర్మార్గుడైన అశ్వత్థామ అర్ధరాత్రప్పుడు దొంగచాటుగా శిబిరంలో దూరి పసిబిడ్డలైన ఉపపాండవులను మరచి తన పొట్టన పెట్టుకున్నాడు. ఇందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు. నేను ఇప్పుడే వెళ్లి, ఆ ధర్మభ్రష్టుని శిరస్సును ఖండించి తీసుకు వచ్చి, నీ కాళ్లముందు పడవేస్తాను. నువ్వు ఆ నీచుని తలను నీ కాళ్లతో తొక్కి, ఛిద్రం చేసి, నీ శోకాన్ని బాపుకో’’అని ఓదార్చాడు. అర్జునుడి మాటలు విన్న ద్రౌపది మనస్సు కొద్దిగా ఊరట పొందింది. బలంగా ఒక నిట్టూర్పు విడిచి, పక్కనే ఉన్న శ్రీకృష్ణుని వంక భావగర్భితంగా చూసింది. అప్పుడు కృష్ణుడు రథాన్ని సిద్ధం చేసి, అర్జునుడిని రథంలో కూర్చుండబెట్టుకుని, ఆ రథానికి పూన్చిన గుర్రాలను అదిలించాడు. దూరంగా వస్తున్న పార్థుడి రథాన్ని చూడగానే అశ్వత్థామ ప్రాణభయంతో పరుగెత్తి సమీపంలోనే ఉన్న ఓ నీటిమడుగులో దాక్కున్నాడు. దిక్కుతోచని స్థితిలో ప్రయోగమే తప్ప ఉపసంహారం తెలియనటువంటి మహా శక్తిమంతమైన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం వింతకాంతులు చిమ్ముకుంటూ శరవేగంగా అర్జునుడిని సమీపించసాగింది. కృష్ణుడు ‘‘పార్థా! ఇది బ్రహ్మశిరోనామకాస్త్రం. దీనిని ఎదుర్కొనాలంటే తిరిగి అదే అస్త్రాన్ని ప్రయోగించాలి.’’ అని చెప్పాడు. నిప్పులు కక్కుతూ తనమీదకు దూసుకొస్తున్న ఆ అస్త్రాన్ని నిలువరించేందుకు తిరిగి అదే అస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు. ఆ రెండు అస్త్రాలూ ఒకదానినొకటి ఢీకొనడంతో భూనభోంతరాళాలు దద్దరిల్లేట్లు శబ్దాలు వచ్చాయి. పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. తీవ్రమైన అగ్నిజ్వాలలు వెలువడసాగాయి. శ్రీకృష్ణుని సూచన మేరకు అర్జునుడు ఉపసంహార మంత్రం పఠిస్తూ ఆ అస్త్రానికి భక్తితో ప్రణమిల్లాడు. వెంటనే రెండు అస్త్రాలూ శాంతించి, అర్జునుడి అమ్ములపొదిలో చేరిపోయాయి. నోరు వెళ్లబెట్టి ఆ దృశ్యాన్ని చూస్తుండిపోయిన అశ్వత్థామ మీదకు సింహంలా లంఘించి, అతణ్ణి తాళ్లతో బంధించి, రథానికి కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ద్రౌపది ముందు పడేశాడు. ‘‘ద్రౌపది అతనికి చేతులు జోడించి, ‘‘శిశువులను చంపడానికి పచ్చినెత్తురు తాగే రాక్షసులు సైతం వెనకాడతారే, అలాంటిది గురుపుత్రులు, ధర్మాధర్మాలు తెలిసిన వారయి ఉండీ కాస్తంత అయినా కనికరం లేక అమాయకులైన పసిబిడ్డలను చంపడానికి మీకు చేతులెట్లా వచ్చాయి? మీ గుండె అంత బండరాయిగా ఎలా మారింది..’’ అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న ద్రౌపదిని వారిస్తూ, ‘‘ఉచ్చనీచాలు మరచిన పాషాణం లాంటి ఈ దుర్మార్గుడితో ఇంకా మాటలెందుకు?’’ అంటూ కత్తిదూసి అశ్వత్థామను చంపబోయాడు పార్థుడు. అప్పుడు ద్రౌపది ‘‘వీరాధివీరులైన మీరు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న ఇతణ్ణి చంపితే ఇక మీకూ అతనికీ తేడా ఏముంది? దయచేసి వదిలేయండి’’ అంటూ దణ్ణం పెట్టింది. ‘‘మరి నా ప్రతిజ్ఞ ఎలా....’’ అంటున్న అర్జునుడితో శ్రీకృష్ణుడు, ‘‘పార్థా! ఇతని తల గొరిగి, అతన్ని క్షమించి వదిలెయ్’’ వీరుడికి అది శిరచ్ఛేదంతో సమానం’’ అని చెప్పి, అశ్వత్థామవైపు తిరిగి, ‘‘ఓరీ! నీవు చేసిన పనికి ఒళ్లంతా కుళ్లిపోయి, రక్తమాంసాలతో కంపుకొడుతూ చావుకోసం ఎదురు చూస్తూ ఈ యుగమంతా ఇలాగే జీవిస్తావు’’ అని శపించాడు. అశ్వత్థామ ఆ విధంగా చిరంజీవి అయ్యాడు. నాటినుంచి కురుక్షేత్రంలో చావలేక, చావురాక, క్షణ క్షణం చస్తూ బతుకుతున్నాడు. అయినా, చావుకన్నా అదే సరైన శిక్ష కదా అశ్వత్థామకు. – డి.వి.ఆర్.భాస్కర్ -
'నయీం అనుచరులతో ప్రాణభయం'
కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరులతో తమకు ప్రాణభయం ఉందని నయీం బాధితులు ఆరోపించారు. కరీంనగర్లో నయీం బాధితులు బుధవారం మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా బాధితులు వీరలక్ష్మీ, కాంతారావు, రియల్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ...14 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ చేశారన్నారు. నగునూరు భూ ఆక్రమణలో నయీం, అతని అనుచరులు ఉన్నారని చెప్పారు. భూ ఆక్రమణలతో ప్రమేయమున్న అందరినీ అరెస్ట్ చేయాలని నయీం బాధితులు డిమాండ్ చేశారు.