పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. బుధవారం అర్ధరాత్రి భగవంత్ మాన్ హఠాత్తుగా స్పృహ తప్పిపడిపోయారు. హుటాహుటినా ఆయన్ను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు ఆయనకు లెప్టోస్పిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు యాంటీ బయాటిక్స్ అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అసలేంటీ వ్యాధి? ఎందువల్ల వస్తుంది..?.
లెప్టోస్పిరోసిస్ అంటే ..?
లెప్టోస్పిరోసిస్ అనేది లెప్టోస్పిరా బాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఇది మానవులను జంతువులను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా మానవులకు లెప్టోస్పిరోసిస్ సోకిన జంతువుల ద్వారా లేదా వాటి మూత్రంతో ప్రత్యక్ష సంబంధం లేదా ఆ మూత్రంతో కలుషితమైన నేల, నీరు వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా చర్మంపై కోతలు లేదా రాపిడి ద్వారా లేదా కళ్లు, ముక్కు నోటిలో శ్లేష్మ పొరల ద్వారా మానవుకులకు సంక్రమిస్తుంది.
లక్షణాలు..
ఈ వ్యాధి కారణంగా అధిక ఉష్ణోగ్రత, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, అతిసారం, చలి, కళ్ళు ఎర్రబడటం తదితర లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి,వాపు చేతులు, కాళ్లల్లో కనిపించడం వంటివి జరుగుతాయి.
వ్యాధి తీవ్రత..
దీన్ని యాంటీ బయాటిక్స్‌తో రెండు వారాల్లో నయం అయ్యేలా చెయ్యొచ్చు. అదే ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే మాత్రం మూత్రపిండాలకు వ్యాపిస్తుంది. మెదడు, వెన్నుపాము, కాలేయానికి సోకవచ్చు. అరుదైన పరిస్థితుల్లో ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు.
నిర్థారించడం కష్టమైతే..
ఈ వ్యాధిని ఏంటనేది నిర్థారించడం కష్టముతుందని అన్నారు. దీనిపై సదరు వైద్యుడికి సరైన అవగాహన ఉంటేనే నిర్థారించగలరని చెప్పారు. అలాంటి సమయాల్లో మరో వైద్యుడిని కూడా సంప్రదించటం అనేది ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. ఈలోగా ఆ బ్యాక్టీరియా గనుక మెదడులోకి ప్రవేశిస్తే మాత్రం ప్రాణాతంకంగా మారిపోతుంది. అయితే ఇది మానవుడి నుంచి మానవుడికి మాత్రం సంక్రమించదట.
ఎందువల్ల అంటే..
కాలుష్యం కారణంగా ఈ వ్యాధి వస్తుందని చెబుతున్నారు వైత్యులు. ముక్యంగా కిరాణ స్టోర్స్‌లలో లూజ్‌కి సరుకులను తీసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకండి. సాధ్యమైనంత వరకు ప్యాక్ చేసి, సీల్ చేసిన వాటినే కొనుగోలు చేయాలని చెబుతున్నారు నిపుణులు. ఉష్ణమండల వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు.
తొలిసారిగా..
1920లలో అండమాన్ దీవుల నుంచి తొలిసారిగా ఈ వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భారతదేశంలోని గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అండమాన్ నికోబార్ దీవులు వంటి తీర ప్రాంత రాష్ట్రాలలో అధికంగా ఉంటుందని వెల్లడించారు నిపుణులు . అయితే ఈ వ్యాధి గణనీయమైన మరణాలకు దారితీసినప్పటికీ చాలా అరుదుగా సంభవించడం గమనార్హం.
(చదవండి: ఓ డాక్టర్ హార్ట్ బిట్..! హృదయాన్ని మెలితిప్పే కేసు..!)
Comments
Please login to add a commentAdd a comment