సాక్షి, హైదరాబాద్: తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదని, తనకు కేసీనో ఇండస్ట్రీలోని ప్రత్యర్ధుల నుండి ప్రాణహాని ఉందని కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ అన్నారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ, కొంత కాలంగా రెక్కి నిర్వహిస్తున్నారని, పోలీసులు విచారణ జరిపి సెక్యూరిటీ పెంచాలని కోరారు.
‘‘నేను రాజకీయాల్లోకి వస్తునాన్నని తెలిసి టార్గెట్ చేశారు. ఈడీ విచారణ మొదలైనప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈడీ విచారణ దర్యాప్తులో ఉందన్నారు. కేసీనో నిర్వహిస్తున్నానని, అది తన ప్రొఫెషన్ అన్న చికోటి.. ప్రభుత్వానికి టాక్స్‌లు చెల్లించి లీగల్ ఉన్న దగ్గరే కేసీనో నడుపుతున్నానన్నారు. హిందూత్వం కోసం కేసీనోను వదులుకోవడానికి తాను సిద్ధమని, అవకాశం ఉంటే రాజకీయాల్లోకి రావడానికి రెడీ అని చికోటి ప్రవీణ్ అన్నారు.
కాగా, చీకోటి ప్రవీణ్ కారు చోరీకి గురైంది. సైదాబాద్ ఇంట్లో కారును దుండగులు దొంగిలించారు. ఇన్నోవా కార్ కీస్ వెతికి కారుతో పరారయ్యారు. సైదాబాద్ పీఎస్‌లో చికోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
చదవండి: ఉపాధ్యాయుల వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
Comments
Please login to add a commentAdd a comment