car theft
-
బంజారాహిల్స్‌లో కారు చోరీ.. ఖైరతాబాద్‌లో చైన్ స్నాచింగ్..
బంజారాహిల్స్: చైన్ స్నాచింగ్ చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా కారు చోరీకి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్, ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్బీటీనగర్ బస్తీకి చెందిన అఫ్రోజ్ తన మారుతీ వ్యాన్‌లో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లేవాడు. గురువారం రాత్రి కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో రిపేరు చేయాలని రోడ్డునెంబర్–12లోని కమాన్‌లో మెకానిక్కు కారు అప్పగించి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వరకు కారుకు మరమ్మతులు చేసిన మెకానిక్ షెడ్‌కు తాళం వేసీ ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం వ్యాన్ తీసుకెళ్లేందుకు అక్కడికి వచి్చన ఆఫ్రోజ్కు షెడ్ ఎదుట కారు కనిపించలేదు. దీంతో మెకానిక్కు ఫోన్ చేయడంతో తాను కారు అక్కడే పార్కింగ్ చేసి వెళ్లిపోయానని చెప్పిన అతను ఘటనా స్థలానికి పరిగెత్తుకొచ్చాడు. పరిసర ప్రాంతాల్లో గాలించినా కారు కనిపించకపోవడంతో బాధితుడు ఆఫ్రోజ్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కారు తాజ్‌కృష్ణా హోటల్ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. కాగా ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఆనంద్‌నగర్ కాలనీలో ఓ మహిళ మెడలో గొలుసు చోరీకి గురైనట్లు ఖైరతాబాద్ పోలీసులకు సమాచారం అందింది. అక్కడి పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించగా మారుతీ వ్యాన్‌లో వచ్చిన ఓ వ్యక్తి కారు దిగి కొంతదూరం నడిచి వెళ్లి రోడ్డుపై వెళుతున్న నర్సమ్మ అనే మహిళ మెడలోని 2.5 తులాల బంగారు గొలుసు లాక్కుని పరారైనట్లుగా గుర్తించారు. దీంతో కంట్రోల్ రూం నుంచి అన్ని ఠాణాలకు సమాచారం అందించారు. బంజారాహిల్స్‌లో చోరీకి గురైన కారు అదేనని గుర్తించారు. దీంతో అటు ఖైరతాబాద్ పోలీసులు, ఇటు బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందీలను ఏర్పాటు చేసి దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన సదరు దొంగ కారును ఖైరతాబాద్‌లో వదిలేసి సందుల్లో పడి ఉడాయించినట్లుగా తేలింది. అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో కారు దొంగిలించిన అతను ఉదయం వరకు అటూ ఇటూ తిరుగుతూ ఆనంద్‌నగర్ కాలనీలో ఒంటరిగా కనిపించిన మహిళను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లుగా పోలీసులు నిర్థారించారు. స్నాచర్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. వెస్ట్–సెంట్రల్ జోన్ల సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకోవడంతో బంజారాహిల్స్, ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వెహికిల్‌పై కేసుల వివరాలు క్షణాల్లో..
సెంకడ్హ్యాండ్లో వెహికిల్ కొనుగోలు చేస్తున్నారా..? తీరా వెహికిల్ తీసుకున్నాకా ఇంటికి పోలీసులు వచ్చి ‘మీ వాహనంపై క్రిమినల్ కేసు నమోదైంది. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం’ అని అంటే షాకింగ్‌గా ఉంటుంది కదా. అందుకే ముందే జాగ్రత్త పడండి. మీరు కొనాలనుకునే వాహనంపై ఏవైనా కేసులున్నాయో లేదో తెలుసుకోండి. అందుకోసం మీరు ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే ఈ వివరాలు తెలుసుకునేలా ప్రభుత్వం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్‌ను(సీసీటీఎన్ఎస్) ఆవిష్కరించింది. వాహనాలపై ఎలాంటి కేసు లేకపోతే నో అబజెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) పొందవచ్చు. చాలా వరకు దొంగతనం జరిగిన వాహనాలను ఏదో రూపంలో కన్సల్టెన్సీల ద్వారా ఇతరులకు అంటగట్టే ముఠాలూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుగానే కేసుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. అందుకోసం..బ్రౌజర్‌లోకి వెళ్లి digitalpolicecitizenservices.gov.in అని టైప్ చేయాలి.క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్(సీసీటీఎన్ఎస్) సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది.సిటిజన్ లాగిన్ పేరుతో డిస్ప్లే అయిన బ్లాక్‌లో వివరాలు ఎంటర్ చేయాలి. ముందుగా మొబైల్ నంబర్ ఎంటర్‌చేసి ‘సెండ్ ఓటీపీ’ బటన్‌పై క్లిక్ చేయాలి.మొబైల్‌కు వచ్చిన ఓటీపీను కింద ఎంటర్ చేయాలి. తర్వాత వినియోగదారుడి పేరు, క్యాప్చా కోడ్ ఇవ్వాలి. తర్వాత లాగిన్ బటన్ ప్రెస్ చేయాలి.తర్వాత వేరే విండో ఓపెన్ అవుతుంది. వెహికిల్ టైప్ ఎలాంటిదో సెలక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్, చాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి.ఏదైనా కేసులు ఉంటే వేరే విండోలో వాటికి సంబంధించిన వివరాలు డిస్ప్లే అవుతాయి. కేసులేవీ లేకపోతే ఎన్ఓసీ వస్తుంది.ఇదీ చదవండి: బ్లాకర్లు వాడుతున్నా యాడ్! ఇప్పుడేం చేయాలి..? -
కారు దొంగతనం.. డ్రైవింగ్ రాక 10 కి.మీ తోసుకెళ్లి... చివరికి!
ఉత్తర ప్రదేశ్‌లో వింత దొంగతనం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు కలిసి అడ్డదారిలో డబ్బు సంపాదించేదుకు ఓ కారును దొంగతనం చేయాలనుకున్నారు. అనుకున్నట్లే కారును దొంగిలించారు కానీ తరువాతే అసలు విషయం తెలిసింది. ముగ్గురిలో ఎవరికి కూడ డ్రైవింగ్ రాదని.. దీంతో చేసేదేం లేక కారును దాదాపు 10 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్లారు. అమినా చివరకు పోలీసులకు పట్టుబట్టారు. అసలేం జరిగిందంటే.. కాన్పూర్‌లోని దబౌలి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అమన్ గౌతమ్, సత్యం కుమార్ కాలేజీ విద్యార్థులు. వీరికి అమిత్ వర్మతో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి మే 7న కారు మారుతి వ్యాన్‌ను దొంగిలించాలని ప్లాన్ చేశారు. పథకం ప్రకారమే కారును దొంగిలించారు. అయితే అక్కడే ఈ ముగ్గురికి కష్టాలు మొదలయ్యాయి. ముగ్గురిలో ఎవరికి కారు డ్రైవింగ్ రాదని అర్థమైంది. అయినా కారును వదిలి వెళ్లాలని అనిపించలేదు. దీంతో కారును నెట్టుకుంటూ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా రాత్రి 10 కిలోమీటర్లు దబౌలి నుంచి కళ్యాణ్పూర్ వరకు వ్యాన్‌ను తోసుకుంటూ వెళ్లారు. 10 కిలోమీటర్ల పాటు కారు తోయడంతో ఇక తమ వల్ల కాదని, నెంబర్ ప్లేట్ తొలగించి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో దాచిపెట్టి అక్కడి నుంచి పారిపోయారు. తరువాత వచ్చి ఆ కారును అమ్మేయాలని కుట్ర పన్నారు. చివరికి ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేశారు. ఈ దోపిడీకి అమిత్ స్కెచ్ వేయగా.. దీన్ని వెబ్ సైట్ ద్వారా అమ్మేందుకు సత్యం ప్లాన్ చేశాడని ఏసీపీ భేజ్ నారాయణ్ సింగ్ వెల్లడించారు. ఒకవేళ కారు కొనడానికి ఎవరూ దొరక్కపోతే.. వెబ్ సైట్ ద్వారా విక్రయించాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. చదవండి: స్మార్ట్ టన్నెల్.. సెల్ సిగ్నల్ దొరక్క ప్రాణం పోయింది! -
అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు: చికోటి ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదని, తనకు కేసీనో ఇండస్ట్రీలోని ప్రత్యర్ధుల నుండి ప్రాణహాని ఉందని కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ అన్నారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ, కొంత కాలంగా రెక్కి నిర్వహిస్తున్నారని, పోలీసులు విచారణ జరిపి సెక్యూరిటీ పెంచాలని కోరారు. ‘‘నేను రాజకీయాల్లోకి వస్తునాన్నని తెలిసి టార్గెట్ చేశారు. ఈడీ విచారణ మొదలైనప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈడీ విచారణ దర్యాప్తులో ఉందన్నారు. కేసీనో నిర్వహిస్తున్నానని, అది తన ప్రొఫెషన్ అన్న చికోటి.. ప్రభుత్వానికి టాక్స్‌లు చెల్లించి లీగల్ ఉన్న దగ్గరే కేసీనో నడుపుతున్నానన్నారు. హిందూత్వం కోసం కేసీనోను వదులుకోవడానికి తాను సిద్ధమని, అవకాశం ఉంటే రాజకీయాల్లోకి రావడానికి రెడీ అని చికోటి ప్రవీణ్ అన్నారు. కాగా, చీకోటి ప్రవీణ్ కారు చోరీకి గురైంది. సైదాబాద్ ఇంట్లో కారును దుండగులు దొంగిలించారు. ఇన్నోవా కార్ కీస్ వెతికి కారుతో పరారయ్యారు. సైదాబాద్ పీఎస్‌లో చికోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చదవండి: ఉపాధ్యాయుల వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త -
దొంగిలించిన కారులో వెళ్తుండగా ప్రమాదం.. చికిత్స పొందుతూ మరో బైక్ చోరీ
సాక్షి, ములుగు: కారును దొంగిలించి సొమ్ము చేసుకోవాలనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. తప్పించుకునే తొందరలో వేగంగా వెళ్లిన దొంగలకారు విద్యుత్ స్థంభానికి ఢీ కొట్టడంతో ఆస్పత్రిపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ అప్సర్ కారు తన ఇంటి వద్ద నిలిపి ఉండగా ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించి, కారును వేగంగా నడుపుతూ తీసుకెళ్తుండగా మంగపేట మండలం గంపోనిగూడెం వద్ద విద్యుత్ స్తంభానికి ఢీకొట్టారు. దీంతో ఇద్దరు గాయపడడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు తాడ్వాయి మండలం వీరాపురం గ్రామానికి చెందిన చీరల సందీప్ కాగా.. మరొకరు రాజ్‌కుమార్‌గా గు ర్తించారు. మంగపేట పోలీస్‌స్టేషన్‌లో రోడ్డు ప్రమా దం కేసు నమోదు కాగా, ఏటూరునాగారంలో కారు అపహరణ కేసు నమోదైంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ ఇద్దరిలో రాజ్‌కుమార్ ఏటూరునాగారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సామాజిక ఆస్పత్రి వద్ద విధులు నిర్వర్తిస్తున్న గడ్డం దశరథం 108 డ్రైవర్ బైక్‌ను తీసుకొని ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది, బైక్ యజమాని తలలు పట్టుకుంటున్నారు. ఒక కారుతో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి దొంగతనం బయటపడి పోలీసులకు చిక్కగా చికిత్స పొందుతూ మరో బైక్‌ను దొంగలించడం హాట్ టాపింగ్ మారింది. అంతేకాకుండా పోలీసులకు చిక్కినట్లే చిక్కి ఒక దొంగ పారిపోవడం గమనార్హం. ఇద్దరు దొంగలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కానీ, సోమవారం రాత్రి వరకు కూడా బైక్‌పై పారిపోయిన వ్యక్తి వివరాలు తెలియలేదు. చదవండి: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యంగ్ జర్నలిస్ట్ మృతి -
సినీ నిర్మాత కారు చోరీ
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్ హయత్ హోటల్లో ఫార్చునర్ కారు చోరీకి గురైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు సదాహల్లి మల్బరి మెడోస్ విల్లాస్‌లో ఉంటున్న ప్రముఖ వ్యాపారి, సినీ నిర్మాత వి.మంజునాథ్ ఈ నెల 22న హైదరాబాద్‌కు వచ్చి పార్క్‌హయత్ హోటల్లో బస చేశాడు. ఈ నెల 26న బయటికి వెళ్లి తిరిగివచ్చిన ఆయన తన కారును పార్కింగ్ చేశాడు. 27న ఉదయం బయటికి వెళ్లేందుకు కారు తీయడానికి వెళ్లగా పార్కింగ్ స్థలంలో కారు కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం కనిపించలేదు. కారులో చెక్‌బుక్‌లు, మొబైల్ఫోన్లు, బెంజికారు తాళాలు, ఖరీదైన డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు ఉన్నట్లు పేర్కొంటు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పార్కి ంగ్ ప్లేస్‌తో పాటు హోటల్ చుట్టూ సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
భర్తకు షాక్! భార్యతో సహా కారు దొంగతనం
ఛండీగఢ్ : భార్యను కారులో వదిలి వెళ్లిన ఓ భర్తకు షాక్ ఇచ్చారు దొంగలు. భర్యతో సహా వాహనాన్ని తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటన పంజాబ్‌లోని డేరా బస్సిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం మధ్యాహ్నం డేరా బస్సికి చెందిన రాజీవ్ చంద్, రీతు దంపతులు తమ పిల్లల స్కూలు ఫీజు చెల్లించడానికి స్కూలు దగ్గరకు వచ్చారు. కారు తాళం చెవి అలాగే ఉంచి, రాజీవ్ స్కూల్లోకి వెళ్లాడు. రీతు కారు లోపలే ఉండి అతడి కోసం ఎదురుచూస్తోంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు వ్యక్తులు కారులోకి చొరబడ్డారు. ( రన్నింగ్ బస్సులోనుంచి దూకిన యువతులు ) ఒకరు డ్రైవింగ్ సీటులో కూర్చోగా.. మరొకరు రీతు నోరును గుడ్డ ముక్కతో మూసి, కారును తీసుకెళ్లిపోయారు. దాదాపు ఐదు కిలోమీటర్లు వెళ్లిన అనంతరం రీతును ఓ చోట కిందకు తోసి కారును తీసుకెళ్లిపోయారు. స్కూల్లో పని ముగించుకుని బయటకు వచ్చిన రాజీవ్ అక్కడ కారు కనిపించకపోయే సరికి కంగారుపడ్డాడు. భార్యకు ఫోన్ చేసినా స్పందించకపోయే సరికి పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు. కాగా, కొన్ని గంటల తర్వాత రీతు ఇంటికి చేరుకోవటంతో రాజీవ్ ఊపిరి పీల్చుకున్నాడు. -
మెకానిక్ పనే..?
నాగోలు: స్థానిక లలితానగర్ కారు చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లలితానగర్ కాలనీ రోడ్డు నంబర్ 9లో ఉంటున్న కుండారపు రాజాచారి కుమారుడు స్నేహిత్‌రావ్ భువనగిరిలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను తన ఫార్చునర్ కారు (ఏపీ29 సీఏ 1212)ని ఇంటి ఎదుట పార్కింగ్ చేశాడు. బుధవారం సాయంత్రం కారు కనిపించకపోవడంతో ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాలనీలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా రాత్రి 2 గంటల ప్రాంతంలో స్విఫ్ట్‌కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కారును తీసుకెళ్లినట్లు వెల్లడైంది. అయితే కారు డోర్ తెరవడం, స్టార్ట్ చేసిన తీరును బట్టి నిందితులకు కారుపై పూర్తి అవగాహన ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కారు చోరీ చేసిన అనంతరం వీరు సాయినగర్ మీదుగా అల్కాపురి సిగ్నల్ వరకు వచ్చినట్లు సీసీ పుటేజీల్లో రికార్డైంది. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కారు లేకున్నా ‘కీకీ’ ఛాలెంజ్
-
‘కీకీ’ ఛాలెంజ్.. ఇలా కూడా చేస్తారా?
కదిలే కారు నుంచి కిందకు దూకి, ఆ వాహనంతోపాటే సమాంతరంగా వెళుతూ డ్యాన్స్ చేయటం. కీకీ ఛాలెంజ్ పేరిట సోషల్ మీడియాలో ఇదో ట్రెండ్ సెటర్‌గా మారింది. అయితే కొందరు కుర్రాళ్లు చేసిన ఓ వీడియో సరదాగా ఉండటమే కాదు... వాట్సాప్ గ్రూప్‌ల్లో చక్కర్లు కొడుతోంది కూడా. కారు డోర్‌ను దొంగతనం చేసి అచ్చం కీకీ ఛాలెంజ్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ ఓ వీడియోను రికార్డు చేస్తుంటారు. ఇంతలో ఓ వ్యక్తి ఏం చేస్తున్నారంటూ అడ్డుతగలటం.. కీకీ ఛాలెంజ్ చేస్తున్నామంటూ బదులు ఇవ్వటం, అంతలోనే కారుతో సహా ఓ వ్యక్తి డోర్ కోసం రావటం.. దొంగిలించిన డోర్‌తో సహా కుర్రాళ్లు పరిగెత్తటం ఆ వీడియోలో చూడొచ్చు. కీకీ కారు డోర్ ఛాలెంజ్ పేరిట సరదాగా చేసిన ఈ యత్నం వైరల్ అవుతోంది. ఈ వీడియోను కొన్ని ట్రోల్ పేజీలు సైతం వాడేసుకోవటం విశేషం. కీకీ ఛాలెంజ్.. యువత తాము నడుపుతున్న కారు నుంచి డోర్ తీసుకుని కిందకు దూకుతారు. కారు అలా వెళుతూ ఉండగా, వారు కూడా దానితోపాటే వెళుతూ డాన్స్ చేస్తారు. పాట ఆఫ్ చేయగానే ఒక్కసారిగా తిరిగి కారులోకి దూకేయాల్సి ఉంటుంది. స్నేహితురాలు కేషియా ఛాంటెను గుర్తు చేసుకుంటూ కెనడా రాక్ స్టార్ ‘డ్రేక్’ పాడిన ‘ఇన్ మై ఫీలింగ్స్’ అనే పాట కీకీ ఛాలెంజ్‌కు మూలం. ఈ ప్ర్రక్రియను రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి, ఇతరులకు సవాల్ చేస్తారు. ఇప్పటికే విల్ స్మిత్, సియారా వంటి ప్రముఖులూ సైతం ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. అయితే దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలు దేశాలు, నగరాలు ఈ ఛాలెంజ్‌పై నిషేధం విధించాయి. ఇదిలా ఉంటే బైక్‌పై కూడా ఈ కీకీ ఛాలెంజ్‌ను కొందరు యత్నిస్తుండటం గమనార్హం. -
వైఎస్ఆర్సీపీ నాయకురాలి కారు చోరీ
-
కారుతో ఉడాయించిన టెంపరరీ డ్రైవర్!
హైదరాబాద్: జల్సాలకు అలవాటుపడి స్నేహితుల వద్ద తాను కూడా పెద్ద పొజిషన్లో ఉన్నానని చెప్పుకునే యువకుడు తన యజమాని కారు దొంగిలించాడు. ఆ పరారైన నిందితుడి కోసం జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన చరణ్(29) యూసుఫ్‌గూడలో నివాసం ఉంటూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తాత్కాలిక డ్రైవర్‌గా కూడా పని చేస్తూ జీవించేవాడు. ఈ నేపథ్యంలోనే రహ్మత్‌నగర్ సమీపంలో నివసించే సుబ్బారాయుడు తరచూ వివిధ కార్యక్రమాలకు వెళ్లేందుకు టెంపరరీ డ్రైవర్‌ను పిలిపించుకునేవాడు. అలా చరణ్ ఆయన కారు నడిపేందుకు చాలాసార్లు వెళ్లాడు. గత నెల 24వ తేదీన చరణ్ ఆ ఇంటికి వచ్చి ఫోన్లో మాట్లాడుతూ పైకి వెళ్లి మళ్లీ కిందికి వస్తూ అక్కడి వాచ్మెన్లు వినేలా అలాగే సార్.. వెళ్తున్నాను.. అంటూ సెక్యూరిటీ రూం దగ్గర ఉన్న కారు తాళం చెవులు తీసుకుని కారుతో బయటకు వెళ్లాడు. సాయంత్రానికి కారు లేకపోవడంతో సుబ్బారాయుడు సెక్యూరిటీని అడిగాడు. తరచూ వచ్చే డ్రైవర్ మీతో మాట్లాడుతున్నట్టు నటించి కారుతో వెళ్లారని చెప్పారు. కారు చోరీకి గురైందని తెలుసుకున్న బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేరుగా కాకినాడకు వెళ్లిన చరణ్ కారుతో జల్సాలు చేస్తూ కాకినాడ, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాలన్నీ చుట్టేస్తున్నట్లు ఫోన్ట్రాక్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. పక్కా నిఘా వేసి పట్టుకనే క్రమంలో పోలీసు బృందం విజయవాడలో మకాం వేసింది. -
షోరూమ్‌లో కారు చోరీ
రావులపాలెం : తాళాలు వేసి ఉన్న ఒక కార్ల షోరూమ్ షెట్టర్ తాళం పగులగొట్టి కారును దొంగలించిన ఉధంతమిది. వివరాల ప్రకారం స్థానిక అరటి మార్కెట్ యార్డుకు వెళ్లే దారిలో ఉన్న మారుతి సుజికీ షోరూమ్‌లో సిబ్బంది ఎప్పటిలాగే బుధవారం రాత్రి షోరూమ్‌కు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. గురువారం వచ్చి చేసే సరికి షోరూమ్ ఒక వైపు షెట్టర్ తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. షోరూమ్‌లో అమ్మకానికి ఉంచి మారుతి షిఫ్ట్ డిజైర్ మాగ్మా గ్రీన్ కలర్ కారును దొంగలు తీసుకుపోయినట్టు దీనిని విలువ సుమారు రూ. 8లక్షలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సంఘటన ప్రాంతాన్ని సీఐ పీవీ రమణ, ఎస్సై పీవీ త్రినాథ్‌లు పరిశీలించారు. కాకినాడ నుండి క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. షోరూమ్ నిర్వహకులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. దర్యాప్తులో భాగంగా కారు చోరీ చేసిన వ్యక్తుల ఆచూకీ కోసం జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు. -
కార్ల చోరీ ఇతివృత్తంగా బొంగు
కార్ల దొంగల ఇతివృత్తంగా రూపొందిస్తున్న చిత్రం బొంగు అని ఆ చిత్ర దర్శకుడు తాజ్ తెలిపారు. ఈయన ప్రముఖ కళాదర్శకుడు సాబు శిరిల్ వద్ద పలు చిత్రాలకు సహయ కళాదర్శకుడిగా పనిచేసి ఈ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టారు. ఆర్టీ.ఇన్ఫినిటీ డీల్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై రఘుకుమార్ అనబడే తిరు, రాజరత్నం, శ్రీధర్ ముగ్గురు కలిసి నిర్మిస్తున్న చిత్రం బొంగు. చతురంగం తదితర విజయవంతమైన చిత్రాల ఫేమ్ నటరాజ్(నట్టి) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. 2014లో మిస్ ఇండియా పట్టం గెలుచుకున్న రూహీసింగ్ నాయకిగా ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.ఈ బ్యూటీ ఇప్పటికే హిందీతో పాటు ఇతర భాషల్లో నటిస్తున్నారన్నది గమనార్హం. మాధూర్ బండార్కర్ దర్శకత్వం వహించిన క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో నటించి ప్రాచుర్యం పొందిందీ భామ. బొంగు చిత్రంలో ఇతర పాత్రల్లో అతుల్‌కులకర్ణి, ముండాసుపట్టి రాందాస్,అర్జున్, పావలా లక్ష్మణన్, మయిల్సామి,శ్యామ్ నటిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక రాయపేటలోని ఓల్డ్ ఉడ్‌ల్యాండ్ హోటల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నలుగురు కార్ల దొంగల ఇతివృత్తం తెరకెక్కిస్తున్న చిత్రం బొంగు అని అన్నారు. అయితే వారు ఎందుకు దొంగలుగా మారారు. ఆ తరువాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారన్న సంఘటనలో కథ, కథనం జెట్ స్పీడ్‌లో నడుస్తుందన్నారు. ఇందులో ఒక రేస్ కారు ముఖ్య పాత్రగా ఉంటుందన్నారు. అందుకు ఖరీదైన రేస్ కారును ఉపయోగించామని చెప్పారు. ఆ కారు షోరూమ్ కోసం దేశం అంతా శోధించామనీ చివరికి అహ్మదాబాద్‌లో కనిపించిందని, అక్కడ అనుమతి తీసుకుని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై,అహ్మదాబాద్, మధురై ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందిస్తున్నారు. -
మరదలి పెళ్లి కోసం.. ఫార్చూనర్ కారు చోరీ
తన మరదలికి పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకోసం డబ్బులు కావాలి. ఏంచేయాలో తెలియలేదు. దాంతో, తాను డ్రైవర్ గా పనిచేస్తున్న ఖరీదైన ఫార్చూనర్ కారునే ఎత్తుకెళ్లిపోయాడు. మహేష్ జివాచ్ అనే వ్యక్తి ఫైవ్ స్టార్ హోటల్లో జిమ్ కోచ్ అయిన సం దీప్ గోమ్స్ (35) వద్ద డ్రైవర్ గా పనిచేస్తాడు. తన మరదలి పెళ్లికి డబ్బులు సర్దడానికి వేరే దారిలేక తాను డ్రైవింగ్ చేసే రూ. 30 లక్షల విలువైన ఫార్చూనర్ కారును ఈనెల 11న ఎత్తుకెళ్లిపోయాడు. దాన్ని ఎలాగైనా అమ్ముకోవాలని రకరకాలుగా ప్రయత్నించాడు. అలహాబాద్ లో ఒకసారి, బిహార్ లో మరోసారి ప్రయత్నించాడు. ఎక్కడా కుదరలేదు. దాంతో దాన్ని టాక్సీలా మార్చి జనాల్ని తిప్పడం మొదలుపెట్టాడు. గోమ్స్ వద్ద మహేష్ గత ఆరు నెలలుగా పనిచేస్తున్నాడు. 11వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో అతడు తన బాస్ కు చెప్పకుండా కారు తీసుకుని వెళ్లిపోయాడు. ఆరోజు రాత్రి, మర్నాడు అంతా అతడికోసం ప్రయత్నించినా ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. అతడు కూడా తనకు ఫోన్ చేయకపోవడంతో, అనుమానం వచ్చి ఫిర్యాదుచేశానని చెప్పారు. సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా తన ఆచూకీ గమనిస్తారని, పాత సిమ్ కార్డు తీసేసి, కొత్త సిమ్ వేసుకున్నాడు. అయితే అతగాడి ఫోన్ ఐఎంఈఐ నెంబరు ద్వారా పోలీసులు ఆచూకీని పట్టేశారు. చివరకు ప్రయాణికులను తరలిస్తుండగా పట్టుకున్నారు. అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. -
ఉంగరాలూ మింగేశారు!
► ఓ హోటల్ వద్ద న్యాయవాది కారు చోరీ ► నెల తరువాత దొరికిన వాహనం ► ఆభరణాలు మాయం ► పోలీసుల మాయాజాలం సాక్షి, సిటీబ్యూరో : నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారుల అక్రమాలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు సీజ్ చేసిన కార్లను పంచుకోవడం... కోర్టు అనుమతి లేకుండానే అమ్ముకోవడం... చీటింగ్ కేసులో 16 మంది నిందితుల పేర్లు గోల్మాల్ చేయడం లాంటి ఉదంతాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అక్రమ వ్యవహారం బయట పడింది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని దసపల్లా హోటల్లో చోరీకి గురైన బీఎండబ్ల్యూ కారులో ఉన్న న్యాయవాదికి చెందిన మూడు వజ్రపుటుంగరాలను సీసీఎస్ ఆటోమొబైల్ టీం పోలీసులు మింగేసినట్టు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 3 లక్షలుగా తెలుస్తోంది. ఆ న్యాయవాది నెల రోజుల పాటు ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. ఇటీవల సీసీఎస్ పోలీసుల బాగోతాలు వరుసగా తెరపైకి వస్తుండడంతో ఉంగరాలు కాజేసిన ఉదంతంపై కూడా విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలివీ... గత ఏడాది నవంబర్ 29న బాగ్ అంబర్‌పేటకు చెందిన హైకోర్టు న్యాయవాది దిండకుర్తి నారాయణ కిషోర్ జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు డిన్నర్‌కు వెళ్లారు. తన బీఎండబ్ల్యూ కారు (ఏపీ 10 టీజే టీఆర్ 6384)ను వాలెట్ పార్కింగ్‌లో అప్పగించి వెళ్లగా... తిరిగి వచ్చేసరికి అపహరణకు గురైంది. ఈ విషయమై అదే రోజు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో మూడు వజ్రాలు పొదిగిన ఉంగ రాలు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... బంజారాహిల్స్‌లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతూ జల్సాలకు అలవాటు పడిన తిరువీధుల సుమన్ అనే యువకుడు కారును త స్కరించినట్లు గుర్తించారు. ఈ కేసును అప్పటికే సీసీఎస్‌లోని ఆటోమొబైల్ టీంకు అప్పగించారు. వారు సుమన్‌ను అదుపులోకి తీసుకొని వివరాలు రాబట్టారు. సీసీఎస్ ఆటో మొబైల్ విభాగం సీఐ ప్రసాద్ కారును స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హోంగార్డుగా నమ్మించి ప్రైవేట్ డ్రైవర్‌తో వాహనాన్ని తరలించారు. కారులో ఉన్న మూడు ఉంగరాలను నొక్కేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దాంతో ప్రైవేట్ డ్రైవర్, బన్ను ప్రమోద్ మరుసటి రోజు నుంచి పరారైనట్టు సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా పోలీసులు అప్పట్లో జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా అక్రమాలు బయట పడ డ ంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాయమైన ఉంగరాల వ్యవహారంపై సీసీఎస్ పోలీసులను విచారిస్తున్నారు. కనిపించడం లేదన్నారు... చోరీ కేసులో దొరికిన కారును ప్రైవేటు డ్రైవర్ ప్రమోద్‌తో ఎలా తెప్పించారని న్యాయవాది నారాయణ కిషోర్ ప్రశ్నించారు. తన కారు డిక్కీలో ఉన్న వజ్రాల ఉంగరాలను ప్రమోద్ తీశాడని... అతన్ని ఆ రోజే పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయాడని తెలిపారు. ఉంగరాలు ఇప్పించాలని సీఐ ప్రసాద్‌ను వేడుకుంటే... ఇప్పిస్తానని చెప్పారని... చివరకు అతను కనిపించడం లేదని సమాధానమిచ్చారని న్యాయవాది ‘సాక్షి’కి తెలిపారు. ప్రసాద్‌ను గానీ, ప్రమోద్ను గానీ అదుపులోకి తీసుకుని విచారిస్తే తన ఉంగరాలు దొరకుతాయని భావిస్తున్నారు. విమానాల్లో చక్కర్లు... స్టార్ హోటళ్లలో విందు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బన్ను ప్రమోద్ను సీఐ ప్రసాద్ తన కారుకు ప్రయివేటు డ్రైవర్‌గా పెట్టుకున్నారు. సీసీఎస్‌లో మాత్రం అందరూ అతనిని హోంగార్డుగా పరిగణించారు. విమానాల్లో ప్రయాణాలు... స్టార్ హోటళ్లలో విందులు...ఇదీ ప్రమోద్ వ్యవహార శైలి. అతనికి నెలకు రూ.10 వేలు మాత్రమే జీతంగా వచ్చేది. ఈ వేతనంతో విమాన ప్రయాణాలు... స్టార్ హోటళ్లలో భోజనాలు సాధ్యం కాదనేది తెలిసిందే. మరి విలాసాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. పరారీలో ఉన్న ప్రమోద్ను పట్టుకుంటే సీసీఎస్ అధికారుల అక్రమాలు మరిన్ని వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి. -
మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్
-
మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్
హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యే కుమారుడు సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటుపడ్డ మాజీ ఎమ్మెల్యే తనయుడు పార్క్ చేసిన ఖరీదైన కార్లను చోరీ చేసి వాటిలో అమ్మాయిలతో షికార్లు కొట్టేవాడు. ఇతగాడు బీఎండబ్ల్యూతో పాటు రెండు వెర్నా కార్లను దొంగిలించాడు. ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న సుమన్ విలాసాలకు అవసరమైన డబ్బు లేకపోవడంతో కార్ల చోరీలు చేయటానికి అలవాటు పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సుమన్‌ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. -
ఖరీదైన కార్ల చోరీ, అమ్మాయిలతో షికార్లు
-
ఖరీదైన కార్ల చోరీ, అమ్మాయిలతో షికార్లు
హైదరాబాద్ : జల్సాలకు అలవాటుపడ్డ ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఖరీదైన కార్లను చోరీ చేసి వాటిలో అమ్మాయిలతో షికార్లు చేస్తున్నాడు. అతగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... శ్రీనగర్ కాలనీకి చెందిన సుమన్(25) ఇంజినీరింగ్ పూర్తి చేశారు. చదువుతున్న సమయంలోనే అమ్మాయిలతో పరిచయాలు, విలాసాలకు అలవాటుపడ్డాడు. విలాసాలకు అవసరమైన డబ్బు లేకపోవడంతో కార్ల చోరీలు మొదలెట్టాడు. వారం క్రితం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్ పార్కింగ్లోని వ్యాలెట్ పార్కింగ్ డ్రా నుంచి ఓ కారు తాళం తీసుకొని ఓ అడ్వకేట్ కు చెందిన బీఎండబ్ల్యూ కారు ఎత్తుకెళ్లాడు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దసపల్లా హోటల్ సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా సుమన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా గతంలో కూడా బేగంపేట బాటిల్స్ అండ్ చిమ్నీ పబ్ పార్కింగ్‌లో కూడా రెండు వెర్నా కార్లు దొంగిలించినట్లు తేలింది. కార్లు చోరీ చేశాక వాటి నంబర్ ప్లేట్లు మార్చి అమ్మాయిలతో షికార్లుకు వెళ్లడం, పబ్‌లు, క్లబ్‌లలో జల్సాలు చేయడం సుమన్‌కు అలవాటుగా మారింది. గతంలో ఇంకా ఏమైనా చోరీలు చేశాడా? అనే కోణం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. -
అక్కడ చోరీ.. ఇక్కడ విక్రయం
మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లో ఖరీదైన కార్ల చోరీ నకిలీ పత్రాలతో నగరంలో విక్రయం అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు రూ.3 కోట్ల విలువైన 15 కార్ల స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: ఇతర రాష్ట్రాలలో ఖరీదైన కార్లు, ఇతర భారీ వాహనాలను చోరీ చేసి.. వాటికి నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును నగర సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.3 కోట్ల విలువ చేసే 15 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు సహకరిస్తున్నట్టు తెలియడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వివరాలు... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వాహనాల దొంగపై సీసీఎస్ ఆటో మొబైల్ టీం దృష్టి సారించింది. అతడిని ఆ బృందం అదుపులోకి తీసుకొని విచారించగా దిమ్మతిరిగే నిజాలు వెలుగు చూశాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలలో ఖరీదైన కార్లను చోరీ చేసి నగరానికి తెస్తున్న ముఠా.. ఆర్టీఏ బ్రోకర్ల సహాయంతో రిజిస్ట్రేషన్ నెంబర్లను మార్చి విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఇలా విక్రయించిన వాహనాలకు నగరంలోని పలు ఫైనాన్స్ కంపెనీలు ఫైనాన్స్ కూడా చేశాయి. మహబూబ్‌నగర్‌లో పట్టుబడిన నిందితుడు మరో ఇద్దరు నిందితుల పేర్లు వెల్లడించడంతో వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఈ ముఠా ఏడాది కాలంలో 15 కార్లను విక్రయించినట్లు తేలడంతో వీటిని ఖరీదు చేసిన వారి నుంచి వాహనాలను సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పోలీసులు ఈ ముఠా అరెస్టును చూపించే అవకాశాలున్నాయి. -
కారు చోరీ కేసులో పోలీస్ అధికారి కుమారుడు అరెస్ట్
హైదరాబాద్ : ఖరీదైన వాహనం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు పోలీస్ అధికారి కుమారుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో నలుగురు అనుమానితుల్నికూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నిందితుడు ఎవరనే కోణంలో సాంకేతికంగా దర్యాప్తు సాగుతున్న డీఎస్పీ కుమారుడు రాహుల్ పై పోలీసులు దృష్టి సారించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.80లో నివసించే ఎన్వీవీ ప్రసాద్ గతేడాది మే 22న జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్‌కు వచ్చారు. తన స్కోడా సూపర్బ్ కారును హోటల్‌కు చెందిన వ్యాలెట్ పార్కింగ్‌లో ఉంచారు. కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన ఆయన కారు చోరీ అయిందని గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు కారు విలువ భారీగా ఉండటంతో దర్యాప్తు నిమిత్తం కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. పలు కోణాల్లో దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు హోటల్ ప్రధాన ద్వారం, ఇతర ప్రాంతాలతో పాటు పార్కింగ్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించారు. వీరిలో ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో పని చేస్తున్న ఓ డీఎస్పీ కుమారుడు కూడా ఉన్నారు. వాహనం రికవరీ కోసమూ ప్రయత్నిస్తున్నాంఅని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
పోలీసుల అదుపులో డీఎస్పీ కుమారుడు
ఖరీదైన వాహనం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు ఓ డీఎస్పీ కుమారుడితో సహా నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నిందితుడు ఎవరనే కోణంలో సాంకేతికంగా దర్యాప్తు చేస్తూ విచారిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.80లో నివసించే ఎన్వీవీ ప్రసాద్ గతేడాది మే 22న జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్‌కు వచ్చారు. తన స్కోడా సూపర్బ్ కారును హోటల్‌కు చెందిన వ్యాలెట్ పార్కింగ్‌లో ఉంచారు. కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన ఆయన కారు చోరీ అయిందని గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు కారు విలువ భారీగా ఉండటంతో దర్యాప్తు నిమిత్తం కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. పలు కోణాల్లో దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు హోటల్ ప్రధాన ద్వారం, ఇతర ప్రాంతాలతో పాటు పార్కింగ్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించారు. ప్రాథమికంగా నలుగురిని అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో పని చేస్తున్న ఓ డీఎస్పీ కుమారుడు కూడా ఉన్నారు. ‘ఆ నలుగురిలో అసలు నిందితుడు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నాం. దీనికోసం అనుమానితుల్ని విచారించడంతో పాటు ఫోన్ వ్యవహారాలకు సంబంధించి సాంకేతికంగానూ ముందుకు వెళ్తున్నాం. వాహనం రికవరీ కోసమూ ప్రయత్నిస్తున్నాం’ అని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.