ఉత్తర ప్రదేశ్‌లో వింత దొంగతనం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు కలిసి అడ్డదారిలో డబ్బు సంపాదించేదుకు ఓ కారును దొంగతనం చేయాలనుకున్నారు. అనుకున్నట్లే కారును దొంగిలించారు కానీ తరువాతే అసలు విషయం తెలిసింది. ముగ్గురిలో ఎవరికి కూడ డ్రైవింగ్ రాదని.. దీంతో చేసేదేం లేక కారును దాదాపు 10 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్లారు. అమినా చివరకు పోలీసులకు పట్టుబట్టారు.
అసలేం జరిగిందంటే.. కాన్పూర్‌లోని దబౌలి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అమన్ గౌతమ్, సత్యం కుమార్ కాలేజీ విద్యార్థులు. వీరికి అమిత్ వర్మతో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి మే 7న కారు మారుతి వ్యాన్‌ను దొంగిలించాలని ప్లాన్ చేశారు. పథకం ప్రకారమే కారును దొంగిలించారు. అయితే అక్కడే ఈ ముగ్గురికి కష్టాలు మొదలయ్యాయి. ముగ్గురిలో ఎవరికి కారు డ్రైవింగ్ రాదని అర్థమైంది. అయినా కారును వదిలి వెళ్లాలని అనిపించలేదు. దీంతో కారును నెట్టుకుంటూ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా రాత్రి 10 కిలోమీటర్లు దబౌలి నుంచి కళ్యాణ్‌పూర్ వరకు వ్యాన్‌ను తోసుకుంటూ వెళ్లారు.
10 కిలోమీటర్ల పాటు కారు తోయడంతో ఇక తమ వల్ల కాదని, నెంబర్ ప్లేట్ తొలగించి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో దాచిపెట్టి అక్కడి నుంచి పారిపోయారు. తరువాత వచ్చి ఆ కారును అమ్మేయాలని కుట్ర పన్నారు. చివరికి ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేశారు. ఈ దోపిడీకి అమిత్ స్కెచ్ వేయగా.. దీన్ని వెబ్ సైట్ ద్వారా అమ్మేందుకు సత్యం ప్లాన్ చేశాడని ఏసీపీ భేజ్ నారాయణ్ సింగ్ వెల్లడించారు. ఒకవేళ కారు కొనడానికి ఎవరూ దొరక్కపోతే.. వెబ్ సైట్ ద్వారా విక్రయించాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు.
చదవండి: స్మార్ట్ టన్నెల్.. సెల్ సిగ్నల్ దొరక్క ప్రాణం పోయింది!
Comments
Please login to add a commentAdd a comment