కదిలే కారు నుంచి కిందకు దూకి, ఆ వాహనంతోపాటే సమాంతరంగా వెళుతూ డ్యాన్స్ చేయటం. కీకీ ఛాలెంజ్ పేరిట సోషల్ మీడియాలో ఇదో ట్రెండ్ సెటర్‌గా మారింది. అయితే కొందరు కుర్రాళ్లు చేసిన ఓ వీడియో సరదాగా ఉండటమే కాదు... వాట్సాప్ గ్రూప్‌ల్లో చక్కర్లు కొడుతోంది కూడా.
కారు డోర్‌ను దొంగతనం చేసి అచ్చం కీకీ ఛాలెంజ్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ ఓ వీడియోను రికార్డు చేస్తుంటారు. ఇంతలో ఓ వ్యక్తి ఏం చేస్తున్నారంటూ అడ్డుతగలటం.. కీకీ ఛాలెంజ్ చేస్తున్నామంటూ బదులు ఇవ్వటం, అంతలోనే కారుతో సహా ఓ వ్యక్తి డోర్ కోసం రావటం.. దొంగిలించిన డోర్‌తో సహా కుర్రాళ్లు పరిగెత్తటం ఆ వీడియోలో చూడొచ్చు. కీకీ కారు డోర్ ఛాలెంజ్ పేరిట సరదాగా చేసిన ఈ యత్నం వైరల్ అవుతోంది. ఈ వీడియోను కొన్ని ట్రోల్ పేజీలు సైతం వాడేసుకోవటం విశేషం.
కీకీ ఛాలెంజ్.. యువత తాము నడుపుతున్న కారు నుంచి డోర్ తీసుకుని కిందకు దూకుతారు. కారు అలా వెళుతూ ఉండగా, వారు కూడా దానితోపాటే వెళుతూ డాన్స్ చేస్తారు. పాట ఆఫ్ చేయగానే ఒక్కసారిగా తిరిగి కారులోకి దూకేయాల్సి ఉంటుంది. స్నేహితురాలు కేషియా ఛాంటెను గుర్తు చేసుకుంటూ కెనడా రాక్ స్టార్ ‘డ్రేక్’ పాడిన ‘ఇన్ మై ఫీలింగ్స్’ అనే పాట కీకీ ఛాలెంజ్‌కు మూలం. ఈ ప్ర్రక్రియను రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి, ఇతరులకు సవాల్ చేస్తారు. ఇప్పటికే విల్ స్మిత్, సియారా వంటి ప్రముఖులూ సైతం ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. అయితే దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలు దేశాలు, నగరాలు ఈ ఛాలెంజ్‌పై నిషేధం విధించాయి. ఇదిలా ఉంటే బైక్‌పై కూడా ఈ కీకీ ఛాలెంజ్‌ను కొందరు యత్నిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment