Kiki Challenge
-
ఆ సిత్రాలు.. ‘సోషల్’.. వైరల్!
సెకన్లు, నిమిషాల వ్యవధిలో కార్చిచ్చులా వ్యాపించి అందరినీ చేరుకునే సత్తా ఉండటం సోషల్ మీడియాలో కొత్త పోకడలకు ఆస్కారమిస్తోంది. ఆ సిత్రాలు కొన్ని చూస్తే... బాటిల్ క్యాప్ చాలెంజ్ సీసా మూతను కాలితో తీసే చాలెంజ్ పేరే బాటిల్ క్యాప్ చాలెంజ్. టైక్వాండో ఇన్స్ట్రక్టర్ ఫరాబీ డవ్లెట్చిన్ దీన్ని ప్రారంభించారు. నేలపైనగానీ, బల్లపైన గానీ ఒక సీసాని ఉంచి, దాని మూతను వదులుగా పెట్టాలి. కాలితో సీసా మూత ఊడిపోయి కిందపడేలా చేయాలి. సీసా మాత్రం పడకూడదు. బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, గోవింద, పరిణీతి చోప్రా, సుస్మితా సేన్ లాంటి ప్రముఖులు ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. కికీ చాలెంజ్ కదులుతున్న కారులోంచి దిగడం.. పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేయడం... ఇదీ కికీ ఛాలెంజ్!!. యువత ఈ చాలెంజ్‌ను క్షణాల్లో వైరల్‌గా మార్చేసినా.. చాలా చోట్ల ఈ చేష్టలు ప్రమాదాలకూ కారణమ య్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఇలాంటి ఘటనలు నమోదు కావడంతో పోలీసులు.. ఈ చాలెంజ్‌లో పాల్గొనవద్దంటూ హెచ్చరికలు జారీచేయాల్సిన పరిస్థితులొచ్చాయి. ఫిట్నెస్ చాలెంజ్ ఈ చాలెంజ్ ప్రకారం యోగా చేస్తున్న దృశ్యాల వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవాలి. ప్రధాని మోదీ యోగా వీడియోలూ మథ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. క్రీడాకారులూ, బాలీవుడ్ నటులు ఇంకా ఎందరో ఇందులో పాల్గొన్నారు. -
జాతీయ జెండాతో ‘కీకీ’ చాలెంజ్..
-
జాతీయ జెండాతో ‘కీకీ’ చాలెంజ్.. వివాదంలో ఎయిర్‌లైన్స్
కీకీ చాలెంజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న సరికొత్త చాలెంజ్. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ చాలెంజ్ వల్ల ఇబ్బందుల పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) కూడా ఈ జాబితాలో చేరింది. అసలేం జరిగిందంటే.. పోలాండ్‌కు చెందిన టూరిస్ట్ ఇవా బయాంక జుబెక్ ప్రస్తుతం పాకిస్తాన్లో పర్యటిస్తోంది. అయితే పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పీఐఏ ఆమెతో ఓ ప్రమోషనల్ వీడియోను రూపొందించింది. పాక్ జాతీయ జెండాను ఒంటిపై కప్పుకున్న ఇవా బయాంక.. ఆగి ఉన్న విమానంలో డాన్స్ చేస్తూ కీకీ చాలెంజ్ విసిరింది. ఇందుకు సంబంధించిన వీడియోను పీఐఏ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘ప్రపంచాన్నంతటినీ చుట్టి వస్తోన్న గ్లోబల్ సిటిజన్ ఇవా జుబెక్ హృదయం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. పీఐఏలో ప్రయాణిస్తూ ఆమె సరికొత్త అనుభవాన్నిఆస్వాదిస్తున్నారు. ఇంతకు ముందెన్నడు, ఎవరూ సెలబ్రేట్ చేసుకోని విధంగా ఆమె పాక్ స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుతున్నారంటూ’ ట్వీట్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. చర్యలు తప్పవు.. ఇవా బయాంక చర్యను తీవ్రంగా తప్పు పట్టిన పాక్ నేషనల్ అకౌంటబిలిటి బ్యూరో(ఎన్ఏబీ) ఆమెపై, పీఐఏపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఎన్ఏబీ అధికారి మాట్లాడుతూ.. ‘ అసలు ఆమెను ఆగి ఉన్న విమానంలోకి వచ్చేందుకు, డ్యాన్స్ చేసేందుకు అనుమతించింది ఎవరో కనుక్కునే పనిలో ఉన్నాం. జాతీయ జెండాను అవమానించినందుకు ఆమెకు నోటీసులు జారీ చేశాం. ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా పీఐఏకి లెటర్ కూడా పంపించామని’ పేర్కొన్నారు. Eva zu Beck from Poland/England is a Global Citizen travelling around the world, but now her heart is set on Pakistan! She has been exploring Pakistan flying #PIA. She will be celebrating Independence Day in a style never before attempted in the world! Stay tuned for updates. pic.twitter.com/jrwezOJBzw — PIA (@Official_PIA) August 12, 2018 -
కాజల్, అల్లుడు శీను వెరైటీ ‘కీకీ’ వీడియో
ప్రపంచవ్యాప్తంగా కీకీ చాలెంజ్ ఫేమస్ అయింది. ఎంతో మంది ప్రమాదాల భారిన పడ్డారు కూడా. ఈ చాలెంజ్ మన దేశంలోనూ విస్తరించి హల్చల్ చేస్తోంది. టాలీవుడ్‌కు చెందిన ఆదా శర్మ, రెజీనాలు కీకీ చాలెంజ్‌ను స్వీకరించారు. పోలీసులు ఈ చాలెంజ్‌ను నిషేదించడంతో కొంతవరకు దీని హవా తగ్గింది. అయితే తాజాగా కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి ఈ కీకీ చాలెంజ్‌ను వెరైటీగా ప్రయత్నించారు. కదిలే కారులోంచి కాకుండా.. వీల్ చైర్లోంచి దిగి విభిన్నంగా చేశారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. మధ్యలో ఈ కీకీ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. -
వీల్ చైర్లోంచి విభిన్నంగా కికీ చాలెంజ్
-
రైలులో కీకీ అన్నారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు
ముంబై : కీకీ చాలెంజ్ చాలా ప్రమాదకరం.. కీకీ అంటూ విన్యాసాలు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా జనాలు మాత్రం వాటిని బుర్రకెక్కించుకోవడం లేదు. దాంతో ఇన్ని రోజులు మందలించి వదిలేసిన పోలీసులు ఇప్పుడు మాత్రం కాస్తా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కీకీ చాలెంజ్ అంటూ కదులుతున్న రైలుతో పాటు విన్యాసాలు చేసిన ఒక యువకుడికి, ఈ తతంగాన్నంతా వీడియో తీసిన అతని స్నేహితులకు కూడా పనిష్మెంట్ ఇచ్చారు. కాకాపోతే అది కాస్తా వెరైటీ పనిష్మెంట్. రైల్వే ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేశారు కాబట్టి వరుసగా మూడు రోజుల పాటు రైల్వే స్టేషన్‌ను శుభ్రపర్చాలంటూ కోర్టు ఆ యువకులను ఆదేశించింది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని విరార్ ప్రాంతానికి చెందిన నిషాంత్ షా(20), ధ్రువ్ షా(23), శ్యాం శర్మ(24) అనే ముగ్గురు యువకులు కీకీ ఛాలెంజ్ పేరిట కదులుతున్న రైల్లో నుంచి కిందకి దిగి డ్యాన్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఫ్లాట్‌ఫాంపై రకరకాల విన్యాసాలు చేశారు. దీన్నంతా వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్టు చేశారు. దాంతో అది కాస్తా పోలీసుల కంట పడింది. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు, సీసీ టీవీ, సదరు కీకీ వీడియోలోని దృశ్యాల ఆధారంగా ఆ ముగ్గురుని అరెస్టు చేశారు. అయితే ఈ యువకులు కీకీ పేరుతో ఇలా విన్యాసాలు చేయడం ఇదే ప్రథమం కాదని తెలిసిందే. గతంలో వీళ్లు ఏకంగా అంబులెన్స్ దగ్గర కూడా కీకీ ఛాలెంజ్ డ్యాన్స్ చేశారట. ఆ వీడియోను కూడా రైల్వే పోలీసులు గుర్తించారు. అనంతరం వాళ్లను అరెస్టు చేసి వసాయ్ ప్రాంతంలోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. యువకులను విచారించిన రైల్వే కోర్టు వారికి శిక్ష విధించింది. ఈ వారంలో మూడు రోజుల పాటు వసాయ్ రైల్వే స్టేషన్‌ను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేకాక ముగ్గురు యువకులు రైల్వే స్టేషన్‌ను శుభ్రపరుస్తుండగా వీడియో తీసి దాన్ని కోర్టుకు అందజేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలు, అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ రైల్వే స్టేషన్‌ను శుభ్రం చెయ్యాలని కోర్టు ఆదేశించింది. -
మనోళ్ళు ఎప్పుడో ఉతికిపారేసిందే నేటి కీకీ
పోలీసులు లాఠీ చూపినా కీకీ కేక పెడుతూనే ఉంది. కదులుతున్న కార్లు దాటి దున్నతున్న నాగళ్లను పట్టుకుంది. సిటీ యూత్ నుంచి పల్లెటూరి పిల్లగాళ్లను చేరింది. ఆ చాలెంజ్ వెంట పరుగులు తీస్తున్నారు.. పిచ్చిపట్టి డ్యాన్స్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో యువ రైతులు పొలంలో పని చేస్తూ ‘కీకీ చాలెంజ్’ యాక్సెప్ట్ చేయడంతో కీకీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సోషల్ మీడియా కాజ్‌తో క్రేజ్‌గా మారిన కీకీ చాలెంజ్ వల్ల కాళ్లు విరుగుతున్నాయి.. తలలు పగులుతున్నాయి.. ప్రాణాలు పోతున్నాయి... ట్రాఫిక్ ఇబ్బందులూ వస్తున్నాయి.. ఆపండి అని అరుస్తున్నా ఆగట్లేదు. పనిష్మెంట్ తప్పదని హెచ్చరిస్తున్నా లెక్క చేయట్లేదనే అనిపిస్తోంది ఈ వెర్రిని చూస్తుంటే. వాస్తవానికి ‘కీకీ చాలెంజ్’లాంటిది మనకు కొత్త కాదు. ఈ స్టయిల్ మన సినిమా బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే క్రియేట్ చేసింది. డిజిటల్ ఏజ్‌లోనూ కంటిన్యూ చేస్తోంది. కంటి చూపుతో ట్రైన్ ఆపడాలు.. తొడకొట్టి వెనక్కి పంపిచడాలు ఎన్ని సినిమాల్లో చూడలేదూ? అయితే వీటిని మనం స్టంట్స్గానే గుర్తించాము తమ్మ సోషల్ మీడియా దాకా తీసుకెళ్లలేదు. చాలెంజెస్ పేరుతో పబ్లిసిటీ ఇవ్వలేదు. ఈ కామన్సెన్స్నే ‘కీకీ’కీ అప్లయ్ చేయాలి. మన దగ్గర గతంలో ‘కీకీ’ని పోలిన సన్నివేశాలు కనిపించిన సినిమాలు... షోలే.. సాజన్ అశోక్ కుమార్, కిషోర్ కుమార్, అనూప్ కుమార్ ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి నటించిన ‘చల్తీ కా నామ్ గాడీ’లో కదిలే కారులో సాగే పాటలు, మాటలు, డాన్సుల సీన్లు ఉన్నాయి. ‘బాజూ... సంఝో ఇషారే’ అని సాగే పాటలో కారు వదిలి దౌడు తీసే విన్యాసాలు ఉన్నాయి. అలాగే ‘ప్యార్ కియే జా’ (డైరెక్టర్ సీవీ శ్రీధర్)లోనూ ‘గోరే హాతోంపే జుల్మ్ నా కరో’ అనే కీకీ చాలెంజ్‌ను పోలిన పాట ఉంటుంది. హీరోయిన్స్ ఇద్దరూ కారు నడిపిస్తుంటే హీరో పాడుకుంటూ బ్యానెట్ మీద డాన్స్ చేస్తాడు ఆ పాటలో. అందరికీ తెలిసిన ‘షోలే’’లోనూ అలాంటి సాంగ్ షో చేసింది. బసంతి (హేమామాలిని) తన గుర్రబ్బండీని తోలుకుంటుంటే వీరు (ధర్మేంద్ర) ‘కోయి హసీనా జబ్ రూట్ జాతీ హైతో’ అని పాడుతూ బగ్గీ ఎక్కుతాడు. పాడుకుంటూనే కిందికి దూకుతాడు. మళ్లీ ఎక్కుతాడు. ‘ఆరాధన’ ఆల్ టైమ్ హిట్ సాంగ్ ‘మేరే సప్నోంకి రాణి కబ్ ఆయే గీ తూ’ పిక్చరైజేషన్ ఏమన్నా ఉంటుందా? మూవింగ్ ట్రైన్‌లోని హీరోయిన్ను చూస్తూ జీప్‌లోని హీరో పాడే పాట. ఇప్పటికీ కోట్ల స్వరాలు ఆలపిస్తునే ఉంటాయి. కాని అభినయించే దుస్సాహసం రికార్డ్ కాలేదెక్కడ. ‘సాజన్’, ‘హమ్ ఆప్ కే హై కౌన్’ వంటి సినిమాల్లో లోతట్టుకి జారుతున్న జిప్సీలోకి హీరో సల్మాన్ ఖాన్ దూకి ఎక్కిన దృశ్యాలున్నాయి. ‘అంజాన్’ సినిమాలో షారూఖ్‌ఖాన్ టాక్సీ మీదెక్కి అభినయించిన ‘బడీ ముష్కిల్ హై ఖోయా మెరా దిల్ హై..’ పాట కూడా చాలా పాపులర్ అయింది. షారూఖ్ ఖానే నటించిన ఇటీవలి సినిమా ‘ఫ్యాన్’లో ‘కరూ ట్విటర్ పే.. ట్యాగ్ కరూ ఫేస్బుక్ పే’ అనే పాటలో కూడా ఆయన పాడుకుంటూ కదిలే బస్ ఎక్కుతాడు. ఇది సినిమాల వరకూ ఓకే. నిజ జీవితంలో కదిలే వాహనం ఎక్కే ప్రమాదం ఎలాంటిదో తెలుసు కదా! టాలీవుడ్ ఎక్స్పరిమెంట్స్ తెలుగు పరిశ్రమ కూడా మన హీరోల చేత ఇలాంటి శ్రమ బాగానే చేయించింది. బ్రహ్మాండంగా స్టెప్స్ వేయించింది. అభిమానాన్ని చప్పట్ల వరకే పరిమితం చేయించింది. ‘నవ్వింది మల్లెచెండు.. నచ్చింది గర్ల్ ఫ్రెండ్.. ’ అంటూ ‘అభిలాష’లో టూ వీలర్ మీద చిరంజీవి చేసిన విన్యాసాలు కొన్నా? ఈలలతో స్పందించిన గొంతులు ఇంకెన్నో! ప్రేమకు అమ్మాయి ఓకే చెబితే ఇప్పటికీ ఆ పాటను హమ్ చేస్తూ ఉల్లాసంగా రైడ్ చేసే పల్సర్, అపాచీ, హోండా.. ఈవెన్ హ్యార్లీ డేవిడ్సన్ బైక్స్ ఎన్నిలేవూ! స్పీడ్ బ్రేకర్స్‌ను ఇగ్నోర్ చేసిన దాఖలాలే లేవు. ‘మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూఫానులా రేగి పొమ్మన్నది..’ అంటూ ‘గులాబీ’ ఆ ప్రయాణాన్ని కొనసాగించింది. నైంటీస్‌లో శంకర్ ‘ప్రేమికుడు’ తీసి అద్దాల బస్ మీద హీరోతో ‘ఊర్వశి ఊర్వశి టేకిట్ ఈజీ ఊర్వశి’ అంటూ పాడించాడు. యువత ఆస్వాదించింది కాని బస్సెక్కి పాడే ప్రయత్నం చేయలేదు. మణిరత్నం ‘ఛయ్య ఛయ్య..’ ఎంత హల్చల్ అయిందో.. మలైకా ఎంతమందిని డిస్టర్బ్ చేసిందో వేరే చెప్పక్కర్లేదు. కీన్గా అబ్జర్వ్ చేస్తే ఇండియన్ సినిమాలో పాటలే కాదు.. కదులుతున్న వెహికిల్స్‌లో.. మీద.. పక్కన.. ఫైట్స్, ఇతర సన్నివేశాలూ చాలానే కనిపిస్తాయి. గిమ్మిక్సే అనే స్పృహనూ కలిగిస్తాయి. సో.. ఇంట్రెస్టింగ్ అని ఎంటర్టైన్ అవండి. చాలెంజింగ్ అని ఇమిటేట్ చేయకండి. అలా చేస్తే ప్రమాదం ఎదురుపడి డొక్కలు కదులుతాయి.. ఎముకలు విరుగుతాయి. మరుగున పడాల్సిన దాన్ని వయా సోషల్ మీడియా వైరల్ చేయొద్దు. లైఫ్ చాలెంజెను స్వీకరించాలి. పదిమందికి మంచిని పంచాలి. హాలికుల కుశలం కోసం కరీంనగర్ జిల్లాలో రైతులు కీకీ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసిన వార్తను సోషల్ మీడియా వైరల్చేసి మరుగున పడ్తునదాన్ని మళ్లీ పైకి తెచ్చింది. హాలికుల కుశలం కోసం యాంటి సూసైడ్ చాలెంజ్‌ను స్వీకరిస్తే బాగుంటుంది. రైతుల సంక్షేమాన్ని సర్కార్ సవాలుగా తీసుకుంటే సూపర్‌గా ఉంటుంది. అంతే తప్ప కదులుతున్న వాహనం నుంచి దిగి వేసే గంతుల వల్ల ప్రయోజనం లేదు. -
పోలీసుల ప్రచారం.. బిత్తరపోయాడు
సాక్షి, తిరువనంతపురం/జైపూర్: ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తూ చర్చనీయాంశంగా మారింది కీకీ ఛాలెంజ్. పోలీసులు మాత్రం అది ప్రమాదకరమైందంటూ ఆంక్షలు విధించేస్తున్నా.. యువత అవేం పట్టించుకోకుండా సవాల్‌గా తీసుకుని మరీ ఊగిపోతోంది. అయితే ఈ ఛాలెంజ్‌కు అడ్డుకట్ట వేసే క్రమంలో జైపూర్ పోలీసులు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘ఇన్ లవింగ్ మెమోరీ ఆఫ్ కేకే.. కీకీ ఛాలెంజ్‌లో షీగ్గీ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు’ అంటూ దండేసి ఉన్న ఓ యువకుడి ఫోటో జైపూర్ పోలీసులు ట్విటర్ ఖాతాలో ఉంచారు. ‘ఛాలెంజ్ చేసి ప్రాణాలు తీసుకోకండి’ అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ యాడ్‌ను కొచ్చి(కేరళ)కి చెందిన జవహార్ సుభాష్ చంద్ర(30) చూసి బిత్తర పోయాడు. అందుకు కారణం ఆ ఫోటోలో ఉంది అతనే కాబట్టే. సోషల్ మీడియాలో విస్తృతంగా ఆ ఫోటో వైరల్ కావటంతో ఏం జరిగిందోనన్న కంగారుతో బంధువులు అతనికి ఫోన్ కాల్స్ చేయటం ప్రారంభించారంట. మీడియా ముందుకు వచ్చిన జవహార్ ఈ విషయాన్ని చెబుతూ వాపోతున్నాడు. (కీకీ విన్నర్స్ ‘తెలంగాణ’ కుర్రాళ్లే...) ఫోటో ఎలా దొరికిందంటే.. ఎక్కడో కొచ్చిలో ఉంటున్న అతని ఫోటో జైపూర్ పోలీసులకు ఎలా దొరికిందంటే.. 2008లో జవహార్ మోడలింగ్ చేసేవాడు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్ అయిన జవహార్ అంకుల్.. అతన్ని ఫోటోలు తీసి వాటిని షట్టర్‌స్టాక్‌లో ఉంచారు. ఆ సైట్ నుంచి ఫోటోలను కొనుగోలు చేసిన పోలీసులు ఇప్పుడు ఇలా యాడ్ ఇచ్చారన్న మాట. ‘ఇదొక ప్రచార కార్యక్రమం. ప్రజలకు మంచి చేయాలనే ప్రయత్నం. లీగల్‌గానే అతని ఫోటోను కొనగోలు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో యాడ్‌ను వెనక్కి తీసుకోం. అతను అభ్యంతరం వ్యక్తం చేసినా సరే’ అని కమిషనర్ సంజయ్ అగర్వాల్ స్పష్టం చేశారు. (దొంగతనం చేసి మరీ...) -
సోషల్ మీడియాను ఊపేస్తున్న దేశీ కికి
-
కీకీ ఛాలెంజ్.. అవార్డు మనోళ్లదే
కీకీ ఛాలెంజ్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నడుస్తున్న కిరి కిరి. రన్నింగ్‌లో ఉన్న కారు నుంచి రోడ్డుపై దిగి డ్యాన్స్ చేసి, తిరిగి అదే కారులోకి దూకి మరికొందరికి ఛాలెంజ్ విసరటం దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఇది ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా. కొందరు మాత్రం దాన్ని వీడలేకపోతున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఇద్దరు యువ రైతులు కూడా తమ వంతుగా ఈ ఛాలెంజ్‌లో పాలు పంచుకున్నారు. పోలం దున్నుతూ చేసిన ఈ ఛాలెంజ్ తాలూకు వీడియో హిల్లేరియస్‌గా ఉండటమే కాదు. వాట్సాప్ గ్రూప్‌ల్లో తెగ మారుమోగిపోయింది. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకుంది కూడా. తెలంగాణలోని లంబడిపల్లి గ్రామానికి చెందిన గీలా అనీల్ కుమార్(24), పిల్లి తిరుపతి(28). కీకీ ఛాలెంజ్‌కు సరదాగా యత్నించాలని డిసైడ్ అయ్యారు. వరినాట్ల సందర్భంగా ఎద్దులతో పొలాన్ని చదును చేస్తూ డ్రేక్ ‘ఇట్స్ మై ఫీలింగ్స్’ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ వేశారు. ప్రపంచాన్ని ఊపేస్తున్న పాట.. దానికి దేశీ టచ్.. ఇంకేముంది? ఒక్కసారిగా వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ‘మై విలేజ్ షో’ ఫేమ్ శ్రీరామ్ శ్రీకాంత్ తన యూట్యూబ్ చానల్ లో ఈ నెల 1న పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 1.6 కోట్ల మంది చూశారు. (కారు లేకున్నా...) ఈ వీడియో వ్యవహారం ఇంతటితో ముగిసిపోలేదు. ప్రముఖ కెనడియన్ కమెడియన్, టీవీ వ్యాఖ్యాత ట్రెవార్ నోవా.. కీకీ చాలెంజ్ లో ఈ ఇద్దరు యువ రైతులు విజేతలుగా నిలిచినట్లు ప్రకటించాడు. బాలీవుడ్ నటుడు ఫేమ్ వివేక్ ఒబెరాయ్ కూడా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఇంటర్నెట్, సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదంటున్న అనిల్ తల్లిదండ్రులు నిర్మలా-మల్లేషన్లు తమ కొడుక్కి వస్తున్న పేరును చూసి ఆశ్చర్యపోతున్నారు. తన ఇంతపేరు తీసుకొచ్చిన ‘కికీ చాలెంజ్’ గౌరవార్థం తిరుపతి తన కొడుక్కి కికీ అని ముద్దు పేరు పెట్టుకున్నాడు. డ్రోన్ సాయంతో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ చేసిన వీడియోకు రానీ గుర్తింపు.. ఈ కుర్రాళ్లు సరదాగా చేసిన యత్నానికి దక్కటం గమనార్హం. అనిల్.. తిరుపతి -
కీకీ ఛాలెంజ్.. అవార్డు మనోళ్లదే
-
తెలీక చేశాను.. సారీ!
సాక్షి, బెంగళూరు: కీకీ ఛాలెంజ్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న శాండల్‌వుడ్ నటి నివేదిత గౌడ ఎట్టకేలకు స్పందించారు. ఆ ఛాలెంజ్‌ను నిషేధించిన విషయం తెలీక తాను తప్పు చేశానని ఆమె క్షమాపణలు చెప్పారు. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో కీకీ ఛాలెంజ్ వీడియో చూసి సరదాగా ప్రయత్నించా. అంతేగానీ దాన్ని నిషేధించారన్న విషయం నాకు తెలీదు. నాపై విమర్శలు వెల్లువెత్తిన సమయంలో నన్ను కావాలని టార్గెట్ చేశారేమో అనిపించింది. విషయం తెలిశాక వేరే వాళ్లు ప్రయత్నించకూడదన్న ఉద్దేశంతో ఆ వీడియోను తొలగించా. ప్రాణాల మీదకు తెచ్చుకోవాలని ప్రజలకు చెప్పేంత మూర్ఖురాలిని కాదు కదా!. క్షమించండి’ అని ఓ జాతీయ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యానించారు. (కీకీ ఛాలెంజ్.. దమ్ముంటే ఇలా చేయండి) 18 ఏళ్ల నివేదిత గౌడ కన్నడ బిగ్‌బాస్ 5వ సీజన్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. కీకీ ఛాలెంజ్ విమర్శల నేపథ్యంలో ఆమె పేరు మరోసారి తెరపైకి వచ్చింది. నివేదితపై బెంగళూరు పోలీసులకు ఓ ఉద్యమవేత్త ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటే కీకీ డాన్స్‌తో డాన్స్ కిక్ రాదని, కటకటాల కిక్ మాత్రమే వస్తుందని బెంగళూరు పోలీసులు నెటిజన్లను హెచ్చరించారు. నటి రెజీనా కికి వీడియో వైరల్.. విమర్శలు -
కిరి కిరి
పబ్లిసిటీ పరుగెత్తాలంటే ఏం చెయ్యాలి? పరుగెత్తే కార్లోంచి దూకి, పరుగున డాన్స్ చెయ్యాలి. ఎన్ని వంకర్లు తిరిగితే అన్ని షేర్లు. ఎన్ని టింకర పనులు చేస్తే అన్ని లైకులు. నలుగురికి సాయం చేసో.. పదిమందికి అన్నం పెట్టో.. ఒకరికి చదువు చెప్పో.. ఒక అన్యాయాన్ని ఎదిరించో..అబ్బో.. అంత వద్దులెండి. కనీసం ఒక ప్లకార్డునైనా పట్టుకున్నా సమాజానికి సేవ చేసినట్లు అవుతుంది కానీ.. ఈ కీకీ లేమిటి? కిరికిరిలేమిటి? అమాయకమైన ఓ యువకుడి ఫొటో.. దండ వెళ్లాడుతూ! కింద ‘ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ కేకే.. లవింగ్ బాయ్‌ఫ్రెండ్ టు కీకీ.. డైడ్ వైల్ డూయింగ్ ది షిగ్గి.. (ఫిబ్రవరి 1995 – జూలై 2018) (కేకే ప్రేమస్మృతిలో కీకీ ప్రియతముడు.. షిగ్గీని చేస్తుండగా దుర్మరణం)’ అని రాసి ఉంది. దానికో రైటప్.. ‘డోంట్ చాలెంజ్ డెత్. బీ వైజ్.. కీప్ అవే ఫ్రమ్ సిల్లీ స్టంట్స్ అండ్ అడ్వైజ్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ టు స్టే సేఫ్.(మృత్యువును సవాల్ చెయ్యకండి. తెలివిగా ఉండండి. వెర్రి విన్యాసాలకు దూరంగా ఉండండి. క్షేమంగా ఉండమని మీ స్నేహితులకు కూడా చెప్పండి.) ఇన్అవర్ఫీలింగ్స్#కీకీకిల్స్#ఇన్‌మైఫీలింగ్స్#కీకీచాలెంజ్#జైపూర్పోలీస్#సేఫ్జైపూర్సోషల్ మీడియాలో జైపూర్ పోలీస్‌లు పెట్టిన పోస్ట్ ఇది. ఇప్పుడు సంచలనం రేపుతోంది.. కీకీ చాలెంజ్‌కు కౌంటర్‌గా! ఏంటీ కిరి కిరి?! అరే.. ఈ దేశం.. ఆ దేశమని కాదు.. ఏ దేశంలోనైనా.. ఈ కారు ఆ కారని కాదు.. నానో నుంచి మెర్సిడెజ్‌బెంజ్ దాకా.. నడుస్తున్న కారు లోంచి దూకి.. ‘కీకీ డు యు లవ్ మీ’ అంటూ పాటకు డ్యాన్స్ చేయడం.. స్మార్ట్ ఫోన్‌తో షూట్ చేసుకోవడం.. ఆ వీడియోలను మీ టూ అంటూ కీకీ చాలెంజ్‌కు ట్యాగ్ చేసుకోవడం! ఇదీ కీకీ హ్యాష్‌ట్యాగ్ చాలెంజ్ లేదా ఇన్‌మైఫీలింగ్స్ చాలెంజ్. ఇప్పుడు లోకమంతా పిచ్చిపట్టినట్లు అవుతోంది దీని కోసమే. సోషల్ మీడియాలో వైరల్‌గా అంతా అవే పోస్ట్‌లు. సగటు మనుషుల నుంచి సెలబ్రెటీల దాకా అందరూ పిచ్చిగా ఫాలో అవుతోంది దీన్నే. మొన్నటికి మొన్న రెజీనా కసాండ్రా, అమ్రపాలీ కాస్ట్యూమ్స్‌లో ఆదా శర్మ.. కదులుతున్న కార్లోంచి దూకి పాటకు స్టెప్పులేసి ఆ వీడియోను పోస్ట్ చేశారు. బాలీవుడ్ ఏమీ తక్కువ అడుగులేయలేదు. కరిష్మా శర్మ తన్మయత్వంతో చిందేసింది. నోరా ఫతేహి, వరుణ్ శర్మ (ఫక్రే ఫేమ్) తమ తిక్కను నడుస్తున్న ఆటోలోంచి దూకి చూపించుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్డే కాదు కోలీవుడ్, శాండల్‌వుడ్ సహా హాలీవుడ్‌తోపాటు పాప్ ప్రపంచానికీ ఈ కీకీ చాలెంజ్ వెర్రి పాకేసింది. పోలీసులకూ సవాలే లైఫ్ బిందాస్‌గా ఉండాలి. ఆడుతూపాడుతూ రోజు గడవాలి. ఎప్పుడూ కొత్తగా ఉండాలి. దానికోసం ఎలాంటి వెర్రినైనా తలకెక్కించుకుంటాం.. ఎంతటి పాగల్ పనికైనా తెగబడతామని జనాలు చాలెంజ్ చేస్తే ‘ఊరుకోం’ అంటూ, పట్టుకెళ్లి జైల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసులు. సందులు, వీధులు, కూడళ్లు, రోడ్లు, హైవేలు.. ఎక్కడైనా చాలెంజ్‌కి రెడీ అంటూ.. నడుస్తున్న కార్లలోంచి దూకి డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకోవడం ట్రాఫిక్‌కు అంతరాయంగా మారుతోంది. మరీ కొంతమందైతే రెడ్ సిగ్నల్స్‌ను కూడా లెక్కచేయట్లేదట. ఈ చాలెంజ్ ఆట పోలీసులకు ప్రాణసంకటంగా మారింది. ఈ స్టంట్స్ చేస్తున్నవాళ్లకే కాదు ఇతర వాహనదారులకూ ప్రమాదాలను తెచ్చిపెడ్తోంది. పీక్‌కి వెళ్లిన ఈ పిచ్చిని ఆపడానికి ముంబై, ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, యూపీ పోలీసులు తమ స్టిక్స్‌కి స్ట్రిక్ట్‌గానే పనిచెప్పనున్నారట. ఎవరైనా అలా నడుస్తున్న వాహనాల్లోంచి దూకి గంతులు వేస్తే అరెస్ట్ ఖాయమని.. హెచ్చరికలూ జారీ చేశారు. నిఘా కెమెరాలూ పనిచేస్తున్నాయి. మన పోలీసులు కూడా పేపర్లలో, టీవీల్లో, ఎఫ్ఎమ్ రేడియోల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెండువైపులా పదునైన వేదిక సోషల్ మీడియా.. ఉద్యమాలను (ఉదా : జాస్మిన్ విప్లవం) పుట్టించి ప్రభుత్వాలను ఉరుకులు పెట్టించగలదు.. ‘మీ టూ’ లాంటి హ్యాష్‌ట్యాగ్స్‌ను సృష్టించి మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించగలదు. ఐస్ బకెట్ చాలెంజ్‌తో జబ్బుల మీద (మోటర్ న్యూరోస్ డిసీజ్) అవగాహన తెప్పించగలదు.. రైస్ బకెట్‌తో సామాజిక బాధ్యతను గుర్తుచేయగలదు. దేనికైనా తీవ్రంగా రియాక్ట్ కాగలదు.. దేన్నయినా లైట్‌గా కొట్టిపారేయగలదు. సీరియస్ పాలసీలను ప్యాక్ చేసి దాచేయగలదు.. వినోదాన్ని పంచి పెద్దగా స్ప్రెడ్ చేయగలదు. అదీ సోషల్ మీడియా ఐడెంటిటీ! ‘కీకీ’ కూడా అదే డయాస్‌గా వైరల్ అయింది. ఎక్కడిదీ కిర్రాక్? కెనడా ర్యాప్ సింగర్ డ్రేక్ తెలుసు కదా? ఆయన పాడిందే ‘కీకీ డు యు లవ్ మీ’. ఆయన లేటెస్ట్ ఆల్బమ్ ‘స్కార్పియన్’లోని ‘ఇన్ మై ఫీలింగ్స్’తో సాగుతుందీ పాట. అయితే చాలెంజ్ విసిరింది మాత్రం డ్రేక్ కాదు. బౌన్స్ ట్రాక్‌లో చాలా హుషారుగా సాగే ఈ సాంగ్ ప్రముఖ ఇంటర్నెట్ కమెడియన్ షిగ్గీకి తెగ నచ్చింది. ఉన్నదాన్ని దేన్నయినా తన స్టయిల్లో పాపులర్ చేయడమే కదా షిగ్గీ పని. అందుకే వీధుల్లో.. ఈ పాటకు డ్యాన్ చేసి.. ఈ ఎంజాయ్మెంట్ను మీరూ చాలెంజింగ్‌గా తీసుకోండి అంటూ ఆ వీడియోను జూన్ 30 న సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. షిగ్గీ చాలెంజ్ హ్యాష్‌ట్యాగ్, డూ ది షిగ్గీ హ్యాష్‌ట్యాగ్‌తో. ఈ వీడియోలో ఎక్కడా ఏ వెహికిలూ లేదు. కాని కొన్ని రోజులకు ఓడెల్ బెక్‌హమ్ (ఎన్ఎఫ్ఎల్ స్టార్) ఈ చాలెంజ్‌ను కార్లోంచి(ఆగి ఉన్న కారే) దిగి చేశాడు. ఆ తర్వాత కొంత మంది కదులుతున్న కార్లోంచి దిగి చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి కీకీ చాలెంజ్‌ను కదులుతున్న కార్లోంచి దిగి చేయడం మొదలుపెట్టారంతా. అమెరికన్ యాక్టర్ విల్ స్మిత్ అయితే ఇంకాస్త ముందుకెళ్లి డ్రోన్ కెమెరాలను పెట్టుకొని బుడాపెస్ట్ బ్రిడ్జి మీద డ్యాన్స్ చేశాడు. జరిమానాలు..అరెస్ట్‌లు అలా ఈ వెర్రి వయా హ్యాష్‌ట్యాగ్ ఖండాలన్నిటికీ వ్యాపించింది. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను తెచ్చిపెట్టింది. దాంతో అన్ని దేశాల పోలీసులు కన్నెర్ర చేయక తప్పలేదు. అబుదాబీలో కీకీ చాలెంజ్ కోసం రోడ్డు ఎక్కితే జైలు, జరిమానా రెండూ విధిస్తున్నారు. దుబాయ్‌లో రెండువేల దిరమ్స్ ఫైన్, 23 బ్లాక్ పాయింట్స్ పనిష్మెంట్. అంతేకాదు అరవై రోజుల పాటు ఆ వెహికిల్ జప్తులో ఉంటుంది. అమెరికాలో అయితే రిమాండ్‌కు తరలిస్తున్నారట. స్పెయిన్‌లో నడ్డి విరిగే చార్జీలు విధిస్తున్నారట. కొన్నాళ్ల కిందట మన దగ్గర కొలవెర్రి కూసింది. ఇప్పుడు కీకీ కేకేస్తోంది. ఎక్సయిట్మెంట్ ఉండాలి.. ఎంజాయ్‌మెంటూ కావాలి. అవి జీవితంలో ఉత్సాహం నింపాలి కాని లైఫ్‌ను కిర్రాక్ చేయొద్దు. కదులుతున్న కారు కాదు.. నేను కదలని కార్లోంచే దిగి కీకీ చాలెంజ్ చేశాను. షూటింగ్లో ఉన్నాను కాబట్టి.. గ్యాప్ దొరికినప్పుడు ఆ కాస్ట్యూమ్స్తోనే డ్యాన్స్ చేశానంతే. కదులుతున్న కారులోంచి దూకి చేయలేదు కాబట్టి నేను రూల్స్‌ని, లాని వయలేషన్ చేయలేదనే అనుకుంటున్నా. గవర్నమెంట్ విల్ బి వెరీ హ్యాపీ విత్ మి. – అదా శర్మ, నటి కీకీ జోలికెళ్లొద్దు కీకీ చాలెంజ్ ఫన్ కోసమే అయినా క్షేమం కాదు. ప్రాణాలతో చెలగాటమే. ట్రాఫిక్ రూల్స్‌కి విరుద్ధం కూడా. ఇలాంటి వాటి జోలికి వెళ్లొద్దు. – లావణ్య త్రిపాఠి చట్ట వ్యతిరేక చర్యే కీకీ చాలెంజ్ పేరుతో నడుస్తున్న కారులోంచి దూకి స్టెప్పులేస్తుండటం క్షణికానందాన్ని కలిగించినా మన దగ్గర వాళ్లకు మాత్రం కన్నీటి శోకాన్ని మిగులుస్తుంది. అలా డ్యాన్స్ చేయడం వల్ల కారు ప్రమాదానికి గురై ప్రాణాలు పోతాయి. కొన్ని సందర్భాల్లో వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొట్టడం వల్ల వారు కూడా ప్రమాదం బారిన పడే అవకాశముంది. దీనికితోడు ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఇలా చేయడం కూడా చట్టవ్యతిరేక చర్యే. సిటీ పోలీసు యాక్ట్ సెక్షన్ 70(బీ), మోటారు వెహికల్ యాక్ట్ సెక్షన్ 184, 188ల కింద కేసు నమోదు చేస్తాం. – మహేశ్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ జీవితాన్ని చాలెంజ్‌గా తీసుకోండి కదులుతున్న కార్లోంచి బయటకు దూకి రోడ్లపై డ్యాన్స్‌లు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి చాలెంజ్‌లు అనుసరించే బదులు యువత జీవితాన్ని చాలెంజ్‌గా తీసుకొని ఎదిగేందుకు ప్రయత్నించాలి. ఇటువంటి వాటితో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ప్రాణాలు తీసుకోవద్దు. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎవరిని ఉద్ధరించడానికి! ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి ఈ చాలెంజ్? ఏదైనా పనికొచ్చేవి చేసినా ప్రయోజనముంటుంది. తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన గ్రీన్‌చాలెంజ్ తీసుకోండి.. దేశం పచ్చగానైనా మారుతుంది. గిఫ్ట్ ఎ హెల్మెట్‌తో ప్రమాదాలు తగ్గుతాయి. ట్రాఫిక్ రూల్స్ మీద అవేర్నెస్ పెరుగుతుంది. అంతేకాని ఈ పిచ్చి చాలెంజ్లేంటి? వీటిని అరికట్టాలి. – మంచు లక్ష్మి, నటి, ప్రొడ్యూసర్ – శరాది -
కారు లేకున్నా ‘కీకీ’ ఛాలెంజ్
-
‘కీకీ’ ఛాలెంజ్.. ఇలా కూడా చేస్తారా?
కదిలే కారు నుంచి కిందకు దూకి, ఆ వాహనంతోపాటే సమాంతరంగా వెళుతూ డ్యాన్స్ చేయటం. కీకీ ఛాలెంజ్ పేరిట సోషల్ మీడియాలో ఇదో ట్రెండ్ సెటర్‌గా మారింది. అయితే కొందరు కుర్రాళ్లు చేసిన ఓ వీడియో సరదాగా ఉండటమే కాదు... వాట్సాప్ గ్రూప్‌ల్లో చక్కర్లు కొడుతోంది కూడా. కారు డోర్‌ను దొంగతనం చేసి అచ్చం కీకీ ఛాలెంజ్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ ఓ వీడియోను రికార్డు చేస్తుంటారు. ఇంతలో ఓ వ్యక్తి ఏం చేస్తున్నారంటూ అడ్డుతగలటం.. కీకీ ఛాలెంజ్ చేస్తున్నామంటూ బదులు ఇవ్వటం, అంతలోనే కారుతో సహా ఓ వ్యక్తి డోర్ కోసం రావటం.. దొంగిలించిన డోర్‌తో సహా కుర్రాళ్లు పరిగెత్తటం ఆ వీడియోలో చూడొచ్చు. కీకీ కారు డోర్ ఛాలెంజ్ పేరిట సరదాగా చేసిన ఈ యత్నం వైరల్ అవుతోంది. ఈ వీడియోను కొన్ని ట్రోల్ పేజీలు సైతం వాడేసుకోవటం విశేషం. కీకీ ఛాలెంజ్.. యువత తాము నడుపుతున్న కారు నుంచి డోర్ తీసుకుని కిందకు దూకుతారు. కారు అలా వెళుతూ ఉండగా, వారు కూడా దానితోపాటే వెళుతూ డాన్స్ చేస్తారు. పాట ఆఫ్ చేయగానే ఒక్కసారిగా తిరిగి కారులోకి దూకేయాల్సి ఉంటుంది. స్నేహితురాలు కేషియా ఛాంటెను గుర్తు చేసుకుంటూ కెనడా రాక్ స్టార్ ‘డ్రేక్’ పాడిన ‘ఇన్ మై ఫీలింగ్స్’ అనే పాట కీకీ ఛాలెంజ్‌కు మూలం. ఈ ప్ర్రక్రియను రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి, ఇతరులకు సవాల్ చేస్తారు. ఇప్పటికే విల్ స్మిత్, సియారా వంటి ప్రముఖులూ సైతం ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. అయితే దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలు దేశాలు, నగరాలు ఈ ఛాలెంజ్‌పై నిషేధం విధించాయి. ఇదిలా ఉంటే బైక్‌పై కూడా ఈ కీకీ ఛాలెంజ్‌ను కొందరు యత్నిస్తుండటం గమనార్హం. -
‘తెలంగాణలొ నేరం చేయాలంటే భయపడాల్సిందే’
సాక్షి, హైదరాబాద్ : ‘కికీ చాలెంజ్ వల్ల మీ జీవితాలే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఎవరు ఈ కికీ చాలెంజ్‌ను తీసుకోవద్దు. కికీ చాలెంజ్ అంటూ డ్యాన్స్ చేసినా, దీనికి సంబంధించిన వీడియోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేసినా కఠిన చర్యలు తప్పవం’టూ హెచ్చరించారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. నేరాల నియంత్రణలో భాగంగా ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్’ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణలో నేరాల నియంత్రణ కోసం నూతన సాఫ్ట్వేర్ ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్’ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా దాదాపు లక్ష ఫోటోలను ఈ సిస్టంలో అప్లోడ్ చేస్తున్నాం. పాత నేరస్తుల వివరాలను, వారి ఫింగర్ ప్రింట్స్ వివరాలను కూడా డేటా బేస్ ద్వారా ఈ సిస్టమ్‌లో పొందుపరుస్తాం. ఫలితంగా నేరస్తులను గుర్తుపట్టడం తేలిక అవుతుంది. మిస్సింగ్ కేసులు, క్రిమినల్ కేసులు, గుర్తు తెలియని వ్యక్తులకు సంబంధించిన నేరాలను త్వరితగతిన పరిష్కరించడానికి ఈ టెక్నాలజీ ఎంతో సహకరిస్తుంది. ఇక మీదట తెలంగాణలో నేరం చేయాలంటే ఎవరైనా భయపడాల్సిందే. నేరాలను అదుపు చేయడానికి ఈ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుంది’. దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ పోలీస్ శాఖ ఈ ‘ఫేషియల్ రేకగ్నైజేషన్ సిస్టమ్’ను ఏర్పాటు చేస్తుందని మహేందర్ రెడ్డి తెలిపారు. నేటి నుంచే ‘టీఎస్ కాప్’ యాప్‌కు ఈ సిస్టమ్‌ను అనుసంధానం చేస్తున్నామన్నారు. అంతేకాక త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టిగేషన్ అధికారులందరికి ఈ సిస్టమ్ గురించి శిక్షణ ఇచ్చి వాడుకలోకి తీసుకొస్తామని తెలిపారు. -
ఆంటీ మీరు కూడనా..!
-
ఆంటీ మీరు కూడనా..!
గాంధీనగర్ : ‘కికీ చాలెంజ్’.. ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగిస్తూ, వారిని నడిరోడ్లపై నాట్యం చేయిస్తూ, పోలీసులకు నిద్ర లేకుండా చేస్తోంది. ‘ఈ చాలెంజ్ చాలా ప్రమాదకరం’ అని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తోన్న వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. యువతరం మొదలుకొని సెలబ్రిటీస్ వరకూ ఈ చాలెంజ్‌ను స్వీకరించి తమ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు వీరి కోవలోకి ఒక వడోదర ఆంటీ చేరారు. సెలబ్రెటీలు చేసిన కికీ డ్యాన్స్ కంటే ఎక్కువగా ఇప్పుడు ఈ ఆంటీ డ్యాన్సే ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. కికీ పుణ్యామా అని కేవలం ఒక్క రోజులోనే కావాల్సినంత పబ్లిసిటీ దక్కించుకోని పాపులర్ అయ్యారు ఈ వడోదర ఆంటీ. కానీ ఈ వెర్రి ఇక్కడకు కూడా పాకడంతో తలలు పట్టుకుంటున్నారు వడోదర పోలీసులు. దాంతో సదరు వీడియోలో ఉన్న ఆంటీ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. వివరాల ప్రకారం.. వడోదరకు చెందిన మధ్య వయస్కురాలైన రిజ్వానా మిర్ కికీ చాలెంజ్‌లో భాగంగా ‘ఇన్ మై ఫిలింగ్స్’ సాంగ్‌కు డాన్స్ చేసి, ఆ వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. కికీ సాంగ్‌కు ఈ ఆంటీ వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘వాహ్ ఆంటీ.. ఏం ఎనర్జీ, అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రసుత్తం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లకు నచ్చిన ఈ ఆంటీ డ్యాన్స్, పోలీసులకు మాత్రం వణుకు పుట్టిస్తోంది. దాంతో వడోదర పోలీసులు ఈ వీడియోపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. అంతేకాక ఇలాంటి ప్రమాదకర చాలెంజ్‌లు తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కికీ చాలెంజ్ మీద పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కికీ చాలెంజ్ అనే ఈ ఇంటర్నెట్ సంచలనానికి మరో పేరు ‘ఇన్ మై ఫీలింగ్స్’. డ్రేక్ గ్రాహం అనే 24 ఏళ్ల కెనడియన్ యువ గాయకుడు ఇటీవల విడుదలైన తన ‘స్కార్పియన్’ ఆల్బంలోని ‘ఇన్మై ఫీలింగ్స్’ అనే పాటలో ‘కికీ డూ యూ లవ్ మీ’ అని ప్రశ్నిస్తాడు. అయితే ఈ పాటకీ, ‘కికీ చాలెంజ్’కీ ఏ సంబంధమూ లేదు. ఇంటర్నెట్ కమెడియన్ షిగ్గీ ఈ పాటకు డాన్స్ చేసి దాన్ని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో వేలాది మంది అనుసరిస్తున్నారు. -
వివాదంలో బిగ్‌బాస్ నివేదిత
యశవంతపుర : ఇప్పటికే పలు రాష్ట్రాలలో నిషేధించిన కికీ (రోడ్డుపై డ్యాన్స్ చేయటం) చాలెంజ్‌ను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసిన కన్నడ బిగ్‌బాస్ పారిసిపేట్ నివేదిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివేదిత ఇటీవల కారులో వెళ్తూ ఒక ట్రాఫిక్ ప్రాంతంలో దిగి డ్యాన్స్ చేసి ఆ వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో అప్లోడ్ చేసి కికీ చాలెంజ్‌కు పిలుపునిచ్చారు. ఈ కికీ చాలెంజ్‌ను పలు రాష్ట్రాలు నిషేధించాయి. భారీ ట్రాఫిక్ ఉన్న ప్రాంతంలో ఉన్నట్టుండి కారు దిగి డ్యాన్ చేయటాన్ని కికీ చాలెంజ్‌గా పిలుస్తారు. బిగ్‌బాస్‌లో పాల్గొన్న నివేదిత గౌడ నగరంలోని రోడ్డుపై కారు దిగి 15 సెకండ్ల పాటు డ్యాన్స్ చేసి అది అప్లోడ్ చేశారు. నడి రోడ్డుపై ఇలా డ్యాన్స్ చేయటం వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలు కూడా జరుగతాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో కూడా కికీ చాలెంజ్‌ను నిషేధించాలని కన్నడిగులు కోరుతున్నారు. -
ఇక వాళ్ళు జైలుకే!
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల సోషల్‌మీడియా ద్వారా ప్రాచుర్యం పొందిన... రహదారులపై స్టంట్స్‌కు సంబంధించిన ‘కికిఛాలెంజ్’ విధానాలకు స్వస్తి చెప్పాలని నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్ కుమార్ అన్నారు. ఈ తరహా ఫీట్లు చేసిన వారిని పట్టుకుని కటకటాల్లోకి పంపుతామని హెచ్చరించారు. అనేక మంది వాహనచోదకులు నడుస్తున్న తేలికపాటి వాహనాల్లోంచి స్టీరింగ్ వదిలిపెట్టి బయటకు దూకడం, నడిరోడ్డుపై నృత్యాలు వంటి వీడియోలు ఇటీవల సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. యువతులు సైతం అలా చేస్తూ వీడియోలు షూట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇదే తరహా విన్యాసాలు సిటీలోనూ జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఫీట్లు చేసే వారిలో ప్రధానంగా యువతే ఎక్కువగా ఉంటున్నారని, ఇలాంటి చర్యల కారణంగా తమతో పాటు ఎదుటి వారి ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యువతను దృష్టిలో పెట్టుకుని ఈ ‘కికిఛాలెంజ్’ విధానాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. యువత ఈ ధోరణిని వీడాలని, ఎవరైనా ఫీట్లు చేస్తూ చిక్కితే వారిపై ఐపీసీతో పాటు సిటీ పోలీసు యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. -
కికి చాలెంజ్‌లో పాల్గొన్న రెజీనా
-
నయా క్రేజ్.. కికీ చాలెంజ్..!
న్యూఢిల్లీ: ఇదో కొత్త తరహా చాలెంజ్.. యువతను నడి రోడ్లపై నాట్యం చేయిస్తున్న సరికొత్త సోషల్ మీడియా సవాల్.. ఇదే కికీ డ్యాన్స్ చాలెంజ్. కదిలే వాహనంలో నుంచి కిందకు దూకి, ఆ వాహనంతో పాటే సమాంతరంగా లయబద్ధంగా కదులుతూ.. కెనడా ర్యాప్ స్టార్ డ్రేక్ పాడిన ‘ఇన్ మై ఫీలింగ్స్’ పాటకు నాట్యం చేయడమే ఈ చాలెంజ్. ఈ సవాలును స్వీకరించినవారు ఈ మొత్తం ప్రక్రియను రికార్డు చేసి ఇన్స్టాగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా సైట్లలో అప్లోడ్ చేస్తారు. ఈ డ్యాన్స్ సవాల్ ఇప్పుడు దేశవిదేశాల్లో యువతను ఉర్రూతలూగిస్తోంది. సాధారణ యువతరం మొదలుకొని సెలబ్రిటీస్ వరకూ ఈ చాలెంజ్‌ను స్వీకరించి తమ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. విల్ స్మిత్, సియారా లాంటి ప్రముఖులూ ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. అయితే, ఈ డ్యాన్స్ ఫీట్ ప్రమాదకరమైనదని, దీని జోలికి వెళ్లవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెరచి ఉన్న అంబులెన్స్ డోర్ పక్కగా ఓ యువకుడు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఢిల్లీ పోలీసులు ఒక ట్వీట్ చేశారు. ‘రోడ్లపై నాట్యం చేస్తే మీ కోసం మరో ద్వారాలు తెరుచుకుంటాయి’ అనే హెచ్చరిక ఆ ట్వీట్ లో ఉంటుంది. ప్రమాదాలతో డ్యాన్స్ ఈ కికీ చాలెంజ్ మైకంలో పడి చాలా మంది ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. కారు దిగే సమయంలో జారిపడి గాయపడుతున్న వారు కొందరైతే, నడుస్తున్న కారు పక్కనే డాన్స్ చేస్తూ, కారు తనని దాటిపోకుండా ఓ పక్క జాగ్రత్త పడుతూ చేసే ఈ నృత్యం మత్తులో పడి ఎదురుగా ఏముందో కూడా చూసుకోకుండా ఎదురొస్తున్న వాహనాలు, లేదా రోడ్డు పక్కనున్న స్తంభాలకు గుద్దుకొని, లేదా రోడ్లపైనున్న గుంతల్లో పడి గాయాల పాలవుతున్నవారు మరికొందరు. అసలెక్కడిదీ చాలెంజ్: కికీ చాలెంజ్ అనే ఈ ఇంటర్నెట్ సంచలనానికి మరో పేరు ‘ ఇన్ మై ఫీలింగ్స్’. డ్రేక్ గ్రాహం అనే 24 ఏళ్ల కెనడియన్ యువ గాయకుడు ఇటీవల విడుదలైన తన ‘స్కార్పియన్’ ఆల్బంలోని ‘ఇన్మై ఫీలింగ్స్’ అనే పాటలో ‘కికీ డూ యూ లవ్ మీ’ అని ప్రశ్నిస్తాడు. అయితే ఈ పాటకీ, ‘కికీ చాలెంజ్’కీ ఏ సంబంధమూ లేదు. అయితే ఇంటర్నెట్ కమెడియన్ షిగ్గీ ఈ పాటకు డాన్స్ చేసి దాన్ని ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో వేలాది మంది అనుసరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు అత్యంత ప్రమాదకరమైన ఈ నృత్యంపై యిప్పుడు ఇండియా, అమెరికా, స్పెయిన్, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆంక్షలు విధించారు. ప్రమాదకరమైన ఈ కారు నృత్యాన్ని అనుకరించొద్దంటూ ముంబై, చండీగఢ్, లక్నోలాంటి నగరాల్లో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ కికీ ఛాలెంజ్‌లో పాల్గొంటున్న వారి ని నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. స్పెయిన్ పోలీసులు ఈ నృత్యం చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు.ఫ్లోరిడాలో దీన్ని నేరంగా భావించి వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తున్నారు. -
ఆ ఛాలెంజ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకోకండి!
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘కికీ ఛాలెంజ్ లేదా ఇన్‌మైఫీలింగ్స్ చాలేంజ్’ను స్వీకరించి ఎవరు కూడా రోడ్లపై డ్యాన్సులు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోకూడదంటూ ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్ పోలీసులు మంగళవారం నాడు తమ నగరాల పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఓ నీగ్రో యువకుడు శనివారం నాడు ఫ్లోరిడాలో కారులో నుంచి దూకి రోడ్డుపై డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అంతే అటువైపు నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలా పలు దేశాల్లో పలువురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ కెనడా గాయకుడు డ్రేక్ జూలై పదవ తేదీన తన కొత్త పాటల ఆల్బమ్‌ను విడుదల చేశారు. అందులో ఆయన పాడిన ‘ఇన్మై ఫీలింగ్స్’ పాట సూపర్ హిట్టయింది. ఈ పాటకు డ్యాన్స్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టార్ షిగ్గీ షో, సోషల్ మీడియాలో ఇతరులను కూడా డ్యాన్స్ చేయాల్సిందిగా సవాల్ విసిరారు. అది కాస్త వైరల్ అవడంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ‘ఇన్‌మైఫీలింగ్స్’ పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొదట పార్కుల్లో, బీచుల్లో, రైల్వే స్టేషన్లలో మొదలైన ఈ డ్యాన్సు ఛాలెంజ్ ఆస్పత్రులకు అటు నుంచి రోడ్డపైకి చేరుకుంది. సియెర్రా, విల్‌స్మిత్, ఓడెల్ బెకమ్ లాంటి సెలబ్రిటీలు కూడా తమ డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా యూజర్లను మరింత ఆకర్షించింది. ‘రోడ్లపై మీద డ్యాన్సులు చేసినట్టయితే మరో చోటుకు ద్వారాలు తెరచుకుంటాయి’ అంటూ అంబులెన్స్ ఫొటోలతో ఢిల్లీ, ముంబై పోలీసుల ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇంతకుముందు ‘ది ఐస్ బకెట్ ఛాలేంజ్, ది రన్నింగ్ మేన్ ఛాలెంజ్, ది మేమ్క్విన్ ఛాలేంజ్’లు వైరల్ అయినా అవి ప్రాణాల మీదకు తీసుకరాలేదు. -
శ్రుతితప్పిన ‘ఇన్‌మైఫీలింగ్స్’
-
నటి రెజీనా.. నీకు ఇది తగునా?
సాక్షి, హైదరాబాద్ : పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ‘కికి చాలెంజ్’ స్వీకరించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించి అందులో భాగస్వాములు కావడంతోనే అసలు తంటాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే తమ అభిమాన నటీనటులు, క్రికెటర్లు లేక ఇతర రంగాల వాళ్లు ఎవరు ఏది చేసినా వారి ఫ్యాన్స్ అది ఫాలో అవుతుంటారు. కానీ కిక్ చాలెంజ్ లాంటి ప్రమాదకర విషయాల జోలికి వెళ్లొద్దని ఇదివరకే దీని ప్రభావం ఎక్కువగా కర్ణాటక, ముంబైలలో పోలీసులు హెచ్చరించారు. ఇప్పుడు దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. Not just a risk for you but your act can put life of others at risk too. Desist from public nuisance or face the music ! #DanceYourWayToSafety #InMySafetyFeelingsChallenge pic.twitter.com/gY2txdcxWZ — Mumbai Police (@MumbaiPolice) 26 July 2018 ఇటీవల నటి అదాశర్మ కికి చాలెంజ్ స్వీకరించి డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్‌గా ఉండే అదా శర్మ కదులుతున్న కారు పక్కన కాకుండా ఆగి ఉన్న వాహనం పక్కన స్టెప్పులేశారు. అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత టాలీవుడ్ మరో నటి రెజీనా కూడా కికి చాలెంజ్‌ను స్వీకరించారు. హాఫ్ శారీలో చాలా అందంగా, సంప్రదాయబద్దంగా కనిపించిన రెజీనా కదులుతున్న కారులోంచి దిగి ‘ఇన్ మై ఫీలింగ్స్’ పాటకు డ్యాన్స్ చేశారు. దీన్ని వీడియో తీసి తన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అయితే ఇలాంటివి వీరి అభిమానులు ఫాలో అయ్యే అవకాశం ఉందని ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆందోళన వ్యక్తమవుతోంది. #inmyfeelingschallenge had to be done!!!@champagnepapi you’ve got us South Indian girls dancin to your tunes.. 😂😋 This is the craziness that goes on between shots... 🙄😛 Video and styling: @jaya_stylist Music supervision:#priyankatumpala pic.twitter.com/dTA1enB9Nt — ReginaCassandra (@ReginaCassandra) 29 July 2018 హలీవుడ్ సింగర్ డ్రేక్ తన కొత్త పాట ‘ఇన్ మై ఫీలింగ్స్’ను విడుదలతో పాటు ‘కికి చాలెంజ్’ను జనాల్లోకి విసిరారు. ఈ చాలెంజ్ తీసుకున్న వారు కదులుతున్న వాహనంలోంచి దిగి ‘ఇన్ మై లైఫ్’ పాటకు అనుగుణంగా కదులుతున్న వాహహం పక్కనే ముందుకు సాగుతూ డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. పాట అయిపోయాక తిరిగి వాహనంలోకి ఎక్కాలి. అలా చేస్తేనే చాలెంజ్ నెగ్గినట్లు. అయితే ఇది మీకు మాత్రమే కాదు, మీ వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ముంబై పోలీసులు ఇటీవల ట్వీట్ చేశారు. ఎలాంటి జన సంచారం, రద్దీలేని రోడ్లపై ఇలాంటివి చేయాలని, అయినా కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి చాలెంజ్‌లు స్వీకరించడకపోవడమే ఉత్తమమని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.