శ్రుతితప్పిన ‘ఇన్‌మైఫీలింగ్స్‌’ | In My Feelings challenge ends with Florida man hit by car | Sakshi
Sakshi News home page

శ్రుతితప్పిన ‘ఇన్‌మైఫీలింగ్స్‌’

Jul 31 2018 6:55 PM | Updated on Mar 20 2024 3:51 PM

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ‘కికీ ఛాలేంజ్‌ లేదా ఇన్‌మైఫీలింగ్స్‌ చాలేంజ్‌’ను స్వీకరించి ఎవరు కూడా రోడ్లపై డ్యాన్సులు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోకూడదంటూ ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు మంగళవారం నాడు తమ నగరాల పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఛాలేంజ్‌ను స్వీకరించిన ఓ నీగ్రో యువకుడు శనివారం నాడు ఫ్లోరిడాలో కారులో నుంచి దూకి రోడ్డుపై డ్యాన్స్‌ చేయడం ప్రారంభించారు. అంతే అటువైపు నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలా పలు దేశాల్లో పలువురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement